World's Last Chance

At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

While WLC continues to uphold the observance of the Seventh-Day Sabbath, which is at the heart of Yahuwah's moral law, the 10 Commandments, we no longer believe that the annual feast days are binding upon believers today. Still, though, we humbly encourage all to set time aside to commemorate the yearly feasts with solemnity and joy, and to learn from Yahuwah's instructions concerning their observance under the Old Covenant. Doing so will surely be a blessing to you and your home, as you study the wonderful types and shadows that point to the exaltation of Messiah Yahushua as the King of Kings, the Lord of Lords, the conquering lion of the tribe of Judah, and the Lamb of Yahuwah that takes away the sins of the world.
WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

బల్లపరుపు భూమి: ఒక అస్థిర ప్రపంచంలోని బైబిలు సత్యం

“తన బైబిలును బాగా ఎరిగి ఆ బోధకు అనుగుణంగా జీవించువాడు అత్యంత తెలివైన వ్యక్తి. ప్రపంచంలో అన్ని విశ్వవిద్యాలయాలు మరియు పరిశీలనల కన్నా, బైబిలులో, ప్రత్యేకంగా ఆదికాండం, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, యెషయా మరియు యెహెజ్కేలులో నిజమైన విజ్ఞాన శాస్త్రం కనిపిస్తుంది. నిజమైన జ్ఞానం యొక్క గొప్ప విషయాలు అక్కడ పొందుపరచబడి ఉంటాయి, అయితే వాటిని ఒక భక్తి గల ఆత్మతో అడుగుట అవసరం, ఎందుకంటే, ఎలోహీం అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది.” (యాకోబు 4:6). యహూషువః చెప్పినదేమనగా “తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను.” మత్తయి 11: 25, 26. (టెర్రా ఫిర్మా: ఎర్త్ నాట్ ఏ ప్లానెట్, స్క్రిప్చర్, రీజన్, అండ్ ఫాక్ట్, డేవిడ్ వార్డ్లా స్కాట్, p.166)

క్రింద, “బల్లపరుపు భూమి” సత్యానికి Wlc ని హత్తుకొనునట్లు చేసిన కొన్ని విషయాలను మేము ఎత్తి చూపుతున్నాము. ఇది సాక్ష్యం లేదా ఆధారం యొక్క సమగ్ర జాబితాను ఇచ్చుటకు ఉద్దేశించినది కాదు. అయినప్పటికీ, అత్యంత రహస్య మరియు ముఖ్యమైన అంశంపై నిజాయితీగా పరిశీలన ప్రారంభించునట్లు అందరినీ ప్రోత్సహించటకు ఇది సరిపోతుంది.

ఎప్పటినుంచో పాతుకుపోయిన విషయాన్ని మరియు మోసపూరిత ప్రచారం యొక్క మొత్తం జీవితకాలాన్ని కదిలించడం అంత సులభం కాదు, కానీ తండ్రి దయ ద్వారా, అది సాధించబడుతుంది. మీరు మీ అభిప్రాయాలను మరియు పూర్వపు ఊహలను విచారణా తలుపు వద్ద విడిచి, తెరచిన మనస్సుతో మరియు నిజాయితీ గల హృదయంతో ఈ అధ్యయనంలో పాల్గొనుటకు సమయం కేటాయించాలని మేము ప్రార్థిస్తున్నాము.

“సత్యం పూర్తి విచారణకు భయపడదు.” (డేవిడ్ వార్డ్లా స్కాట్)

man surprised

యాదృచ్ఛికంగా, మేము దీనిని పొందాము: భూమి బల్లపరుపుగా ఉన్నదనే సలహా వెర్రి మాటలా అనిపిస్తుంది. ఈ విషయాన్ని మొదటిగా విన్నప్పుడు మేము కూడా అలాగే భావించాము. తగినంత విచారణ చేయకముందే దేనినీ తిరస్కరించుటను మేము ఇష్టపడకపోవుట వలన, మేము ప్రార్థనతో ఆ విషయాన్ని గూర్చి అధ్యయనం చేయుట ప్రారంభించాము, ఎక్కడికి దారి తీసినా దానిని వెంబడించునట్లు. ఎన్నో వారాలు మరియు నెలలు హృదయ శోధన మరియు శ్రద్ధయైన అధ్యయనం చేసిన తరువాత, చివరికి “గోళాకార” నమూనాయే వెర్రిది అని మా దృఢ నమ్మకం.

“సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును..”
(సామెతలు 18:13, KJV)

స్థిరముగా ఉన్న బల్లపరుపు భూమికి మద్దతునిచ్చే బైబిల్ ఆధారాలు:

భూమి స్థిరముగా ఉన్నది:

  • భూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి: భూలోకము స్థిరముగా ఉండును, అనగా అది కదలకుండును. (మొదటి దినవృత్తాంతములు 16:30 KJV)

  • యహువః రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు యహువః బలముధరించి బలముతో నడుము కట్టు కొనియున్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడియున్నది. (చూడుము, కీర్తనలు 93: 1)

  • యహువః రాజ్యము చేయుచున్నాడు లోకము కదలకుండ స్థిరపరచబడియున్నది న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి (కీర్తనల గ్రంథము 96:10 చూడుము)

  • నా ప్రాణమా, యహువఃను సన్నుతించుము. యహువః, నా ఎలోహీం నీవు అధిక ఘనతవహించిన వాడవు నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు. భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను. ((కీర్తనల గ్రంథము 104:1, చూడుము)

భూమి మరియు ఆకాశ జ్యోతులు ఆకాశమండలముతో చుట్టబడి ఉంటాయి:

మరియు ఎలోహీం జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. ఎలోహీం ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను.  ఎలోహీం ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. (ఆదికాండము 1: 6-8)

ఇక్కడ, “ఆకాశము క్రిందనున్న జలాలను ఆకాశవిశమునకు పైనున్న జలములనుండి” వేరుచేయుట ద్వారా యహువః ఆకాశవిశాలమును సృష్టించెనని మనం కనుగొందుము. ఏమైనా ఇది స్పష్టంగా కలదు; అనగా, ఆకాశవిశాలము క్రింద మరియు ఆకాశవిశాలమునకు పైన కూడా నీరు ఉన్నది.

పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి. (కీర్తనల గ్రంథము 148:4, KJV)

బల్లపరుపు భూమి: ఒక అస్థిర ప్రపంచంలోని బైబిలు సత్యం image

ఆదికాండము 1:6-8 ప్రకారం, ఆకాశవిశాలానికి పైన మరియు ఆకాశవిశాలానికి క్రింద జలములు గలవు.

ఇక్కడ ఆకాశ (మండలము) విశాలముగా అనువదించబడిన పదం H7549:

H7549 – râ̂ya(రాఖీయ)

BDB నిర్వచనం:

1) విస్తరించిన ఉపరితల (ఘనరూప), విశాలము, ఆకాశమండలము

1a) విశాలము (చదునైన ఆధారం, ఆధారము)

1b) ఆకాశమండలము (పై జలములకు ఆధారంగా ఉన్న ఆకాశానికి పైభాగం)

1b1) ఘనపదార్థంగా ఉంటూ పైనున్న జలములను కాయుచున్నదని హెబ్రీయల ద్వారా భావించబడుతుంది.

