చివరి తరానికి పరలోకం యొక్క సందేశం సమస్త వ్యవస్థీకృత మతాలు మరియు తెగల నుండి బయటకు వెళ్ళుట అయివుంది. అయితే మత నాయకులు సంఘానికి వస్తున్న ప్రజలను నిలబెట్టుకోవడంపై ఆసక్తి కలిగి ఉన్నారు. సంఘము భ్రష్టత్వంలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు కూడా సభ్యులు సంఘంలోనే కొనసాగవలసిన బాధ్యతను కలిగి ఉన్నారని ఆలోచింపజేయుటకు వారు యెహెజ్కేలు ఎనిమిది మరియు తొమ్మిదవ అధ్యాయాలను ఉపయోగించెదరు! |
నాస్నేహితురాలిని అదిరిపడి(షాకులో) చూశాను. సింథియ “వరల్డ్ వైడ్ చర్చాఫ్గాడ్” యొక్క జీవితకాల సభ్యురాలు. హెర్బర్ట్ డబ్ల్యు. ఆర్మ్స్ట్రాంగ్మరణానంతరం వేదాంతపరమైన మార్పులు వచ్చినప్పుడు సంస్థలో కలిగిన వినాశకరమైనవిచ్ఛిన్నం గురించి ఆమె నాకు చెప్పింది. పండుగలను మరియు ఏడవ రోజు సబ్బాతునువిడిచిపెట్టి సాధారణ క్రైస్తవుల వలె మారినప్పుడు దాని సభ్యులు 50% వరకు దానినివిడిచిరి.
“ఇదిపూర్తిగా నాశనకరమైనది,” సింథియా కన్నీళ్లతో గుర్తుచేసుకున్నది. “మనంశేషించబడి ఉన్నామని మరియు ఇతర సంఘములన్నియు పడిపోయినవి అని చెప్పితిమి. ఏడవ రోజుసబ్బాతునందు మనము ఆరాధించాము, ఆ సమయంలో మనము అది శనివారమేనని నమ్మితిమి. మనముయహువః యొక్క పండుగలను ఆచరించాము. మనము దేవుడు త్రిత్వము అనే మతబోధను నమ్మలేదు.మనకు సత్యం ఉంది! ఆ తరువాత చర్చి నాయకులు ఆ నమ్మకాలన్నిటినీ తీసివేయుట, పండుగలనుతిరస్కరించుట మరియు ఆదివారం ఆరాధన మొదలు పెట్టుట, నా మొత్తం జీవితంలో అత్యంతఅయోమయానికి గురైన అనుభవం. దానిని వివరించడానికి పదాలు లేవు.
“బైబిలుఆధారిత నమ్మకాలన్నిటినీ విడిచిపెట్టు ఒక చర్చి సభ్యులుగా ఉండేందుకు మేమునిరాకరించినప్పుడు మా యొక్క చాలామంది స్నేహితులను కోల్పోయాము. మనము మన చర్చిలోనేఉండి మరియు లోపలి నుండి మార్పులను చేయడానికి ప్రయత్నించాలని చెప్పబడితిమి. మేమువదిలిపెట్టినప్పుడు, మా మిత్రులు మమ్మును తిరస్కరించారు ఎందుకంటే తమను తాముఇప్పటికీ శేషించినవారనుకొనుట వలన. మరియువిడిచిపెట్టుట ద్వారా, మేము కోల్పోబడిన వారిమని వారికి నిరూపించబడింది.”
నేను1990 లలో “ప్రపంచవ్యాప్త చర్చ్ ఆఫ్ గాడ్” విచ్ఛిన్నం గురించిఎరిగియున్నాను. ఎవ్వరైనా ఆదివారంన పూజించేందుకు సబ్బాతును ఏ విధంగావిడిచిపెట్టుదురు, అది నన్ను నిజంగా ప్రభావితం చేయలేదు. అన్నిటి తరువాత, వారుఏమైనప్పటికీ పడిపోయిన సంఘము! నేను సెవెంత్-డే అడ్వెంటిస్టును మరియు నాకు తెలుసుమేము శేషించిన వారము. “ప్రపంచవ్యాప్త చర్చ్ ఆఫ్ గాడ్” కేవలం మరొకపడిపోయిన చర్చి. సింథియ చెప్పేది వినడానికి నాకు చాలా దిగ్భ్రాంతి కలిగింది, అదిఏమిటంటే, నేను ఎల్లప్పుడూ పడిపోయినట్లు భావించిన సంఘంలో సభ్యురాలిగా ఉంటూ, ఆ సంఘసభ్యురాలిగా ఉండుట అనే ధర్మం వలన కూడా ఆమె శేషించబడిన సభ్యురాలిననిచెప్పుకుంటుంది!
