World's Last Chance

At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

While WLC continues to uphold the observance of the Seventh-Day Sabbath, which is at the heart of Yahuwah's moral law, the 10 Commandments, we no longer believe that the annual feast days are binding upon believers today. Still, though, we humbly encourage all to set time aside to commemorate the yearly feasts with solemnity and joy, and to learn from Yahuwah's instructions concerning their observance under the Old Covenant. Doing so will surely be a blessing to you and your home, as you study the wonderful types and shadows that point to the exaltation of Messiah Yahushua as the King of Kings, the Lord of Lords, the conquering lion of the tribe of Judah, and the Lamb of Yahuwah that takes away the sins of the world.
WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

ఇతరుల కోసం ప్రార్థించుట

1 సమూయేలు 12

మధ్యవర్తిత్వ ప్రార్థన యొక్క విజ్ఞాన శాస్త్రం

“ఈ రోజు మీరు యజమానిని కలవాల్సి ఉండుట చాలా చెడ్డదై యున్నది. ఈ రోజు రవాణా కారణంగా ఒక సామాను ఆలస్యం అయిందని ఆయనకు సందేశం వచ్చింది. అతడు నీమీద అరిస్తే, దానిని వ్యక్తిగతంగా తీసుకోకండి. అతను ప్రతి ఒక్కరిపై అలాగే అరుస్తాడు. “ఆ అరిష్ట పదాలతో ప్రకటనదారు వర్తకుడైన రోజర్ మోర్నెవ్యును యజమాని కార్యాలయంలోకి ప్రవేశపెట్టాడు నిర్వాహకుడు.

“లోపలికి వచ్చి, కూర్చొనుము” యజమాని పైకి చూడకుండా చెప్పాడు. “నేను మాట్లాడ గలుగుటకు ముందు అతడు ఫోన్లో మాట్లాడవలసి వచ్చింది.”

ఫోన్లో కోపంతో ఉన్న మనిషికోపంతో ఒక ఫోన్ నంబరును నొక్కుతూ ఆపై యజమాని తనను అసంతృప్తికి గురిచేసిన ఒక త్రైమాసిక నివేదిక నిమిత్తం తన వ్యాపార నిర్వాహకులలో ఒకనిని తిట్టుట మొదలుపెట్టాడు. అసభ్యపకర పదజాలంతో అతడు మరింతగా మాట్లాడుతూ, కోపంగా మరియు మరింత క్రూరమైన శబ్దంతో తిట్టుచుండెను.

రోజర్ భయపడ్డాడు. ఈ వ్యక్తి నాకు వికారం పుట్టేలా చేయుచున్నాడని అతడు అనుకున్నాడు. ఆ వ్యాపారవేత్త కొరకు ప్రార్ధన చేయటకు ఇది తనకు ఎదురాయెను, అయితే రోజర్ నిజంగా ఇష్టపడలేదు, ఆ మనిషి చాలా అసహ్యకరంగా కనిపించెను. అయినప్పటికీ, ఆలోచన తిరిగి వచ్చినప్పుడు, అతడు నిశ్శబ్దంగా ప్రార్థిస్తూ, “తండ్రి, నాకు మీ సహాయం కావాలి. నేను నిజంగా ఈ వ్యక్తి కోసం ప్రార్థన చేయాలనుకోవడం లేదు. బదులుగా ఇక్కడ నుండి మెల్లగా బయటకు వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. నాకు సహాయం కావాలి! దయచేసి ఈ మనిషిని నేను ఇప్పుడు చూస్తున్నట్టుగా కాకుండా నీ కృపచేతనే ఆవరించబడిన వానిలా చూచుటకు సహాయం చేయుము. “

తక్షణమే, ఆ వ్యక్తి నిమిత్తం ఒక జాలి భావన రోజర్ యొక్క హృదయాన్ని నిండెను. అతడు ఇలా ప్రార్థించుట కొనసాగించాడు: “యహువః, నీ పరిశుద్ధాత్మ శక్తితో, ఈ మనిషిని బాధిస్తున్న దెయ్యాల సమూహంను గద్దించమని నేను మిమ్ము అడుగుతున్నాను. దయచేసి కాంతి మరియు శాంతి యొక్క దైవిక వాతావరణంతో అతనిని ఆవరించండి. నేడు నీ పరిశుద్ధాత్మను అతడి దగ్గరకి పంపించి అతనిని నీయొద్దకు నడిపించుము.”

తర్వాత సంఘటనను గుర్తుచేసుకుంటూ, రోజర్ ఇలా చెప్పారు:

రాత్రి నుండి పగలు ఏర్పడినట్లు ఆ మనిషిలోని పరివర్తనను చూడటానికి నాకు ఐదు సెకన్ల కంటే ఎక్కువ పట్టలేదు. అతని సంభాషణ ఒక నూతన విధానంలోనికి మార్పు చెందింది. దాదాపు ఆగకుండా మాట్లాడుట మరియు అసభ్యకరమైన అరుపులతో మాట్లాడటకు బదులుగా, అతడు తన స్వరాన్ని మారుస్తూ మరియు తెలివైన వాదనగా అనిపించిన మాటలతో మాట్లాడటం మొదలుపెట్టాడు. సుదీర్ఘ అంతరాయాలు అవతలి వ్యక్తి తన పరిస్థితిని వివరించుకొనుటకు అవకాశంను ఇచ్చెను. సంభాషణ ఎక్కువ కంగారు లేకుండా కనిపిస్తూ ముగిసింది . . . అతని ఆగ్రహమైన వ్యక్తీకరణ. . . ఇప్పుడు మృదువైనది. 2

ఫోనును పెట్టివేస్తూ, వ్యాపారవేత్త రోజర్ వైపు స్నేహపూరిత చిరునవ్వుతో చూస్తూ చేతులు కలపడానికి నిలబడెను.

సంతోషకరమైన మనిషిసంతోషం పెద్దమనుషీ “మీతో కలవటం నాకు ఆనందం” రోజర్. నా పేరు డెన్నిస్. క్షమించండి, అంతా చాలా దుర్భరంగా ఉన్న రోజున కలుసుకోవాల్సి వచ్చింది. “నిజానికి, నేను నిజాయితీగా ఉంటాను. ఇది అంత సాధారణమైనది కాదు. నాకు ఎందుకో తెలియదు, కానీ కొన్నిసార్లు ఈ అదుపు చేయలేని కోపం నాపై ఆవరిస్తుంది. ఇది అధ్వాన్నంగా పెరిగిపోతుంది మరియు నేను అదుపుచేయలేక పోవుచున్నాను. నేను కొన్నిసార్లు వెర్రి అనుభూతికి గురవుతున్నాను.” ఒక ఉద్రిక్త శ్వాసను విడుస్తూ ఆయన ఇలా అన్నాడు: “నేను నా ఉద్యోగులకు వారి విలువకు మించి రెండు రెట్లు జీతమిస్తేనే గాని వారు నా కోసం పని చేయరు.”

పూర్తిగా కొత్త వానికి గుట్టంతా చెప్పుచున్నాడని అకస్మాత్తుగా అతడు గ్రహించాడు. “నేను ఇదంతా మీకు ఎందుకు చప్పుచున్నానో నాకు తెలియదు. నన్ను క్షమించండి. నా సమస్యలన్నింటినీ మీపై రుద్దాలనేది నా ఉద్దేశ్యం కాదు. ప్రకటనల విషయం మాట్లాడదాం.”