నిర్వచనం ప్రకారం “పైన జలములకు ఆధారంగా ఉన్న ఆకాశానికి పైభాగం,” అని ఉండగా, దానికి ఇంకాస్త కలుపుతూ, అది ఘనపదార్థమై పైనున్న జలములను కాయుచున్నదని హెబ్రీయల ద్వారా భావించబడుతున్నది.”

H7549 (râqı̂ya‛) యొక్క మూలం H7554 (râqa), ఇది స్ట్రాంగ్స్ ద్వారా ఇలా నిర్వచించబడెను:

“ఒక ఆదిమ మూలం; భూమిని తూచేందుకు (భావావేశం యొక్క చిహ్నంగా); సారూప్యతను బట్టి, విశాల పరుచుట (సుత్తితో కొట్టుట ద్వారా); సూత్రప్రాయంగా, పైన కప్పుట (సన్నని లోహపు కాగితాలతో): —కొట్టు, విశాల పరుచు, మొత్తం వ్యాపించు (ముందుకు, పైకి, బయటకు), సాగగొట్టిన” -స్ట్రాంగ్స్ కాంకర్డేన్స్

పైన గల జలాలను కాయుచున్న ఖగోళము దాని మూల పదమును బట్టి ఘనమైనదిగా కనిపిస్తుంది, అది ఒక లోహపు కాగితం వలె సాగగొట్టబడి ఉంటుంది.

ఆకాశ జ్యోతులు ఈ విశాలానికి లోపలి భాగంలో ఉంచబడినట్లు లేఖనం తెలియజేయుచుండెను.

ఎలోహీం పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు, భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను. ఎలోహీం ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమిమీద వెలు గిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీక టిని వేరుపరచుటకును ఎలోహీం ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని ఎలోహీం చూచెను. (ఆదికాండము 1:14-18 చూడండి)

బల్లపరుపు భూమి: ఒక అస్థిర ప్రపంచంలోని బైబిలు సత్యం image

సాదారణ భాషలో లేఖనం చెప్పునది:

(1) ఆకాశమండలానికి క్రింద మరియు పైన జలములు ఉన్నవి (ఆదికాండము 1:6-8 చూడుము.)
(2) ఆకాశ జ్యోతులు ఆకాశమండలము లోపల ఉంచబడెను. (ఆదికాండము 1:14-18 చూడుము.)

స్వభావాన్ని బట్టి ఆకాశం ఘనరూపమై ఉన్నది:

ఈ క్రింది భాగంలో, ఎలీహు యోబుతో చేసిన సంభాషణ, మనం ఆదికాండములో సృష్టి ఖాతా నుండి ఇప్పటికే నేర్చుకున్న దాన్ని ధృవీకరిస్తుంది, అనగా జలాలను వేరుచేయుచు, ఆకాశ జ్యోతులకు ఆశ్రయమైన ఆకాశవిశాలం ఒక ఘనపదార్థం. గమనించండి, ఎలీహు ఖగోళం యొక్క మూల పదమైన H7554 (râqa ‘) ను వాడెను, దీనర్థం: సారూప్యతను బట్టి, విశాల పరుచుట (సుత్తితో కొట్టుట ద్వారా); సూత్రప్రాయంగా, పైన కప్పుట (సన్నని లోహపు కాగితాలతో): —కొట్టు, విశాల పరుచు, మొత్తం వ్యాపించు (ముందుకు, పైకి, బయటకు), సాగగొట్టిన”

పోతపోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింప [H7554 – râqa] జేయగలవా ? (యోబు గ్రంథము 37:18, KJV)

ఇప్పుడు, గోళాకార నమూనాను సమర్ధించేవారిచే తరచూ పేర్కొనబడుచున్న కీలక వాక్యాన్ని మనము పరిశీలిద్దాం:

ఆయన భూ మండలము (circle) [H2329 – chûg] మీద ఆసీనుడై యున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. (యెషయా గ్రంథము 40:22 KJV)

బల్లపరుపు భూమి: ఒక అస్థిర ప్రపంచంలోని బైబిలు సత్యం image“circle / వలయం” గా అనువదించబడిన పదం H2329 (chûg). ఇది అక్షరార్థంగా వలయం, చుట్టూ లేదా దిక్సూచి అని అర్థం, మరియు పొడిగింపు ద్వారా ఆకాశం యొక్క ఊర్ధ్వభాగంను సూచించవచ్చు. ఇది “బంతి” లేదా “గోళం” కాదు.

H2329 – chûg

BDB నిర్వచనం:

1) వృత్తం, చుట్టూ, వలయం

2) (BDB) పైభాగం (ఆకాశం యొక్క)

H2329 (chüg) అనేది ఏవిధంగానూ బంతిని లేదా గోళాన్ని సూచించదు. యెషయా, దైవ ప్రేరేపణ ద్వారా, ఇక్కడ తన పదాల ఎంపికలో ఉద్దేశపూర్వకంగా స్పష్టంగా ఉన్నాడు; అతడు “బంతి” అనే పదాన్ని కలిగి లేకపోలేదు. ఈ క్రింది భాగంలో స్పష్టంగా చూడవచ్చు:

ఆయన తప్పక ఆగ్రహం తెచ్చుకొని మరియు ఒక విశాలమైన దేశంలోనికి నిన్ను బంతి [H1754 – dûr] వలె విసురును . . . (యెషయా 22:18, KJV)

యెషయా, ఒక బంతిని సూచిస్తున్నప్పుడు అతడు H1754 (dûr) ను వ్రాసాడు, H2329 (chûg) కాదు.

ఇక్కడ గమనించదగ్గ ముఖ్య విషయం H2329 (chûg) “ఆకాశం యొక్క పైభాగం” ను సూచించును, అది, సందర్భానుసారం, ఈ వివరణలో వినియోగానికి సరిగ్గా సరిపోతుంది. మనం ఒక్కసారి మళ్ళీ చూద్దాం:

ఆయన భూ మండలము (circle) [H2329 – chûg] మీద ఆసీనుడై యున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును [H8064 – shâmayim] వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. (యెషయా గ్రంథము 40:22 KJV)

భూమిపైనున్న 1 ఆకాశం యొక్క పైభాగం మీద యహువః కూర్చొని ఉండెనని మరియు అతని మైదాన స్థానం నుండి, భూ నివాసులు మిడతలవలె కనిపించుదురని ఈ ప్రకరణము మనకు చెబుతుంది. యహువః, సర్వాంతర్యామి మరియు భూనివాసులను చూచుటకు ఆయన కళ్ళు శ్రమపడనవసరం లేదు, కానీ ఇక్కడ యెషయా యొక్క చిత్రీకరణ స్పష్టంగా ఉంది.