వారుమాత్రమే నిజమైన సంఘమని మరియు ఇతరులందరూ కోల్పోబడిన లేదా “పడిపోయినవారు”అని చెప్పుట చాలా చర్చిలలో ఒక సిద్ధాంతంగా ఉంది. మీరు “శేషించిన”సంఘములో సభ్యుడిగా ఉండాలని అనుకుంటే, ఒక నిజమైన చర్చిలో సభ్యుడుగా (పదియవ వంతుచెల్లించే) ఉండాలని చెప్పెదరు: అది వారి సంఘము. పాస్టర్లు, యాజకులు మరియు రబ్బీలుసాధ్యమైనంత మంది సభ్యులను నిలబెట్టుకోవడంలో ఒక స్వార్థపూరితమైన ఆసక్తిని కలిగిఉన్న వాస్తవం నిజం. అన్నిటి తరువాత, ప్రజలు తమ దశమ భాగాలను మరియు సమర్పణలనుఅర్పిస్తున్న అదే సంస్థ వారి నాయకులకు జీతాలను చెల్లిస్తున్న సంస్థ.
సాధ్యమైనంతఎక్కువ మందిని తమ సంఘాలకు వచ్చువారిగా ఉంచుకొనుటకు చేయు తమ ప్రయత్నాల్లో, మతనాయకులు యెహెజ్కేలు 8-9 అధ్యాయాలను చూపించెదరు. అయినప్పటికీ, ఈ అధ్యాయాలకు వారుఅర్థం చేప్పే విధానం మోసపూరితమైనది మరియు అది లేఖనాలలోని ఇతర భాగాలతోఅంగీకరించబడదు.
యెరూషలేములోని హేయక్రియలు
యెహెజ్కేలు దానియేలుకు ఒక సమకాలీకుడు మరియు బబులోనుకు చెరపట్టబడినవారిలో ఒకడు. యెహెజ్కేలు 8 లో ఇచ్చిన దర్శనంలో, యహువః ఆత్మ యెరూషలేములోను దానిలోగలఆలయంలోను చేయబడిన హేయక్రియలను గూర్చి చూపించెను. (ఈ సమయానికి, నెబుకద్నెజరు యొక్కమూడవ మరియు చివరి దండయాత్ర ద్వారా యెరూషలేములోని ఆయలం నాశనం చేయబడలేదు.)
ప్రవక్తకునాలుగు హేయమైనవి చూపబడెను, ప్రతి ఒక్కటి దాని ముందటి దానికంటే అసహ్యమైనది మరియుప్రతి ఒక్కటి నగరం మరియు ఆలయంలోకి లోతుగా వెళ్ళుచుండెను. వీటిలో, ఇతరవిషయాలతోపాటు, దాచబడిన విగ్రహారాధన మరియు మహిళలు తమ్మూజు కోసం విలపించుట [ఇదిరోమన్ క్యాథలిక్ చర్చిలో లెంట్ గాను మరియు అనేక ప్రొటెస్టంట్ చర్చిలలో ఆధ్యాత్మికభక్తి క్రియగాను ప్రచారం చేయబడిన ఒక ఆచరణ]. చివరకు సెవెంత్-డే అడ్వెంటిస్ట్చర్చిలో కూడా “ఈస్టర్ వేడుకలు పెరుగుట” చూడబడెను మరియు వివిధ
అడ్వెంటిస్ట్ప్రచురణలు వ్యక్తులుగా లేదా సమాజాలుగా ఎక్కువ లేదా తక్కువ స్థాయిలో పాల్గొనుచున్నజనములను చూపుతూ లెంట్ కు సానుకూల సూచనలను ఇచ్చాయి.
యెహెజ్కేలునకుచూపిన చివరి హేయక్రియ అతి చెడ్డదై ఉంది: “యహువః మందిరపు లోపలి ఆవరణ ములోనన్ను దింపగా, అక్కడ యహువః ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకును బలిపీఠమునకునుమధ్యను ఇంచుమించు ఇరువది యయిదుగురు మనుష్యులు కనబడిరి. వారి వీపులు యహువః ఆలయముతట్టును వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి యుండెను; వారు తూర్పున నున్నసూర్యునికి నమస్కారము చేయు చుండిరి. “(యెహెజ్కేలు 8:16, KJV) ఇది యహువః ఆరాధనఅని చెప్పుచు కొనసాగిస్తున్న సూర్య ఆరాధన కంటే తక్కువ కాదు!