“డెన్నిస్, చింతించకండి.” రోజర్ భరోసా ఇస్తున్నట్లుగా నవ్వి. “నాకు చెప్పినదానిని ఎప్పుడూ నేను ఎవరికీ చెప్పలేదు. వాస్తవానికి, ఖాతాదారులు తరచుగా తాము ఎవరికీ చెప్పని విషయాలను నాతో చెబుతుంటారు. కారణం ఏదయినా కాని, వారు నా వద్ద సౌకర్యవంతంగా అనుభూతి చెందుతారు మరియు నిజంగా బాగా తెలిసిన వారికి కాకుండా, ఒక పూర్తి కొత్త వానిగా నాతో పంచుకోవడానికి ఇష్టపడతారు. “

డెన్నిస్ మళ్లీ కూర్చుని, రోజర్ ని కూర్చొనమని సంజ్ఞ చేసాడు. “మీ ఖాతాదారులతో నేను అంగీకరిస్తున్నాను. నాకు నిజంగా ఎలా వివరించాలో తెలియదు, కానీ మీలో. . . మీలో ఒక శక్తి తోడుగా ఉంది. నేను నిజంగా మాటలలో చెప్పలేకపోవుచున్నాను, కానీ అది ఈ లోకానికి మించిన శక్తి వంటిది ఉంది. నేను ఇప్పుడు అనుభవించిన శాంతి మరియు సమాధానం మునుపెన్నడూ అనుభవించ లేదు. “

తన ప్రార్థనకు జవాబు ఇలా త్వరితంగా మరియు స్పష్టంగా రావటం రోజర్ కి విస్మయం కలిగించింది. “మంచిది, మీరు ఫోన్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నేను చూసిన వెంటనే, సర్వలోక నాధుడు తన శాంతితో మిమ్మల్ని ఆవరించునట్లు మీ కోసం ప్రార్ధించడం మొదలుపెట్టాను అని అతడికి చెప్పాను.”

“అద్భుతం.” డెన్నిస్ అతడిని ఒక క్షణం అధ్యయనం చేసాడు. “నేను కొన్ని సంవత్సరాల క్రితం దేవున్ని మరియు మతాన్ని వదిలివేసాను. ‘సర్వలోక నాధుడు తన శాంతితో నన్ను ఆవరించెను. నేను దానిని ఇష్టపడుతున్నాను. నేను ఆలోచించుటకు మీరు ఒక విషయాన్ని ఇచ్చారు. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, అని త్వరితంగా చెప్పాడు. “నేను మళ్ళీ చర్చికి వెళ్లి మతపరమైనవన్నీ లేదా దేనినీ పొందడం మొదలుపెట్టను, కాని మీరు నా కోసం ప్రార్థిస్తూ ఉంటారా? నేను నిజంగా దానిని అభినందిస్తాను! “

వారి వ్యాపారాన్ని గురించి చర్చించుట ముగించిన తరువాత, డెన్నిస్, రోజర్ తో పాటుగా తలుపు వద్దకు నడిచి అతనితో పాటు త్రోవ చివరికి వెళ్లాడు.

బదిలీ మరియు ప్రమోషన్ కారణంగా, రోజర్ మళ్ళీ డెన్నీస్ ను చూడటానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఆ సమయంలో, తన నిజమైన మాటలలో, అతడు ఆ వ్యక్తి కోసం ప్రార్థన కొనసాగించాడు. మరోసారి అతడు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, అతడు డెన్నిస్ యొక్క వ్యాపార కార్యాలయానికి తన పిలుపుపై ​​కొత్త ప్రాంత-అమ్మకదారునితో కలిసి వెళ్లాడు. డెన్నిస్ మళ్లీ రోజర్ ను చూచినందుకు ఆనందించాడు మరియు అతడు తన ఉద్యోగులకు తన జీవితాన్ని మార్చివేసిన వ్యక్తిగా పరిచయం చేశాడు.

నిజానికి, మార్పు ఆశ్చర్యకరంగా ఉంది. అతను ఆనందం, సంతృప్తి మరియు సానుకూల ఆత్మను వెలిబుచ్చాడు. తన బల్ల వెనుక ఈ క్రింది పదాలతో ఒక చిత్రం వ్రేలాడుతూ ఉంది: “ప్రార్థన విషయాలను (పరిస్థితులను) మారుస్తుంది.”

సంతోషకరమైన మనిషి

రోజర్ లాంటి ఇలాంటి అనుభవాలు, దురదృష్టవశాత్తు, చాలా అరుదు. అంటే ప్రార్థనలకు జవాబివ్వడానికి పరలోకం నెమ్మదిగా లేదా అయిష్టంగా ఉందని కాదు. సమస్య ఏమిటంటే, ప్రార్థన చేసే ప్రజలు చాలా అరుదుగా ఉంటున్నారు! లేక, ఒకవేళ ప్రార్థన చేస్తే, అది సగం-హృదయపూర్వకంగా మరియు అస్పష్టంగా ఉంటుంది. ప్రతి మానవ హృదయ అవసరాలను తీర్చడానికి పరలోకం ఎదురు చూస్తుండెను. ఏదేమైనా, ప్రతి యుద్ధంలో “నియమ నిబంధనలు” ఉంటాయి మరియు యహూషువః మరియు సాతాను మధ్య యుద్ధం దీనికి భిన్నంగా ఉండదు.

రోజర్ మోర్యువు

రోజెర్ జె. మోర్యువు వ్రాసిన ఇంక్రెడిబుల్ పవర్ ఆఫ్ ప్రేయర్ నుండి తీసుకొనబడినది.

నియమం యొక్క నిబంధనలు: మీరు తప్పక అడగాలి!

సాతాను ద్వారా బందించబడుచున్న మానవ జాతిని కాపాడుకోవడానికి, యహువః కొన్ని నియమాలను స్థాపించాడు. ఆ నియమాలలో ఒకటి ఏమిటంటే, ఇరుప్రక్కల నుండి ప్రత్యక్ష ప్రమేయం. నిర్దిష్ట అభ్యర్థనకు మాత్రమే సమాధానం ఇవ్వబడుతుంది. నిజంగా అవమానకరమైన విషయం ఏమిటంటే, యహువఃను విశ్వసిస్తున్న జనులు తమ సర్వశక్తిమంతునిలో కలిగియున్న విశ్వాసంకంటే లూసిఫెరియన్లు (లూసిఫర్ ను ఆరాధించే వారు) మరియు దెయ్యం-ఆరాధకులు తమ అభ్యర్ధనలకు సమాధానం పొందుటలో సాతాను యొక్క సామర్ధ్యం మరియు సిద్ధపాటు యందు ఎక్కువ “విశ్వాసాన్ని” కలిగి యుంటున్నారు.

దేవునితో ఈ దినం“ఇది విశ్వాస పూరితమైన ప్రార్థనకు సమాధానంగా మనకు ఇచ్చుటకు యహువః యొక్క ప్రణాళికలో భాగం, మనం అలా (నిర్దిష్టమైనది) అడగనిదే ఆయన దానిని దయచేయడు.” 3 యహూషువః ఈ సూత్రాన్ని అర్థం చేసుకునెను. కొండమీద తన ఉపన్యాసంలో, తండ్రి ముందు ప్రతి ఒక్కరు తమ అవసరాలను అడగాలని ఆయన ప్రోత్సహించెను:

“అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్యనెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచియీవుల నిచ్చును. (మత్తయి 7: 7-11, NKJV)

ప్రార్థనకు జవాబిచ్చుటలో యహువః ఎప్పుడూ సంతోషించును మరియు సాతాను అణచివేసిన ఆత్మలను రక్షించుటకు సహాయం చేయుటకు చేయు ప్రార్థనల యందు ఆయన మరింత ఎక్కువ సంతోషాన్ని పొందును. “తండ్రీ, మమ్మల్ని రక్షించండి! మేము నశించుచున్నాము!” అనే ప్రార్థన ఎల్లప్పుడూ తక్షణ సమాధానం పొందుతుంది.