“తెరను” విప్పినట్లు ఆకాశవైశాల్యమును [H8064 – shâmayim] వ్యాపింపజేసెను మరియు “గుడారము” వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను అని కూడా ఈ ప్రకరణం మనకు తెలియజేయుచుండెను. “ఆకాశము” ను సూచించుటకు ఇక్కడ వాడిన పదము మరియు ఆదికాండములో ఆకాశవిశాలమును సూచించుటకు ఉపయోగించబడిన పదము ఒక్కటే:

ఎలోహీం ఆ విశాలమునకు [H7549 – râ̂ya] ఆకాశమని [H8064 – shâmayim] పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. ( ఆదికాండము 1:8. చూడుము.)

యెషయా తెలియజేస్తున్నది ఏమంటే, తండ్రి యహువః ఒక గుడారం వంటి భూమిపై విస్తరించి ఉన్న ఆకాశవైశాల్యము మీద (లేదా పైన) కూర్చున్నాడు. (యహువః ఆకాశం, లేదా షమాయిమ్ ను విస్తరింపజేసెనని లేఖనం నిరంతరం చెబుతుంది: కీర్తన 104: 2, యోబు 9: 8, యెషయా. 40:22; 42: 5; 44:24; 45:12; 51:13, యిర్మియా. 10:12; 51:15, జెకర్యా. 12: 1)

బల్లపరుపు భూమి: ఒక అస్థిర ప్రపంచంలోని బైబిలు సత్యం image

తండ్రియైన యహువః భూమికిపైగా ఒక “గుడారం” వలె లేక ఒక “తెర” వలె విస్తరింపజేసియున్న ఆకాశవైశాల్యము మీద (లేదా పైన) కూర్చునియుండెనని యెషయా మనకు చెప్పుచుండెను. (యెషయా 40:22 చూడండి.) ఈ సారూప్యత “గోళపు” సందర్భానికి అస్సలు సరిపోదు, అర్ధరహితంగా ఉంటుంది.

యోబు గ్రంథంలో ఎలీఫజు ఈ వివరణతో ఒప్పుకున్నాడు, ఎందుకంటే యహువః chûg (H2329) మీద నడిచినాడు, యెషయాచే ఉపయోగించబడిన అదే పదం ఆకాశం యొక్క పైభాగాన్ని సూచిస్తుంది:

J.P. Green's literal rendering of Job 22:14

“మరియు పైభాగం [H2329] – ఆకాశములు [H8064] – అతను నడుచును”

గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా నున్నవి, ఆయన చూడలేదు ఆకాశపు [H8064 – shâmayim] వలయంలో (circuit) [H2329 – chûg] ఆయన తిరుగుచున్నాడు అని నీవను కొనుచున్నావు. (యోబు గ్రంథము 22:14. KJV)

ఖగోళము యొక్క అత్యున్నత స్థలములో యహువః నివసించునని ఎలీఫజు స్పష్టంగా నమ్మాడు.

ఎలోహీం ఆకాశమంత [H8064 – shâmayim] మహోన్నతుడు కాడా? నక్షత్రముల ఔన్నత్యమును చూడుము అవి ఎంత పైగా నున్నవి? (యోబు గ్రంథము 22:12)

సొలోమోను, సృష్టి ఖాతాపై తన వ్యాఖ్యానంలో, మోషే, యెషయా మరియు యోబు యొక్క లేఖనాల నుండి ఇప్పటివరకూ నేర్చుకున్న వాటిని బలోపేతం చేయుచున్నాడు:

ఆయన ఆకాశవిశాలమును [H8064 – shâmayim] స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును [H2329 – chûg] నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు..(సామెతలు 8:27- 29)

ఇక్కడ, మళ్ళీ, మనము ఆకాశవిశాలమును గుర్తించడానికి అదే పదం ఉపయోగించబడెనని కనుగొందుము, ఆకాశములు: chûg (H2329)

“సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి. అందరును యహువః నామమును స్తుతించుదురు గాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది. (కీర్తనల గ్రంథము 148: 3,4, 13)

సొలోమోను, పై భాగంలో, సృష్టి వారంలో యహువః చేసిన దాన్ని తిరిగి చెప్పుచుండెను (ఆదికాండము 1: 2 చూడండి.) సందర్భాన్నిబట్టి, సొలొమోను మహాజలములమీద ఉన్న భౌతిక ఆకాశవిశాలమును గురించి స్పష్టంగా మాట్లాడుతున్నాడని తెలుస్తుంది, ఎందుకంటే ఆకాశముల [H8064 – shâmayim] యొక్క తయారీ గురించి మాట్లాడుచుండెను అనగా, మహాజలముల మీద chûg (H2329) వుంచబడెను. మరొక చాలా న్యాయమైన వివరణ ఏమిటంటే సొలోమోను, ఇక్కడ, సముద్రాలకు సరిహద్దుగా యహువః చేత స్థాపించబడిన బాహ్య మంచు వృత్తం గురించి ప్రస్తావిస్తూ, ఆయన ఇలా చెప్పుచుండెను.

జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు. (సామెతలు 8:29)

ఈ వ్యాఖ్యానాలలో ఒకడు దేనికి కట్టుబడి ఉండాలనే దానితో సంబంధం లేకుండా, ఒక విషయం ఖచ్చితంగా ఉంది: అది భూమి “గోళం” గా ఉన్నదని ఎక్కడా సూచనప్రాయంగా కూడా చెప్పలేదు. ఇప్పటివరకు పరిశీలించబడిన బైబిలు వాక్యాలన్నీ, ఆకాశం యొక్క విశాలముచే కప్పబడియున్న భూమిని వర్ణిస్తాయి.

ప్రవక్తయైన యెహెజ్కేలు వ్రాసిన అద్భుత కోణమును ఇప్పుడు మనం పరిశీలిద్దాము:

ముప్పదియవ సంవత్సరము నాలుగవ నెల అయిదవ దినమున నేను కెబారు నదీప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని; ఆ కాలమున ఆకాశము [H8064 – shâmayim] తెరవ బడగా ఎలోహీం గూర్చిన దర్శనములు నాకు కలిగెను. నేను చూడగా ఉత్తర దిక్కునుండి తుపాను వచ్చు చుండెను; మరియు గొప్ప మేఘమును గోళమువలె గుండ్ర ముగా ఉన్న అగ్నియు కనబడెను, కాంతిదానిచుట్టు ఆవరించియుండెను; ఆ అగ్నిలోనుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న యపరంజివంటి దొకటి కనబడెను. దానిలోనుండి నాలుగు జీవుల రూపములుగల యొకటి కనబడెను, వాటి రూపము మానవ స్వరూపము వంటిది. మరియు జీవుల తలలపైన ఆకాశమండలము [H7549 – râ̂ya] వంటి విశాలతయున్నట్టుండెను. అది తళతళలాడు స్ఫటిక ముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి యుండెను. ఆ మండలము [H7549 – râ̂ya] వంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి యొకదానిప్రక్క ఒకటి పైకి చాప బడియుండెను; రెండేసి వాటి దేహములు కప్పుచుండెను, ఈ తట్టుననున్న జీవులకును ఆ తట్టుననున్న జీవులకును, అనగా ప్రతిజీవికిని ఆలాగున రెక్కలుండెను. అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని; అది విస్తార మైన ఉదకముల ఘోషవలెను సర్వశక్తుడగు దేవుని స్వరము వలెను దండువారు చేయు ధ్వనివలెను ఉండెను, అవి నిలుచునప్పుడెల్ల తమ రెక్కలను వాల్చుకొనుచుండెను. అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలలకు పైగా నున్న ఆకాశ మండలము [H7549 – râqı̂ya‛] వంటి దానిలోనుండి శబ్దము పుట్టెను. వాటి తలల పైనున్న ఆ మండలము [H7549 – râqı̂ya‛] పైన నీల కాంతమయమైన సింహాసనమువంటి దొకటి కనబడెను; మరియు ఆ సింహాసనమువంటి దానిమీద నరస్వరూపి యగు ఒకడు ఆసీనుడైయుండెను. చుట్టు దాని లోపట కరుగుచున్న యిత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలు కొని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను, చుట్టును తేజోమయముగా కనబడెను. వర్ష కాలమున కనబడు ఇంద్ర ధనుస్సుయొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను. (యెహెజ్కేలు 1:1,4,5,22- 28)

బల్లపరుపు భూమి: ఒక అస్థిర ప్రపంచంలోని బైబిలు సత్యం imageఇక్కడ యెహెజ్కేలు మనకు ఇలా చెబుతున్నాడు:

  1. ఆకాశము [H8064 – shâmayim] తెరవబడెను. (యెహెజ్కేలు 1:1 చూడుము.)
  2. ఉత్తర దిక్కునుండి తుపాను వచ్చు చుండెను; మరియు గొప్ప మేఘమును, అగ్నియు కనబడెను (యెహెజ్కేలు 1:4 చూడుము.) “ఉత్తరం,” ఇక్కడ సందర్భంలో, ఆయనకోసం తెరవబడియున్న పరలోకం యొక్క అత్యున్నత స్థాయిని సూచిస్తుంది, ఈ అవగాహనతో యోబు ఒప్పుకున్నాడు: “శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను . . .” ( యోబు 26:7 చూడుము)
  3. ఈ తుఫానులోనుండి వచ్చిన అగ్ని నుండి నాలుగు జీవుల రూపములు బయటకు వచ్చెను. (యెహెజ్కేలు 1:5 చూడుము)
  4. ఈ జీవులు బయటకు వచ్చిన తరువాత, యెహెజ్కేలు ఆకాశమండలమును చూసెను [H7549 – râqı̂ya‛] యెహెజ్కేలు ఈ ఆకాశమండలమును “స్పటికము తో పోల్చెను” (యెహెజ్కేలు 1:22 చూడుము) ఇక్కడ “స్పటికము” గా అనువదించబడిన పదం H7140 (qerach), దీనర్థం “మంచు, మంచు స్పటికం.” ఇది ఖగోళం పై ఉన్న నీరు ఘనీభవించినట్లు సూచిస్తుంది (లేదా కనీసం మంచు రూపాన్ని కలిగి ఉంటుంది). దీనినే అపోస్తలుడైన యోహాను తన దర్శనంలో కూడా చూశాడు: “మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టును, ముందు వెనుక కన్నులతోనిండిన నాలుగు జీవులుండెను..” (ప్రకటన గ్రంథం 4:6) ఇక్కడ “స్పటికము” అనువదించబడిన గ్రీకు పదం కృస్టలోస్ krustallos (G2930), దీనిని “ఉన్నతస్థాయి గ్రీకులో మంచు కోసం వాడతారు.” (విన్సెంట్ యొక్క వర్డ్ స్టడీస్). దీని గురించి చాలా ఎక్కువ చెప్పవచ్చు, కానీ ఈ అధ్యయనం యొక్క పరిధిలో ఈ ప్రత్యేక బంగారు గనిని మరింత త్రవ్వటకు వీలుపడదు.
  5. జీవుల తలలకు పైగా నున్న ఆకాశ మండలమువంటి [H7549 – râqı̂ya‛] దానిలోనుండి శబ్దము పుట్టెను. (యెహెజ్కేలు 1:25)
  6. ఆకాశమండలము [H7549 – râqı̂ya‛] పైన సింహాసనంపై యహువః ఆసీనుడై యుండెను. (యెహెజ్కేలు 1: 26-28 చూడండి.)

యెహెజ్కేలు, ఇక్కడ, తనకు ఒక మంచు స్ఫటికం వలె కనిపించిన, ఆకాశమండలముపై గల సింహాసనంపై మహిమతో ఆసీనుడైయున్న యహువః యొక్క అసాధారణమైన చిత్రాన్ని చిత్రించాడు.

ఈ ప్రవక్త మరోసారి మరో దర్శనంలో ఈ చిత్రాన్ని ధృవీకరిస్తాడు:

నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశమండలము [H7549 – râ̂ya] వంటిదానిలో నీలకాంతమయమైన సింహాసనమువంటి దొకటి అగుపడెను. (యెహెజ్కేలు 10:1)

యెషయా, ఎలీఫజు, ఎలీహు, యెహెజ్కేలు అందరూ ఘనరూపమైన ఆకాశ మండలముపై యహువః సింహాసనాసీనుడై ఉండెనని అంగీకరిస్తున్నారు. భూమి అక్షరానుసారంగా యహువః యొక్క పాదపీఠముగా ఉన్నట్లు కనిపిస్తోంది.

యహువః ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము [H8064 – shâmayim] నా సింహాసనము భూమి నా పాద పీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించునది ఏపాటిది? (యెషయా గ్రంథము 66:1.)

భూమి బల్లపరుపుగా ఉన్నది:

యోబు గ్రంధంలో, మనం అత్యంత ఆకర్షణీయ మరియు అంతరార్ధం గల సంభాషనను చూస్తాము. 38 వ అధ్యాయంలో, యహువః యోబుకు కనిపించి మరియు అతనిని ప్రశ్నించుట మొదలుపెట్టును. ఈ ప్రశ్నల్లో ఒకటి ఈ అధ్యయనం కోసం ప్రత్యేకంగా ఉంటుంది:

భూమి వైశాల్యత [H7338 – rachab] ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైన తెలిసివయెడల చెప్పుము. (యోబు గ్రంథము 38:18, KJV)

వైశాల్యత, అనే పదము, ఇక్కడ rachab (H7338), అనగా “వెడల్పు, విస్తృత లేదా విస్తారమైన విస్తారము.” (BDB లెక్సికాన్) ఇది ఒక బల్లపరుపు భూమిపై సంపూర్ణంగా న్యాయమైన ప్రశ్నగా కనిపిస్తుంది. ఇది ఒక గోళాకార భూమి యొక్క సందర్భంలో అయితే, అస్సలు అర్ధం ఉండదు.