ఇవియహువఃకు వ్యతిరేకమైన చాలా తీవ్రమైన నేరాలు. మరియు ఇంకనూ, పాపం ఎంత భయంకరమైనదైనప్పటికి, నేటికినీ తన ప్రజలను వారి గుడులలో ఉండమని యహువః కోరుతున్నట్లుగా మతనాయకులు నేటి వరకు చెప్పుచుండిరి. సంఘాల నుండి తమను తాము వేరుపరచుకొను వారు తప్పుచేస్తూ, తప్పిపోయే ప్రమాదంలో ఉన్నారని వారు చెప్పెదరు. అయితే ఈ వాదన, యహువః యొక్కవాక్యాన్ని వక్రీకరిస్తూ మరియు అనేక యథార్థమైన ఆత్మలను యహువః క్రింది విధంగాప్రకటించిన సంఘములలో ఉండటానికి దారి తీయుచుండెను: “నా ప్రజలారా, మీరు దానిపాపములలో పాలివారు కాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకుప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి. “(ప్రకటన 18: 4, 1599 జెనీవా బైబిలు)
యహ్ మాటను వక్రీకరించుట
![]() |
యథార్థ-హృదయం గల విశ్వాసులు తమ సంఘంలోనే ఉండాలని యహువః కోరుకుంన్నాడని ఒప్పించేందుకు ఉపయోగపడే సూత్రాలను ఉపయోగించుట చర్చి నాయకులకు చాలా బాగా తెలుసు.
|
విశ్వవిద్యాలయంలో,నా డిగ్రీకి అవసరమైన అత్యంత తంత్రమైన తరగతులలో ఒకటి వాగ్వాదము & చర్చ.ప్రొఫెసర్ మాకు చెప్పారు, వాదనను ఒప్పింపజేసే ఒక సాధనం, మీ ప్రతివాది యొక్క వాదననుఅతనికి చెప్పుట. మీ వాదనలలో, మీరు మీ వాదనకు వ్యతిరేకమైన వాదనలను స్పష్టంగాతెలుసుకుంటే, ఆ వాదనలు ఎందుకు తప్పు అనేదానిని మీరు ప్రదర్శించటానికి మెరుగైనస్థితిలో ఉంటారు. మీకు వ్యతిరేకంగా చేసిన వాదనలను కేవలం తిరస్కరించుట అనేది ఎక్కువఆమోదయోగ్యమైనది కాదు. వ్యతిరేక దృక్పథంలో పదాలను పెట్టి, ఆ తరువాత ఆ వ్యతిరేకదృక్పథం ఎందుకు తప్పుగా ఉందో తెలియజేయుట మరింత ధృడముగా ఉంటుంది.
యెహెజ్కేలు8 మరియు 9 వ అధ్యాయం నుండి చూపిస్తూ మంత్రులు ఖచ్చితంగా ఇదే చేసిరి. చర్చిలోతప్పులు జరిగాయని వారు గుర్తించారు. అధికార దుర్వినియోగం ఉంది; చర్చి నిధులదుర్వినియోగం; దోషాన్ని బోధించే వేదాంతవేత్తల ప్రొఫెసర్లు; నాడీ- భాషావిజ్ఞానప్రోగ్రామింగ్ ఉపయోగించే పాస్టర్; మరియు చర్చి నాయకులు స్పష్టంగా రోమ్ తో ఒకసయోధ్య విధానమును ప్రోత్సహించుదురు … కానీ, వారు ఒత్తిడి చేయుదురు, సంఘంవెళ్తుంది. చర్చితో ఉండండి.
దీనికిఉదాహరణ కేరీ న్యూహాఫ్ వ్రాసిన ఒక వ్యాసం, దీనిలో అతను ఇలా పేర్కొన్నాడు:
మీరుదీనిని ఎప్పుడూ వినెదరు.
నేనుచర్చిని విడిచిపెట్టినతిని అని.
నేనునిజంగా చర్చికి వెళ్లవలసిన అవసరం లేదు … దేవునితో నా సంబంధం వ్యక్తిగతమై ఉంది.
