World's Last Chance

At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

While WLC continues to uphold the observance of the Seventh-Day Sabbath, which is at the heart of Yahuwah's moral law, the 10 Commandments, we no longer believe that the annual feast days are binding upon believers today. Still, though, we humbly encourage all to set time aside to commemorate the yearly feasts with solemnity and joy, and to learn from Yahuwah's instructions concerning their observance under the Old Covenant. Doing so will surely be a blessing to you and your home, as you study the wonderful types and shadows that point to the exaltation of Messiah Yahushua as the King of Kings, the Lord of Lords, the conquering lion of the tribe of Judah, and the Lamb of Yahuwah that takes away the sins of the world.
WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

న్యూమూన్ దినములు & అనువాద దినములు


రహస్యం వివరించబడెను

 

సృష్టికర్త కేలండరు ఆధునిక అన్యమత కేలండరులో లేనటువంటి రెండు వర్గాల దినములను కలిగి ఉన్నది: న్యూ మూన్/ నెలారంభ దినములు మరియు అనువాద దినములు. ఒక్కసారి వీటిని అర్థం చేసుకున్న తర్వాత, వాస్తవంగా సమయం ఎలా లెక్కించబడేదో గ్రహించుట సులభమవుతుంది.

 

సుమారు 2,000 సంవత్సరాలు, పాశ్చాత్య ప్రపంచంలోని భాగాలు ఒకే ఏడు రోజుల వారపు చక్రం ద్వారా సమయాన్ని నియంత్రించాయి. శనివారం తరువాత వచ్చు ఆదివారపు ఈ ఆధునిక వారం సృష్ట్యారంభము నుండి అంతరాయం లేకుండా నిరంతరం తిరుగుతూ ఉంది అనే భ్రమను క్రైస్తవులలో సృష్టించింది. ఇది నిజం కాదు. ఆధునిక గ్రెగోరియన్ కేలండరును అధికారికంగా స్వీకరించిన చివరి దేశం 1923 లో, గ్రీస్, అయినప్పటికీ 1949 వరకు మొత్తం ప్రపంచం దీనిని వాడుటలో ఏకీకరణ చేయబడలేదు.

యొక్క మార్పుల (కదలిక) ద్వారా మనము చేరే సంగ్రహణం.””సమయము అనేది వస్తువుల

ఆస్ట్రియన్ భౌతిక శాస్త్రవేత్త, ఎర్నస్ట్ మాక్ (1838-1916)

సమయము మరియు అది ఎలా లెక్కించబడుతుందోననే పరిజ్ఞానం, బైబిలు సంబంధమైన కాల కొలత పద్ధతిలో కనిపించే న్యూమూన్ దినాలు మరియు అనువాద దినాల యొక్క ప్రాముఖ్యతను అర్ధం చేసుకొనుటకు వీలు కల్పిస్తుంది.

సమయం కదలిక ద్వారా మాత్రమే కొలవబడుతుంది.

మానవులు కదలికలను ఉపయోగించి సమయంను చెప్పుదురు మరియు కొలుచుదురు. గడియారం-ముఖం చుట్టూ కదిలే గడియారపు ముళ్ళు గంటలను, నిమిషాలను మరియు సెకన్లను తెలియజేయును. సూర్యుని చుట్టూ భూమి యొక్క భ్రమణం ద్వారా ఒక సంవత్సరంను తెలియజేయబడుతుంది. భూమి చుట్టూ చంద్రుని భ్రమణం ద్వారా ఒక నెల తెలియజేయబడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుట ద్వారా ఒక రోజు తెలియజేయబడుతుంది.1 [గమనిక: WLC ఏ విధమైన మోసపూరిత సూర్యకేంద్రక పద్ధతిని లేదా భూమి గోళాకారంగా ఉంది అనే తప్పుడు సూచనను ఆమోదించదు: బల్లపరుపు భూమి యొక్క సత్యం]

సమయ గణనలో తేడాలు: వారాల యొక్క గందరగోళం

క్షీణిస్తున్న చంద్రడుగమనం లేకుండా సమయంను కొలుచుట సాధ్యం కాదు. ఆధునిక కేలండరు అనేది ఒక సౌర కేలండరు, ఇది దాని రోజులు మరియు సంవత్సరాల కొరకు సూర్యునిపై ప్రత్యేకంగా ఆధారపడి ఉంటుంది. ఆధునిక కేలండర్లో, వారాలు మరియు నెలలు ప్రకృతిలో దేనిపైనా ఆధారపడవు.అవి పూర్తిగా స్వతంత్రంగా ఉంటాయి. ఇది ప్రపంచంను సృష్టించినప్పుడు యహువఃచే స్థాపించబడిన సూర్య-చంద్ర కేలండరుకు భిన్నంగా ఉంటుంది.

