లేఖనాలలో వున్న అత్యంత విశేషమైన ప్రవచనాలలో దానియేలు 9 లోగల 70 వారముల ప్రవచనం ఒకటి. ఇది రక్షకుని యొక్క బాప్తీస్మము మరియు మరణములకు సంబంధించిన ఖచ్చితమైన సంవత్సరములను తిరుగులేని విధంగా గుర్తిస్తుంది. దురదృష్టవశాత్తూ, పలువురు ఈ ప్రవచనంను తప్పుగా వర్ణించటమో1 లేదా దానియొక్క విశాలమైన మర్మ భావమును పట్టుకోలేక దాటిపోవటమో చేయుచున్నారు. దానియేలు “70 వారాల” యొక్క నిశితమైన పరిశీలన, “శుక్రవారపు శిలువ మరణమును” తప్పు అని ఎదురులేని విధంగా నిరూపిస్తుంది. అలాగే ఈ ఆధునిక 7 రోజుల వారము సృష్ట్యారంభము నుండీ ఆటంకము లేకుండా నిరంతరాయంగా కొనసాగుచుండెననే భావనను కూడా! |
70 వారాల ప్రవచనము (దానియేలు 9:
24-27)
దానియేలు
గ్రంధం 9 వ అధ్యాయంలో, ప్రవక్త తాను ఇటీవల పొందిన ఆందోళనకరమైన దర్శనమును వలనను
(దానియేలు 8), దానియొక్క అర్థం పూర్తిగా కనుగొనలేకపోవుట వలనను యరూషలేము
నిమిత్తమును మరియు చెరలోవున్న ఇశ్రాయేలు నిమిత్తమును చాలా భావోద్వేగమైన విజ్ఞాపనను
చేయుచుండుటను కనుగొంటాము. దానియేలు ప్రార్థన చేయుచుండగా, అతనికి గాబ్రియేల్ అనే
దూత కనిపించి పరలోకంలోని పరిశుద్ధ స్థలము 2 ప్రవచనం ప్రకారం శుద్ధిచేయబడుటకు
ముందు జరగబోయే అనేకమైన విషయాలను సవివరంగా వివరించుట ప్రారంభిస్తాడు. ఈ వివరణ
యహూషువః యొక్క బాప్టిజం మరియు శిలువ మరణంల యొక్క ఖచ్చితమైన సంవత్సరాలను ఎదురులేని
విధంగా స్పష్టం చేయుచున్నది. ఈ వివరణ ఉంది. గాబ్రియేలు దానియేలుకు ఇలా చెప్పుట
ప్రారంభించాడు:
తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బదివారములు విధింపబడెను. (దానియేలు 9:24) |
ఇక్కడ
దానియేలు యొక్క ప్రజలకు (యూదులకు) ను మరియు పరిశుద్ధ పట్టణము (యెరూసలేం) నకును 70
ప్రవచన వారములు ఇవ్వబడియుండెనని పరలోకము తేటపరచు చుండెను. దీనిలో కింది విషయాలన్నీ
జరగవలసి యున్నది అని స్పష్టమవుతుంది:
- అతిక్రమము పూర్తిచేయ బడుట.
- పాపమునకు
ఒక ముగింపును చేయుట. - దోషమునిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుట.
- నిత్య
నీతి తీసుకుని వచ్చుట. - దర్శనంను
మరియు ప్రవచనంను ముద్రించుట. - అతిపరిశుద్ధ
స్థలమును; (అతిపరిశుద్ధుని/ most holy, kjv) అభిషేకించుట.
వివరణలోనికి
వెళ్లే ముందు, ముందుగా ఒక ప్రవచన వారం యొక్క విలువ ఎంత అనేది అర్ధం చేసుకొనుట
అత్యవసరమై యున్నది. ప్రవచనములను అధ్యయనం చేసేటప్పుడు, ఎల్లప్పుడూ బైబిలును తానే అర్థాన్ని
వివరించుటకు మనము తప్పనిసరిగా అనుమతించాలి. ప్రవక్తలు ఉపయోగించిన ప్రతి చిహ్నానికి
యహువః తన వాక్యంలో వివరణ అందించియున్నారు. లేఖనాల ప్రకారం, ఒక ప్రవచన వారము = ఒక
సంవత్సరము.
. . .
సంవత్సర మొకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణ యించి యున్నాను (యెహెజ్కేలు
4:6)
మీరు
ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము
చొప్పున నలుబది సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు
తెలిసికొందురు. . . (సంఖ్యలు 14:34
చూడండి.)
దీని
ప్రకారం, మనము కింది విధంగా నిర్ధారించాలి:
-
ఒక ప్రవచన వారం = 7 ప్రవచన
దినములు = 7 సంవత్సరాలు.
-
70 ప్రవచన వారములు = (490 ప్రవచన దినములు),
= 490 సంవత్సరాలతో సమానము.
ఇప్పుడు,
మనము ఈ ప్రవచనం యొక్క తదుపరి వచనం యొద్దకు వెళదాం. 25 వ వచనంలో, గాబ్రియేలు 70
ప్రవచన వారాలలో జరగబోయే సంఘటనల స్వభావంను మరియు వాటి సమయాలను అత్యంత వివరంగా
వివరించుటను ప్రారంభించాడు. యహువః దూత, ఇక్కడ, మొదటి 69 ప్రవచన వారాల లెక్కింపు
యొక్క ప్రారంభ స్థానం మరియు ముగింపు స్థానములను ఇవ్వడం ద్వారా ప్రారంభించెను.
యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చువరకు ఏడు మరియు “అరువది-రెండు” (హీబ్రూ బైబిల్) వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అరువది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులును కందకములును మరల కట్టబడును. (దానియేలు 9:25) |
ఇక్కడ మనము,
యెరూషలేమును మరల కట్టించమని ఆజ్ఞ బయలుదేరిన దగ్గరనుండి మెస్సీయ వచ్చేవరకు 69
ప్రవచన వారములు (7వారములు + 62 వారములు) పట్టునని తెలుసుకున్నాము. ఇది 483
సంవత్సరములతో సమానము.
-
69 ప్రవచన వారాలు = 483 ప్రవచన దినములు (69 వారాలు x
7 దినములు) = 483 సంవత్సరాలు
“అయితే
యెరూషలేమును మరల కట్టించమని ఆజ్ఞ బయలుదేరిన సమయంను తెలియజేయు సంఘటనలు నాలుగు జరిగి
ఉన్నాయి.” అవి:
- యహువః
మందిరపు పునర్నిర్మాణానికై క్రీ.పూ 536 లో కోరేషు యొక్క ఆజ్ఞ (ఎజ్రా 1: 1-4) - తరువాత
ఆటంక పరచబడిన పనులను కొనసాగించుటకు క్రీ.పూ 519 లో దర్యావేషు యొక్క ఆజ్ఞ (ఎజ్రా 6:
1-12) - క్రీ.పూ
457 లో ఎజ్రాకు అర్తహషస్త ఇచ్చిన ఉత్తర్వులు. (ఎజ్రా 7) - క్రీ.పూ
444 లో అర్తహషస్త నెహెమ్యాను ఆజ్జాపించుట. (నెహెమ్యా 2)
మనము ఈ
నాలుగింటిలో మూడు ఉత్తర్వులను వెంటనే తొలగించవచ్చు.
క్రీ.పూ 536
లో ఇవ్వబడిన కోరేషు యొక్క ఆజ్ఞ మరియు క్రీ.పూ 519 లో ఇవ్వబడిన దర్యావేషు యొక్క ఆజ్ఞలను
తొలగించవలసి ఉన్నది ఎందుకంటే ఈ రెండింటిలో దేనినుండి 483 సంవత్సరాలను లెక్కించినా
69 ప్రవచన వారాల యొక్క చివరి స్థానానికి, అనగా మెస్సీయ వచ్చుటను సూచించు
సంవత్సరంనకు కంటే చాలా ముందుగా ముగుయుచున్నవి. కోరేషు యొక్క ఆజ్ఞ నుండి 69 భవిష్య
వారాలను లెక్కిస్తే మనలను క్రీ.పూ 53 నకు చేర్చును. దర్యావేషు యొక్క ఆజ్ఞ నుండి
లెక్కిస్తే క్రీ.పూ 36 నకు చేర్చును. మర్లా, ఈ రెండునూ చాలా తక్కువైపోవుచున్నవి.
మనం
కొట్టివేయవలసిన మూడవ ఆజ్ఞాపణ క్రీ.పూ 444 లో అర్తహషస్త ద్వారా నెహెమ్యాకు ఇవ్వబడిన
ఆజ్ఞ. రాజు నెహెమ్యాను యెరూషలేముకు తిరిగి వెళ్ళుటకు అనుమతించి ఉన్నప్పటికీ, ఆది
అధికారిక నిర్ణయంగా ఉన్నట్లు కనిపించదు. కేవలం ఒకప్రత్యేకమైన సమయంనకు యెరూషలేమునకు
తిరిగి వెళ్ళుటకు నెహెమ్యా చేసిన వ్యక్తిగత అభ్యర్థనను అర్తహషస్త మంజూరు చేసెను.