ఎవరి హృదయాలు రక్షకుని యొక్క ప్రేమతో నిండియుండునో వారు, ఇతరులను రక్షించుటకుగల ఆయన భారాన్ని కూడా పంచుకుంటారు. వారు తమ కుటుంబ సభ్యులకు, వారి స్నేహితులకు, వారి మాజీ తోటి సంఘ సభ్యులకు తాము ఇష్టపడే సత్యాలను తెలియజేయుటకు పాటుపడతారు. “నేను అనేది మరణించినప్పుడు, ఇతరులను మోక్షానికి నడిపించాలి అనే ఒక తీవ్రమైన కోరిక మేల్కొంటుంది – అది మంచి కోరికలను చేపట్టే ప్రయత్నాలకు దారి తీస్తుంది. సమస్త జలాల పక్కన విత్తటం జరుగుతుంది; ప్రాముఖ్యమైన ప్రార్థనలు, శాశ్వత ప్రార్థనలు, నశించుచున్న ఆత్మల తరపున పరలోకానికి ప్రవేశిస్తాయి.” 4 ముఖ్యంగా, పురోగతి చెందుతున్న సత్యాన్ని వెంబడిస్తున్నప్పుడు, ఒక వ్యక్తిని సాధారణ విశ్వాస వ్యవస్థల నుండి వేరు చేయడానికి దారితీయు సత్యాన్ని వెంబడిస్తున్నప్పుడు, విభేదాలు తలెత్తవచ్చు. స్నేహాలు ఇబ్బందికరమైన అనుభూతులు చెందును; వివాహ బంధాలు బాధపర్చును. అలాంటి పరిస్థితుల్లో, సత్యానికి వెన్ను చూపుతున్నవారికోసం ప్రార్థించుట మన హక్కు మరియు బాధ్యత.

ఇశ్రాయేలీయులు తమను పాలించుటకు ఒక రాజు కావాలని యహువఃపై తిరుగుబాటు చేసినప్పుడు, అలా చేయుట ద్వారా ఇశ్రాయేలీయులు యహువః యొక్క పాలనను తిరస్కరించుచున్నారని ఎరిగినవాడై, సమూయేలు ప్రవక్త ఈ గొప్ప పాపం కొరకు విలపించెను. (1 సమూయేలు 8: 6-7 చూడండి) అయితే దైవిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాంటి తిరుగుబాటు చేసినప్పుడు కూడా సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు ముఖం చాటువేయలేదు. మతభ్రష్టత్వంలో ఉన్న (ప్రేమింపబడిన ప్రజలు) వివిధ సమస్యలతో పోరాడుతూ లేదా నిజంగా తిరస్కరించిడినట్లు కనిపించిన వారందరికి ఆయన మాట ఒక శంఖారావం వంటి పిలుపైయున్నది. “నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యహువఃకు విరోధముగ పాపము చేసినవాడ నగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును.” (1 సమూయేలు 12:23)

మధ్యవర్తిత్వ ప్రార్థన ఇలాంటి సందర్భాల్లో వస్తుంది. ఇతరులకొరకు ప్రార్థించుట చాలా ముఖ్యమైనది! “మానవులకు ఇవ్వబడి యన్న అత్యంత పవిత్రమైన సత్యాన్ని నమ్మునట్లు ఇతరులకు చెప్పుచున్న వారికోసం పరలోకం చూస్తోంది. ఆత్మలను పరలోకానికి చేర్చుటలో మీతో పనిచేయాలనే, సహకరించాలనే కోరికతో దూతలు ఎదురు చూస్తున్నాయి.” 5

మన ప్రార్థనలు మన సొంత ప్రయోజనాల కోసం, స్వార్థపూరితంగా ఉండకూడదు. మెస్సీయ జీవిత సూత్రం మన జీవితాల సూత్రంగా ఉండాలి. “వారి నిమిత్తము” అని ఆయన తన శిష్యుల గురించి మాట్లాడుతూ: వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడునట్లు వారికొరకై నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను. (యోహాను 17:19). క్రీస్తులో ప్రత్యక్షమవబడిన [యహువః మాట] అదే భక్తి, అదే స్వీయ త్యాగం, హక్కులను పొందుటకు అదే విధేయత ఆయన సేవకులలోనూ కనబడవలెను. ప్రపంచంలో మన లక్ష్యం మమ్మల్ని రక్షించుకోవటానికో లేదా ఆనందించటానికో కాదు; పాపులను రక్షించడానికి ఆయనతో కలిసి పనిచేయడం ద్వారా [యహువఃను] మహిమపరచుటకు. మనం ఇతరులతో మాట్లాడుటకు వీలగునట్లు [యహువః] నుండి ఆశీర్వాదాలను అడగాలి. ఇచ్చుట ద్వారా మాత్రమే స్వీకరించుటకు అవసరమైన సామర్థ్యం సంరక్షించబడుతుంది. మన చుట్టూ ఉన్నవారితో సత్యాన్ని గూర్చి మాట్లడకుండానే పరలోక నిధిని పొందుటను కొనసాగించలేము. 6

ఆత్మలను రక్షించుటలో పరలోకానికి సహకరించడానికి, యహువః యొక్క ప్రజలు రక్షకుని యొక్క ఉదాహరణను అనుసరించి మరియు ఇతరుల కోసం మధ్యవర్తిత్వ ప్రార్థనలు చేయుటలో పాల్గొందురు. మంచి మరియు చెడుల మధ్యగల గొప్ప యద్ధంలో నియమ నిబంధనల విషయంలో పరలోకం కలిగియున్న అడ్డంకులు కారణంగా, మీరు కలుస్తున్న ప్రతివారికోసం మీరు ప్రార్థించుట చాలా ముఖ్యమైన యున్నది. పరలోకం ఎక్కువగా చేయాలని కోరుకుంటుంది అయితే సహాయం అడగుటకోసం మాత్రం వేచి ఉంది. “తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల యహువఃకు ఉన్నదని” గ్రంథం చెపుతుంది. (ఎఫెసీయులకు 3:20, KJV) “ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును.. (యోహాను 16 : 24) అడుగుట అనేది ముఖ్యమైనది కానట్లయితే, తమకొరకు మరియు ఇతరులకొరకు అభ్యర్ధన చేయమని లేఖనం పదే పదే చెప్పదు.

సమర్ధవంతమైన మధ్యవర్తిత్వ ప్రార్ధనలో గల అంశాలు

సమర్ధవంతమైన మధ్యవర్తిత్వ ప్రార్ధన కొన్ని ముఖ్యమైన అంశాలను కలిగియుంటుంది:

  1. యహువఃకు తిరిగి అంకితం చేసుకొనుము.
  2. యహువః నామమున పిలువుము.
  3. యహూషువః నామమున ప్రార్థన చేయుము.
  4. నిర్దిష్టంగా ఉండుము.
  5. పట్టుదలగా ఉండుము.

యహువఃకు తిరిగి అంకితం చేసుకొనుము.