సృష్టి యొక్క కేలండరు పూర్తిగా ప్రకృతి మీద ఆధారపడి ఉంది. సంవత్సరాల నుండి నెలల వరకు, వారాల నుండి రోజుల వరకు, దీనిలో సమస్తము గమనములపై ఆధారపడి ఉండును. “నెల”/ month అనే పదం మొదట “మూన్త్/moonth” గా ఉంది మరియు అది చంద్రుడు/moon అనే పదం నుండి వచ్చింది. ప్రాచీన కాలంలో, నెలలు ఎల్లప్పుడూ చంద్రుని కదలికపై ఆధారపడి ఉండేవి. అలా, అందువలన వారాలు నెలలలోని లేదా చాంద్రమానంలోని విభాగాలుగా వుండేవి. “హీబ్రూ సబ్బాతన్ … ఏడు రోజుల వ్యవధిలో, చంద్రుని దశలలోని మార్పులకు అనుగుణంగా జరుపబడేది….”2. అలాగే బైబిల్ కేలండరు యొక్క నెలలు మరియు వారాలు కూడా ప్రకృతిలోని కదలికపై ఆధారపడి ఉంటూ, యహువః యొక్క సూర్య-చంద్ర కేలండరుకును మరియు నేడు వినియోగంలో ఉన్న అన్యమత/ పోపు సంబంధిత సౌర కేలండరుకును మధ్య పెద్ద తేడాను చూపిస్తుంది.

రెండు కేలండర్లు సూర్యుని చుట్టూ ఒక భ్రమణం పూర్తి చేయడానికి భూమికి ఎంత సమయం పడుతుంది అనేదానిని వెంబడిస్తాయి. (ఒక సంవత్సరం). అలాగే రెండును ఆ సంవత్సరాన్ని చిన్న చిన్న, మరింత నిర్వహించదగిన విభాగాలుగా విభజిస్తాయి. కానీ అక్కడ, సారూప్యత ముగుస్తుంది. ఆధునిక కేలండరులోని నెలలు 28 రోజుల నుండి 31 రోజుల వరకూ నిడివిని కలిగి ఉంటాయి. నెలలు ప్రకృతిలో దేనితోను ముడిపడి ఉండవు. పర్యవసానంగా, ఒక వారం నిరంతరంగా మరియు అంతరాయం లేకుండా ఒక నెల నుండి మరొక నెలకు; ఒక సంవత్సరం నుండి, తదుపరి సంవత్సరంకు కొనసాగును.

ర దశల పరిశీలన మీద ఆధారపడి ఉండేది … నేటి అభిప్రాయం ప్రకారం, ఒక స్థిరమైన రోజుగా ఉండేది కాదు.””ఇశ్రాయేలు యొక్క సంచార కాలంలో సబ్బాతు, చంద్


jewishencyclopedia.com

మరోవైపు, సృష్టికర్త కేలండరులోని ప్రతి నెల చంద్రుని కదలికలపై ఆధారపడును. ప్రతి నెల న్యూమూన్/ నెలపొడుపుతో ప్రారంభమవుతుంది. వారం, నెల యొక్క భాగంగా ఉంటూ, ప్రతి న్యూమూన్ కు దాని చక్రం పునః ప్రారంభమవుతుంది. “హీబ్రూ నెల ఒక చంద్ర నెల, మరియు ఈ కాలంలోని నాల్గవ భాగం చంద్రుని యొక్క ఒక దశ; ఏడు రోజుల వారంను నిర్ణయించునట్లు కనిపిస్తుంది.”3 సృష్టి యొక్క కేలండరును మొదటిగా అధ్యయనం చేయట ప్రారంభించినప్పుడు ఇది గ్రహించుట కష్టతరముగా ఉంటుంది: ఆధునిక, సౌర కేలండర్లో నిరంతర వారాల చక్రం ఉంటుంది. సృష్టి యొక్క కేలండరులో లేదు.