దానియేలు గ్రంథంలో, నెబుకద్నెజరు యొక్క ప్రవచన కలను గూర్చిన వివరాలు భూమి బల్లపరుపు అని సూచిస్తున్నాయి:

నేను నా పడకమీద పరుండియుండగా నాకు ఈ దర్శనములు కలిగెను; నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల యొక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయెను; దాని పైకొమ్మలు ఆకాశమునకంటునంత ఎత్తుగాను, అది భూమి యొక్క అన్ని చివరలను చూడగలుగునట్లును ఉండెను. (దానియేలు 4:10-11, KJV)

నెబుకద్నెజరు తాను ఎత్తుగాగా పెరిగిన వృక్షం గురించి కలగన్నాడని మరియు అది భూమి యొక్క అన్ని చివరలను చూడగలుగునట్లును ఉండెనని చెప్పెను. ఇది కేవలం ఒక కల అయినప్పటికీ, ఒక బల్లపరుపు భూమిని సూచిస్తుంది, ఎందుకంటే బల్లపరుపు భూమిపై మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఈ విషయం గోళాకార భూమిపై పూర్తిగా అసాధ్యంగా ఉంటుంది.

బల్లపరుపు భూమి: ఒక అస్థిర ప్రపంచంలోని బైబిలు సత్యం image

ఇప్పుడు, మన ప్రేమగల రక్షకుని రెండవ రాకడలోని కొన్ని అద్భుతమైన వర్ణనలను చూద్దాం:

ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలు పాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,

పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీదరాలెను. మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను. భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై యున్నవాని యొక్కయు గొఱ్ఱెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు? మీరు మామీద పడి ఆయన సన్నిధికిని (సింహాసనం నుండి) గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండల తోను చెప్పుచున్నారు. (ప్రకటన గ్రంథము 6:12-17, KJV)

ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌. (ప్రకటన గ్రంథము 1:7, KJV)

ప్రవచనకారుడైన యోహాను ప్రకారం:

  1. ఆకాశ నక్షత్రములు భూమిమీద రాలును. (ప్రకటన గ్రంథము 6:13.) యోహాను, ఈ అంశంపై వివరించిన ఇతర ప్రవక్తల వలెనే, నక్షత్రాలు మహాదేహాలు (భూమి కంటే పెద్దవి) గా ఉండి మిలియన్ల మైళ్ల దూరంలో ఉన్నాయని స్పష్టంగా నమ్మలేదు. ఒకవేళ ఇది, ఆధునిక ఖగోళ శాస్త్రం రూపొందించినట్లుగా ఉంటే, ఒక నక్షత్రం భూమిపై పడితే అది మొత్తం భూమిని నిర్మూలించుటకు సరిపోతుంది. గమనించండి; నక్షత్రాలు భూమిపై “పడును” అని కూడా యోహాను పేర్కొన్నాడు; నక్షత్రాలు భూమిపై ఏదో పక్క బలంగా తాకునని చెప్పుటలేదు.
  2. ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోవును (ప్రకటన గ్రంథము 6:14) ఆకాశం ఒక పరదా వలె లేక గుడారం వలె విస్తరించబడినదనే లేఖనం యొక్క సర్వవాప్త వర్ణనతో ఇది సరిపోతుంది. భూమి ఒక గోళం అయితే ఈ వివరణకు ఎటువంటి అర్ధం ఉండదు.
  3. యహూషువః మహిమలో వస్తున్నప్పుడు భూమిపైనున్న ప్రతిఒక్కరు ఆయనను చూతురు. (ప్రకటన గ్రంథము 1:7.) ఇది ఒక బల్లపరుపు భూమిపై ఖచ్చితమైన అర్థాన్ని కలిగి ఉంటుంది, కానీ భూమి ఒక గోళం అయితే అసాధ్యం అవుతుంది.
  4. దుష్టులు, పశ్చాత్తాపం పొందనివారు “గొఱ్ఱెపిల్ల ఉగ్రత” నుండి, “సింహాసనాసీనుని ముఖము” నుండి తమను తాము దాచుకొనుటకు ప్రయత్నించుదురు. (ప్రకటన గ్రంథము 6:15-16.) ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోవునప్పుడు, దుష్టులు, సింహాసనంపై (ఆకాశం యొక్క పైభాగాన, or భూమియొక్క “వృత్తం” పై గల సింహాసనం [H2329 – chûg] Isa.40:33) ఆసీనుడైనవాని ముఖము నుండి తమను దాచుకొనుటకు ప్రయత్నించుదురు.

బల్లపరుపు భూమి: ఒక అస్థిర ప్రపంచంలోని బైబిలు సత్యం image

లేఖనంచెబుతుంది, యహూషువః యొక్క రెండవ రాకడ వద్ద, “ఆకాశములు చుట్టబడిన గ్రంథము వలె” తొలగిపోవును మరియు అలా “ప్రతి నేత్రము ఆయనను” చూచును. (ప్రకటన గ్రంథము 1:7; 6:12-17.) ఈ ప్రకరణములను గోళకార భూమి యొక్క మాదిరికి అనుగుణంగా వర్ణించాలంటే అనేకమైన తారుమారులు అవసరమవుతాయి. ఆకాశం వెనక్కు పోయినప్పుడు, దుష్టులు సింహాసనంపై ఆసీనుడైన యహువఃను చూచెదరు, మరియు తన అద్భుతమైన సముఖమునుండి తమను తాము దాచుకొనుటకు ప్రయత్నించుదురు.

కదులుతున్నవి ఆకాశ జ్యోతులు, భూమి కాదు.

యహువః ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయు లను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యహువఃకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము.

జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా. సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు. (యెహొషువ 10:12,13 చూడుము.)

లేఖనము దీనికంటే స్పష్టముగా ఉండదు: “సూర్యుడు ఆకాశం మధ్యలో స్థిరంగా నిలిచి యుండెను.” యెహోషువ ఆకాశంలో నిలిచియుండునట్లు సూర్యుని మరియు చంద్రుని ఆదేశించాడు. అతడు తిరగకుండా ఆగునట్లు భూమిని ఆజ్ఞాపించలేదు. నిజాయితీగల బైబిలు విద్యార్థులుగా, మనం ఈ ప్రకరణము యొక్క స్పష్టతను గుర్తించాలి. మానవుని యొక్క నకిలీ-శాస్త్రీయ కోపర్నికన్ (సూర్య కేంద్రక) సిద్ధాంతానికి సరిపోవునట్లు లేఖనాలను వక్రీకరించిన యెడల యహువః మనలను క్షమించడు, ఇది ఆదికాండము మొదలుకొని లేఖనమునకు విరుద్ధంగా ఉంటుంది. నిజమైన విజ్ఞానం (పరీక్షించుట ద్వారా మరియు పరిశీలించుట ద్వారా) నిశ్చల భూమి యొక్క వాస్తవికతను నిర్ధారిస్తుంది: (Experiments, The Alleged Coriolis Effect).

