World's Last Chance

At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

While WLC continues to uphold the observance of the Seventh-Day Sabbath, which is at the heart of Yahuwah's moral law, the 10 Commandments, we no longer believe that the annual feast days are binding upon believers today. Still, though, we humbly encourage all to set time aside to commemorate the yearly feasts with solemnity and joy, and to learn from Yahuwah's instructions concerning their observance under the Old Covenant. Doing so will surely be a blessing to you and your home, as you study the wonderful types and shadows that point to the exaltation of Messiah Yahushua as the King of Kings, the Lord of Lords, the conquering lion of the tribe of Judah, and the Lamb of Yahuwah that takes away the sins of the world.
WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

పాపపు వ్యసనం: ఆత్మ యొక్క మార్గములను కాపాడుకొనుట

ఇప్పుడు, మునుపు ఎన్నడూ లేనంతగా, దేని ద్వారా అయితే సాతాను ప్రలోభపెట్టుటకు మరియు చిక్కించుకొనుటకు చూచునో ఆ “ఆత్మ యొక్క ప్రతి మార్గమును” రక్షించుకొనుట అత్యవసరమై ఉంది.

పాపము వ్యసనమై ఉంది. అది ఏ పాపము అనేది విషయం కాదు: కోపము, హానికరమైన పుకార్లు, మత్తు పదార్ధములు, చెడు అనుమానములు, అహంకారం, నికోటిన్ / మద్యం, అశ్లీల చిత్రాలు, హస్త ప్రయోగం, లేదా ఇంకా ఏదైనా. ఇవన్నియు వ్యసనములై వుండెను.

పాప వ్యసనం

మనలో ఎవరికైనా సమాధానం కేవలం యహూషువః లోనే దొరుకుతుంది. ప్రతివాడును తన సొంత ఆత్మ విషయంలో యహువఃకు జవాబు చెప్పుకోవలసి ఉంది. లేఖనాలు వివరించిన విధంగా, “నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టిదేశములో నుండినను వారు తమ నీతిచేత తమ్మును మాత్రమే రక్షించు కొందురు, ఇదే అదోనాయ్ యహువః వాక్కు. (యెహెజ్కేలు 14:14. చూడండి). పరిశీలన/కృపా కాలం త్వరలోనే మూయబడుచున్నందున, మనలో ప్రతి ఒక్కరును మన హృదయాలలో దాచబడియున్న ప్రతి ఒక్క పాపమును వెదకి మరియు వాటన్నిటినీ యహూషువః కు అప్పగించాలి.

మంచంపై పడుకుని సెల్ ఫోన్ లోకి తేరి చూస్తున్న వ్యక్తి

లైంగిక కోరిక, తిండి కొరకు, డ్రగ్స్/ మత్తు పదార్ధముల కొరకు మరియు మాలిన్యమైన దేనికొరకైనా గల కోరిక ఇదంతయు మానవుల ద్వారా దెయ్యాలు వ్యక్తం చేయుచున్న ఆకలై వుంది. సాతాను మానవుని ఆత్మను ప్రలోభపెట్టగలిగే ఏకైక మార్గం పంచేంద్రియాలు మాత్రమే. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక ఆరోగ్యకరమైన ఆహారం, మితమైన జీవన శైలి, తగినంత నిద్ర, ఇవన్నీ కలిసి పంచేంద్రియాలను కాపాడి వాటిని బలోపేతం చేయును.

సాతాను పంచేంద్రియాల ద్వారా ప్రలోభపెట్టును, కాని అతడు ఆలోచనల ద్వారా చిక్కించుకొనును. ఎవరైతే శుద్ధి పొందుటకు మరియు రక్షకుని ఆయన రెండవ రాకడలో కలుసుకొనుటకు సిద్ధపడుదురో వారు ఆలోచనలను కాపలా కాచుకొనుటలో శ్రద్దగా ఉండాలి, ఎందుకంటే ఆలోచనలు గుమిగూడి భావాలుగా మారును. అలా, ఆలోచనలు మరియు భావాలు కలిసి అది వ్యక్తిత్వంగా మారును.