న్యూ మూన్లు లేక నెలారంభములు బైబిలు పద్ధతి యొక్క సమయ-సూచక వ్యవస్థలోని ముఖ్యమైన భాగాలు, ఎందుకంటే అవి నెలవారీ వారాల చక్రం పునఃప్రారంభమయ్యే సమయములు. లేఖనాలలో “న్యూ మూన్” అనే పదబంధం హిబ్రూ పదం, ఖోదేష్ నుండి వచ్చింది. ది న్యూ స్ట్రాంగ్స్ ఎగ్సాస్టివ్ కాంకర్డేన్స్ ఆఫ్ బైబిల్ వర్డ్స్ లో ఖోదేష్ అనగా “కొత్త
చంద్రుడు; సూత్రప్రాయంగా, ఒకనెల. “న్యూ స్ట్రాంగ్స్ ఎక్స్పాండెడ్ డిక్షనరీ ఆఫ్ బైబిల్ వర్డ్స్ లో ఈ విధంగా వివరించబడింది:” ఖోదేష్ ఒక ‘నెల,’ లేదా ఒక న్యూమూన్ నుండి మరొక న్యూమూన్ వరకు గల కాలాన్ని సూచిస్తుంది. . . . సంబంధిత స్వల్పభేదంలో, ఈ పదం ఒక కాల వ్యవధిని కొలుచును, లేదా ఒక కేలండర్ నెలను సూచించును.”

అందుచేత, లేఖనాల్లో “న్యూ మూన్” అనగా:

  1. కొత్త నెల యొక్క మొదటి రోజు.
  2. ఒక న్యూమూన్ కు మరియు తదుపరి న్యూమూన్ కు మధ్య గల సమయం.
  3. ఒక కేలండరు నెల.

టు), పెంతెకోస్తు, మరియు పర్ణశాలల పండుగలు సౌర పండుగలు, అనగా సంవత్సరంలోని కాలాలకు అనుగుణంగా జరిగే పండగలు.””న్యూమూన్ మరియు సబ్బాతు చంద్రుని వలన తెలియబడు పండుగలు, పస్కా (పులియని రొట్టెల పండుగతో పా

ఎ డిక్షనరీ ఆఫ్ ది బైబిల్: డీలింగ్ విత్ ఇట్స్ లాంగ్వేజ్, లిటరేచర్, అండ్ కంటెంట్స్ ఇంక్లూడింగ్ బైబ్లికల్ థియాలజీ, 1898, సంపుటి .1, పేజి.860.

న్యూమూన్ దినములయందు ఒక నూతన నెల ప్రారంభమౌను అనుటకు గ్రంథం పలు ఆధారములను5 కలిగి ఉంది. ఖోదేష్ ను నెలలోని మొదటి రోజుగా ఉపయోగించిన దాని కంటే ఎక్కువ సార్లు ఒక కేలండర్ నెలను సూచించడానికి ఉపయోగించినట్లు లేఖనాల ఆధారాలు 6 ఉన్నాయనే వాస్తవం చంద్రుని చాంద్రమానంతో అనుసంధానించబడియున్న కాలం ఒక నెలకు సంబంధించినదని తెలియజేయుటను చూడవచ్చు. ఖోదేష్ బైబిలులో 20 సార్లు క్రొత్త చాంద్రమానం యొక్క మొదటి రోజుని సూచించడానికి ఉపయోగించబడినది. ఇది కేలండర్ నెలను లేదా చాంద్రమాసంను సూచించడానికి 251 సార్లు ఉపయోగించబడింది.

చంద్రుడిని కేలండర్ నెలకు అనుసంధానించే మరొక హెబ్రీ పదం యెరాఖ్, (# 3391). “నెల” కోసం ఈ పదం న్యూమూన్ ను సూచించదు, కానీ ఒక కేలండర్ నెలను ఒక చాంద్రమానంతో అనుసంధానిస్తుంది: “ఒక చాంద్రమానం, అనగా,
నెల: – నెల, చంద్రుడు.” 7 రెండు పదాలు కేలండరుపై ఒక నెలను ఒక చాంద్రమానంతో కలుపుతాయి:

ఖోదేష్: న్యూమూన్; నెల; చాంద్రమాసం.

 

 

యెరాఖ్: నెల; చాంద్రమాసం, చంద్రుడు.

ప్రకృతిలో ప్రతి దాని నుండి విడిపోయి ఉన్న నెలలు గల గ్రెగోరియన్ కేలండరులో న్యూమూన్ దినాలకు సంబంధించిన రోజులు లేవు. అందువల్ల చాలామంది ప్రజలు న్యూమూన్ దినమునందు ఏమి చేయాలి, ఎలా ఆచరించాలి అనే దానిపై గందరగోళంగా ఉంటారు. లేఖనం న్యూ మూన్ యొక్క ఆచారం గురించి అనేక విషయాలు తెలుపుతుంది:

  1. న్యూమూన్లు వ్యాపార దినాలు కాదు.
  2. న్యూమూన్లు కృతజ్ఞతార్పణ దినాలు.
  3. న్యూమూన్లు ఆరాధనా దినాలు.