యెషయా గ్రంథంలో, ఆకాశంలోని సూర్యుని తిరోగమనము ద్వారా, యహువః సూర్య గడియారమును వెనుకకు తిరుగునట్లు ఎలా ప్రభావితం చేసెనో అనే ప్రేరేపిత వృత్తాంతము గలదు:

ఆహాజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతిచేత దిగిన నీడను మరల పదిమెట్లు ఎక్క జేసెదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరల ఎక్కెను. (యెషయా గ్రంథము 38:8)

యెషయా మనకు “సూర్య కాంతి పది మెట్లు తిరిగి ఎక్కెను” అని సాధారణ భాషలో చెబుతుండెను. దాని గురించి ఏ ప్రశ్నయు లేదు; కదిలినది భూమి కాదు, అది సూర్యుడు అని యెషయా నమ్మాడు.

మోసపూరితమైన మానవుల యొక్క సిద్ధాంతాలపై ఆధారపడుటకు ప్రవక్తల యొక్క సాక్ష్యమును తప్పుదోవ పట్టిస్తున్నవారిని యహువః నిషేధించెను.

కదులుతున్నది సూర్యుడు అని రాజైన దావీదు కూడా నమ్మాడు.

ఆకాశములు ఎలోహీం మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నది లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలు వెళ్లు చున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములోనుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరుగెత్త నుల్లసించునట్లు తన పథమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి ఆ దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు. (కీర్తనల గ్రంథము 19:1-6 చూడుము)

ప్రసంగి గ్రంథంలో సొలొమోను 25 కన్నా ఎక్కువ సార్లు, భూసంబంధ కార్యకలాపాలను సూచిస్తున్నప్పుడు “సూర్యుని క్రింద” అనే పదబంధాన్ని ఉపయోగించాడు. సూర్యుడు భూమిపై కదులుతున్నట్లు సొలొమోను స్పష్టంగా నమ్మాడు.

మోసపూరితమైన మానవుల యొక్క సిద్ధాంతాలపై ఆధారపడుటకు ప్రవక్తల యొక్క సాక్ష్యమును తప్పుదోవ పట్టిస్తున్నవారిని యహువః నిషేధించెను.

బల్లపరుపు భూమికి మద్దతు ఇచ్చే అనుభావిక ఆధారం:

క్రింద, బల్లపరుపు భూమికి మద్దతు ఇచ్చే కొన్ని అనుభావిక సాక్ష్యాలపై మనం క్లుప్తంగా చర్చిద్దాం. ఇది ఒక సంపూర్ణ జాబితాగా కోసం ఉద్దేశించబడలేదు. సత్యాన్ని నిజాయితీగా వెతుకుతూ ఉన్నవారికి అంతర్జాలటలో ఇప్పటికే అనేక విషయాలు అందుబాటులో ఉన్నందున, ఈ అంశాలపై గొప్ప వివరాలలోనికి వెళ్ళుట మా లక్ష్యం కాదు.

బల్లపరుపు భూమి: ఒక అస్థిర ప్రపంచంలోని బైబిలు సత్యం image

NASA Logo

NASA లోగోలో ఫోర్కులాంటి పాము యొక్క నాలుకను గమనించండి

  • వక్రత యొక్క స్పష్టత లేకపోవడం: నాసా వాదనల ప్రకారం భూమి ఒక బంతి వలె 25,000 మైళ్ల చుట్టుకొలతతో ఉంటే, అప్పుడు నిలిచియున్న నీరు మైలుకు 8 అంగుళాలు క్రిందికి వంగి ఉండి దూరం యొక్క వర్గం ద్వారా గుణించబడాలి. ఇది సుదూరంగా ఉన్న వస్తువుల ఎత్తులో గమనించదగ్గ తగ్గుదల ఎంత ఉండును అనేదాన్ని లెక్కిస్తోంది. దీనిని పరీక్షించడానికి లెక్కలేనన్ని ప్రయోగాలు నిర్వహించబడ్డాయి, అయితే వక్రతను నిరూపించుటలో అన్నీ విఫలమయ్యాయి. నీరు ఎప్పుడూ సమాంతర స్థాయిలో ఉంటుంది. దీనికి వక్రత లేదు. (కొన్ని ఉదాహరణలు)

  • సర్వేయరులు, ఇంజనీర్లు, వాస్తుశిల్పులు, నావికా అధికారులు మొదలైనవారు, వారి ప్రణాళికలను చేసేటప్పుడు భూమి యొక్క వక్రతను పరిగణనలోకి తీసుకోరు (కొన్ని వంతెనలు మనస్సులో వక్రతతో నిర్మించబడతాయని కొందరు వాదిస్తున్నారు, అయితే వంతెన క్రింద ఉన్న నీరు వంతెన యొక్క వక్రతను అనుసరించకపోవుటలో, ఈ ఆలోచన యొక్క అసత్యము స్పష్టంగా కనిపిస్తుంది. నీరు ఎల్లప్పుడూ తన సొంత స్థాయిని కనుగొంటుంది; దానికి వక్రత లేదు.)

  • విమాన పైలట్లు వాటిని ఒకే ఎత్తులో ఉంచడానికి మరియు వాటిని అంతరిక్షంలోనికి ఎగిరి పోకుండా నిరోధించుటకు, తమ విమానాల ముక్కును నిరంతరంగా క్రిందివైపు దించుతూ ఉండరు (వారు ఒక గోళం చుట్టూ గంటకు వందల మైళ్ళ వేగంతో ఎగురుతూ ఉంటే ఇది ఖచ్చితంగా అవసరం)

  • నదులు తక్కువ ప్రతిఘటనను (పల్లపు మార్గమును) అనుసరిస్తాయి, కానీ ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో నదులు ఎత్తుకు (వక్రత యొక్క చాలా మైళ్ళ ఎత్తు వరకు) ప్రవహిస్తాయి, (ఉదాహరణ: గల్ఫ్ ఆఫ్ మెక్సికోను చేరుకొనుటకు ముందు మిస్సిస్సిప్పి 11 మైళ్ళ దూరం పైకి ప్రవహించాలి.)

  • ఒకప్పట్లో భూమి (లేదా నీటి) యొక్క వక్రత కారణంగా సముద్రంలోని నౌకలు వీక్షకుడి నుండి దూరంగా ప్రయాణించినప్పుడు క్రమేణా కనిపించకుండా పోయేవని భావించినప్పటికీ, ఇది కేవలం “దృక్కోణ చట్టం” కారణంగా జరుగునని ఇప్పుడు మనకు తెలుసు. నగ్న కంటికి కనుమరుగైపోయిన మొత్తం నౌకలను సులభంగా టెలిస్కోప్ లేదా అలాంటి పరికరం యొక్క సహాయంతో తిరిగి చూడవచ్చు.