మరణించి ఆపై సమాధి ద్వారా స్వర్గానికి వెళ్ళుట కంటే, రెండవ రాకడ సమయంలో రూపాంతరం చెంది మరణం చూడకుండా పరలోకానికి వెళ్ళుట ప్రత్యేకమైనదిగా ఉంటుంది. మరణంను చూడకుండా స్వర్గానికి వెళ్లే వారందరూ, వారి జీవితంలో వారంతట వారు జయించలేనటువంటి ఒక స్థానమునకు చేరుదురు. అయితే ఒక వ్యక్తి తన జీవితంలోనికి 95% చెడు ధోరణులను వారసత్వంగా పొందియున్నాడా లేక కేవలం 5% చెడు వారసత్వ ధోరణులను పొందియున్నాడా అనేది ముఖ్యం కాదు. యహూషువః మాత్రమే రక్షించగలడు. 95% చెడు ధోరణులను వారసత్వంగా కలిగియున్న ఒక వ్యక్తి తాను రక్షకునికి పూర్తిగా లొంగిపోతే/ విధేయుడైతే అతడు రక్షించబడవచ్చు. మరియు యహువఃకు భయపడు తల్లిదండ్రులను కలిగి, ఒక ఉత్తమ వాతావరణంలో పెరిగి, కేవలం 5% చెడు ధోరణులను వారసత్వంగా పొందియున్న ఒక వ్యక్తి తాను తన సొంత బలం ద్వారా అధిగమించగలనని భావించి, యహూషువఃకు తనను అప్పగించుకొనుటను తిరస్కరించిన యెడల తాను రక్షణను కోల్పోవును.

“యహువః”కు నన్ను నేను ఏవిధంగా లోబరుచుకొందును? అని అనేకకులు పరిశీలన చేసుకొనుచున్నారు.1 నిన్ను నీవు ఆయనకు సమర్పించుకొనుటకు నీవు ఆశపడుతున్నావు, కానీ అనుమాన అనే బానిసత్వం వలన నీవు నైతిక శక్తిలో బలహీనంగా ఉన్నావు, మరియు నీవు/ మీరు మీ జీవితం యొక్కయు పాపం యొక్కయు అలవాట్ల నియంత్రణలో ఉన్నారు. మీ వాగ్దానాలు మరియు తీర్మానాలు ఇసుక త్రాళ్ళ (స్థిరత్వం లేని) వలె ఉన్నాయి. మీరు మీ ఆలోచనలను, మీ ప్రేరణలను, మీ ఇష్టాలను నియంత్రించలేరు. మీయొక్క విరిగిపోయిన ప్రమాణాలు మరియు పోగొట్టుకొనిన ప్రతిజ్ఞలు మీ సొంత ఆత్మవిశ్వాసంపై మీకు గల నమ్మకంను బలహీన పరుస్తుండెను, మరియు యహువః మిమ్మల్ని అంగీకరించడు అనే అనుభూతిని మీలో కలిగిస్తుండెను; కానీ మీరు నిరాశ చెందవలసిన అవసరం లేదు. మీరు అర్థం చేసుకోవలసినది సంకల్పం యొక్క నిజమైన శక్తిని. ఇది మనిషి స్వభావంలోని పాలక శక్తి, నిర్ణయం తీసుకునే శక్తి, లేదా ఎంపిక చేసుకునే శక్తి. ప్రతీది సంకల్పం యొక్క సరియైన చర్య మీద ఆధారపడి ఉంటుంది. ఎంపిక చేసుకునే శక్తిని మానవునికి యహువః ఇచ్చెను; దీనిని వ్యాయామం చేయుట వారి పనియై ఉంది. మీ హృదయమును మీరు మార్చలేరు; మీరు మీకు మీరుగా ప్రేమానురాగాలను యహువః కు ఇవ్వలేరు, కానీ మీరు ఆయనను సేవించుటను ఎంచుకోగలరు. మీరు మీ ఇష్టాన్ని ఆయనకు ఇవ్వగలరు; తరువాత ఆయన తన మంచి ఆనందం ప్రకారం చేయుటకు మీలో పని చేయును. అలా మీ మొత్తం స్వభావం యహువః ఆత్మ యొక్క నియంత్రణలోనికి తీసుకుని రాబడుతుంది; మీ అనురాగములు ఆయనపైన కేంద్రీకృతమై ఉండును, మీ ఆలోచనలు ఆయనతో సామరస్యంగా ఉండును.2