నెహెమ్యా యెరూషలేమునకు చేరినపుడు, ప్రజలు అప్పటికే పట్టణ నిర్మాణ పనిలో నిమగ్నమై
ఉన్నట్లు అతడు కనుగొనెను. వారు స్పష్టంగా పదమూడు సంవత్సరాల క్రితం ఎజ్రాకు
ఇవ్వబడిన శాసనం కింద పనిచేయుచున్నారు. నెహెమ్యా తాను యెరూషలేములో చేయాలనుకున్న
పనిని కేవలం యాభై రెండు రోజుల తర్వాత సంపూర్తి చేసెను. (నెహెమ్యా 6:15)
ఇది 70
ప్రవచన వారాల లెక్కింపును ప్రారంభించ వలసిన స్థానమును, అలాగే వీటిలో మొదటి 69
వారాలను మెస్సీయ వచ్చువరకు నడిపించు ఆజ్ఞాపణను తెలియజేయుచుండెను. అది క్రీ.పూ
457 లో అర్తహషస్త ఎజ్రాకు ఇచ్చిన ఆజ్ఞ.3
రాజైన
అర్తహషస్త, ఆకాశమందలి ఎలోహ ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు
క్షేమము, మొదలగు మాటలు వ్రాసి యీలాగు సెలవిచ్చెను. చేతనున్న నీ ఎలోహ ధర్మ
శాస్త్రమును బట్టి యూదానుగూర్చియు యెరూషలేమునుగూర్చియు విమర్శచేయుటకు నీవు
రాజుచేతను అతని యేడుగురు మంత్రులచేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయ మేమనగా,
(ఎజ్రా 7: 12-13 చూడండి)
ఇప్పుడు,
మనము 70 ప్రవచన వారాల యొక్క లెక్కింపును ప్రారంభించ వలసియున్న ఖచ్చితమైన
స్థానాన్ని కనుగొని యున్నాము, అయితే ఇక్కడనుండి 69 వారాలు (483 సంవత్సరాలు)
ముందుకు లెక్కించి, అది మనలను దూత ప్రవచించిన విధంగా మెస్సీయ వచ్చు సమయము వరకు
తీసుకుని వెళ్ళునేమో చూద్దాం.
క్రీ.పూ 457
నుండి 483 సంవత్సరాలు ముందుకు లెక్కిస్తే, ఆలెక్క క్రీ.శ 27కు చేరుతుంది.
-457 + 483
= క్రీ.శ. 26
అయితే,
అక్కడ 0 సంవత్సరం లేనందున మనము ఒక సంవత్సరంను జతచేయాలి.
క్రీ.శ. 26 +1 సంవత్సరం = క్రీ.శ. 27
అయితే
క్రీ.శ. 27 లో ఏమి జరిగింది? యహూషువ, మెస్సీయ బాప్తీస్మము పొందెను. గాబ్రియేలు
ద్వారా తెలుపబడిన ఆ ఖచ్చితమైన సమయంలో “అతి పరిశుద్ధుడు”/most holy
అభిషేకించబడెను. (దానియేలు 9:24).
యోహాను
బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయమొదలు కొని యూదయ యందంతట ప్రసిద్ధమైన సంగతి
మీకు తెలియును,, ఎలోహ నజరేయుడైన యహూషువఃను పరిశుద్ధాత్మతోను శక్తితోను
అభిషేకించెననునదియే…. (అపొస్తలుల కార్యములు 10: 37-38)
తాను
బాప్తీస్మం పొందిన సమయానికి దానియేలు యొక్క ప్రవచనంలోని మొదటి 69 వారాలు పూర్తిగా
నెరవేరినట్లు యహూషువఃకు బాగా తెలుసు మరియు అప్పటినుండి ఆయన మారుమనస్సు పొందుటకు మనుష్యులను
పిలిచుట ప్రారంభించెను “కాలము సంపూర్ణమైయున్నది, ఎలోహ రాజ్యము
సమీపించియున్నది” (మార్కు 1:15)
ఆయన
బాప్తీస్మము పొందిన సంవత్సరము క్రీ.శ 27 అని మనము గ్రహించవచ్చు ఎందుకంటే, అది
తిబేరియ కైసరు యొక్క పాలనలో 15వ సంవత్సరంలో జరిగినట్లు లూకా గారు తన సువార్తలోని
మూడవ అధ్యాయములో తెలియజేసెను.
తిబేరియ
కైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరంలో. . . (లూకా 3: 1)
ప్రజలందరును
బాప్తిస్మము పొందినప్పుడు యహూషువః కూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా
ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ
శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను. అప్పుడునీవు నా ప్రియ కుమారుడవు,
నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. (లూకా 3: 21-22)
టిబేరియస్
క్రీ.శ. 12 లో రాజప్రతినిధి/ సహాయకుని గాను క్రీ.శ. 14 లో చక్రవర్తిగాను
అధికారికంగా ఏలనారంభించెను.4 క్రీ.శ. 12 నుండి
పదిహేను సంవత్సరాలు లెక్కించినపుడు తిబేరియ ‘పరిపాలనలో మొదటి సంవత్సరం క్రీ.శ. 27
కు వస్తుంది. ఇది దేవదూత 600 సంవత్సరాల క్రితం దానియేలుకు ఏదైతే వెల్లడించినదో
దానితో ఖచ్చితంగా సరిపోతూ ఉంది!
యెరూసలేము
పట్టణము గురించి దూత యొక్క మాటలను గుర్తుచేసుకుంటే:
. . . సమస్యాత్మకమైన (kjv) సమయములందు పట్టణపు రాచవీధులును కందకములును మరల కట్టబడును. (దానియేలు 9:25) |
క్రీ.పూ 457
లో అర్తహషస్త ద్వారా శాసనం ఇవ్వబడిన దగ్గరనుండి మొదటి ఏడు ప్రవచన వారాల (49
సంవత్సరాల) కాలంలో యరూషలేము యొక్క గోడలు
పునర్నిర్మించబడుట జరిగెను. నిజంగా, ఇది “సమస్యాత్మకమైన కాలమై”
ఉండెను. ఎందుకంటే నిరంతరమైన దాడి యొక్క భయమువలన కార్మికులు “ఒక చేతితో
నిర్మాణపు పని జరిగించుచూ, మరొక చేతితో ఆయుధం పట్టుకుని పనిని నిర్వహించారు”
అని నెహెమ్యా మనకు చెబుతుండెను. (నెహెమ్యా 4:17) క్రీ.పూ 408 లో, యెరూషలేము
పట్టణము మరియు ఆలయం యొక్క పునరుద్ధరణ
పూర్తయింది.
-457 + 49 =
-408 (408 క్రీ.పూ.)
అద్భుతం!
అయితే, ప్రవచనం అక్కడ ఆగిపోలేదు. ఇప్పుడు మనము తదుపరి వచనములను చూద్దాం.
ఈ అరువదిరెండు వారములు జరిగిన పిమ్మట ఏమియు లేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధకాలాంతమువరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. (దానియేలు 9:26) |
ఇక్కడ, మనం
69 ప్రవచన వారాల నెరవేర్పు జరిగిన కొంత కాలం తరువాత, మెస్సీయ “నిర్మూలన
చేయబడుట”ను, ఆపై పట్టణము నాశనం అవుటను గురించి చెప్పబడ్డాము. గాబ్రియేలు
ప్రవచనం యొక్క చివరి వాక్యంను కొనసాగిస్తూ, 70 వ ప్రవచన వారం యొక్క వివరాలను
వెల్లడి చేయుచుండెను:
అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము(పాడైన దానికి) చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించువరకు ఈలాగున జరుగును. (దానియేలు 9:27) |
70 వప్రవచన
వారపు మధ్య కాలంలో, ఆయన (మెసయ్య) అనేకులకు ఒక నిబంధనను స్థిరపరచును అని దూత
చెప్పెను. ఇంకా అతడు చెప్పుచూ మెస్సీయ ఈ చివరి ప్రవచన వారం మధ్యలో బలిని
నైవేద్యమును నిలిపివేయుటకు కారణమవునని చెప్పెను.
మనము
ఇప్పుడు 70 వ వారపు మధ్యలో ఏమి జరిగిందనేది మొదట పరిశీలిద్దాం. క్రీ.శ 27
శరత్కాలంలో యహూషువః బాప్తీస్మం పొందిన సమయం నుండి 7 సంవత్సరాలు (ఒక ప్రవచన వారం)
ముందుకు లెక్కించినపుడు అది క్రీ.శ. 34 శరత్కాలంనకు చేరుతుంది. దీనిప్రకారం 70 వ
వారపు మధ్య భాగం క్రీ.శ 31 వసంతంనకు చేరుతుంది. క్రీ.శ 31 వసంతకాలంలో బలిని మరియు
నైవేద్యములను నిలిపివేయుటకు కారణమైన సంఘటన ఏమి సంభవించెను? మెస్సీయ పస్కా సమయంలో
శిలువ వేయబడెను, మరియు దేవాలయపు (బలులు జరపబడు) తెరను కూడా యహువః స్వయంగా పైనుండి
క్రింద వరకు చించుట జరిగెను!
మరియు
యహూషువః మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి
క్రింది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్దలాయెను; (మత్తయి 27: 50-51 చూడండి)
యహూషువః ,
మన మెస్సీయ, ధర్మశాస్త్రంలో గల జంతు బలులన్నిటికి సాదృశ్యమైన అంతిమ పాపపరిహారార్థబలిగా
ఉండెను. అతడు నిర్మూలము చేయబడును, అయితే అది తనకోసం కాదు “[He was cut off,
but not for Himself kjv]” (దానియేలు 9:26); ఆయన తాను చేసిన నేరము నిమిత్తం
శిలువ వేయబడలేదు, కానీ నీవు మరియు నేను చేసిన నేరము నిమిత్తం మరణించారు.
ఎందుకనగా
మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను. (2
కొరింథీయులు 5:21 చూడండి.)
ఆయన
శిలువ వేయబడిన తరువాత, మందిరపు బలులు ఇక పూర్తిగా నిలిపివేయబడెను.
ఎద్దుల
యొక్కయు మరియు మేకల యొక్కయు రక్తం పాపములను తీసివేయుట సాధ్యంకాదు. కాబట్టి ఆయన
[యహూషువః, మెస్సీయ] ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు.
“బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణహోమములును
పాపపరిహారార్థబలులును నీకిష్ఠమైనవికావు. అప్పుడు నేనుగ్రంథపుచుట్టలో నన్నుగూర్చి
వ్రాయబడిన ప్రకారము, ఓ యహువః, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను
వచ్చియున్నానంటిని. ఇవన్నియు ధర్మశాస్త్రముచొప్పున అర్పింప బడుచున్నవి. ఆ
రెండవదానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యహూషువః మెస్సీయ యొక్క
శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము. (హెబ్రీయులు 10: 4-10 చూడండి)
యహూషువః
క్రీ.శ 31 లో శిలువ వేయబడ్డాడని మనకు ఇప్పుడు నిశ్చయంగా తెలుసు, కానీ గాబ్రియేలు
దూత మెస్సీయ “ఒక వారంలో అనేకులకు నిబంధనను స్థిరపరచును” అని చెప్పెను (ఈ
70 వ వారపు వ్యవధి క్రీ.శ 34 శరదృతువులో పూర్తయినది) . ఇది ఎలా సాధ్యం? కొత్త
నిబంధనను యహూషువః తన 3 1/2 సంవత్సరాల పరిచర్యనందంతటా బోధించి శిలువ మరణం పొందిన
తరువాత ఆ పరిచర్య అపొస్తలుల ద్వారా ముందుకు తీసుకువెళ్లుట జరిగినది! కొత్త
నిబంధనను అంగీకరించుటకు యూదు దేశానికి ఇవ్వబడిన ఆహ్వానం క్రీ.శ 34 శరదృతువు వరకు,
యూదులు పరలోకానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తుది అంకంలో, సంహేద్రిన్
స్తెఫనును (మొదటి క్రిస్టియన్ హతసాక్షి) హత్య చేసిన సమయం వరకు కొనసాగెను.
(అపొస్తలుల కార్యములు 7). సంహేద్రిన్ కు ఒక అసాధారణ శక్తివంతమైన ప్రసంగాన్ని
ఇచ్చిన తరువాత, అది యహువః యొక్క ప్రవక్తలను నిరాకరించి మరియు మెస్సీయను
తిరస్కరించి, సభలో స్తెఫనును పట్టుకుని రాళ్ళు రువ్వి చంపుట ద్వారా యూదా దేశం
యొక్క స్పష్టమైన నేరం తెలియబడినది.
పరలోకము
తెరువబడుటయు మరియు తండ్రి కుడిపార్శ్వమున యహూషువః నిలువబడుటయును స్తెఫను
చూసినప్పుడు తన ఈ చివరి అభ్యర్ధన యొక్క దైవీక ప్రేరణ యహువః ఎలోహ ద్వారా
నిర్ధారించబడినది.
అయితే అతడు
పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, యహువః మహిమను, యహూషువః తన
తండ్రి కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచి, ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు
యహువః కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను!” (అపొస్తలుల
కార్యములు 7 :55-56చూడండి)
అయితే
పశ్చాత్తాప పడుటకు బదులు, సంహేద్రిన్ సభ్యులు మిక్కిలి ఆగ్రహము తెచ్చుకుని వినటకు
నిరాకరించారు. వారు యహువః యొక్క నిబంధనను అంగీకరించే వారి చివరి అవకాశంను
మూర్ఖముగా తిరస్కరించారు.
అప్పుడు
వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసికొని యేకముగా అతనిమీదపడి, పట్టణపు వెలుపలికి
అతనిని వెళ్లగొట్టి, రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యౌవనుని
పాదములయొద్ద తమ వస్త్రములు పెట్టిరి. (అపొస్తలుల కార్యములు 7: 57-58)
(గమనిక:
ఇక్కడ కౌన్సిల్ సభ్యులు బట్టలు వేసిన ఈ సౌలు, కొంతకాలానికే తన పేరు పౌలుగా
మార్చబడినవాడై, అన్యజనులకు సువార్త తీసుకు వెళ్ళుటకు పరలోకం ద్వారా నియమింపబడిన
వ్యక్తియే.)
యూదా దేశం
కోసము మరియు భూసంబంధమైన యరూషలేము కోసము కేటాయించబడిన 70 ప్రవచన వారాలు పూర్తిగా
నెరవేరెననే దానికి పరలోకము యొక్క చివరి నిర్ధారణగా, (దూత ప్రవచించిన విధంగా)
క్రీ.శ 70 లో యరూషలేము పట్టణము మరియు దేవాలలయము ధ్వంసం చేయబడెను.
. . . వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు, వాని/ దాని అంతము హఠాత్తుగా/ వరద [kjv] వలె వచ్చును. మరియు యుద్ధకాలాంతమువరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. (దానియేలు 9:26) |
గమనిక: “వచ్చునట్టి రాజు యొక్క
ప్రజలు” అనగా, భూసంబంధ పట్టణమును మరియు దేవాలయమును నాశనం చేయాలనే పరలోకం
యొక్క తీర్పును రోమ్ తన ద్వారా నెరవేర్చుచుండుటను సూచిస్తుంది. అలాగే దాని అంతము వరద
వలె వచ్చును” ఆనేది తీర్పు ఎంత వేగముతో వస్తుంది అనేదానిని స్పష్టపరుస్తుంది.
“మరియు యుద్ధకాలాంతమువరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను”: (1)
యెరూషలేము యొక్క వేగవంతమైన నాశనం ముందుగా చెప్పబడెను; అది క్రీ.శ 70 లో జరిగినది.
(2) “యుద్ధ కాలాంతము వరకు” అనగా దేవాలయం ధ్వంసం చేయబడిన సమయం నుండి
కాలాంతము వరకు [అంటే యహూషువః రెండవ రాకడ] వరకు పురాతన ఇశ్రాయేలు ఆక్రమించిన
భూబాగంలో శాంతిని మరియు స్థిరత్వం ఉండదు అనే నిజం ముందుగా చెప్పబడెను. నేడు
ఇజ్రాయేలు మరియు దాని పొరుగు దేశాల మధ్య జరుగుతున్న ముగింపులేని యుద్ధాలు ద్వారా
అది నిర్ధారించబడుచున్నది. ఈ నిర్జనమైన/ నాశనకరమైనదాని గూర్చి దానియేలు 9:27 లో
కూడా చెప్పెను.
అలా,
70 ప్రవచన వారాలు పరిపూర్ణ వివరాలతో సహా నెరవేరెను మరియు జరుగును అని పరలోకం
ద్వారా ప్రకటించబడినవన్నీ జరగబడినవి:
- అతిక్రమము పూర్తిచేయుట: వారి
అతిక్రమణము/ మరియు తిరుగుబాటును పూర్తిచేయుటకు యూదా దేశానికి ఇవ్వబడిన అవకాశంను
మరియు అపరాధమునకు (పాపానికి) పైన యహూషువః యొక్క విజయంను ప్రస్తావిస్తుంది. - పాపమునకు ఒక ముగింపును చేయుట: పాపం నుండి
పశ్చాత్తాపం పొందుటకు యూదా దేశానికి ఇవ్వబడిన అవకాశంను, మరియు పాపంపై యహూషువః
యొక్క విజయంను ప్రస్తావిస్తుంది. - దోషమునిమిత్తము ప్రాయశ్చిత్తం
చేయుట: దోషమునుబట్టి
శిలువపై యహూషువః చేసిన ప్రాయశ్చిత్తంను ప్రస్తావిస్తుంది. - నిత్య నీతిని తీసుకుని వచ్చుట: యహూషువః
నందును మరియు ఆయన బలిత్యాగం నందును గల విశ్వాసం ద్వారా కలుగు నీతిని
ప్రస్తావిస్తుంది. - దర్శనమును మరియు ప్రవచనంను
ముద్రించుట: దర్శనపు
ప్రవచనపు ప్రతి వివరం యొక్క పరిపూర్ణ నెరవేర్పును ప్రస్తావిస్తుంది. - అతిపరిశుద్ధుని/most holy (kjv)
అభిషేకించుట: యహూషువః
యొక్క పరిశుద్దాత్మ అభిషేకంను ప్రస్తావిస్తుంది.
యూదా దేశం కోసం
కేటాయించిన సమయం ఇప్పుడు నెరవేరినది, ఇప్పుడు సువార్త అన్యుల యొద్దకు కొనిపోబడెను.
(ఈ సమయం నిమిత్తం చెప్పుకోదగిన ఉపమానం కొరుకు మత్తయి 21: 33-43 చూడండి; దీనిలో
“యహువః రాజ్యం” యూదా దేశం నుండి తీసివేయబడి మరొకరికి ఇచ్చివేయుటను
గూర్చి చెప్పబడింది.)
అన్నిటినీ ఒక దగ్గర చేరస్తే ….
ఇప్పుడు
మనము క్రీ.శ. 31 సంవత్సరంను లేఖనాల ప్రకారం యహూషువః శిలువ వేయబడిన సంవత్సరం అని
నిశ్చయంగా నిర్ధారణ చేశాము, ఇప్పుడు మనము ఈ నిజం యొక్క అతి పెద్ద చిక్కులను, అనగా
సృష్టి ఆరంభము నుండి ఈనాటి వరకు 7 రోజుల వారపు చక్రము ఆటంకం లేకుండా తిరుగుట లేదు
అనే విషయాన్ని పరిశీలిద్దాం! ఆధునిక గ్రెగోరియన్ కేలండరు నకిలీదై ఉంది.
శిలువ మరణం:
లేఖనాల
ప్రకారం యహూషువః పస్కా రోజున సిలువవేయబడెను, అది ఎల్లప్పుడూ మొదటి చంద్ర మాసం
యొక్క 14 వ దినాన వస్తుంది. నజరేయుడైన యహూషువః నిజానికి లోక పాపములను మోసుకొనిపోవు
యహువః యొక్క పస్కా గొర్రెపిల్ల అని దైవీకముగా ఏర్పాటు చేయబడిన శిలువ వేయబడిన
కాలములు సాక్ష్యమిచ్చుచుండెను. (యోహాను 1:29)
మొదటి నెల
పదునాలుగవ దినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును. (లేవీకాండము 23:5
చూడండి)
లేఖనాలు
కూడా అది “సబ్బాతుకు ముందు దినము” అని చెప్పుచున్నవి. అనగా వారంలోని 6 వ
దినము.
ఆయన
కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి–నిజముగా ఈ
మనుష్యుడు ఎలోహ కుమారుడే అని చెప్పెను. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి
దినమునకు పూర్వదినము. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయియ యోసేపు తెగించి,
పిలాతునొద్దకు వెళ్లి యహూషువః దేహము (తనకిమ్మని) యడిగెను. (మార్కు 15: 39-43
చూడండి.)