  • గురుత్వాకర్షణ శక్తి ఎప్పుడూ నిరూపించబడలేదు; గోళాకార నమూనాకు కట్టుబడియుండుటకు దీనిని విశ్వాసం ద్వారా అంగీకరించాలి. గురుత్వాకర్షణ అనేది మనము పిల్లలుగా ఉన్నప్పటి నుండి సత్యముగా తీసుకున్న విషయం (ఎందుకంటే మనం మన “విద్యా వ్యవస్థ” ల ద్వారా సిద్ధాంతబోధన/ జ్ఞాన ఒత్తిడి చేయబడ్డాము), వాస్తవానికి, ఈ సిద్ధాంతంలో ఎటువంటి అర్ధమూ లేదు. భూమికి మొత్తం మహాసముద్రాలను క్రిందికి ఆకర్షించుకొనుటకు సరిపడు అపారమైన శక్తిగల “గురుత్వాకర్షణ” అని పిలువబడే ఒక మాయా శక్తి ఉన్నప్పుడు, ఇంకా దానికి ఒక అతిచిన్న మేఘం లేదా అతిసూక్ష్మమైన రెక్కలు కలిగిన కీటకాలను ఆకర్షించగల శక్తి లేదని నిజంగా మనం విశ్వసించాలా? మనము “గురుత్వాకర్షణ” అని పిలిచే ఈ ఊహాత్మక శక్తి వర్షమును తలక్రిందులుగా పడేలా చేయగలుగునని లేక పంటలు ప్రక్కలకు పెరగునట్లు చేయునని నిజంగా మనం నమ్మవలెనా? … (యాదృచ్ఛికంగా, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రోత్సహించే వారు భూమి గంటకు 1,000 మైళ్ళ వేగంతో తిరుగుతుందని, మరియు సూర్యుని చుట్టూ గంటకు 67,000 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తూ, గంటకు 420,000 మైళ్ళ వేగంతో విశ్వం ద్వారా పరుగెడుతుందని కూడా చెబుతారు. అయితే, మీరు కంప్యూటరు వద్ద కూర్చొని ఈ వ్యాసాన్ని చదువుతున్నప్పుడు మీరు స్వల్పమైన కదలిక సూచనను కూడా గుర్తించలేరు. ఇది అర్థరహితంగా ఉంది.) “ఆధునిక మిధ్యా-విజ్ఞాన శాస్త్రం ముఖ్యంగా “మీ బైబిలును, మీ అనుభవాలను, మీ వివరణను మరియు పునరావృతం చేయగల, పరిశీలించదగిన మరియు పరిశీలించదగిన సమస్త సమాచారాన్ని విస్మరించండి … మరియు మీ పాఠ్య పుస్తకం చెప్పుదానిని గ్రుడ్డిగా విశ్వసించండి అని చెబుతుంది.” ప్రాపంచిక అధికారంలో ఉన్నవారికి బాగా తెలుసు, ఏమిటంటే “మీరు ఒక తగినంత పెద్ద అబద్ధాన్ని చెప్పి, మరియు దానిని తగినంత తరచుగా చెప్పినట్లయితే, అది నమ్మబడుతుంది.” (అడాల్ఫ్ హిట్లర్) ఏ తప్పు చేయవద్దు; శత్రువుకి ఒక విధి-విధానం ఉంది. (ఒక చిన్న వీడియో: గురుత్వాకర్షణ లేక సాంద్రత?)

  • హోరిజోన్ (భూమి లేదా నీటి నుండి ఆకాశాన్ని వేరుచేసే దృశ్య సరిహద్దు) ఎల్లప్పుడూ పరిశీలకుడి యొక్క కంటికి పెరుగుతున్నట్లు కనబడుతుంది (ఒక విమానంలో భూమిపై 30,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్నప్పుడు కూడా). ఎప్పుడూ వక్రతతో ఉండు గోళం యొక్క హోరిజోన్ను గుర్తించునట్లు పరిశీలకునికి ఒక స్థానం ఎప్పటికీ కనిపించదు. హోరిజోన్ ఎల్లప్పుడూ సంపూర్ణంగా సమాంతరంగా కనిపిస్తుంది.

  • భూమి ఒక గోళం అని అనుకొంటూ, “దక్షిణ అర్ధగోళానికి” ప్రయాణం చేయుటకు ప్రయత్నించినప్పుడు లిఖితమైన ఓడ నాయకుల కష్టాలు (భూమి ఒక గోళం అయితే, మీరు భూమధ్యరేఖ నుండి “దక్షిణ ధ్రువం” వైపు వెళ్ళినప్పుడు రేఖాంశాల గీతలు బిగువుగా అవుతాయి. అయితే బల్లపరుపు భూమిపై, రేఖాంశాల గీతలు నిరంతరంగా ఉత్తర ధృవం బయటి నుండి విస్తరిస్తూ ఉంటాయి, అనగా మీరు దక్షిణం వైపున వెళ్ళేటప్పుడు అవి వెడల్పుగానే ఉంటూ ఉంటాయి.)

  • 1700 మరియు 1800 లలో అన్వేషకులు చేసిన నివేదికలలో, అంటార్కిటికాను చుట్టివచ్చుటకు ప్రయత్నించినప్పుడు వారు 50,000 మైళ్ళకు పైగా ప్రయాణించినట్లు అంచనా వేశారు, ఇది నిజానికి బల్లపరుపు భూమిపై బాహ్య మంచు వలయం. (ఉదా. జేమ్స్ కుక్, జేమ్స్ క్లార్క్ రాస్, ది బ్రిటిష్ “ఛాలెంజర్” ఎక్స్పెడిషన్) NASA ప్రకారం, భూగోళం చుట్టుకొలత 25,000 మైళ్ళు మాత్రమేనని గుర్తుంచుకోండి.

  • వాణిజ్య విమానముల యొక్క నిరర్థకమైన విమాన నమూనాలు (ఒక చిన్న వీడియో: డౌన్ సౌత్)

  • సుదూర వస్తువులను, దృష్టికోణం హోరిజోన్ కి అవతలి ప్రక్క వాటిని నగ్న కంటికి కనబడేలా చేసినప్పటికీ, అవి పరిశీలకుడి నుండి దూరంగా వాలుగా కనిపించడం లేదు. ( ఒక గుండ్రని భుమి మీద, చెప్పబడిన వక్రత స్థానానికి అవతల ఉంటే ఇది ఖచ్చితంగా సంభవించాలి) “గురుత్వాకర్షణ” శక్తిగల ఒక గుండ్రని భూమిపై, వేడి గాలి బెలూన్లు (బుడగలు) వీక్షకుడి నుండి సుదూర ఆకాశంలోకి వెళ్లినప్పుడు వెనుకకు అంటుకున్నట్టు కనబడాలి, బుట్ట దిగువ భాగం మరింతగా కనిపించేలా చేయాలి.