నేనువ్యవస్థీకృత మతంతో ఉండెడివాడిని.
సంఘంమానవ నిర్మిత ఆవిష్కరణ, దేవుని ఆలోచన కాదు.
పెరుగుతున్నసంఖ్యలో ప్రజలు నేడు చర్చిని ఎందుకు విడిచిపెడుతున్నారో పూర్తిగా అర్థమయింది.చివరికి చర్చిలో నడిపించేవారు కూడా తరచూ హాజరు కావడం లేదు…
…నాకు అర్థం అయ్యింది. చర్చి పరిపూర్ణంగా లేదు. జీవితం క్లిష్టమైనది. పెరుగుతున్నఎంపికలు/ ఇష్టాలు ఉన్నాయి. మరియు ఆధునిక మనస్సు ఎక్కువ నిర్వాహక లేదా సంస్థాగత విషయాలపైఅపనమ్మకం కలిగియున్నది. కానీ చర్చియొక్క విలువ తగ్గించు ఆలోచన ఎంత సొగసుగా ఉన్నా,అది తప్పు.
చర్చి యొక్క విధానములు కపటమైన ఆలోచన వలె సాగును, అయితే అది నిజానికివ్యతిరేకం; అది ఎంత సరళమైన మరియు ఆలోచనకు కుదింపు మార్గముగా ఉండినను ఏఫలితార్ధములేని చోటికి దారితీస్తే ఏమిటి? 1
తరువాతన్యూహాఫ్, చర్చితో ఉండుట క్రైస్తవుని విధి అని క్రైస్తవులు నమ్మునట్లు చేయుటకు ఒకక్లిష్టమైన పద బంధపు వలను రూపొందించెను. ఉదాహరణకు, అతను ఇలా చెప్పాడు, “నీవుఒక క్రైస్తవుడు అయితే, నీవు వెళ్ళుచున్నది సంఘము కాదు. నీవే సంఘము. నీవు క్రైస్తవునిగాచర్చి నుండి ఇక ఎప్పటికీ వేరవలేవు, ఒకవేళ అయితే నీవు ఒక వ్యక్తిగా మానవత్వం నుండివేరగగుదువు. నీవు చర్చికి వెళ్ళవద్దు. నీవే చర్చివై ఉన్నావు.”2 ఇలాంటి వాదనలో ఉన్న సమస్య ఏమిటంటే,ఇది సత్యాన్ని అసత్యంతో పెనవేయుటయే. “నీవు సంఘము,” ఇది సత్యం, ఎందుకంటే”సంఘము” అనేది ఎక్లేసియా, లేక “పిలవబడిన వారు”. ఏమైనప్పటికీ,ఏ సంస్థాగత సంఘము ఎక్లెసియా కాదు, కాలేదు. మరియు ఇంకా న్యూహాఫ్ నొక్కి చెప్పినదిఇదే.
![]() |
సభ్యులు చర్చిలోని లోపాలను చూసినప్పుడు, వారు వేదిక యొద్ద నుండి ప్రకటించిన సరైన దోషాన్ని చూసినప్పుడు వారు చర్చిలలోని హేయమైనవాటి కొరకు “నిట్టూర్చి, విలపించాలి”, కానీ వారు ఎట్టి పరిస్థితులలోనూ వెలుపలికి పోకూడదు అని బోధించబడుదురు. అన్నింటి తరువాత, వారు సభ్యులుగా ఉన్న సంఘము, శేషింనచి సంఘము అని వారి నాయకులు నొక్కి చెప్పెదరు. ఒకవేళ విడచిపెడితే, వారు ఇకపై శేషం యొక్క భాగం కాదు.
|
అతనుపూర్తిగా యక్తి విరుద్ధమైన ప్రకటనతో ముగించెను: “మీరు చర్చినివదిలించుకోవాలని కోరుకుంటే, మీరు యేసును కూడా వదలాలి. మీరు ఒకటి లేకుండా రెండవదికలిగి ఉండలేరు. “ఈ వాదన పిలవబడిన వారు [ఎక్లేసియా] సంస్థతో సమాన విలువ కలిగిఉన్నారని నొక్కి చెప్పడానికి ప్రయత్నిస్తుంది.