కొందరు విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత వారంలోని మొదటి దినమున, తెల్లవారుచుండగా కొందరు ఈ విధమైన దృష్టి సరైనది కాదు ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఈ నెల 10 వ రోజున వారి గొర్రెను ప్రత్యేకించుకొనుటకు ఆదేశించబడిరి. (నిర్గమకాండము 12: 3); అయితే గొర్రెను ప్రత్యేకించుకోవడానికి అవసరమైన పశువుల మంద లేనివారు ఉన్నచో, వారు ఒక గొర్రెను కొనుగోలు చేయవలసి ఉన్నది. అయితే ఏడవ-రోజు విశ్రాంతి దినమందు కొనుట మరియు అమ్ముట నిషిద్ధమై ఉండెను, కాబట్టి పొరపాటుగా శనివారంను సబ్బాతు అని పట్టుకొని వ్రేలాడే వారు ఈ విషయంలోని తప్పును ఒప్పుకుని తీరాలి.5 |
లేఖనాల
ప్రకారం యహూషువః శిలువ వేయబడిన దినం:
-
క్రీ.శ. 31 సంవత్సరం,
-
మొదటి చంద్ర మాసం యొక్క 14 వ
దినము,
-
వారంలోని 6 వ దినము.
ఇప్పుడు,
మనము ఈ వివరాలన్నిటినీ ఒక చోట చేర్చవలెను. శిలువ వేయబడిన సంవత్సరమైన క్రీ.శ. 31
యొక్క చంద్ర దశలను చూపే ఒక పట్టిక క్రింద ఉంది. (గమనిక: క్రింది ఖగోళ “న్యూ
మూన్” అనే వరుస సూర్య-చంద్ర సముచ్ఛయమును/అమావాస్యను చూపిస్తుంది.)
మూలం: http://astropixels.com/ephemeris/phasescat/phases0001.html
బైబిల్
సంవత్సరము మరియు బైబిల్ నెల ఎప్పుడు ప్రారంభం అవుచున్నాయో అనే అంశంపై భిన్న
ఆలోచనలు గల వర్గములు ఉన్నాయి. అయితే అమావాస్య తరువాత వచ్చు వేకువజామున ఒక నెల
ప్రారంభమవునని, మరియు వసంత విషవత్/ వెర్నల్ ఈక్వినోక్స్ కు అతి సమీపంగా వున్న
న్యూమూన్ దినముతో ఒక క్రొత్త సంవత్సరము ప్రారంభమవుని అధ్యయనం ద్వారా WLC అంగీకరించినది.8 అయితే, ఇప్పుడు మనము అన్ని రకాల లెక్కింపు పద్దతులను వుపయోగించి, శిలువ
వేయబడిన సంవత్సరంను పరిశీలించి శుక్రవారంనాడు శిలువ వేయబడుట సాధ్యపడుతుందేమో
చూద్దాము.
దీనికోసం
మొదట మనము క్రీ.శ 31 లో మార్చి మరియు ఏప్రిల్ నెలలయొక్క అమావాస్య సమయములను
తప్పనిసరిగా గమనించాలి. ఎందుకంటే అన్ని రకాల న్యూమూన్ లెక్కింపు పద్ధతులకు సమాన
గుర్తింపును ఇచ్చి సంవత్సర ప్రారంభమును లెక్కించినపుడు, క్రొత్త సంవత్సరము
ఎల్లప్పుడూ మార్చి లేదా ఏప్రిల్ నెలలలో ప్రారంభమవుతుంది.
అమావాస్య:
-
మార్చి 11 @ 10: 20 PM (UTC)
-
ఏప్రిల్ 10 @ 11: 33 PM (UTC)
“అమావాస్య
తరువాతి వేకువజాము” విధానములో న్యూమూన్ ను (చంద్ర నెలయొక్క మొదటి దినమును)
లెక్కించినపుడు పస్కా దినము (చంద్రనెల యొక్క 14 వ రోజు) మార్చి 25 న గానీ (ఇది
నేటి గ్రెగోరియన్ క్యాలెండరులో “ఆదివారం నకు సమానం”) లేదా ఏప్రిల్ 24 న
గానీ (ఇది నేటి గ్రెగోరియన్ క్యాలెండరు ప్రకారము “మంగళవారంనకు సమానం”)
పడుతుంది. మీరు ఇక్కడ క్రీ.శ 31 సంవత్సరం యొక్క గ్రహ వారపు దినముల కేలండరును6 చూడవచ్చు: http://www.timeanddate.com/calendar/?year=31&country=34
“ఇది
కనీసం శుక్రవారానికి(శుక్రవారం శిలువ వేయటం) దగ్గరకు కూడా రాలేదు.”
ఇప్పుడు
మనము, అనేక మంది సాంప్రదాయవాదులు సమర్థించే, మొదట కనిపించే నెలవంకతో నెల
ప్రారంభమయ్యే పద్దతిలో చూద్దాము. స్కాలర్స్ (మేధావుల) మరియు ఖగోళ శాస్త్రజ్ఞుల
ప్రకారం, మొదటి నెలవంక సాధారణంగా అమావాస్య తరువాత 17-23 గంటల కనిపించును, అయితే
కొంతమంది నెలవంకను అమావాస్య [ఖగోళ న్యూ మూన్] తరువాత 15.5 గంటలకు” చూసినట్లు
నివేదించిరి. (యునైటెడ్ స్టేట్స్ నావల్ అబ్జర్వేటరీ).
“న్యూ
మూన్ [అమావాస్య] తరువాత దాదాపు 17-23 గంటలకు ఒక సన్నని నెలవంక కనిపించుట
ప్రారంభమవును.” (Http://www.moonsighting.com/faq_ms.html7)
“1855 లో, సర్ జి. బి అరియ్… క్రీ.శ. 29
నుండి 34 కు సంబంధించిన … ఖగోళ గణనలను తయారు చేసెను. యూదయ వాతావరణంలో,
ముఖ్యంగా మార్చి మరియు ఏప్రిల్ నెలలలో నెలవంక కనిపించుటకు అమావాస్య తర్వాత 18
గంటల సమయం సరిపోతుంది అని భావించెను. అయితే, ఒక ముందు జాగ్రత్తగా, అతను 23
గంటల సమయంను కూడా లెక్కించెను. ” ( “ది మూన్స్ విజుబులిటీ అండ్ ది
డేట్ ఆఫ్ క్రూసిఫిక్షన్” కర్టనే ఆర్, ది అబ్జర్వేటరీ, వాల్యూమ్. 34, పే.
228-232 (1911))
సెవెంత్-డే
అడ్వెంటిస్టుల హిస్టారికల్ రీసెర్చ్ కమిటీ ఆఫ్ జనరల్ కాన్ఫెరెన్స్ ప్రకారం, తూర్పు
సమీపంలో మొదటి కనిపించే నెలవంక, అమావాస్య తరువాత 42 గంటల కంటే తక్కువ సమయంలోనే
కనిపిస్తుంది:
“ఇది Near East/తూర్పు సమీప ప్రాంతంలో
అమావాస్య తరువాత 16.5 నుండి 42 గంటల తరువాత, దాని గమనములు మరియు అక్కడి వాతావరణం
మరియు భూమి నుండి దానికి గల దూరంపై ఆధారపడి వగేగముగా లేక ఆలస్యంగా ఒక సన్నని
నెలవంక రూపంలో మరలా కనిపించడం ప్రారంభమై, తరువాత పెద్దగా పెద్దగా పౌర్ణమి రోజు
వరకూ పెరుగుతూ ఉంటుంది.” (క్రోనాలజీ
ఆఫ్ ఎజ్రా 7, ఎ రిపోర్ట్ ఆఫ్ ది హిస్టారికల్ రీసెర్చ్ కమిటీ ఆఫ్ ది జనరల్ కాన్ఫ్
రెన్స్ ఆఫ్ సెవెంత్-డే అడ్వెంటిస్ట్స్ , పేజీ .11)
పునఃశ్చరణ
చేసుకుంటే, మొదటి నెలవంక:
-
సాధారణంగా అమావాస్య తరువాత 17-23
గంటలకు చూడవచ్చు.
-
కొన్నిసార్లు తూర్పు సమీపంలో
(ఉదా: యెరూషలేము) కనిపించుటకు అమావాస్య తరువాత 42 గంటల వరకు పట్టవచ్చు.
దీనర్థం, యెరూషలేములో మొదటి నెలవంక
నిలకడగా కనిపించడం కోసం అమావాస్య తరువాత 17 నుండి 42 గంటల వరకూ పట్టునని ఖచ్చితంగా
చెప్పవచ్చు.
ఇప్పుడు
మనము మొదటి కనిపించే నెల వంకను గుర్తించటానికి అవసరమైన కాల పరిమితిని (అంటే
అమావాస్య తరువాత 17-42 గంటలు అని) స్పష్టంగా నిర్వచించాము. ఇప్పుడు మనము క్రీ.శ 31
మార్చిలో “మొదట కనిపించే నెలవంక
పద్దతిలో నెలను ప్రారంభించే విధానంలో” శుక్రవారం శిలువ వేయటం సాధ్యపడునేమో
చూద్దాం.
అమావాస్య =
మార్చి 11 @ 10: 20 PM (UTC) = మార్చి 12 @ 12: 20 AM (యెరూషలేము సమయం, UTC +2). ఇక్కడ
ఇవ్వబడిన తేదీ నందు గల అమావాస్యకు మరియు సూర్యాస్తమయానికి మధ్య గల సరాసరి సమయంను
క్రింద చూడవచ్చు. (యెరూషలేములో మార్చి మధ్యలో సూర్యాస్తమయం 5:45 PM కు
ఏర్పడుతుంది.)