మీరు ఇతరుల కొరకు ప్రార్థించుటకు ముందు, మీ పాపాలను ఒప్పుకోవలెను. మీకు మరియు రక్షకునికి మధ్య మీరు కోరుకునే దీవెనను ఆటంక పరిచే ఏ నిరోధమూ లేదని నిర్ధారించుకోండి. అయితే, ప్రార్థన ఎప్పుడూ ఆకాశంవైపునకు తిరిగి చేయుట సరైనది. డెన్నిస్ తన ఉద్యోగిపై కోపం ప్రదర్శించే సమయంలో రోజర్ మోర్యువుకు ఒక సుదీర్ఘ ప్రార్థన చేయుటకు తగినంత సమయం లేదు, అయినప్పటికీ పరలోకం తన ప్రార్థనను విని దానికి సమాధానమిచ్చెను. ఏదేమైనా, యహువః ముందు ఒక నిర్దిష్ట విషయాన్ని సమర్పించేటప్పుడు, మీ స్వయంను యహువఃకు పునఃసమర్పించుట ముఖ్యం.

యహువః నామమున పిలువుము.

“యహువః నామమున పిలవండి” అని లేఖనాలు పదేపదే చెబుతున్నాయి. కీర్తన 105:1 ఇలా చెబుతోంది: “యహువఃకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి.”కృతజ్ఞతాస్తుతులు చెల్లించునప్పుడు ఆయన పవిత్ర నామమున ప్రార్థిస్తే, దైవిక వాగ్దానాన్ని గ్రహించుటకు మానవ హృదయంలోని విశ్వాసాన్ని ప్రేరేపిస్తుంది. ఇది సమర్ధవంతమైన మధ్యవర్తిత్వ ప్రార్థనలోని ముఖ్యమైన భాగం. మీరు నిత్యుడైనవాని యొక్క ఆధిపత్యాన్ని, శక్తిని, ఘనతను గుర్తిస్తున్న సమయంలో, మీ యొక్క ప్రేమ, కృతజ్ఞత, విశ్వాసం వృద్ధిచెందుతాయి. ఇది, తిరిగి, యహువః అధికారంలో మరియు చిత్తంలో మీ విశ్వాసాన్ని బలపరుస్తుంది, అది మీ విన్నపాలకు జవాబును దయచేస్తుంది. “యహువః నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.” (సామెతలు 18:10)

యహూషువః నామములో ప్రార్థన చేయుము

నిత్యమైన సింహాసనం ముందు మీ అభ్యర్ధనలను తన నామములో చేయమని ఉన్నతతుడైన తండ్రి యొక్క కుమారుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. “మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.” (యోహాను 14:13, 14) విందునని ఇచ్చిన హామీ ఎంత గొప్ప హామీ!

యహూషువః నామమున ప్రార్థన చేయుట అనగా, “యహూషువః మెస్సీయ నామమున ప్రార్థన చేయుచున్నాము, ఆమేన్” అని యహూషువః పేరులో ప్రార్థనను ముగించుట కాదు. అనగా ఆయన చిత్తానికి మరియు తండ్రి యొక్క చిత్తానికి అనుగుణంగా ప్రార్ధించుట అని. గెత్సమనేలో మెస్సీయ వలే, “అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక” అని ప్రార్థన చేయాలి. (లూకా 22:42 చూడండి.)

ప్రార్థనకు ఒక పిలుపు

మేడగది నుండి తాను అప్పగించబడిన గెత్సమనే తోటకు నడిచి వెళ్తున్నప్పుడు, యహూషువః తన శిష్యులను ఇలా ప్రోత్సహించాడు: “ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు; మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును. (యోహాను 16:23, 24) మీరు ప్రార్థన చేస్తున్న వ్యక్తి సరైన మార్గమును ఎన్నుకుంటాడని గాని లేక మీరు ప్రార్ధించునట్లు అంతా జరుగును అని గాని మీకు హామీ ఇవ్వబడదు. మానవుని ఆలోచనను యహువః ఎప్పటికీ బలవంతం చేయడు. ఒక వ్యక్తి సత్యాన్ని తిరస్కరించుటను మరియు, ప్రమాదకరంగా ప్రవర్తించుటను కొనసాగిస్తే, లేదా మీరు ప్రార్థిస్తున్న ఇతర ఏ విషయాన్నైనా నిరాకరిస్తే, అతడు లేదా ఆమె తనకు నచ్చిన మార్గమును ఎంపిక చేసుకునే స్వేచ్ఛను యహువః మంజూరు చేస్తాడు. అయితే, ఒక వ్యక్తి లేదా పరిస్థితి కోసం ప్రార్ధిస్తే ఆ ప్రార్ధన యహువఃను ఆ మార్గంలో పని చేయటకు స్వేచ్ఛనిచ్చును, లేని యెడల సాతానుతో యుద్ధంలో నియమ నిబంధనల ప్రకారం ఆయన దానిని చేయలేడు.

నిర్దిష్టంగా ప్రార్థించండి

సమాధానం పొందని ప్రార్థనలను గూర్చిన భయం తరచుగా ప్రజలు చాలా అస్పష్టమైన ప్రార్ధనలు చేయుటుకు దారితీస్తుంది. వారు అభ్యర్థనలను చేస్తారు, కాని అభ్యర్థనలు చాలా విస్తృతంగా ఉంటాయి, కాబట్టి అవి నిర్దిష్టంగా కాక అస్పష్టంగా ఉంటాయి, కావున యహువః ఆ ప్రార్థనలకు సమాధానమిచ్చినప్పటికీ, వారు వాటిని చూడలేరు! “చాంగ్ సహోదరిని దీవించుము” అని అడుగుట కంటే, “చాంగ్ సహోదరికి సబ్బాతును పాటించుటకు వీలు కలిగించే ఉద్యోగాన్ని దయచేయండి” అని అడుగుట ప్రత్యేకంగా ఉంటుంది. “19 వ శతాబ్దపు గొప్ప ప్రొటెస్టంట్ సువార్తికుడు మరియు సంఘ సంస్కర్త, చార్లెస్ స్పర్జన్ ఒకసారి ఇలా పేర్కొన్నాడు: “ప్రార్థన యొక్క ఒక సాధారణ విధానం ఖచ్చితత్వం లేకపోవడంతో విఫలమవుతుంది. ఇది సైనికులందరూ వారి తుపాకీలను ఎక్కడికైనా కాల్పులు చేయవచ్చు అనే ఆదేశం వలె ఉంటుంది. బహుశా ఎవరో కొంతమంది చంపబడతారు, కానీ శత్రువులు ఎక్కువగా తప్పిపోతారు.” 7

మీకు అవసరమైన దాని గూర్చి చాలా ప్రత్యేకంగా ప్రార్థించటానికి భయపడవద్దు.

  • ఒక స్నేహితుని స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నట్లయితే, మరణం నుండి యహూషువఃను లేపిన ఆత్మ మీ స్నేహితుని ఆరోగ్యాన్ని పునరుద్ధరించుటకు అతని లోనికి రావాలి అని ప్రార్ధించండి.

  • ఒక రెస్టారెంట్ లో తినవలసి వచ్చినప్పుడు, ఆహారంలో మీకు హాని కలిగించే పదార్ధాలు ఏవైనా ఉంటే, ఆహారాన్ని దయచేయు యహువః, ఆ హానికరమైన పదార్ధాలు మీకు హాని కలిగించకుండా మీలో కరిగిపోయి మరియు బయటకు పోవునట్లు ప్రార్థన చేసుకోవలెను.
  • ఒక వ్యక్తి నిరాశకు గురై లేక కోపంగా ఉన్నట్లైతే, చీకటి సైన్యాలను వెనుకకు నెట్టుటకు మరియు శాంతి మరియు కాంతి యొక్క పరలోక వాతావరణంతో అతనిని ఆవరించుటకు పవిత్ర దేవదూతలు పంపబడునట్లు ప్రార్థన చేయవలెను.