ఇదితప్పు. పరిశుద్ధాత్మ విడిచిపెట్టుమనిచెప్పుచుండగా, ప్రజలను ఒక మతపరమైన సంస్థలో ఉంచుతూ అపరాధులను చేయుటకు ఇటువంటివాదనలను రూపొందించారు. సభ్యులు చర్చిలోని లోపాలను చూసినప్పుడు, వారు వేదిక యొద్దనుండి ప్రకటించిన సరైన దోషాన్ని చూసినప్పుడు వారు చర్చిలలోని హేయమైనవాటి కొరకు”నిట్టూర్చి, విలపించాలి”. కానీ వారు ఎట్టి పరిస్థితులలోనూ వెలుపలికిపోకూడదు అని బోధించబడుదురు. అన్నింటి తరువాత, వారు సభ్యులుగా ఉన్న సంఘము శేషింనచిసంఘము అని వారి నాయకులు నొక్కి చెప్పెదరు. ఒకవేళ విడచిపెడితే వారు ఇకపై శేషంయొక్క భాగం కాదు.
ప్రబోధాలుబోధించబడుతున్నాయి, సమావేశాలు నిర్వహించబడుతున్నాయి, ఏర్పాటు చేయబడిన సభ్యులువిడిచి పోకుండా ఎలా కాపాడుకోవాలి, అదే సమయంలో సంఘ సభ్యత్వంను ఎలా పెంచుకోవాలి అనేదానిపై పుస్తకాలు మరియు వ్యాసాలు వ్రాయబడ్డాయి. కారణాలు చాలా మంచిగా కనిపించాయి.”చర్చి ట్రాన్స్ ఫ్యూషన్: చేంజింగ్ యువర్ చర్చ్ ఆర్గానికల్లీ- ఫ్రం ఇన్సైడ్అవుట్” అనే పుస్తకమును గూర్చి తన లేఖలో డేవ్ ఫెర్గూసన్ మూడు దశల ప్రక్రియనువివరిస్తూ “చర్చిలను మిషనరీ ఉద్యమంగా (మారునట్లు) మార్చడానికి సహాయపడేప్రక్రియలను” గురించి వివరించెను.
చర్చిలుఈ కదలికను పొందుటకు ఖచ్చితంగా చేయవలసిన కనీసం మూడు క్లిష్టమైన ఉద్యమాలు ఉన్నాయనిగత ఇరవై నాలుగు నెలల్లో నేను కనుగొన్నాను:
యేసు మార్గాలను అభ్యాసంలో పెట్టేపద్దతుల వైపుకు ప్రజలను నడిపించుము.
యేసు యొక్క పరిచర్యను స్పష్టంగాఅర్థంచేసుకొనుట మరియు వ్యక్తీకరించుట వైపునకు నడిపించుము.
యేసు పనిని పూర్తిచేయు ఉద్యమదృష్టివైపునకు నడిపించుము.3
డంభపువాక్చాతుర్య ప్రసంగం రక్షకునికి ఒకరు-ఒకరు-ఒకరుగా వ్యక్తిగతంగా ఆధ్యాత్మికఅనుసంధానం చేయుటకంటే, గుంపును నియంత్రించట మరియు ప్రభావితం చేయటపై దృష్టిపెడుతుండెను. రక్షణ ఎల్లప్పుడూ వ్యక్తిగత విషయం. యెహెజ్కేలు ఇలా వ్రాశాడు:”నోవహును దానియేలును యోబును, ఈ ముగ్గురు అట్టిదేశములో నుండినను వారు తమనీతిచేత తమ్మును తామే రక్షించబడుదురు, ఇదేఅదోనాయ్ యహువః వాక్కు. “(యెహెజ్కేలు 14:14, 1599 జెనీవా బైబిలు)
అయితే,చర్చి నాయకులు, జన సంఖ్యపై దృష్టి పెడతారు. సహజంగానే! వారు సువార్త ఆజ్ఞనునెరవేర్చాలని కోరుకుంటారు. కానీ వారి ఆర్థిక మద్దతు-వ్యవస్థ యొక్క నిర్వహణయెహెజ్కేలు లోని ఈ వచనములను గూర్చి వారి వివరణ ప్రభావితం చేస్తుంది. వారు లోపలినుండి మార్పులను చేయాలని యహువః ఆశిస్తున్నట్లు చెప్పి, నిరాశకు గురైన సభ్యులనుకొనసాగించుటకు ప్రయత్నిస్తారు.
అయితేయెహెజ్కేలు 8 మరియు 9వ అధ్యాయాలను సందర్భోచితంగా చదివినప్పుడు, బైబిలుచెబుతున్నది అది కాదు.