-
(కనీ
కనిపించని న్యూమూన్) = పస్కాను మార్చి 26 కు చేరుస్తుంది. ఇది ఆధునిక
“సోమవారం”నకు సమానం.(గమనిక: 1% ప్రకాశంతో చంద్రుడు 6:15 PM గంటలకు
అస్తమించును, సూర్యుని తరువాత, .5 గంటలకు9 ) -
(స్పష్టంగా
కనిపించే న్యూమూన్) = పస్కాను మార్చి 27 కు చేరుస్తుంది. ఇది ఆధునిక
“మంగళవారం”నకు సమానం. (గమనిక: 3% ప్రకాశంతో చంద్రుడు 7:15 PM గంటలకు
అస్తమించును, సూర్యుని తరువాత 1.5 గంటలకు) -
(స్పష్టంగా
కనిపించే న్యూమూన్) = పస్కాను మార్చి 28 కు చేరుస్తుంది. ఇది ఆధునిక
“బుధవారం” నకు సమానం. (గమనిక: 8% ప్రకాశంతో చంద్రుడు 8:15 PM గంటలకు
అస్తమించును, సూర్యుని తరువాత 2.5 గంటలకు)
క్రీ.శ 31
మార్చి నెలలో ఒక “శుక్రవారం శిలువ వెయ్యటం” అనేది సాధ్యం కాదు అనేది
స్పష్టమైనది. ఇప్పుడు, మనము క్రీ.శ 31 ఏప్రిల్ లో
“మొదట కనిపించే నెలవంక” పద్దతిలో నెలను ప్రారంభించే విధానంలో
శుక్రవారం శిలువ వేయటం సాధ్యపడునేమో పరిశీలిద్దాం.
అమావాస్య =
ఏప్రిల్ 10 @ 11: 33 PM (UTC) = ఏప్రిల్ 10 @ 2: 33 PM (యెరూషలేము – పగటివెలుగు
పొదుపు సమయం, UTC +3). ఇక్కడ ఇవ్వబడిన తేదీ నందు గల అమావాస్యకు మరియు
సూర్యాస్తమయానికి మధ్య గల సరాసరి సమయంను క్రింద చూడవచ్చు. (యెరూషలేములో ఏప్రిల్
మధ్యలో సూర్యాస్తమయం 7 PM గంటలకు ఏర్పడుతుంది.)
-
(చూడటానికి అసాధ్యమైన న్యూమూన్)
-
(కనిపించీ కనిపించని న్యూమూన్)
= పస్కాను ఏప్రిల్ 25 కు
చేరుస్తుంది. ఇది ఆధునిక “సోమవారం”నకు సమానం.(గమనిక: 1% ప్రకాశంతో
చంద్రుడు 8 PM గంటలకు అస్తమించును, సూర్యుని తరువాత 1 గంటకు9)
-
(స్పష్టంగా
కనిపించే న్యూమూన్) = పస్కాను ఏప్రిల్ 26 కు చేరుస్తుంది. ఇది ఆధునిక
“గురువారం”నకు సమానం. (గమనిక: 5% ప్రకాశంతో చంద్రుడు 9 PM గంటలకు
సూర్యుని తరువాత 2 గంటలకు అస్తమించును.)
-
(మొదటి కనిపించే నెల వంకను
గుర్తించటానికి అవసరమైన కాల పరిమితి 76.5 గంటలని చెప్పుట అనేది “ఇప్పటికే
అంగీకరించిన మరియు సహేతుకమైన కాల పరిమితులకు చాలా దూరమైనది (ముఖ్యంగా
యెరూషలేములో).” కాని “శుక్రవారం శిలువ వెయ్యటం” (ఏప్రిల్ 27) నకు
చేరుకోవాలంటే నెలవంకను గుర్తించుటకు 76.5 గంటలు పట్టుననే అసత్యాన్ని
కాపాడుకోవాలి.) గమనిక:
10% ప్రకాశంతో చంద్రుడు 10 PM గంటలకు,
సూర్యుని తరువాత 3 గంటలకు అస్తమించును.
ఇక్కడ,
మళ్ళీ, మనము శిలువ వెయ్యటం “శుక్రవారం” దగ్గరకు వచ్చుట సాధ్యం కాదని
గ్రహించెదము. క్రీ.శ 31 లో శిలువ వేయటం
శుక్రవారం జరిగిందనే దానిని కాపాడుకునేందుకు సాంప్రదాయవాదులు 76.5 గంటల వయస్సు
వరకు (10% ప్రకాశించువరకు) మొదటి నెలవంక కనిపించలేదు అని అనుకొని ఉండాలి! అయితే
ఇది ఇప్పటికే ఆమోదయోగ్యమైన 17-42 గంటల కాల పరిమితులను మించిపోవుచున్నది.
మళ్ళీ,
గుర్తుంచుకోండి, ప్రారంభ నెలవంకను:
-
సాధారణంగా అమావాస్య తర్వాత 17-23
గంటలకు చూడవచ్చు.
-
కొన్నిసార్లు తూర్పు సమీప ప్రాంతంలో
(ఉదా: యెరూషలేము) కంటికి కనిపించుటకు అమావాస్య తరువాత 42 గంటల వరకు
పట్టవచ్చు.
చంద్రుడు
28.5 గంటల వయసులో ఏప్రిల్ 11 న దాదాపుగా కనిపించి ఉండవచ్చు. అయితే, ఒకవేళ, అలా
కాకపోయినచో, అది తప్పనిసరిగా 5% ప్రకాశం తో 52.5 గంటల వయసులో ఏప్రిల్ 12 న
(సూర్యుని తర్వాత 2 గంటలకు అస్తమించినపుడు) కనిపించి ఉండేది.
చంద్రుని
దానియొక్క 76.5 గంటల వయసు వచ్చువరకు చూడలేము అని సూచించుట సహేతుకం కానే కాదు. ఇటువంటి వ్యతిరిక్తతను చేసినచో, ఈ ప్రకటన
దీనితో పాటు సాధ్యపడని పరిణామాలను కలిగియుండును, అవి తిరస్కరించుటకు వీలులేని
విధంగా దీనియొక్క అసంబద్ధతను ధృవికరించును.
క్రీ.శ 31
ఏప్రిల్ లో “శుక్రవారం శిలువ వెయ్యటం” అనేదానిని పట్టుకొనుట అనేది
చంద్రుడు ప్రత్యక్షమవుటకు గుర్తింపు పొందిన కాల పరిమితుల నుండి (అమావాస్య తర్వాత
17-42 గంటలు) 5 వరుస నెలల్లో (ఫిబ్రవరి-జూన్ వరకు) తప్పిపోయెను అని అర్థం. ఒకరు
క్రీ.శ 31 ఏప్రిల్ లో “శుక్రవారం శిలువ వెయ్యటం” అనేదానిని
బలపరచినట్లయితే, వారు ఆ సంవత్సరపు ఫిబ్రవరి మరియు జూన్ ల మధ్య నెలవంక చంద్రుని
47.75 గంటల వయస్సపుడు చూడవచ్చు అని నమ్మాలి.
-
అమావాస్య = ఫిబ్రవరి 10 @ 12: 15 PM (యెరూషలేము సమయం, UTC +2)
-
ఫిబ్రవరి 10 @ 5: 30 PM (సూర్యాస్తమయం) = 5.25 గంటలు
= చూడటానికి అసాధ్యం.
-
ఫిబ్రవరి 11 @ 5: 30 PM = 29.25 గంటలు = కనిపించుటకు
అవకాశం ఉంది. ప్రకాశం = 2%, చంద్రాస్తమయం: 6:24 PM (సూర్యుని తర్వాత సుమారు 1
గంటకు)
-
ఫిబ్రవరి 12 @ 5: 30 PM = 53.25 గంటలు = ఖచ్చితంగా
కనిపించును! ప్రకాశం = 6%, చంద్రాస్తమయం: 7:29 PM (సూర్యుని తర్వాత సుమారు 2
గంటలకు)
సాంప్రదాయవాదులు
ఎవరైతే క్రీ.శ 31 ఏప్రిల్ లో “శుక్రవారం శిలువ వెయ్యటం” అనే దానిని
పట్టుకొని వ్రేలాడుదురో వారు ఫిబ్రవరి 13 ను న్యూ మూన్ దినోత్సవంగా అంగీకరించాలి
ఎందుకంటే చాంద్రమాసంనకు ఎప్పుడూ 30 రోజుల కంటే ఎక్కువ రోజులుండవు. మార్చిలో న్యూ
మూన్ దినమునుండి నుండి 30 రోజులు వెనుకకు లెక్కిస్తే ఫిబ్రవరి 13 వస్తుంది. ఈ విధానమునకు కట్టుబడిన వారు చంద్రుడు
ఫిబ్రవరి 12 వరకు అంటే 53.25 గంటల వయసు వచ్చువరకు కనబడలేదు అని నమ్మి
తీరాలి. (గమనిక: ఈ చంద్రుడు 6% ప్రకాశం తో సూర్యుని తరువాత దాదాపు 2 గంటలకు
అస్తమించెను.) ఈ చంద్రుడు ఫిబ్రవరి 11 న దాదాపుగా 2% ప్రకాశం తో 29.25 గంటల వయసులో
సూర్యుని తర్వాత సుమారు 1 గంటకు అస్తమించిన రోజున కనిపించి ఉండాలి.
-
అమావాస్య = మార్చి 12 @ 12: 20
AM (యెరూషలేము సమయం, UTC +2)
-
మార్చి 12 @ 5: 45 PM
(సూర్యాస్తమయం) = 17.5 గంటల = బహుశా కనిపించును. ప్రకాశం = 1%, చంద్రాస్తమయం:
6:14 PM (సూర్యుని తర్వాత దాదాపు .5 గంటలకు)
-
మార్చి 13 @ 5: 45 PM = 41.5
గంటలు = ఖచ్చితంగా కనిపించును! ప్రకాశం = 3%, చంద్రాస్తమయం: 7:14 PM
(సూర్యుని తర్వాత 1.5 గంటలకు)
-
మార్చి 14 @ 5: 45 PM = 65.5
గంటల = ఖచ్చితంగా కనిపించును! ప్రకాశం = 8%, మూన్ సెట్: 8:12 PM (సూర్యుని
తర్వాత 2.5 గంటలకు)
సాంప్రదాయవాదులు
ఎవరైతే క్రీ.శ 31 ఏప్రిల్ 27 న “శుక్రవారం శిలువ వెయ్యటం” అనే దానిని
పట్టుకొని వ్రేలాడుదురో వారు మార్చి 15 ను న్యూ మూన్ దినోత్సవంగా అంగీకరించాలి
ఎందుకంటే చాంద్రమాసంనకు ఎప్పుడూ 30 రోజుల కంటే ఎక్కువ రోజులుండవు. ఏప్రిల్ లో న్యూ
మూన్ దినమునుండి నుండి 30 రోజులు వెనుకకు లెక్కిస్తే మార్చి 15 వస్తుంది. దీనర్థం ఈ విధానమునకు కట్టుబడిన వారు
చంద్రుడు మార్చి 14 వరకు అంటే 65.5 గంటల వయసు వచ్చువరకు కనబడలేదు అని నమ్మి
తీరాలి. (గమనిక: ఈ చంద్రుడు 8% ప్రకాశంతో సూర్యుని తరువాత దాదాపు 2.5 గంటలకు
అస్తమించెను.) ఈ చంద్రుడు ఫిబ్రవరి 13 న ఖచ్చితంగా 3% ప్రకాశం తో 41.5 గంటల వయసులో
సూర్యుని తర్వాత సుమారు 1.5 గంటకు అస్తమించిన రోజున కనిపించి ఉండాలి.