చివరి తరంలో ఉన్న మానవునికి ప్రత్యేకించి కష్టంమైన ఒక ప్రదేశం “లైంగిక కల్మషమై” ఉంది. అనేక నిజాయితీ గల క్రైస్తవ జనులు అశ్లీల చిత్రాలు మరియు హస్త ప్రయోగపు వ్యసనాలతో పోరాడుచున్నారు. ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవలసినది ఏమిటంటే ఈ పాపాలు కళ్ళతో మొదలవుతాయి. ఒక పురుషుడు తన కళ్ళను ఒక మహిళ యొక్క శరీరం మీద నిలిపుటకు అనుమతించినప్పుడు, మనస్సు మరియు ఊహ కలిసి పనిచేస్తాయి. క్రైస్తవ మహిళలు కురచగా వస్త్రధారణ చేయుదురు, కానీ తన కనుదృష్టి కేంద్రీకరించుటలోనైనను, లేక తన కళ్ళను తిప్పుకొనుటలోనైనను, దాని భాధ్యత చివరిగా పురుషునిపైనే ఉంది. ఎక్కడైతే కళ్ళు కేంద్రీకృతం చేయుటకు అనుమతించబడునో, అక్కడ ఆలోచనలు నివసించుకు మొగ్గు చూపును.

“మనము మన యొక్క అవలక్షణాలను మరియు పాపములను అంగీకరిస్తూ యహువః నొద్దకు వచ్చినప్పుడు, ఆయన మన వేడుకోలును లక్ష్యపెట్టునని ఆయనే ప్రమాణం చేసారు. ఆయన సింహాసనం యొక్క గౌరవము మనలో ఆయన మాట యొక్క నెరవేర్పును దృఢపరచియున్నది.

“… విశ్వాసం కలిగియుండుటకు మనలను ప్రోత్సహించిన సమస్త మాటలను మన గొప్ప ప్రధాన యాజకుడు గుర్తుచేయుచుండెను. ఆయన తన నిబంధనను ఎప్పుడూ జ్ఞాపకముంచుకొనును.

“ఆయనను వెదుకువారందరూ ఆయనను కనుగొందురు. ఆయనకొరకు తట్టువారందరికీ తలుపు తీయబడును. నన్ను బాధపరచ వద్దు, తలుపు మూయబడినది, నేను దానిని తెరవాలనుకొనుట లేదు నన్ను క్షమించుము అనే మాటలు ఎవరికీ చెప్పబడవు. నేను నీకు సహాయం చేయలేను అని ఏ ఒక్కరికీ చెప్పబడదు. ఆకలి గల ఆత్మలకు ఆహారం కొరకు అర్ధరాత్రి వేళ రొట్టెలకై వేడుకొను వారు విజయము పొందెదరు.”

(క్రైస్ట్ ఆబ్జెక్ట్ లెస్సన్స్, p. 148)

జయించుటలోని దశలు

మిమ్మును పాలించుచున్న పాపం ఏదైనప్పటికీ, దానిని అధిగమించుటకు తీసుకొనగల నాలుగు ప్రత్యేక దశలు ఉన్నాయి:

  1. యహువః నామముపై పిలవండి. మీ పరిస్థితికి వర్తించే వాగ్దానాలను తీసుకొని మరియు పూర్తిగా ఒక సమాధానము వచ్చినట్లు భావిస్తూ ప్రార్థన చేయండి.
  2. సంకల్పముతో మరియు గొప్ప నిశ్చయముతో, మీ ఉద్దేశంను తెలియజేయండి. నిర్దిష్టంగా ఉంటూ పదాలలోనికి మార్చండి.
  3. మీరు శోధనకు దగ్గరగా వెళ్ళుటకు ప్రారంభించినప్పుడు రాబోయే ప్రమాదం గురించి మీకు తెలుయ చేయమని యహువఃను అడగండి. ఆశించిన పాపం యొద్దకు మీ భావోద్వేగాలు మిమ్మల్ని ఆకర్షించునపుడు మీకు గుర్తుజేయుట కోసం మరియు సహాయం కోసం ఆయనను అడగండి.
  4. స్నేహితుల సహాయంను మరియు వారికి లెక్క అప్పజెప్పుటను కలిగియుండుము.