న్యూ మూన్ దినాలు వ్యాపార దినాలు కాదు

బాగా ధనవంతులుగా యుండుటలో “యూదులు ఎల్లప్పుడూ ఖ్యాతిని కలిగి ఉన్నారు: అనగా డబ్బు సంపాదించడానికి మరియు అధిక వడ్డీని సంపాదించడానికి అన్యుల నుండి ప్రతి అవకాశాన్ని పొందడంలో ఖ్యాతి కలిగి ఉన్నారు. బైబిలు కాలాల్లోని యూదులు వేరుగా లేరు. మతభ్రష్టత్వంలో ఉన్నప్పుడు యూదులు తమ దుకాణాలను సబ్బాతు యందు మరియు న్యూ మూన్ల యందు మూసివేయవలసి వచ్చినపుడు ఆగ్రహించుకొనేవారు. ఈ అత్యాశపరులైన వ్యాపారుల దుఃఖంను గూర్చి బైబిలు ఇలా నమోదు చేస్తోంది:

వ్యాపార లావాదేవీ చేయుచున్న స్త్రీ మరియు పురుషుడు

“తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు నెలారంభము యెప్పుడై పోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునోయని చెప్పుకొను వారలారా,

దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షల నిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతిదిన మెప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా, ఈ మాట ఆలకించుడి.

యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యహువః ప్రమాణము చేయునదేమనగా వారిక్రియలను నేనెన్నడును మరువను.” (ఆమోసు 8: 5-7)

అయితే, ఈ దినములయందు ప్రత్యక్ష గుడారపు పనులు అనుమతించబడినవి.

మరియు యహువః మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను.
మోషే ఆ ప్రకారము చేసెను; యహువః అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటిని చేసెను, ఆలాగుననే చేసెను.

రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను. (నిర్గమకాండము 40: 1-2, 16-17).

న్యూమూన్ దినాలలో ఇతర విధములైన “పని” ఆమోదయోగ్యమైనదిగా కనిపించుట సాధ్యము, కానీ తెలియదు. ఏదేమైనా, ఆదాయమును సంపాదించే పని మరియు వ్యాపారం, లేదా ఇతర రోజులలో చేయబడు ఏ ఇతర దైనందిన పనులు చేయరాదు.

ఉన్న సబ్బాతుతో అదే క్రమంలో వుండెను.””ప్రాచీన ప్రవక్తల కాలములో, న్యూమూన్ దినము మరొక చంద్ర ఆచరణగా

స్క్రిబ్నర్స్ డిక్షనరీ ఆఫ్ ది బైబిల్, 1898 ఎడిషన్., పేజి. 521.”

న్యూమూన్/ నెలారంభ దినాలు కృతజ్ఞతార్పణ దినాలు

న్యూ మూన్లు కుటుంబంతో కలిసి గడపడానికి, భోజనం పంచుకునేందుకు మరియు గత నెల యొక్క ఆశీర్వాదాల విషయంలో సంతోషించుటకు మరియు క్రొత్త నెలలో యహువఃకు పునః ప్రతిష్టించుకొను సమయాలుగా ఉంటాయి. న్యూమూన్ దినమలు కుటుంబం మరియు స్నేహితులతో గడపే దినములుగా మరియు కలిసి భోజనం పంచుకొనే సమయాలుగా ఉన్నట్లు బైబిల్ మరియు బైబిలేతర ఆధారాలు సూచించుచున్నవి. ప్రత్యేకించి స్త్రీలు గృహకార్యాల యొక్క అనేక భారాల నుండి విముక్తి పొందే రోజు అని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. ఇతర లేఖనాలు, సబ్బాతు దినముల వలె, న్యూ మూన్లు కూడా ప్రత్యేక విచారణలు చేయుటకు ప్రజలు ప్రవక్తల వద్దకు వెళ్ళే సమయమని వెల్లడిస్తున్నాయి.

న్యూమూన్లు నిజానికి ఆరాధనా దినాలు

గ్రంథం ఎక్కడ నిశ్శబ్దంగా ఉందో, అక్కడ చరిత్ర అదనపు వెలుగును ప్రచురం చేయగలదు. యూనివర్సల్ యూదు ఎన్సైక్లోపెడియా యొక్క తొలి ఎడిషన్, న్యూమూన్ దినాలు నిజానికి ఆరాధన దినములని చెప్పుచుండెను:

సబ్బాతులు మరియు న్యూమూన్లు (రోష్ ఖోదేష్), రెండూ ఒక సంవత్సర కాలంలో కాలానుగుణంగా పునరావృతమవుతాయి. న్యూ మూన్ ఇప్పటికినీ, మరియు సబ్బాత్ మొదట్లో, చంద్ర చక్రంపై ఆధారపడి ఉండెను. రెండును ఇజ్రాయెల్ యొక్క సంచార కాలం నాటికి ఉనికిని చూచిస్తున్నవి. మొదట్లో న్యూ మూన్ కూడా సబ్బాతు వలెనే జరుపబడేది; రాను రాను సబ్బాతు మతము మరియు మానవత్వం యొక్క రోజుగా, ధ్యానం మరియు బోధన, శాంతి మరియు ఆత్మ ఆనందం యొక్క దినంగా మారగా న్యూమూన్ యొక్క ప్రాధాన్యత క్రమంగా తగ్గెను.8

అనువాద దినములు

అనువాద దినములు, న్యూ మూన్ దినాల వలె, ఆధునిక సౌర కేలండరులో ప్రత్యక్ష సంబంధంను కలిగి లేవు. అయినప్పటికీ, యహువః యొక్క కేలండరును స్పష్టంగా అవగాహన చేసుకోవాలంటే వాటిని గూర్చి అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది.

రాత్రి పూట నక్షత్రాకాశం“అనువాద దినము” అనేది ఒక ఖగోళ పదం, అది గ్రంథంలో కనుగొనబడలేదు. అయితే బైబిలు నెలలు చంద్రుని చక్రాలపై ఆధారపడి ఉన్నాయి అనే నిజం బైబులు కేలండరులో ఇవి ఉన్నాయనే దానిని ఋజువు చేస్తుండెను. యునైటెడ్ స్టేట్స్ యద్ధనౌకల పరిశీలనా సంస్థ ప్రకారం, ఒక చాంద్రమానం 29.5 రోజుల పాటు ఉంటుంది. సాధారణంగా చెప్పాలంటే, నెల తప్పించి నెలకు ఇది 29 రోజులను కలిగి ఉండగా, మిగిలిన నెలలలో 30 రోజుల వరకు ఉంటుంది. ఒక చాంద్రమానం [నెల] ఎప్పుడూ 29 రోజుల కంటే తక్కువ గాని లేదా 30 రోజుల కన్నా ఎక్కువ సమయంను గాని కలిగి ఉండదు. ఇది ఒక నిరూపితమైన ఖగోళ వాస్తవం.

ఖగోళ శాస్త్రజ్ఞులు ఒక “చాంద్రమానం” యొక్క 30 వ రోజును సూచించటానికి “అనువాద దినము” అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఇది చంద్ర చక్రం చివరలో చంద్రుడు కనిపించనప్పుడు “చంద్రుడు నల్లగా” మారినపుడు వస్తుంది.

సమయము నిరంతరంగా ఉన్నందున, చాలా మంది కాలమును లెక్కించే వ్యవస్థ కూడా తప్పక, అప్రమేయంగా, నిరంతరంగా ఉండెనని నమ్ముదురు. ఇది ఊహ యొక్క లోపం. వాస్తవానికి, పురాతన కేలండర్లన్నియు సూర్య-చంద్ర కేలండర్లు మరియు వారాల చక్రము (వివిధ పొడవులతో) ప్రతి న్యూమూన్ దినానికి పునఃప్రారంభమయ్యేవి. కాలశాస్త్రవేత్తలు నిరంతర వారాల చక్రం కలిగియున్న మొదటి కేలండరును క్రీ.పూ 600 కాలానికి చెందిన బబులోను సంబంధమైనదానిగా సూచించారు. ఆ సమయానికి ముందు, ఏ కేలండరును ఆటంకం లేని వారాల చక్రాన్ని ఉపయోగించలేదు. వారాల చక్రం నెల/ చాంద్రమాన ప్రారంభంలో గాని లేదా మునుపటి సంవత్సరం ముగిసిన తరువాత [దీనిలో సంవత్సరం ముగిసే ముందు అయిదు దినములు అధిక దినములుగా ఉంటూ అవి ఏ వారపు చక్రానికీ చెందకుండా ఉంటాయి.9] గాని పునఃప్రారంభమవుతాయి.

అన్ని సమయాలను లెక్కించాలి. అందువలన కొందరు సూచించిన విధంగా అనువాద దినములు “లెక్కించని-దినాలు” కాదు. అవి ఒక తేదీని కలిగి ఉన్నాయి: అది ప్రతి ముప్పై రోజుల నెలలో 30 వ తేదీ. నెలలో 30 వ దినము, నెలలో మెదటి దినం వలె ఏడు రోజుల వారపు చక్రంలో భాగం కాదు. ఏదేమైనప్పటికీ, ఇది లెక్కించబడి తేదీని కలిగి ఉంటుంది.