-
అమావాస్య = ఏప్రిల్ 10 @ 2: 33 PM (యెరూషలేము –
పగటివెలుగు పొదుపు సమయం, UTC +3).
-
ఏప్రిల్ 10 @ 7 PM (సూర్యాస్తమయం) = 4.5 గంటలు =
చూచుట అసాధ్యం
-
ఏప్రిల్ 11 @ 7 PM = 28.5 గంటలు = అవకాశం
కనిపిస్తుంది. ప్రకాశం = 1%, చంద్రాస్తమయం: 7:59 PM (సూర్యుని తర్వాత సుమారు
1 గంటలకు)
-
ఏప్రిల్ 12 @ 7 PM = 52.5 గంటలు
= ఖచ్చితంగా కనిపించును! ప్రకాశం = 5%, చంద్రాస్తమయం: 8:57 PM (సూర్యుని
తర్వాత సుమారు 2 గంటలకు)
-
ఏప్రిల్ 13 @ 7 PM = 76.5 గంటలు = ఖచ్చితంగా
కనిపించును! ప్రకాశం = 10%, చంద్రాస్తమయం: 9:55 PM (సూర్యుని తర్వాత సుమారు 3
గంటలు)
సాంప్రదాయవాదులు ఎవరైతే
క్రీ.శ 31 ఏప్రిల్ 27 న “శుక్రవారం శిలువ వెయ్యటం” అనే దానిని పట్టుకొని
వ్రేలాడుదురో వారు ఏప్రిల్ 14 ను న్యూ మూన్ దినోత్సవంగా అంగీకరించాలి. ఈ విధానమునకు
కట్టుబడిన వారు చంద్రుడు ఏప్రిల్ 13 వరకు అంటే 76.5 గంటల వయసు వచ్చువరకు
కనబడలేదు అని నమ్మి తీరాలి. (గమనిక: ఈ చంద్రుడు 10% ప్రకాశంతో సూర్యుడు తర్వాత
దాదాపు 3 గంటలకు అస్తమించెను.) ఇక్కడ మళ్ళీ, చంద్రుడు దాదాపుగా దాని 28.5 గంటల
వయసులో ఏప్రిల్ 11 న కనిపించి ఉండును. అయితే, ఒకవేళ అలా జరగకపోతే, అది తప్పనిసరిగా
ఏప్రిల్ 12 న దాదాపుగా 5% ప్రకాశం తో 52.5 గంటల వయసులో సూర్యుని తర్వాత సుమారు 2
గంటకు అస్తమించిన రోజున కనిపించి ఉండాలి.
-
అమావాస్య = మే 10 @ 4: 58 AM యెరూషలేము – పగటివెలుగు
పొదుపు సమయం, UTC +3)
-
మే 10 @ 7: 30 PM (సూర్యాస్తమయం) = 14.5 గంటలు =
చూచుట అసాధ్యం
-
మే 11 @ 7: 30 PM = 38.5 గంటలు = ఖచ్చితంగా
కనిపించును! ప్రకాశం =
2%,చంద్రాస్తమయం: 8:44 PM (సూర్యుని తర్వాత 1.25 గంటలకు)
-
మే 12 @ 7: 30 PM = 62.5 గంటలు = ఖచ్చితంగా
కనిపించును! ప్రకాశం = 6%,
చంద్రాస్తమయం: 9:42 PM (సూర్యుని తర్వాత 2.25 గంటలకు)
సాంప్రదాయవాదులు
ఎవరైతే క్రీ.శ 31 ఏప్రిల్ 27 “శుక్రవారం శిలువ వేయబడెను” అనే దానిని
పట్టుకొని వ్రేలాడుదురో వారు మే 13 ను న్యూ మూన్ దినోత్సవంగా అంగీకరించాలి. ఇది ఈ
ఉదాహరణకు ఉత్తమ దృష్టాంతమై ఉంది, ఎందుకంటే మునుపటి నెలను ఒక 30 రోజుల నెలగా
చేయుటకు ఒక అధిక దినమును లెక్కించినపుడు అది మొదట కనిపించే నెలవంకగా ఒక పాత
చంద్రుని కోరుతుంది. దీనర్థం, ఈ విధానమునకు
కట్టుబడిన వారు చంద్రుడు మే 12 వరకు అంటే 62.5 గంటల వయసు వచ్చువరకు
కనబడలేదు అని నమ్మి తీరాలి. (గమనిక: ఈ చంద్రుడు 6% ప్రకాశంతో సూర్యుని తరువాత దాదాపు 2.5 గంటలకు
అస్తమించెను.) ఈ చంద్రుడు మే 11 న ఖచ్చితంగా 2% ప్రకాశం తో 38.5 గంటల వయసులో
సూర్యుని తర్వాత సుమారు 1.25 గంటకు అస్తమించిన రోజున కనిపించి ఉండాలి.
-
అమావాస్య = జూన్ 8 @ 8: 06 PM (యెరూషలేము – పగటివెలుగు
పొదుపు సమయం, UTC +3)
-
జూన్ 9 @ 7: 45 PM (సన్సెట్) = 23.75 గంటల =
కనిపించుటకు అవకాశం కలదు. ప్రకాశం = 1%, చంద్రాస్తమయం: 8:31 PM సూర్యుని
తర్వాత దాదాపు .75 గంటలకు)
-
జూన్ 10 @ 7: 45 PM = 47.75 గంటలు = ఖచ్చితంగా
కనిపించును! ప్రకాశం = 3%,చంద్రాస్తమయం: 9:24 PM (సూర్యుని తర్వాత 1.75
దాదాపు గంటలకు)
సాంప్రదాయవాదులు
ఎవరైతే క్రీ.శ 31 ఏప్రిల్ 27 “శుక్రవారం శిలువ వేయబడెను” అనే దానిని
పట్టుకొని వ్రేలాడుదురో వారు జూన్ 11 ను న్యూ మూన్ దినోత్సవంగా అంగీకరించాలి. ఇది
ఈ ఉదాహరణకు ఉత్తమ దృష్టాంతమై ఉంది, ఎందుకంటే మునుపటి నెలను ఒక 30 రోజుల నెలగా
చేయుటకు ఒక అధిక దినమును లెక్కించినపుడు అది మొదట కనిపించే నెలవంకగా ఒక పాత
చంద్రుని కోరుతుంది.
దీనర్థం, ఈ విధానమునకు
కట్టుబడిన వారు చంద్రుడు జూన్ 10 వరకు అంటే 47.75 గంటల వయసు వచ్చువరకు కనబడలేదు
అని నమ్మి తీరాలి. (గమనిక: ఈ చంద్రుడు 3% ప్రకాశంతో సూర్యుని తరువాత దాదాపు 1.75
గంటలకు అస్తమించెను.) ఈ చంద్రుడు జూన్ 9 న 1% ప్రకాశం తో 23.75 గంటల వయసులో
సూర్యుని తర్వాత సుమారు 45 నిమిషాలకు అస్తమించిన రోజున కనిపించి ఉండాలి.
పైన విధానమును అనుసరించేవారు క్రీ.శ 31 లో ఫిబ్రవరి మరియు జూన్ నెలల మధ్య మొదటి కనిపించే లేత చంద్రుని వయస్సు 47.75 గంటల వయసు అని నమ్మాలి. అందువలన ఈ ఐదు నెలల మధ్య మొదటి కనిపించే నెలవంకల వయస్సులు వరుసగా: 53.25 గంటలు, 65.5 గంటలు, 76.5 గంటలు, 62.5 గంటలు, మరియు 47.75 గంటలు అని తప్పక అంగీకరించి ఉండాలి. వీటిలో ప్రతి ఒక్కటీ, మినహాయింపు లేకుండా, చంద్రుని ప్రత్యక్ష్యతను నిర్ణయించుటకు ఏర్పాటు చేయబడిన కాల పరిమితులను దాటిపోవుచున్నవి. మళ్ళీ, గుర్తుంచుకోండి, ప్రారంభ నెలవంకను: • సాధారణంగా అమావాస్య తర్వాత 17-23 గంటలకు చూడవచ్చు. గమనిక: పై విధానము క్రీ.శ 31 లో “శుక్రవారం శిలువ వెయ్యటం” నకు వ్రేలాడేవారికి ఉత్తమ దృష్టాంతమై ఉంది. ఈ చాంద్రమాన నెలల యొక్క దినాల సంఖ్యకు ఒక్క సర్దుబాటు చేసినా, అది ఒక పాత చంద్రున్ని మొదటి కనిపించే నెలవంకగా అంగీకరించ వలసిన పరిస్థితికి దారితీయును. ప్రతీదీ అసంచలమైన న్యూమూన్ దినమునుండి/ ఏప్రిల్ 14 యొక్క లంగరు స్థానము నుండియే లెక్కించాలి, ఎందుకంటే ఇక్కడ నుండియే చంద్ర నెలయొక్క 14 వ రోజు (పస్కా / శిలువమరణ దినము) లెక్కించబడును. ఈ దినమును (ఏప్రిల్ 14) మార్చినయెడల, అది చంద్ర నెలయొక్క 14 వ దినము “శుక్రవారం” రాకుండుటకు గల కారణమౌను. ఈ స్థానం (ఏప్రిల్ 14) నుంచి వెనుకకు లెక్కించిన యెడల మీరు 30 రోజుల కంటే ఎక్కువ లెక్కించలేరు ఎందుకంటే చాంద్రమాన నెలలు ఎప్పుడూ 30 కంటే ఎక్కువ రోజులను కలిగి ఉండవు. ఈ స్థానం (ఏప్రిల్ 14) నుంచి ముందుకు లెక్కిస్తే మీరు 29 రోజులు మాత్రమే లెక్కించాలి ఎందుకంటే చాంద్రమాన నెలలు ఎప్పుడూ 29 కంటే అ రోజులను కలిగి ఉండవు. |
దీనర్థం, క్రీ.శ 31
ఏప్రిల్ 27 న శుక్రవారం శిలువ వేయుటను కలిగియుండు క్రమంలో, ఒకడు ఒక వ్యతిరిక్తతను
(వర్ణించలేని అవకతవకలను) మాత్రమే కాక, వరుసగా 5 నెలల వ్యతిరిక్తతను అంగీకరించాలి!