విశ్వసనీయమైన బృందమును లేదా కనీసం మరొక వ్యక్తిని కలిగియుండుట, మరియు వారితో మీరు పరస్పరం లెక్క అప్పగించుకొనుచు ఉండుట అనేది పాపపు వ్యసనాలను అధిగమించుటకు ఒక అద్భుతమైన సహాయంగా ఉంటుంది. WLC ద్వారా సత్యాన్ని వ్యాప్తి చేయుటకు పనిచేసే పురుషులు మరియు మహిళలు అందరమును యహువః కు హృదయంను మరియు ఆత్మను అంకితం చేసియున్నాము. అయితే మేము కూడా మానవులై ఉన్నాము. మేముకూడా, ఇప్పటికీ తప్పులు చేయుచున్నాము. మాకు కూడా, దీనిని జయించుటకు ఇప్పటికీ రక్షకుడు అవసరమై ఉండెను.

 

బృందముగా లెక్క అప్పజెప్పుకొనుట:

వ్యక్తుల బృందం చివరి తరపు మనుష్యులు చిక్కుకొనే సాతాను యొక్క అతిపెద్ద వలలలో ఒకటి లైంగిక కల్మషము అని WLC దగ్గర సహోదరులు అర్థం చేసుకొనిరి. లైంగిక అనైతికను మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాము మరియు మేము శోధన విషయంలో నిరోధకత్వం కలిగిలేము. WLC బృంద నాయకుడు ఇటీవల WLC వద్ద గల సహోదరుల మనస్సు మరియు శరీరం యొక్క స్వచ్ఛతను కాపాడుకొను విషయంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఇతర వ్యక్తితో పరస్పరం లెక్క అప్పజెప్పుకొనువారిగా కలిసి ఉండుటకు ఆహ్వానించారు.

మేము క్రింది లేఖను మా పరిచర్యను బహిర్గతం చేసుకొనుటకు పంచుకొనుట లేదు. అయితే, ఇతరులు కూడా, దీనమనస్సుతో వారి సొంత సహాయకరమైన బృందాలను వెదకుటను ప్రోత్సహించుటకు ఒక సాధనంగా దీనిని పంచుకుంటున్నాము.

 

 

యహూషువః నందు ప్రియమైన సహోదరులారా,

ఇటీవల యహువః దానియేలు 11 వ అధ్యాయంలోని సత్యాలను మా దృష్టికి తీసుకొచ్చెను, దాని ద్వారా కృపాకాలం ముగియుట ఎంత సమీపంలో ఉందో అనే విషయంపై మాకు అవగాహన కలిగించెను. ప్రియమైన ప్రేమికులారా, మనము మన రక్షకుడు ఇలా చెప్పబోయే సమయంకు చాలా దగ్గరగా ఉన్నాము: “అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము,(లేక, చేయును) అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము,(లేక, యుండును) నీతి మంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము.(లేక, యుండును) పరిశుద్ధుడు ఇంకను పరిశుద్దుడుగానే యుండనిమ్ము.(లేక, యుండును)”(ప్రకటన 22:11). పరిశుద్ధాత్మ ముగింపు ఎంత సమీపముగా ఉందో మనస్సుకు తెలియజేయుట వలన, లైంగిక కల్మషము నేటి పురుషులకు ఒక అడ్డురాయిగా ఉన్న సమస్యను గూర్చి నా హృదయం ఎక్కువ భారం కలిగియుంది.