అనువాద దినములను గూర్చిన గందరగోళం వలన కొంతమంది ప్రజలు బైబిలు సంబంధ సూర్యచంద్ర కేలండరును తిరస్కరించారు. నాల్గవ ఆజ్ఞ సస్పష్టంగా ఇలా చెబుతోంది: “ఆరు దినములు నీవు కష్టపడి నీ పనియంతయు చేయవలెను. ఏడవ దినము నీ ఎలోహ అయిన యహువఃకు విశ్రాంతి దినము.” (నిర్గమకాండము 20: 9-10) అనువాద దినములను అర్ధం చేసుకోకపోవుట, ఒక నెలలో 29 వ తేదీన వచ్చే ఏడవ దినపు సబ్బాతుకు మరియు తరువాతి నెల 8 వ తేదీన వచ్చే ఏడవ రోజు సబ్బాతుకు మధ్య మొత్తం తొమ్మిది రోజులు ఉన్నాయి అనుకొనే తప్పుడు అభిప్రాయానికి దారితీసింది. నాలుగవ ఆజ్ఞలో సూచించిన సబ్బాతుకు సబ్బాతుకు మధ్య ఆరు-రోజుల విరామం కంటే ఈ వ్యవధి ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి ఇది ఒక సమస్యగా కనిపిస్తుంది. అయితే, న్యూ మూన్ దినములు పవిత్ర దినాలలోని ఒక కోవకు చెందినవి కావున, ఆరాధన దినాల మధ్యలో ఎప్పుడూ ఆరు కన్నా ఎక్కువ పని దినాలు ఉండవు. (ఒక చాంద్రమాన నెలలో ఎప్పుడూ 30 రోజుల కంటే ఎక్కువ గాని లేక 29 రోజుల కన్నా తక్కువ గాని ఉండవు. ఆవిధంగా, 30 వ దినమును అనుసరించి న్యూమూన్ దినము ఎల్లప్పుడూ కొత్త నెలను ప్రారంభిస్తుంది. అప్పుడప్పుడూ 29 రోజుల నెలలు లేదా 30 రోజుల నెలలు చంద్రునిచే నియంత్రించబడుట వలన వెనువెంటనే రావచ్చును.)

సౌర చంద్ర కేలండరు

విశ్రాంతి దినాలకు మధ్య చాలా ఎక్కువ పని దినాలు వచ్చుచున్నాయనే భావన, న్యూమూన్ దినము ఒక ఆరాధన దినమని మరియు అది [ఆరు పనిదినాల వెంబడి ఒక ఏడవ దినపు విశ్రాంతి దినమును కలిగి యున్న] నాలుగు వారాల కొత్త చక్రంను ప్రారంభిస్తుందనే విషయంను అర్థం చేసుకోకపోవుట వలన కలుగుచున్నది. న్యూ మూన్ దినాలు కొత్త నెల యొక్క కొత్త వారాల చక్రంను ప్రారంభించుట వలన, అనువాద దినములు వాటికి ఒక తారీఖును కలిగి ఉన్నప్పటికీ అవి వారం వారీ చక్రంలో భాగం కాదు. అనువాద దినాలు, ఎల్లప్పుడూ చంద్ర నెలలో 30 వ తేదీన ఉంటూ అవి ఎప్పుడూ తరువాతి నెలలోని బదిలీ చేయబడవు లేదా కొత్త నెలలోని తేదీగా లెక్కించబడవు ఎందుకంటే కొత్త నెల ఎల్లప్పుడూ ఈ అనువాద దినానికి తరువాత వచ్చే న్యూమూన్ దినముతో మొదలవుతుంది. న్యూ మూన్ తో, నాలుగు వారాల కొత్త చక్రం మొదలవుతుంది. ఆసక్తికరంగా, ఈ గందరగోళం పశ్చిమ ప్రాంతంలో ఉన్నవారిలో [వారికి ఎప్పటికీ నిరంతర వారాల చక్రం గల కేలండరు మాత్రమే తెలిసి ఉండుటవలన] ఎక్కువగా కనిపిస్తుంది. తమ మతపరమైన కేలండర్ల కోసం చంద్రుని కేలండరును ఉపయోగించే దేశాలలో, ఇది గ్రహించడానికి సులభమైన పద్ధతి.