మంచి మనస్సాక్షి కలిగిన, ఎవరైనా ఎలా ఇటువంటి దారుణమైన ప్రతిపాదనను
స్వీకరించుదురు? అది ఎక్కడకు దారితీసినా, అది మన సంప్రదాయాలు మరియు మన
ప్రతిష్టాత్మకమైన భావనలతో అంగీకరించకపోయినా,రుజువును మాత్రమే వెంబడించమని
నిజాయితీ మనలను కోరుచున్నది.
క్రీ.శ 31
లో ఒక “శుక్రవారం శిలువ వెయ్యటం” అనేది లేదు అనే నిజాన్ని దివంగత సర్
ఐజాక్ న్యూటన్ తో (“ఆధునిక భౌతికశాస్త్ర పితామహుడు”గా పలువురు ఎంచిన)
సహా అనేక పండితుల ద్వారా ధృవీకరించబడింది.
“అతను [న్యూటన్] అందువలన
క్రీ.శ. 31, 32 మరియు 35 లను మినహాయించెను ఎందుకంటే నీసాను 14 శుక్రవారం
(అనేక పరిశోధకులచే ధృవీకరించబడిన) రాలేదు. (“న్యూటన్స్ డేట్ ఫర్
క్రూసిఫిక్షన్” ప్రాట్, జె పి, క్వార్టర్లీ జర్నల్ ఆఫ్ ది రాయల్
అస్ట్రనోమికాల్ సొసైటీ, వాల్యూమ్.32
నెం.3 / సెప్టెంబర్, పే.301, 1991)
ముగింపు:
రక్షకుడు
క్రీ.శ 31 లో శిలువ వేయబడ్డాడని లేఖనాలలో దానియేలు యొక్క గొప్ప “70
వారాల” ప్రవచనం ద్వారా స్పష్టమవుతుంది. అలాగే మొదటి చంద్ర నెల యొక్క 14 వ
దినాన మరియు వారంలోని 6 వ దినాన శిలువ వేయుట జరిగిందని కూడా లేఖనాలు స్పష్టం
చేసెను. కేలండరు వివరాలన్నింటినీ కలిసి పరిశీలించినపుడు, ప్రపంచం నేడు ఆచరిస్తున్న
కేలండరు కన్నా వేరే కేలండరును ఇశ్రాయేలీయులు ఉపయోగించేవారని ఎదురులేని విధంగా
స్పష్టం చేయుచుండెను. వారు నిరంతర వారాల చక్రంను కలిగియున్న ఆధునిక పోపు సంబంధ గ్రెగోరియన్
కేలండరుకు ముందువున్న జూలియన్ కేలండరును ఉపయోగించి యుండలేదు.
క్రీ.శ 31 లో
“శుక్రవారం శిలువ వెయ్యట”కు వ్రేలాడుట అనేది ఆధారాలను (దాని తార్కిక
నిర్ధారణతో) నిజాయితీగా వెంబడించుట ఫలితంగా కలిగినది కాదు. అయితే, సంప్రదాయాలపు
కాపాడుకొనుచూ, ఆధారాల ఆధిక్యమును మూర్ఖంగా తిరస్కరించుట వలన కలిగిన పరిణామం.
|
యథార్థ
క్రైస్తవులు అనేకులు శనివారంను బైబులు సబ్బాతు అని న్మెదరు, అయితే ఇది ఆధునిక
“యూదులు” ఆచరించుచున్నారనే కారణంగానే తప్ప మరే ఇతర కారణంగానూ కాదు.
అయితే నేటి యూదులు శనివారం నాడు ఆరాధించుట నిజమే అయినా, అది ఎల్లప్పుడూ ఈ విధంగానే
లేదు. అసలైన కేలండరు పద్ధతి ఆధునిక కేలండరు కంటే భిన్నమైనదనియు మరియు క్రీ.శ
నాల్గవ శతాబ్ద కాలంలో రోమీయుల యొక్క తీవ్రమైన వేధింపుల వలన, యూదులు అసలైన
సూర్య-చంద్ర కేలండరును విడిచిపెట్టిరని యూదుల పండితులకు చాలా స్పష్టంగా తెలుసు.
“కాన్స్టాంటైన్
పాలన (337-362) లో యూదుల వేధింపులు అత్యున్నత స్థాయికి చేరినవి… తీవ్రమైన శిక్ష
వలన కలిగిన బాధ కింద కేలండరు గణన నిషేధించబడింది [జరిగినది].”
(“క్యాలెండర్,” జ్యూయిష్ ఎన్సైక్లోపీడియా)
“న్యూమూన్
ఇప్పటికీ (ఆధారపడి) ఉంది, మరియు సబ్బాతు నిజానికి చంద్ర చక్రం మీద ఎక్కువగా
ఆధారపడి ఉండేది.” (యూనివర్సల్ యూదుల ఎన్సైక్లోపీడియా, పే. 410)
శనివారంను
సబ్బాతు అని బోధించేవారి యొక్క నమ్మకం వారి సాంప్రదాయాలు మరియు అంచనాలపై మాత్రమే
ఆధారపడి ఉన్నది. ఒక్క లేఖనాల నుండి మాత్రమే రోమన్ గ్రెగోరియన్ శనివారంను ఎవరూ
సబ్బాతుగా నిరూపించలేరు. శనివారంను పట్టుకొని వేలాడువారందరి ఆచరణలు, ఒక దేశంగా,
మెస్సీయను తిరస్కరించి మరియు ఆయనను శిలువ వేసిన వారిద్వారా ప్రకటించబడిన ఆధునిక
క్యాలెండర్ సంప్రదాయాల మీద ఆధారపడి ఉన్నాయి.
ప్రముఖ ఊహకు
గ్రంధం విరుద్ధం కావడం వల్ల గ్రంథంలో ఎక్కడా “ప్రతి ఏడు రోజుల”కు
సబ్బాతును ఆచరించమని చెప్పబడలేదు. అయితే, ఏడవ-దినపు సబ్బాతు ఆరు పని దినాలను
అనుసరించును అని చెప్పబడెను.
విశ్రాంతిదినమును
పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము. ఆరు దినములు నీవు కష్ట పడి నీ పని
అంతయు చేయవలెను. ఏడవ దినము నీ ఎలోహ అయిన
యహువఃకు విశ్రాంతిదినము. (నిర్గమకాండము 20: 8-10 చూడండి)
ఇవి కూడా
చూడండి: నిర్గమ. 16:26, 23:12, 31:15, 34:21, 35: 2;
లేవి. 23: 3; ద్వితీ. 5: 13-14
నిరంతర
వారాల చక్రం అని అనుకునుట (ఊహించుకొనుట) వలన మాత్రమే ఒకడు సబ్బాతు ప్రతి ఏడు
రోజులకు వస్తుంది అని నిర్ణయించును. లేఖనములు ఏమైతే చెప్పుచున్నవో దానిని
అంగీకరించినపుడు మరియు కేలండరు మరియు పండుగ దినములకు (సబ్బాతు సహా) సంబంధించిన
వాక్యాలన్నిటిని జాగ్రత్తగా అధ్యయనం చేసినప్పుడు, అది, సమృద్ధిగా, స్పష్టంగా
బైబిలు కేలండరు సూర్యచంద్ర కేలండరు అనియు మరియు ఆధునిక పాపల్ గ్రెగోరియన్ కేలండరుకు
[దాని పూర్వగామి జూలియన్ కేలండరుకు] అన్ని విధాలా సమానంకాదనియు తేటపరుచును.
బైబిలు
గ్రంధంలో ప్రతి నెల ఒక ప్రత్యేక ప్రార్థనా వేడుక దినముతో ప్రారంభమవును. దీనిని
న్యూమూన్ దినము అందురు 10. దీని తరువాత 6 పని దినాలు వుండి,
వారంలో ఏడవ దినమున సబ్బాతు వుంటుంది. [ie.నెలలో ఎనిమిదవ దినమున]. ఆ తరువాత మరొక
మూడు వారాలు కొనసాగుతూ అలా 29వ రోజున నెల ముగుస్తుంది. తరువాతి న్యూమూన్
దినము తర్వాత వారాల చక్రము తిరిగి ప్రారంభమవుతుంది. ఏ నెలకూ 30 రోజుల కంటే ఎక్కవ
దినములు వుండవు.
లేఖనాలలో ప్రతిసారీ ఏడవ దినపు సబ్బాతు ఒక తేదీనకు అనుసంధానించబడి ఉన్నది,
అది ఎల్లప్పుడూ నెలయొక్క 8, 15, 22, మరియు 29 తేదీలలో వచ్చను.