మనము చివరి తరపు వారమై ఉన్నాము. సాతాను మనపై బలముగా దాడిచేయుటకు మరింత తపిస్తూ, మునుపటి ఏ తరంలోను లేనంతగా కొట్టుచున్నాడు. లేఖనము చెప్పుచున్నది: “మనిషి తన హృదయంలో దేనిని ఆలోచించునో, ఆయాలోచనే అతడై ఉండెను.” (7 సామెతలు 23 kjv). మనము ఒక మహిళ వైపు మోహపు చూపుతో చూస్తే, మన హృదయంలో అప్పటికే ఆమెతో వ్యభిచరించినట్లని యహూషువః మనలను హెచ్చరించారు.

సాతానుకు ఇది తెలుసు మరియు చివరి తరపు వారిపై తన దాడులు కనికరంలేనివిగా ఉన్నవి. తన దాడులకు ఎవరూ నిరోధించగల శక్తిని కలిగి లేరు. మునుపెన్నడూ లేని విధంగా, WLC బృందపు సహోదరుల హృదయాల్లో మరియు మనస్సులలో మరియు శరీరాలలో మరింత స్వచ్ఛత అవసరమై ఉంది. ఆకాను పాపము చేసినప్పుడు, అతడు తాను దొంగిలించిన వస్తువులను తన గుడారంలో దాచిపెట్టాడు. అయితే, తన పాపం ఫలితంగా ఇజ్రాయేలు యొక్క మొత్తం శిబిరం బాధింపబడినది. హాయి తో మొదటి యుద్ధంలో ముప్పై ఆరు మంది పురుషులు మరణించారు. ముప్పై ఆరుగురు స్త్రీలు భర్తలు లేకుండా మిగిలిరి. ముప్పై ఆరు గృహాల పిల్లలు పోషణ అందించుటకు ఒక తండ్రి లేకుండా విడువబడిరి. ఇదంతయూ ఒక మనిషి యొక్క రహస్య పాపం వలన.

ఆగుము సిగ్నల్ ప్రియమైన సహోదరులారా, యహువః అందించిన సత్యంను ప్రపంచానికి తెలియజేయుటకు మా ప్రయత్నాలను ఏకం చేసియున్నాము. WLC శిబిరంలో పాపం కారణంగా యహువః దీవెనలు మా మీద ఉండకుండా ఉంటే అది ఒక చెప్పజాలని విషాదముగా ఉంటుంది. మేము ఈ పోరాటంలో మా శక్తిమేరకు ప్రతి ఆయుధంను ఉపయోగించాలి. మేము పారిపోయి దాక్కొనుటకు మా రక్షకుడు ఉన్నాడు. అవసరమైన ప్రతి సమయంలోను సహాయం చేసెదని ఆయన ప్రతిజ్ఞ చేసియుండెను. అయితే, మేము కూడా వ్యసనం విషయంలో పోరాడుచున్నాము. మనందరము పాపం విషయంలో బానిసలము. పాపము దానికదే ఒక వ్యసనమై ఉంది మరియు హస్త ప్రయోగం మరియు అశ్లీల చిత్రాలు అధిగమించుటకు కష్టతరమైన వ్యసనాలుగా ఉన్నాయి. వ్యక్తిగతంగా లెక్క అప్పజెప్పుకొనుటకు ఒక సహాయ బృందంను కలిగి ఉండుట అనేది వ్యసనమునకు బానిసలైనవారికి సహాయం చేసే ప్రక్రియగా నిరూపితమైంది.

నేను ప్రతిపాదించేది ఏమిటంటే, మా చిన్న సమూహం యొక్క భద్రత మరియు గోప్యత కొరకు, మేము, మాలో ప్రతి-ఇతరులకు జవాబు అప్పజెప్పుకొనుటను కలిగి ఉండాలి. ఇది మా సొంత ఆత్మల కోసం పోరాటమై ఉంది మరియు మేము మాకు అందుబాటులో ఉన్న ప్రతి సాధనంను ఉపయోగించుట అవసరమై ఉంది. మాకు యహువః యొక్క దీవెన కావాలి, మా సోదరులారా. మనము ఒకరి కొరకు ఒకరు ప్రార్థించవలసిన అవసరం ఉంది. నేను WLC దగ్గర ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి వారం క్రింది ప్రతిజ్ఞతో ఒకరికొకరు పరస్పరం లెక్క అప్పజెప్పుకొను అంశంలో కలిసి చేరడానికి విజ్ఞప్తి చేస్తున్నాను:

యహువః దయ ద్వారా, యహూషువః నందలి విశ్వాసము ద్వారా నేను ఈ వారంలో నా స్వచ్ఛతను కాపాడుకుంటిని.