పరిశుద్ధంగా ఆచరించవలసిన రోజులను లేదా తేదీలను యహువః ఎల్లప్పుడూ స్పష్టంగా పేర్కొనెను. అందువలన, ప్రత్యేకంగా పవిత్ర దినాలుగా సూచించబడని రోజులు పని దినాలు. న్యూమూన్లు కూడా  విశ్రాంతి సమయాలుగా ఉండటం వలన, విశ్రాంతి  దినాలకు మధ్య ఆరు పని దినాలకంటే ఎక్కువ ఎప్పుడూ ఉండవు.

దినముల యొక్క వర్గాలు/ రకాలు

గ్రెగోరియన్ సౌర కేలండరు వివిధ రకాల దినములను కలిగియున్నది: పని /పాఠశాల దినాలు, వారాంతాలు (చాలామంది ప్రజలు పనిని నిలుపుచేయునవి) మరియు జాతీయ సెలవులు. బైబిలు కేలండరు మూడు రకాల ఆరాధన దినాలను కలిగి ఉంది:

  1. వారపు (ఏడవ రోజు విశ్రాంతి దినము)
  2. నెలవారీ (న్యూ మూన్లు /నెలారంభం)
  3. వార్షిక (వార్షిక పండుగలు)
న్యూమూన్ దినపు బలులు

న్యూమూన్ దినాల కోసం సూచించబడిన బలులు వారపు ఏడవ రోజు విశ్రాంతి దినము కోసం సూచించిన వాటి కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి అనే విషయంలో న్యూ మూన్ యొక్క ప్రాముఖ్యతను చూడవచ్చు!

బైబిలు కేలండరు ద్వారా ఆరాధించటానికి అంగీకరించియున్న చాలామంది వారంవారీ మరియు వార్షిక పండుగలను ఆచరిస్తారు, అయితే నెలవారీ ఆచారమైన న్యూ మూన్ ను తరచుగా నిర్లక్ష్యం చేయుదురు. ఇది పాక్షికంగా న్యూ మూన్ ను ఎలా ఆచరించాలి అనే అజ్ఞానం ద్వారా జరుగుతుంది. ఏదేమైనా, గ్రంధంలో న్యూమూన్ల నిమిత్తం సూచించిన బలులు ప్రతి వారపు ఏడవ దినపు సబ్బాతు కోసం సూచించిన వాటి కంటే చాలా ఎక్కువ. ఏడవరోజు విశ్రాంతి దినము కోసం అవసరమైన బలులు అనుదినము అర్పించు రెండు గొర్రెలతో పాటు మరో రెండు అదనపు గొర్రెలు, చిన్న ఆహారం మరియు పానీయార్పణ మాత్రమే. అయితే, న్యూమూన్ దినముల కోసం అవసరమైన బలులలో అదనంగా రెండు చిన్న దూడలు, ఒక పొట్టేలు, ఏడు గొఱ్ఱెపిల్లలు, ఒక పెద్ద ఆహారం మరియు పానీయార్పణలు కూడా ఉన్నాయి.

పాత నిబంధన యొక్క బలి వ్యవస్థలో భాగంగా యాజకులు ప్రతిరోజూ ఉదయం ఒకటి మరియు ఒక సాయంత్రం ఒకటి దహన బలి అర్పించేవారు. ఏ దినాలలో ఏ బలులు అర్పించాలో యహువః పేర్కొన్నారు. రోజువారీ సగటు బలి ఒక గొర్రె. పెద్ద, ఖరీదైన బలులు వార్షిక పండుగలలో ఇవ్వబడ్డాయి. ఒక రోజుకి పేర్కొన్న బలుల యొక్క రకాన్ని బట్టి రోజుల గొప్పతనం నిర్ణయించబడితే, అవి తక్కువ నుండి చాలా ముఖ్యమైనవి వరకు ఈ క్రింది విధంగా ఉండును:

4. ప్రతి దినము పని దినములు
3. వారపు ఏడవ రోజు విశ్రాంతిదినములు
2. న్యూ మూన్లు/ నెలారంభములు
1. వార్షిక పండుగలు

కేలండరు: సృష్టి యొక్క జ్ఞాపిక

సర్వ సృష్టియు సృష్టికర్తను గురించిన సత్యాలను వెల్లడిచేయడానికి, మానవుల హృదయాలను, మనస్సులను తన సృష్టికర్తకు కృతజ్ఞత తెలియజేయడానికి తీసుకుని వచ్చుటకు రూపొందించబడెను. ఆ విషయం కొరకు మాత్రమే యహువః రూపొందించిన కేలండరు దైవీకంగా రూపొందించబడింది. ఏడవ దినపు వారపు-సబ్బాతు సృష్టికర్త ప్రార్థన చేయుచున్న జంటఆరాధన కోసం వేరుచేయబడి ప్రత్యేకించబడాలి. “సబ్బాతు” అనే పదం షబాత్ నుండి వచ్చింది (# 7673) మరియు దానర్థం, “విశ్రమించుట, అనగా శ్రమనుండి విరమించుట.”10 కానీ, ప్రత్యేకించవలసినవి వారపు సబ్బాతులు మాత్రమే కాదు. వాస్తవానికి, నెలవారీ న్యూమూన్లు మరియు, వార్షిక పండుగలు సృష్టికర్త యొక్క మంచితనాన్ని స్మరణకు తెచ్చుకొను సమయాలై ఉన్నాయి.