  • ఒక ప్రియమైన వ్యక్తి కాంతిని మరియు సత్యాన్ని తిరస్కరించుచున్నట్లయితే, తన ఆత్మను వెలిగించుటకును మరియు సత్యాన్ని గ్రహించి మరియు దానిని అంగీకరించు మనస్సును తనకు అనుగ్రహించమని ప్రార్థనచేయండి.

  • మీ సొంత హృదయం కఠినపర్చబడినట్లైతే, ఆయన చిత్తముతో నీ చిత్తము ఏకీభవించునట్లు మీ హృదయాన్ని తిరిగి నూతనపర్చమని సృష్టికర్తని అడగండి.

మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రత్యేకంగా మరియు నిర్దిష్టంగా ఉండటానికి భయపడవద్దు. ప్రతి ప్రార్థనలో, మీరు నీ చిత్తాన్ని దైవ చిత్తానికి లోపరచి, అన్ని విషయాలలో ఆయన చిత్తం నెరవేరాలని అడిగినప్పుడు, ఖచ్చితమైన విషయాలను గురించి అడుగుటలో ఏ ప్రమాదం ఉండదు.

యహూషువః యొక్క విలువలపై హక్కు పొందండి

మీరు ఒక వ్యక్తి లేదా పరిస్థితి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, నిన్ను (ప్రార్థిస్తున్న వ్యక్తిగా) మరియు నీవు ప్రార్థిస్తున్న వ్యక్తిని కప్పియుంచినట్లు యూషుషు రక్తములోని విలువ (యోగ్యత) యొక్క హక్కును అడగండి. అలాగే

మీ బైబిలును మత్తయి 27 తెరిచి, దానిని మీ తరపున పరలోకము ఎందుకు గొప్పగా పనిచేయాలి అనేదానికి కారణంగా చూపండి. కల్వరి మీద యహూషువః చిందించిన రక్తం యొక్క ధర్మం ద్వారా మాత్రమే ఆదాము యొక్క పడిపోయిన కుమారులు మరియు కుమార్తెలు దైవిక కృపను నిరంతరం పొందగలుగుతూ ఉన్నారు. మీ పాపాలును మరియు మీరు ప్రార్ధిస్తున్నవారి పాపాలును క్షమింపబడునట్లు రక్షకుడు చిందించిన రక్తంలో గల యోగ్యత యొక్క హక్కుకోసం ప్రార్ధన చేయుడి. వైద్యులు, న్యాయవాదులు, పాస్టర్, యజమానులు మొదలైనవారు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నట్లయితే, వారి కోసం కూడా ప్రార్ధించండి.

మధ్యవర్తిత్వ ప్రార్థనలో పాలుపంచుకున్నప్పుడు యహూషువః రక్తములోని యోగ్యత యొక్క హక్కును కలిగియుండుట చాలా ప్రాముఖ్యమైనది. శక్తి మరియు శాంతి యొక్క మూలం నుండి పాపము వ్యక్తులను వేరు చేస్తుంది. అందువలన, కోరుకున్న ఆశీర్వాదాలకు మార్గం సిద్ధం చేయుటుకు వారి పాపాలకు క్షమాపణను అడుగుట అవసరమై యున్నది. యహూషువః స్వయంగా శిలువ వేసినవారి పాపాల కొరకు ప్రార్ధించాడు. (లూకా 23:34 చూడండి.) అదేవిధంగా స్తెఫను తనను చంపినవారి పాపాలు క్షమించబడాలని ప్రార్థించాడు. (అపొస్తలుల కార్యములు 7: 59-60 చూడండి.)

ఆలిసన్ రైడర్ 8 తక్కువ చెల్లించే బూట్ల షాపులో నిలబడి ఒక జత రన్నింగ్ బూట్లు కోసం చూస్తుండెను. అకస్మాత్తుగా, తన దృష్టి కౌరమార దశలో ఉన్న తన కూతురిపై బిగ్గరగా అరుస్తున్న ఒక స్త్రీ పై పడింది, ఆమె తన కూతురిపై ఇలా బిగ్గరగా అరుస్తోంది: “ఈ రోజు నేను కొనే బూట్లను నీవు ఖచ్చితంగా ధరించాలి! నీకు ఏమి కావాలో అది నాకు అనవసరం. నేను డబ్బు చెల్లిస్తున్నాను. ఇది నా డబ్బు మరియు నీవు వీటిని ధరించి పాఠశాలకు వెళ్ళాలి!”

అటువంటి ఆగ్రహ ప్రవాహంతో ఆశ్చర్యపోయిన ఆలిసన్ ఏమి జరుగుతుందో చూసేందుకు మార్గము యొక్క మూలకు జరిగింది. ఒక యువతి, నిరాశకు గురవుతూ నిలబడి యున్నది, మాటల వారధి ఇలా కొనసాగుతుంది: “ఇలా చూడుము! నీవు ఇది, లేక అది ధరించవచ్చు! అవి బాగా పనిచేస్తాయి.”

“ఇవి ముసలోళ్ల బూట్లు,” తన కూతురు నిరసన వ్యక్తం చేసింది.

“నీకు నచ్చిందో లేదో నాకు అనవసరం! బూట్లను కొంటున్నది నేను. ఇది నా డబ్బు మరియు కొనేదాన్ని నేను ధరించవలసినది నీవు!” అలా గట్టిగా మాట్లాడుతూ, ఆమె తన కుమార్తెను తీసుకొని ఆలిసన్ నుండి ప్రక్కకు జరిగెను మరియు అప్పటికీ ఆమె తన మునుపటి “బుద్ధహీన మాటలను ఉద్రేకంతో మాట్లాడుతూనే ఉండెను.”

తగని కోపంతో నిండిన అలాంటి ప్రదర్శన చూసి విసుగుచెంది, మరియు ఆ అమ్మాయిని మరింత ఇబ్బందిపడేలా చేయుటకు ఇష్టపడక, ఆలిసన్ తన స్థానంలోకి నిశ్శబ్దంగా వెళ్ళిపోయెను. ఆమె పరలోకంవైపు తిరిగి మనస్సులో ఆ విషయమై ప్రార్థించెను. తర్వాత ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ, ఆమె ఇలా చెప్పింది:

మొదట, నేను నా పాపాలను క్షమించమని రక్షకుని అడిగాను. ఆ స్త్రీని మరియు తన కుమార్తె యొక్క పాపములు క్షమించబడునట్లు నేను ప్రార్థించాను. నేను ఆ తల్లిని వేధించే దురాత్మలను పారద్రోలుటకు పరిశుద్ధ దూతలను పంపమని అడిగాను.

ఆ సమయంలో నేను ఇలా చెప్పాను “ప్రభువా, దయచేసి ఈ పరిస్థితిలో సహాయం చెయ్యండి!” వెంటనే నిశ్శబ్దంగా మారెను! నేను విన్న తదుపరి మాట ఆ తల్లిది. ప్రశాంత మరియు నిశ్శబ్ద స్వరంతో ఆమె ఇలా చెప్పింది, “నన్ను క్షమించు. క్షమించు నేను పిచ్చిదానిలా ప్రవర్తించాను. నాకు నచ్చిన బూట్లు నువ్వు ధరించేలా చేయటం సరైనది కాదు. నీకు ఏవి ఇష్టమో నాకు చూపుము. “

అత్యంత అద్భుతమైన మార్పు జరిగింది మరియు అది దాదాపు ఒక తక్షణ చర్య! ఇది జరిగి 10 సంవత్సరాలు గడిచినప్పటికీ, నేను ఇప్పటికీ ఆ సంఘటనను మర్చిపోలేదు. ప్రార్థనలో శక్తి ఉందని నాకు తెలుసు!