  • ధృవ నక్షత్రం (ఉత్తరపు నక్షత్రం) చాలా దక్షిణాన 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాన కనిపించినట్లు నివేదికలు ఉన్నవి, అయితే ఆరోపిత దక్షిణ ధ్రువ నక్షత్రం (సిగ్మా అక్టాంటిస్) భూమధ్యరేఖ వద్ద ఉన్న ప్రతి ధృవరేఖ నుండి నిలకడగా కనిపించదు (మరియు ఇతర వీక్షించదగిన నక్షత్రరాశి నియమవిరుద్ధాలు)

  • వాతావరణ నమూనాలు మరియు మహాసముద్ర ప్రవాహాలు బల్లపరుపు భూమిపై ఎక్కువ ఆధారాలను ఇస్తాయి: అజిముతల్ ఈక్విడిస్టెంట్ మ్యాప్ (మరిన్ని వీక్షణ ఎంపికల కోసం ఈ లింక్ వద్ద చూపించిన మ్యాప్ యొక్క దిగువ ఎడమ మూలలో “భూమి” పై క్లిక్ చేయండి.) యాదృచ్ఛికంగా, ఐక్యరాజ్యసమితి వారి లోగోలో ఉపయోగించిన మ్యాప్ ఇదే.

NASA (ఒక సైనిక రహస్య సమాజం) ఎప్పుడూ భూమి యొక్క నిజమైన ఫోటోను ఉత్పత్తి చేయలేదు మరియు నిరంతరంగా మోసగించడానికి కృషి చేస్తున్నది …

Robert Simmon in front of the Blue Marble

“బ్లూ మార్బుల్” ముందు రాబర్ట్ సిమోన్
Credit: NASA/W. Hrybyk

తమ చిత్రాలు కంప్యూటర్ ద్వారా సృష్టించబడతాయని NASA స్వయంగా అంగీకరించింది; అవి ఛాయాచిత్రాలు కాదు. డేటా విజువలైజర్ మరియు డిజైనర్ అయిన రాబర్ట్ సిమ్మాన్, “గొడ్దార్డ్ లో మీ ఉద్యోగంలో భాగంగా చేసిన ఉత్తమమైన పని ఏమిటి?” అని ప్రశ్నించబడినప్పు, అతడు ఇలా సమాధానమిచ్చాడు:

తక్కువ భూ కక్ష్య నుండి మొత్తం అర్ధ గోళాన్ని చూపే ఒక ఫోటో తీయుట చివరిసారిగా 1972 లో అపోలో 17 కాలంలో జరిగెను. భూ పరిశీలన వ్యవస్థ (EOS) ఉపగ్రహాలు భూమి యొక్క ఆరోగ్యమును పరిశీలన చేయుటకు రూపొందించబడెను. అప్పటికి, మొత్తం భూమి యొక్క ఫోటోను తయారు చేయడానికి మేము తగినంత డేటాని కలిగి ఉన్నాము. కాబట్టి మేము చేసాము. నాలుగు నెలల ఉపగ్రహ సమాచారంతో భూ ఉపరితలం యొక్క చదునైన పటమును సృష్టించుట కష్టతరమైన భాగమైయున్నది. రెటో స్టాక్లీ (ప్రస్తుతం స్విస్ ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ మెట్రోలజి అండ్ క్లైమేటాలజీలో ఉన్నాడు) దీనిలో చాలా భాగం పని చేసాడు. అప్పుడు మేము బంతి చుట్టూ చదునైన పటమును (మ్యాప్ ను) చుట్టివేసాము. పనిలో నా భాగం అంతరిక్షం నుండి భూమి ఎలా కనిపిస్తుందోననే ప్రజల అంచనాలకు సరిపోలునట్లు ఉపరితలం, మేఘాలు మరియు మహాసముద్రాలను సమగ్రపరచడం. ఆ బంతి ప్రసిద్ధ “బ్లూ మార్బుల్” అయ్యింది. నేను దానితో సంతోషంగా ఉన్నాను, అయితే అది ఎంత విస్తృతంగా ప్రచారమవునో నాకు తెలియదు. ఇది ఒక చిహ్నం (ఐకాన్) అవుతుంది అని ఎన్నడూ అనుకోలేదు. నేను “మిస్టర్ బ్లూ మార్బుల్” గా మారుదునని నేను అనుకోలేదు. “అప్పటి నుండి మేము స్పష్టత పెంచుట ద్వారా బేస్ మ్యప్ లను నవీకరణ చేసాము మరియు, 2004 కొరకు, మేము నెలవారీ పటముల శ్రేణిని తయారు చేసాము.” (http://www.nasa.gov/centers/Elohimdard/about/people/RSimmon.html)

భూమి యొక్క “బ్లూ మార్బుల్” (నీలి రాయి) చిత్రం ఎలా సృష్టించబడింది? NASA ప్రకారం, ఆరోపిత ఉపగ్రహ డేటా నుండి ఒక మ్యాప్ తయారుచేయబడి తరువాత దానిని బంతికి చుట్టడం జరిగింది. ఆ తరువాత అంతరిక్షం నుండి భూమి ఎలా కనిపిస్తుందోననే ప్రజల అంచనాలకు సరిపోలునట్లు ఆ రూపము మార్పులు చేయబడెను.

తమ ఆలోచనలు యహువఃకు కనబడకుండ లోలోపల వాటిని మరుగుచేయ జూచువారికి శ్రమ. మమ్ము నెవరు చూచెదరు? మా పని యెవరికి తెలి యును? అనుకొని చీకటిలో తమ క్రియలు జరి గించువారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు? కుమ్మరికిని మంటికిని భేదములేదని యెంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసినవారిగూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించినవానిగూర్చి ఇతనికి బుద్ధిలేదనవచ్చునా? (యెషయా గ్రంథము 29:15,16)

మీరు ఎవరిని విశ్వసిస్తారు? యహువః యొక్క ప్రవక్తలనా లేక NASA యొక్క సైనిక రహస్య సమాజమునా?

యహువః ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యహువః మీదనుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహావృక్షము వలె ఉండును; మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును.

యహువఃను నమ్ముకొను వాడు ధన్యుడు, యహువః వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలములయొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింత నొందదు కాపు మానదు. (యిర్మీయా 17: 5-8 చూడండి.)

బల్లపరుపు భూమి: ఒక అస్థిర ప్రపంచంలోని బైబిలు సత్యం image


1 ఇది చాలామంది బైబిలు వ్యాఖ్యాతల యొక్క వ్యాఖ్యానమే అయినప్పటికీ, యెషయా ద్వారా పేర్కొన్న “భూమి యొక్క వృత్తము” (యెషయా 40:22) వాస్తవానికి భూమి యొక్క వృత్తాకార ఆకృతిని సూచించే వాక్యము అని న్యాయంగా తర్కించవలసి యున్నది. ఇది ఖచ్చితంగా ఆమోదయోగ్యమైనది. అయినప్పటికీ, భూమి ఒక గోళం అని ప్రవక్త స్పష్టంగా చెప్పలేదు.

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.