చంద్రుని యొక్క నాలుగు దశలు నెల యొక్క స్పష్టమైన విభాగాన్ని అందించుచున్నవి … హెబ్రీ లేఖనాలలోని పురాతన భాగాలలో న్యూమూన్లు మరియు విశ్రాంతి దినములు దాదాపుగా రెండూ కలిసి ప్రస్తావించబడుట చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండెను. [చంద్ర] నెల ప్రశ్న లేకుండా షేమైతీయులందరికీ సాధారణ పవిత్ర సమయ విభాగమై ఉండెను, చివరికి సిరియన్ల నుండి చాలా ఆలస్యంగా వారాన్ని పొందిన అరబ్బులు కూడా, మతపరమైన జయధ్వనులతో న్యూమూన్ను కొనియాడిరి. … నెల నుండి సబ్బాతు ఎప్పుడు విడిపోయిందో మనము [ఖచ్చితంగా] చెప్పలేము.11

యహువః పవిత్ర సమావేశాలన్నియు, న్యూ మూన్లతో సహా, సృష్టికర్తకు నిబద్ధతను పునరుద్ధరించవలసిన సమయాలు; తగ్గించుకోవడానికి మరియు కుటుంబానికి, స్నేహితులకు పరమతండ్రి యొక్క బహుమానాలను, మరియు ఇతర దీవెనలు గుర్తించుటకు ఇవ్వబడిన సమయం. యహువః యొక్క ఆశీర్వాదాలను గుర్తించడానికి ఈ సమయాన్ని కేటాయించే వారందరికి న్యూమూన్ ఒక దీవెన తెస్తుంది. ప్రేమగల సృష్టికర్త యొక్క అనంతమైన ఆశీర్వాదాలతో సంతోషించుటకు వారు నిత్యత్వమంతటిలోను కాపాడబడదురు.

“ప్రతి అమావాస్య [న్యూమూన్ kjv] దినమునను ప్రతి విశ్రాంతిదినము నను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యహువః సెలవిచ్చుచున్నాడు. (యెషయా 66:23)
 


1 http://www.articlesnatch.com/Article/What-Is-Time–/137691#.VONrLDoTvjA

2 ఎన్సైక్లోపీడియా బిబ్లికా, 1899 ed., P. 4180.

3 ఐబిడ్., పే. 4780.

4 # 2320, ది న్యూ స్ట్రాంగ్స్ ఎక్స్పాండెడ్ డిక్షనరీ ఆఫ్ బైబిల్ వర్డ్స్, p. 453.

5 1 దినవృత్తాంతములు 23:31;2 దినవృత్తాంతములు 2: 4;2 దినవృత్తాంతములు 8:13; 2 దినవృత్తాంతములు 31:3;
ఎజ్రా 3: 5; నెహెమ్యా 10:33; యెషయా 1:13-14; హోషేయ 2:11; కీర్తన 81:3.

6 ఆదికాండము 38:24; నిర్గమకా 0 డము 12:2; సంఖ్యాకాండం 10:10; న్యాయాధిపతులు 11:37-38; 1 సమూయేలు 27:7;2 సమూయేలు 24:13;2 రాజులు 23:31; ఎస్తేరు 2:12; యెహెజ్కేలు 39: 12-14;
ఆమోసు 4:7, మొదలైనవి.

7 న్యూ స్ట్రాంగ్స్ ఎగ్సాస్టివ్ కంకార్డన్స్ ఆఫ్ ది బైబుల్.

8 యూనివర్సల్ యూదు ఎన్సైక్లోపెడియా, పేజి. 410.

9 ఎవిఎటర్ జెర్బావెల్, ది సెవెన్ డే సర్కిల్, పేజీలు 7-8.

10 ది న్యూ స్ట్రాంగ్స్ ఎక్స్పాండెడ్ డిక్షనరీ ఆఫ్ బైబిల్ వర్డ్స్, పేజి: 833.

11 ఎన్సైక్లోపీడియా బిబ్లికా, ఓప్ సిట్., పేజి: 4178-4179.

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.