మేము ఈ ప్రతిజ్ఞను ప్రతి సబ్బాతు తర్వాత, మొదటి రోజున అనగా చంద్రమాసం యొక్క 2వ, 9 వ, 16 వ, మరియు 23 వ రోజులలో పంపాలి. నేను సహోదరుడు Q ను మా జవాబుదారీ సమూహంనకు సమన్వయకర్తగా వ్యవహరించమని కోరితిని. ఖరారు చేయబడిన తేదీలలో, మేమందరము సహోదరుడు Qకు ఇ-మెయిల్ లో మా ప్రతిజ్ఞలను పంపెదము. సహోదరుడు Q రెండు రోజుల సమయంలో, తొట్రిల్లిన మరియు ప్రార్ధన సహాయం ఆవసమైన సహోదరుల యొక్క జాబితాను సిద్ధం చేస్తాడు. అవసరమైతే ఆయన కూడా ప్రార్థన జాబితాలో తన సొంత పేరును జోడించును. ఎందుకంటే, ఈ చివరి తరంలో ఉన్న మనకు ఇది ఒక కష్టతరమైన సమస్య కావున ఎవరైనా స్పందించకపోయి ఉంటే, అతడు తొలగిపోయినట్లు భావించి ప్రార్థన జాబితాలో అతని పేరును కూడా జోడించమని నేను బ్రదర్ Q కు సూచించితిని.

ఇది మాలో ఎవరికినీ ఇబ్బంది కలిగించేదిగా గాని లేదా WLC వద్ద ఏ సోదరుని యొక్క స్థానంను ప్రభావితం చేసేదిగా గాని ఉండదు. ఇది కేవలం స్వచ్ఛత కోసం పోరాటంలో ప్రోత్సాహం అందించుటయై ఉంది. ఈ సహాయ బృందం కృపా కాలం గతించు వరకు శాశ్వతంగా కొనసాగునని నేను తలంచుచున్నాను. సాతాను మన ఆత్మల కోసం గట్టిగా పోరాడుచుండెను మరియు మనము మన సోదరుల ఉన్నతికై ప్రార్థనలు చేయవలసి ఉన్నది.

ఇది హృదయం-చేయు పనియై ఉంది, ప్రియ సహోదరులారా. లైంగిక పవిత్రతను కాపాడుకొనుట అనేది హస్తప్రయోగం లేదా అశ్లీల చిత్రాలనుండి దూరమవుట కంటే ఇంకా ఎక్కువై ఉంది. కళ్ళు ఆత్మకు కిటికీలుగా ఉన్నవి మరియు అన్నివేళలా యందు వాటిని కాచుకొనుచూ ఉండాలి. ఇది మనకు ఒక కురచ వస్త్రములు ధరించిన మహిళ త్వరగా నడుచునప్పుడు మన కళ్ళను వారించుకొనమని తెలియజస్తుంది. ఇది మన మనస్సులను కాపలా కాచుకొనుట అని అర్థం. మనము ఒక మహిళ యెడల కంటి సైగ చేయరాదు. ఇది మన బాధ్యత, సోదరులారా, హస్తప్రయోగం లేదా అశ్లీలతను చూచుటకు తేలికగా అవకాశమున్న పరిస్థితులలో మన కళ్ళు లేదా మన మనస్సుల్లో దానిని లక్ష్యపెట్టుటకు ఏమాత్రం సమయంను అనుమతించకుండా, ఆత్మ యొక్క ఈ కిటికీని రక్షించుకొనవలసి ఉంది.