నిజానికి,
పురాతన క్యాలెండర్లన్నియు (వివిధ రకాలైన నిడివులు కలిగిన) ప్రతి న్యూమూన్
దినానికీ పునఃప్రారంభమయ్యే వారాల చక్రాలను కలిగివున్న సూర్య-చంద్ర కేలండర్లై
ఉన్నాయి. నిరంతర వారాల చక్రం కలిగిన
మొట్టమొదటి కేలండరు క్రీ.పూ 600 లో మొదటి సారిగా బబులోనులో వాడబడినట్లు చరిత్ర
కారులు గుర్తించిరి. ఆ సమయానికి ముందు, ఏ కేలండరు నిరంతర వారాల చక్రంను
వినియోగించలేదు. వారాల చక్రం పునః ప్రారంభమవుట అనేది నెలారంభంనంలో గాని లేక
సంవత్సరారంభంలో గానీ జరిగేది, ఈ విధానంలో పాత సంవత్సరంను ముగిస్తూ ఐదు అధిక
దినములు ఉంటూ అవి ఏ వారానికీ చెందకుండా ఉండేవి.11
“యహువః యొక్క ప్రియమైన పిల్లలారా, ఈ విషయంలో మీరు మామాట వినవద్దు అని మేము వేడుకొనుచున్నాము. దయచేసి ఈ విషయాలను మీ అంతట మీరే పరిశోధించుకోండి. లూనార్ సబ్బాతుపై అనేక అభ్యంతరాలు చెల్లుబాటు అయ్యే విధంగా పైపైన కనిపిస్తాయి కానీ దగ్గరగా పరీక్షించినప్పుడు అవి ఘోరంగా విఫలమయినవి.” |
నిజానికి
ఆధునిక పాపల్ గ్రెగోరియన్ శనివారపు సబ్బాతు లేఖనాల ద్వారా గాని లేదా కేలండరు
చరిత్ర 12 ద్వారా గాని వాస్తవమని చూపబడలేదు. ఈ నిరంతర వారాల చక్రం
యొక్క దోషపూరిత సిద్ధాంతం ఊహపై తప్ప మరి దేనిపైనా స్థాపించబడలేదు. విశ్వాసానికి
మరియు ఆచరణకు లేఖనాలను మాత్రమే ఆధారం చేసుకొనుటకును, ఈ మోసం నుండి విడుదల
పొందుటకును యహువః విశ్వాసులకు ఇదియే గొప్ప సమయమై ఉన్నది.
“యహువః
యొక్క ప్రియమైన పిల్లలారా, ఈ విషయంలో మీరు మామాట వినవద్దు అని వేడుకొనుచున్నాము.
దయచేసి ఈ విషయాలను మీ అంతట మీరే పరిశోధించండి. లూనార్ సబ్బాతుపై అనేక అభ్యంతరాలు
చెల్లుబాటు అయ్యే విధంగా పైపైన కనిపిస్తాయి కానీ దగ్గరగా పరీక్షించినప్పుడు అవి
ఘోరంగా విఫలమయినవి.
“ఇక
బయల్పడవలసిన సత్యం లేదు, మరియు బైబిలు యొక్క మాప్రతిపాదనలు అన్నియూ ఏ లోపమూ
లేకుండా ఉన్నాయి అనుకునే స్థితిలోవున్న ఎవరికైనా క్షమాపణ ఉండదు. కొన్ని సిద్ధాంతాలు
మా ప్రజలలో అనేక సంవత్సరాలుగా వాస్తవంగా నిలిచి ఉన్నాయి అనేది “మన ఆలోచనలు
తప్పుకావు” అనుటకు ఋజువుకాదు. కాలము నిజం లోనికి తప్పును చేర్చదు మరియు సత్యము సత్యముగా ఉండగలదు.
నిశితంగా పరిశీలించినపుడు నిజమైన సిద్ధాంతమేదియు దేనినీ కోల్పోదు.”
(కౌన్నెల్స్ టు రైటర్స్ అండ్ ఎడిటర్స్, ఎల్లెన్ వైట్, పే. 35)”.
“మీరు
మీ ముందుటి అభిప్రాయాలు, మీ పారంపరముగా వచ్చుచున్న ఆలోచనలను విచారణా ద్వారము యొద్ద
విడిచిపెట్టవలెను. మీరు మీ సొంత అభిప్రాయాలను నిజం చేరుకోవడానికి లేఖనాలను అన్వేషణ
చేస్తే, మీరు ఎప్పటికీ సత్యాన్ని చేరుకోలేరు.” (Christ’s Object Lessons,
Ellen White, p.112)
మీరు
ఒక నిజాయితీ హృదయంతో ఈ విషయంలో లోతుగా త్రవ్వమని మేము వేడుకొనుచున్నాము.
![]() |
ఇవ్వబడిన
అన్ని వచనాలు NKJV నుండి తీసుకోబడినవి. లేని యెడల పేర్కొనబడెను.
1
దురదృష్టవశాత్తూ, అనేకులు స్థూలంగా, సమీప భవిష్యత్తులో ఒక మర్మమైన “క్రీస్తు
విరోధి” వచ్చి ఇజ్రాయేలు దేశంతో 7 సంవత్సరాల శాంతి ఒప్పందంను చేయును అనే
బైబులేతర భావనను తీసుకువచ్చే క్రమంలో ఈ విశేషమైన ప్రవచనంను అపార్థం
చేసుకొనుచున్నారు. ఈ ముఖ్యమైన అంశంపై మరిన్ని వివరాల కోసం, The seven year
tribulation (Q & A) మరియు “The Secret Rapture : Satan’s Secret
Weapon” లో చూడండి.
2 “70
వారాలు” ప్రపంచం అనేది విస్తారమైన ప్రవచనానికి పునాది, అది “2300
దినముల”ప్రవచనం. Daniel 8: 2300 Days Prophecy Made Simple లో చూడండి.
3 అర్తహషస్త
1 యొక్క పట్టాభిషేక సంవత్సరం క్రీ.పూ. 465-464; తన మొదటి పాలనా సంవత్సరము క్రీ.పూ.
464 శరదృతువు నుండి క్రీ.పూ. 463 శరదృతువు వరకు విస్తరించి. అర్తహషస్త యొక్క ఆజ్ఞ
క్రీ.పూ. 457 లో “బయలు వెడలిందని” మనకు తెలుసు ఎందుకంటే ఎజ్రా తాను
వసంతకాలంలో [బైబిలు నెలలలో మొదటి నెలలో] బబులోను నుండి బయలుదేరి [బైబిలు నెలలలో
మొదటి నెలలో] ఐదవ నెల అలాగే అర్తహషస్త యొక్క ఏడవ సంవత్సరంలో యెరూషలేము వచ్చాడని
మనకు చెప్పెను. “రాజు ఏలుబడియందు ఏడవ సంవత్సరము అయిదవ మాసమున ఎజ్రా
యెరూషలేమునకు వచ్చెను. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశమునుండి బయలుదేరి,
తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున అయిదవ నెల మొదటి దినమున యెరూషలేమునకు
చేరెను. ” (ఎజ్రా 7: 8-9)
4
http://en.wikipedia.org/wiki/Tiberius
5
సృష్టి వద్ద ఏర్పాటు చేసిన బైబిలు సూర్య చంద్ర కేలండరును ఉపయోగించుట, ఇది ఒక సమస్య
కాదు. తాల్మూడ్ ను వ్రాసిన పరిసయ్యులు ఈ విధమైన పరిస్థితులతో వ్యవహరించుటకు
లేఖనాలలో ఏవిధమైన ఆధారమూ లేనటువంటి ప్రత్యేక నిబంధనలను సృష్టించారు.http://www.truthontheweb.org/postpone.htm
(గమనిక:
ఈ సైట్లో కనిపించే బోధనలను WLC ఏ విధంగానూ సమ్మతిని తెలుపుట లేదు. అయితే, ఈ
లింక్, మెస్సీయను మరియు పరలోక కేలండరును తిరస్కరించిన వారు రూపొందించిన అనేకమైన
వాయిదా నియమాలను చూపును.)
6 రోమ్,
మెస్సీయ కాలంలో, నేడు ప్రపంచం వుపయోగిస్తున్న 7 రోజుల గ్రహ వారంను పాటించలేదు.
అయితే, వారు జూలియన్ క్యాలెండర్ యొక్క 8 రోజుల చక్రం అనుసరించేవారు.
7
http://www.moonsighting.com/faq_ms.html – ఇది ఇస్లాం మతం యొక్క బోధనలు అనుబంధంగా
ఉండుటవలన WLC ఏ విధంగా ఈ సైట్ సిద్ధాంతాలకు మద్దతు ఇవ్వలేదు. అయితే, వారు మోసపోయి
ఉండగా కూడా, ఇస్లాం మతంను అనుసరించే వారు, చంద్రుడిని అధ్యయనం చేయుటలోను మరియు
దాని అమావాస్య తరువాత కనిపించే ప్రారంభ నెలవంక నుండి వారి నెలను ప్రారంభించు
విషయంలోనూ చాలా నిశితమైన పరిశీలన చేయుదురు.
8 WLC యొక్క
లెక్కింపు పద్ధతి ద్వారా, పస్కా క్రీ.శ 31 లో మార్చి 25 న పడినది.
9 చంద్రుని
ఉదయించుట/అస్తమించుట అలాగే దాని ప్రకాశ శాతం యొక్క జాబితాలు Starry Night Pro,
Quick Phase Pro, మరియు Stellarium అనే సాఫ్ట్వేర్లు ద్వారా నిర్ధారించబడినవి.
మీరు ఈ క్రింది లింక్ లో ఉచితంగా Stellarium ను డౌన్లోడ్ చేసుకోవచ్చు: http://www.stellarium.org/
10 న్యూమూన్
యొక్క ప్రాముఖ్యతను, నిజానికి వారపు ఏడవ-దిన విశ్రాంతి కోసం సూచించబడిన బలుల కన్నా
న్యూమూన్ దినాల కోసం సూచించబడిన మరిన్ని ఎక్కువ బలుల ద్వారా చూడవచ్చు. (సంఖ్యలు
28: 11-15)
11 ఎవియేటర్
జెరూబావెల్, సెవెన్ డే సర్కిల్, పేజీ. 7-8.
12 • 8 రోజుల
వారము? జూలియన్ క్యాలెండర్ చరిత్ర (>> వీడియో)