యహువః ఎప్పుడూ ఎవరినీ బలవంతం చేయడు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దగ్గరకు వచ్చుటకు ఇంకా వ్యతిరేకిస్తున్నట్లైతే, అతడు తన సొంత మార్గంలో ఇంకా ఉండవచ్చు. ఏదేమైనా, విశ్వాస సహితమైన ప్రార్థనకు సమాధానంగా, ఆగ్రహాన్ని పోషించు దురాత్మలను యహువః పారద్రోలెను.

పట్టుదలతో ప్రార్థించాలి

కొండమీది ప్రసంగంలో యహూషువః మాటలు అందరికీ పరిచయం ఉన్నవే, అక్కడ ఆయన ఇలా అన్నాడు: “అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.” (మత్తయి 7: 7). అయితే చాలామంది గ్రహించని విషయం ఏమిటంటే, అరామిక్ లోని వ్యాకరణాన్ని సరిగ్గా అనువదిస్తే ఈ క్రింది విధంగా ఉండునని: “అడుగుడి, అడుగుతూ ఉండుడి, అది మీకియ్యబడును. వెదకుడి, వెదకుతూ ఉండుడి, అది మీకు దొరకును, తట్టుడి, తడుతూ ఉండుడి, మీకు తీయబడును.”

మీరు ఎవరికోసమైనా ప్రార్థించునప్పుడు, మీరు సాతాను యొక్క సమస్త దూతలపై ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొంటున్నారు. పౌలు స్పష్టంగా ఇలా హెచ్చరిస్తున్నాడు: “ఏలయనగా మనము పోరాడునది శరీరులతో(మూలభాషలో-రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.” (ఎఫెసీయులకు 6:12, KJV) ఒకవేళ కొంతకాలం పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ మీరు నిరుత్సాహపడకండి. దుష్ట దేవదూతలు తీవ్ర పోరాటము చేయకుండా ఈ యుద్ధ క్షేత్రాన్ని వదిలిపెట్టరు.

శ్రీ మరియు శ్రీమతి హార్వీల విషయంలో ఇది జరిగింది. వారి కుమారుడు, హెన్రీ, మందులతో ప్రయోగాలు చేసేవాడు, ఫలితంగా, 20 సంవత్సరాల వయస్సులో అతడి మెదడు తీవ్రంగా దెబ్బతినెను. తాను తనను గూర్చి శ్రద్ధ వహించలేకపోయేవాడు, ఈ 32 ఏళ్ల వ్యక్తి తన తల్లిదండ్రులతో కలిసి నిశ్శబ్దంగా కూర్చుని, గంటలపాటు గొలుసు-ధూమపానం చేసేవాడు. అలాగే తాను తీవ్రంగా గాయపడేంత వరకు కొన్నిసార్లు తనను తాను కొట్టుకొనేవాడు. గాయపర్చకోవద్దని చెప్పినప్పుడు, అతడు అధిక కోపోద్రకుడయ్యేవాడు. అతని జుట్టు దాదాపుగా అతని నడుము వరకు ఉండేది మరియు ఎవరైనా దానిని కత్తిరించుటకు నిరాకరించేవాడు. అతని మాటలు అజ్ఞానంగా ఉండేవి.

శ్రీమతి హార్వీ, తన కొడుకు నిమిత్తం హృదయం పగిలి ఉన్నప్పుడు, తన పరిస్థితిని నిస్సహాయంగా భావించారు. ఒకరోజు, ఆమె మరియు ఆమె భర్త ఇరువురూ హెన్రీతో పడుతూ వస్తున్న బాధలను గూర్చి మాట్లడుకొనుచుండగా, ఒక పరిచయస్తుడు వచ్చి, వారు బహుశా హెన్రీ యొక్క మానసిక సామర్ధ్యాలను మెరుగుపరచబడునట్లు యహువఃకు ప్రార్ధించిన యెడల ఆయన తన నామ మహిమ నిమిత్తం మరియు ఇతరుల విశ్వాసాన్ని బలపరుచు నిమిత్తం ఈ కార్యం జరిగించవచ్చు అని సూచించెను.

పరిస్థితి తక్షణమే మెరుగుపడలేదు, కానీ వారు ప్రార్థనను కొనసాగించారు. క్రమంగా, అనేక నెలలు గడిసిన సమయంలో, హెన్రీ మెరుగైనట్లుగా కనిపించుటను చూడగానే శ్రీమతి హార్వే ఆశ్చర్యపోయారు. అతని మాటలు స్పష్టంగా మారాయి మరియు చాలా సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారిగా తన జుట్టును కత్తిరించాలని తన తల్లిని అడిగాడు! కొన్ని నెలల తర్వాత, ధూమపానాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు హెన్రీ తన తల్లికి తెలిపాడు. శ్రీమతి హార్వే ఒకింత కాస్త అనుమానాస్పదంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా గొప్ప ధూమపానిగా ఉన్న తరువాత, హెన్రీ దానిని విడిచిపెడతాడని ఆమె భావించలేదు. కానీ ఆమె ఆనందం ఏమిటంటే, అతడు మళ్ళీ ఎప్పుడూ పొగ త్రాగలేదు!

హెన్రీ జీవితంలో మార్పులకు గల కారణం తండ్రేనని శ్రీమతి హార్వే ఆనందంగా ఆ ఘనతనంతా యహువఃకే ఇచ్చెను. కానీ దాదాపు ఒక సంవత్సరం తరువాత, పూర్తిగా హెన్రీని బాగుచేయుటకు యహువః శక్తిపై తన విశ్వాసం క్షీణించుట మొదలయ్యిందని ఆమె తన ప్రార్థనా భాగస్వామితో ఒప్పుకుంది. మార్పులన్నియు మంచిగా ఉన్నప్పటికీ, తన మానసిక సామర్ధ్యాలు మాత్రం ఇప్పటికీ తీవ్రంగా వికలాంగముగానే ఉన్నాయి. విడువక ప్రార్థిస్తూ ఉండమని స్నేహితురాలు తనను ప్రోత్సహించింది, ఆమె తనకు యాకోబు 1: 6, 7 చూపించెను: “అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును . … గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు.”