WLC యొక్క సహ-పనివారిగా, మేము మా సొంత అంతర్నిర్మిత సహాయ బృందంను కలిగియున్నాము. మేము ఒకరికొరకు ఒకరు ప్రార్థించుకొను మరియు ఒకరి కంటే మరొకరిని పైవానిగా చూసుకొను సహోదరుల బృందమై ఉన్నాము. మాలో ఎవరైనా పొరపాటు చేసి ఉంటే, తండ్రి యొద్ద మాకొక మధ్యవర్తి గలడని మేమెరుగుదుము. (1వ యోహాను 2 :1 చూడండి) మరియు ఇక్కడ మేము తీర్పునకు భయపడకుండా సహాయమును మరియు అవగాహనను పొందుదుమని ఎరుగుదుము.

మనకు ఎంతో సమయం లేదు ప్రియ సహోదరులారా, అంతం చాలా దగ్గరగా ఉంది.


పాపమును తీవ్రముగా పరిగణించండి

సహోదర సహోదరి లారా, అంతము మన మోక్షంతో జూదం ఆడటకు చాలా సమీపంలో ఉంది. మనము పాపంను చాలా తీవ్రంగా పరిగణించవలెను. మనకు మన ఆత్మల మార్గములను రక్షించుకునే అవసరత ఉంది.

జీవిత తుఫానులలో రక్షకుని ఆశ్రయించుము, అప్పుడు ఆయన మిమ్మును పైకెత్తును.

మీకు మీరు సరియైన వారిగా మారువరకు, యహువః యొద్దకు వచ్చు నిమిత్తం తగినంత మంచివారిగా మారువరకు, మెస్సీయ నుండి దూరంగా ఉండమనే శత్రువు యొక్క సలహాను వినవద్దు. మీరు అప్పటి వరకు వేచి ఉంటే, మీరు ఎప్పటికీ వెడలిపోలేరు. మీ మురికి వస్త్రాల నిమిత్తం సాతాను మిమ్మల్ని ఎత్తి చూపినప్పుడు, యహూషువః వాగ్దానంను తిరిగి చెప్పండి “నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను.” (యోహాను 6:38). యహూషువః రక్తం సమస్త పాపాల నుండి కడిగివేయునని శత్రువుతో చెప్పండి. దావీదు ప్రార్థనను మీ స్వంతంగా చేయండి “నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము.” కీర్తన 51:7.

లెమ్ము మరియు నీ తండ్రి యొద్దకు వెళ్ళుము. ఆయన నిన్ను ఒక గొప్ప మార్గంలో కలుసుకొనును. మీరు ఆయన వైపు మారుమనస్సుతో ఒక అడుగువేస్తే, ఆయన తన అనంత ప్రేమా హస్తముతో మిమ్మును మలచుటకు త్వరిత పడును. తన చెవి పశ్చాత్తాపము గల ఆత్మ యొక్క మొరకై తెరవబడి ఉంది. హృదయము లోనిది ఆయనకు చేరకముందే ఆయన దానిని ఎరుగును. ఒక ప్రార్థన చేయబడెను, అయితే అది బలహీనపరచబడెను, ఒక కన్నీరు కార్చబడెను, అయితే రహస్యంగా ఉండెను, యహువః కొరకు నిజాయితీ గల కోరిక మనస్సులో ప్రతిష్టించబడెను, అయితే అది దుర్భలముగా ఉండెను, అయిననూ యహువః ఆత్మ దానిని కలుసుకొనుటకు ముందుకు వెళుతుంది. ప్రార్థనను మన నోటితో పలకక ముందే లేక హృదయమందలి ఆశను తెలియజేయక ముందే, మెస్సీయ యొక్క కృప ముందుకు వెళ్ళి మానవ ఆత్మపై క్రియచేయుచున్న కృపను కలుసును.3

లైట్ హౌస్


1 శీర్షికల స్థానంలో పవిత్ర నామాలు ఉపయోగించ బడినవి.

2 ఎల్లెన్ జి వైట్, స్టెప్స్ టు క్రైస్ట్, పేజీ 47. పవిత్ర నామములు వాడబడ్డాయి.

3 ఎల్లెన్ జి వైట్, క్రీస్తు యొక్క ఆబ్జెక్ట్ లెస్సన్స్, p. 205. పవిత్ర నామములు వాడబడ్డాయి.

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.