ఒక వారం (వారమున్నర) తర్వాత, ఒక రోజు,శ్రీమతి హార్వీ ఆమె స్నేహితురాలిని పిలిచెను. ఆమె బహిరంగంగా మాట్లాడగలిగినంత గట్టిగా అరవసాగెను. హెన్రీ హింసాత్మకమైన ఆవేశంతో నిండిపోయెను, కిటికీల ద్వారా సామాగ్రిని విసిరివేస్తూ తన తల్లిదండ్రులను బెదిరింపసాగాడు. హర్వీ షెరీఫ్ ను (ఒక ప్రభుత్వ అధికారి) పిలలుచుటకు బలవంతం చేయబడెను మరియు హెన్రీ మానసిక ఆసుపత్రికి తీసుకువెళ్లబడెను. శ్రీమతి హార్వే కన్నీళ్లతో, ఇలా చెప్పెను: “”నేను ఇలా చెప్పుటకు చింతిస్తున్నాను. కానీ ప్రార్థన యొక్క శక్తిలో నేను విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాను. నేను ఇకపై నా అవసరాల కారణంగా కష్టాలోనికి [యహువః] వెళ్లలేను. “

విశ్వాసంతో అడుగుము

“వద్దు, ఇప్పుడు ఆపవద్దు!” తన స్నేహితురాలు బ్రతిమాలికొనెను. “నేను గతంలో కంటే ఎక్కువగా ప్రార్థన చేయుటకు పూనుకొనుచున్నాను. సాతాను మిమ్మల్ని నిరుత్సాహపర్చడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడు మీ ప్రార్థనలను ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. కాంతి యొక్క శక్తి విజయం పొందునప్పుడు సాతాను ఇలాంటి దాడులు చేయును గనుక దీనిని ఇంతకన్నా గట్టిగా ప్రార్థించుటకు ప్రోత్సాహకంగా తీసుకోండి!”

కొన్ని రోజుల తరువాత, ఆసుపత్రిలో హెన్రీ చక్కగా మేల్కొన్నాడు. అతడు మానసికంగా పరిపూర్ణమని ఆరోగ్య పరీక్షలు చూపించాయి. కొన్ని రోజులు పరిశీలన కోసం అతన్ని ఉంచిన తరువాత, వైద్యులు మిస్టర్ మరియు శ్రీమతి హార్వీకి తమ మార్పుచెందిన కుమారుడిని తీసుకొని వెళ్ళవచ్చునని చెప్పారు. అతను మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాడు.

“[యహువః] తన ప్రజల ప్రార్థనలను నిర్లక్ష్యం చేయుటలో ప్రమాదం లేదు. ప్రమాదమంతా ప్రలోభాలు మరియు శోధనల కారణంగా వారు నిరుత్సాహపడి, మరియు ప్రార్థనలో పట్టుదలను కోల్పోవుటలో ఉంటుంది.” 9 ఇశ్రాయేలీయులు అమాలేకీయులతో పోరాడినప్పుడు ఇదే పాఠము ప్రత్యేకంగా చూపబడినది.

క్రీస్తు యొద్దకు మెట్లు“మోషే యెహోషువతో మనకొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసికొని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధముచేయుము; రేపు నేను ఎలోహీం కఱ్ఱను చేతపట్టుకొని ఆ కొండ శిఖరముమీద నిలిచెదననెను. (నిర్గమకాండము 17:9) శతృ సైన్యంపై యుద్ధం చేయవలసిన సమయంలో యెహోషువ ఇశ్రాయేలు సైన్యానికి నాయకత్వం వహించినప్పుడు, మోషే సమీపంలోని కొండ మీద నిలబడి, ప్రార్థనలో తన చేతులను పైకి లేపి నిలబెట్టాడు. అలా గంటల తరబడి నిలబడి ఉండవలెను. అయితే మోషే చేతులు అలసిపోయినప్పుడు ఆయన వాటిని క్రిందికి దించెను. ఫలితంగా యుద్ధభూమిలో ఒక అద్భుతమైన పరిణామం సంభవించెను: “మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి; మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి”. (నిర్గమకాండము 17:11)

మోషేతో కలిసి కొండకు వెంబడించిన అహరోను, హూరు అనువారు మోషేకు, అలా ఇశ్రాయేలులందరికి సహాయం చేయుటకు త్వరగా వచ్చిరి:

మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసికొని వచ్చి అతడు దానిమీద కూర్చుండుటకై దానివేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించువరకు నిలుకడగా ఉండెను.

అట్లు యెహోషువ కత్తివాడిచేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను.(నిర్గమకాండము 17:12,13)

ఇది గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన పాఠం. ప్రార్థనలో పట్టుదలను నిర్లక్ష్యం చేయవద్దు. సాతాను తెర వెనుక ఎటువంటి ఆరోపణలు చేయుచున్నాడో (యోబు విషయంలో చేసినట్లు) మీకు తెలియదు. కొన్నిసార్లు ప్రార్థనలకు నెలలు లేదా సంవత్సరాల తర్వాత మాత్రమే జవాబు ఇవ్వబడుతుంది. వాగ్దానాలను పట్టుకొని, విడిచిపెట్టకూడదని మీ నుండి యహువః కోరుచుండెను. యాకోబు ప్రార్థన నీ ప్రార్థనగా ఉండవలెను: “నీవు నన్ను ఆశీర్వ దించితేనే గాని నిన్ను పోనియ్యననెను.!” (ఆదికాండము 32: 24-28 చూడండి.)

మిషనరీ మరియు గొప్ప రచయిత అయిన జోసెఫిన్ కున్నింగ్టన్ ఎడ్వర్డ్స్ (లేటు), తన సోదరుడు బిల్ మారుమనస్సు కోసం సంవత్సరాల తరబడి ప్రార్ధించారు. అతడు మార్పు పొందాలని తన తల్లిదండ్రులు తమ సమాధులలోనికి వెళ్ళు వరకు ప్రార్థిస్తూ ఉండిరి, కానీ అతని హృదయంలో ఎలాంటి మృదుత్వం కనిపించలేదు. బిల్ యొక్క భార్య, మేరీ కూడా, తన మార్పు కోసం ప్రార్ధించెను.

ఒక ఉదయం, బిల్ ఉదయ కాలపు పత్రిక చదవుటకు గదిలో కూర్చుని ఉన్నప్పుడు, మేరీ అతని యొద్ద నుండి ఒక వింతైన స్వరమును విన్నది. కంగారుగా ఆ గదిలోకి వెళ్లి, తన భర్త ముఖంలో కన్నీరు కారుటను గమనించింది.

“బిల్! ఏమైంది? ఏం జరిగింది?”

మేరీ తక్షణమే ప్రశ్నించెను.

“ఓహ్, మేరీ! నేను [రక్షకుడు యహూషువఃను] చూసాను. ఆయన ఇప్పుడే ఆ ద్వారం ద్వారా నడిచి వెళ్ళాడు! ఓహ్, మేరీ, నీవు చూడగలిగితే! అతడి ముఖకవళిక ప్రేమతో నిండిపోయింది. దానిని వివరించడానికి పదాలు లేవు!

“మరియు ఆయన నాతో మాట్లాడారు! ఆయన నాకు ఇలా చెప్పారు, బిల్, నీ తల్లిదండ్రులు తాము సమాధులలోనికి పోవు వరకు నీ కోసం ప్రార్ధించారు, మరియు వారు నిన్ను రాజ్యంలో చూడలేరని ఆందోళన చెందుతున్నారు. నేను వారిని పునరుత్థానదినపు ఉదయాన ఆశ్చర్య చకితులను చేయాలనుకుంటున్నాను. నీవు నీ హృదయాన్ని నాకు ఇవ్వవా? మనం వారికోసం కలిసి వేచి ఉందాము.’

“ఓహ్, ప్రియురాలా! నీవు ఎప్పుడైనా ఆయన ముఖాన్ని చూడగలిగితే, ఆయనను నిరాశపరిచే క్రియను నీవు ఎన్నటికీ చేయాలని అనుకోవు. అక్కడ చాలా ప్రేమ ఉంది! నేను ఆయనకు నా హృదయం ఇవ్వాలని మరియు ఆయన రాకడ దినం కోసం సిద్ధంగా ఉండాలని అనుకుంటున్నాను.”

అపొస్తలుడైన పౌలు విడిచిపెట్టుట వలన వచ్చే ప్రమాదాన్ని చాలా త్వరగానే అర్థంచేసుకున్నాడు. ఆయన ఇలా ఉద్బోధించాడు: “కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును.మీరు ఎలోహీం చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది. “(హెబ్రీయులు 10:35, 36)

[యహువః] చెప్పుచుండెను, “ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పరచెదవు. కీర్తనలు 50:15. తక్షణ ప్రార్థన చేయుటకు ఆయన మనలను అడుగుచుండెను. ఇబ్బందులు తలెత్తుట ప్రారంభమైన తక్షణమే, మన హృదయపూర్వకమైన, ధృఢమైన విజ్ఞాపణలను ఆయనకు అర్పించాలి. మన యొక్క విసుగుపుట్టించు ప్రార్ధనల ద్వారా మనము [ఎలోహీంకు] మన బలమైన విశ్వాసానికి ఆధారాలు ఇస్తాము. మన అవసరత యొక్క ఒత్తిడి ధృఢంగా ప్రార్థించుటకు మనల్ని నడిపిస్తుంది, మన పరలోకపు తండ్రి మన ప్రార్థనల ద్వారా కదిలింపబడతాడు. 10

ఒక కర్తవ్యం మరియు ఒక హక్కు

ఇతరుల కోసం ప్రార్ధించడం ద్వారా వారి ఆత్మలను మోక్షానికి నడిపించుటలో యహూషువఃకు సహకరించుట మనకు ఒక బాధ్యత మరియు ఒక హక్కుగా ఉన్నది. ఇతరుల తరపున మీరు అడగగల వాగ్దానాలతో లేఖనం పూర్తిగా నిండి ఉంది: “మృతులలో నుండి యహూషువఃను లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలో నుండి క్రీస్తు యహూషువః ను లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును (రోమీయులకు 8:11). ఇతరుల కోసం ప్రార్థన చేయునప్పుడు, ఆదాము పాపము చేయటకు పూర్వం ఎక్కడ ఉండెనో, మీరు ప్రార్థిస్తున్నవారు అక్కడకు తిరిగి తీసుకొని రాబడునట్లు అడగండి. మనస్సు మరియు హృదయాల యొక్క పునఃనిర్మాణమే మోక్ష ప్రణాళిక యొక్క మొత్తం సారాంశం.

ప్రియులైన వారు సత్యానికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడినప్పుడు నిరాశపడకండి. “వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని యహూషువః తన శిష్యులకు బోధించెను.” (లూకా 18:1)

ఒక పశ్చాత్తాప హృదయంతో ఆయన యొద్దకు వచ్చువారు ఎవ్వరూ ఎన్నడూ త్రోసివేయబడలేదు. ఎప్పుడూ ఒక హృదయపూర్వక ప్రార్థన వ్యర్ధమవలేదు. పరలోక గాయక బృందం యొక్క గీతాల మధ్య, [యహువః] బలహీనమైన మానవుడి యొక్క దుఃఖమును వింటారు. మనము మన హృదయ కోరికను మన గదిలో చెప్పుకొందుము, మార్గమందు నడిచేటప్పుడు మన ప్రార్థనల శ్వాసను విడుచుదుము, అయితే మన మాటలు విశ్వ అధిపతి యొక్క సింహాసనానికి చేరుకుంటాయి. అవి ఏ మానవ చెవికి వినబడకపోవచ్చు, కానీ అవి నిశ్శబ్దంగా మరణించవు, మరియు జరుగుతూ ఉన్న కార్యకలాపాల ద్వారా అవి మరచిపోబడవు. ఏ ఆత్మ యొక్క కోరికను ఏదియు ముంచ జాలదు, అది వీధిలోని అసహ్యకరమైన, మరియు రణగొణధ్వనులకు పైగా లేచి పరలోక న్యాయస్థానం యొద్దకు చేరుతుంది. మనం మాట్లాడుతున్నది [యహువః తో], మరియు ఆయన మన ప్రార్థనను వినును. 11

ఇతరుల రక్షణ కోరుకునే వారికి పరలోకం సహకరిస్తుంది. “[యహువః] పిల్లలు ఒంటరిగా, రక్షణ లేనివారిగా విడిచిపెట్టబడరు. ప్రార్థన సర్వశక్తిమంతుని యొక్క హస్తాన్ని కదిలిస్తుంది.” 12 విశ్వాస పూరితమైన, సరళమైన, విశ్వసనీయమైన, సూటియైన మరియు ప్రత్యేకమైన ప్రార్ధన యహూషువః రక్తము యొక్క విలువలోని హక్కును పొందును, మరియు ఆ ప్రార్థనకు సమాధానం లభించును.

[తండ్రి] మీ హృదయపూర్వక విశ్వాసాన్ని పొందేందుకు అనేక విధాలుగా పని చేస్తున్నాడు. నీ భారమును తొలగించుటలో కంటే మరి ఎక్కువ ఆనందమును ఆయన మరి దేనిలోను కలిగి యుండడు, ఆయన వెలుగును బలమును పొందుకొనుటకు ఆయన యొద్దకు రమ్ము, ఆయన నీ ప్రాణమునకు విశ్రాంతి కలుగుజేతునని వాగ్దానము చేసెను. ప్రార్థన చేయటకు హృదయమును మరియు స్వరమును మీరు కలిగియుంటే, ఆయన ఖచ్చితంగా వినును, మరియు మిమ్మల్ని రక్షించడానికి ఒక చేయి మీ యొద్దకు చేరుకుంటుంది. ప్రార్థనను వినే [ఎల్] ఉండెను, మరియు సమస్త ఇతర వనరులు విఫలమైనప్పుడు, ఆయన మీ ఆశ్రయమై యుండి, ఆపత్కాలంలో సహాయం చేయుటకు ఆయన చాలా దగ్గరగా ఉండును . . . .13

పరలోకం అంతయు నీ కొరకు ఎదురుచూస్తుంది

నేడే పరలోకంతో చేరండి. మీ శ్రద్ధను, మీ చింతలను, మీ ప్రియమైనవారిని, ప్రార్థనకు-జవాబిచ్చే సర్వశక్తిమంతుని ముందు ఉంచండి. ఆత్మలను కాపాడుతూ మోక్షానికి వారసులుగా ఉన్నవారికి సహకరించుటకు పరలోకము ఎదురుచూస్తోంది.


1 రోజెర్ జె. మోర్యువు వ్రాసిన ఇంక్రెడిబుల్ పవర్ ఆఫ్ ప్రేయర్ నుండి తీసుకొనబడినది.

2 ఐబిడ్., Pp. 70-71.

3 ఇ. జి. వైట్, ది గ్రేట్ కాంట్రావర్సీ, పే. 525.

4 ఇ. జి. వైట్, గాస్పల్ వర్కర్స్, పే. 470.

5
E. G. వైట్, సెలెక్టెడ్ మెస్సేజెస్, వాల్యూమ్. 2, పే. 136.

6 ఇ. జి. వైట్, క్రైస్ట్ ఆబ్జెక్ట్ లెసెన్స్, p. 142.

7
C. H. స్పర్జన్, సేర్మోన్స్, పే. 21.

8 పేరు మార్చబడింది.

9
ఇ. జి. వైట్, క్రీస్తు ఆబ్జెక్ట్ లెసెన్స్, పే. 175.

10
ఐబిడ్., పే. 172.

11 ఐబిడ్., పే. 174.

12
ఐబిడ్., పే. 172.

13
E. G. వైట్, దిస్ డే విత్ గాడ్, పే. 184.

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.