మొత్తం వినాశనం
యెరూషలేముమరియు దేవాలయంలోని హేయ క్రియలను గూర్చి యహువః స్పందన స్పష్టంగా ఉంది: దానినిమిత్తం మొత్తం విధ్వంసం పిలువబడెను.
అప్పుడాయననాతో ఇట్లనెను నరపుత్రుడా, నీవు చూచితివే; యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములుజరిగించుట తక్కువ విషయమా? వారు దేశమును బలా త్కారముతో నింపుచు నాకు కోపముపుట్టించితిరి: వారు కొమ్మను తమ ముక్కుకు ఉంచితిరి.
కాబట్టికటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమునగుపరచి, వారు నా చెవులలో ఎంతబిగ్గరగా మొఱ్ఱపెట్టినను నేను ఆలకింప కుందును. (ఏజెకిఎల్ 8: 17-18, KJV)
ఈసూత్రం వేగంగా ఉంది.
మరియునేను చెవులార వినునట్లు ఆయనగట్టిగా ఈ మాటలు ప్రకటించెను, ఒక్కొకడు తాను హతము చేయుఆయుధమును చేతపట్టుకొని పట్టణపు కావలి వారందరును ఇక్కడికి రండి అనెను. అంతలో ఒక్కొకడు తాను హతముచేయు ఆయుధమును చేత పట్టుకొని, ఉత్తర దిక్కుననున్న పై గవిని మార్గముగాఆరుగురు మనుష్యులు వచ్చురి. వారి మధ్య ఒకడు, అవిసె నారబట్ట ధరించుకొని నడుమునకులేఖకుని సిరాబుడ్డి కట్టుకొని యుండెను; వారు ఆలయమున ప్రవేశించి యిత్తడిబలిపీఠమునొద్ద నిలిచిరి. (యెహెజ్కేలు 9: 1-2, KJV)
ఇదితీవ్రమైనది! యహువః ఆజ్ఞ చంపుటకు ఆయుధాలను కలిగి ఉన్నవారిని పిలుచుచుండెను. కానీఇక్కడ కూడా, యూవావా యొక్క దయ చూడబడుతుంది. “యహువః…యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడలధీర్ఘశాంతముగలవాడై యున్నాడు. ” (2 పేతురు 3: 9, KJV)
ఇశ్రాయేలీయులఎలోహ యొక్క మహిమ తానున్న కెరూబుపైనుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి,అవిసె నారబట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిని పిలువగా,యహువః యెరూషలేమను ఆ పట్టణములో ప్రవేశించి చుట్టు తిరిగి, దానిలో జరిగిన హేయకృత్యములను గూర్చి మూల్గు లిడుచు ప్రలాపించుచున్నవారి లలాటముల గురుతు వేయుమని వారికాజ్ఞాపించెను.
నేనువినుచుండగా వారికీలాగు సెలవిచ్చెను మీరు పట్టణములో వాని వెంట పోయి నాపరిశుద్ధస్థలము దగ్గర మొదలుపెట్టి, కటాక్షమైనను కనికరమైనను లేకుండ అందరిని హతముచేయుడి. అందరు నశించునట్లు ఎవరిని విడిచిపెట్టక, పెద్దవారిని చిన్నవారిని కన్యకలనుపిల్లలను స్త్రీలను చంపవలెను గాని, ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారుమందిరము ముందరనున్న పెద్దలను హతముచేయ మొదలు పెట్టెను. (యెహెజ్కేలు 9: 3-6, KJV)
తరువాతసంభవించే విధ్వంసంలో అందరూ నాశనం చేయబడరు. “అసహ్యకరమైనవి జరిగినప్పుడునిట్టూర్చి విలపించువారు” ప్రత్యేకించబడుదురు. పరిశుద్ధాత్మ పదేపదే చర్చినివిడిచిపెట్టమని వారిని తొందర పెట్టినప్పటికీ ఈ మత నాయకులు చర్చి సభ్యులనుఒప్పించటానికి ఈ ప్రకరణమును ఉపయోగిస్తారు. చర్చిలో పాపం ఉందని పరిచారకులు ఒప్పుకుంటారు,కానీ పరలోక మార్గాన్ని పొందిన వారు చర్చిలో చేయబడుచున్న అన్ని అసహ్య కార్యాల పట్లనిట్టూర్చేవారు మరియు విలపించేవారు అని వారు చెప్పుదురు. దీని భావం, అందువల్ల,హేయమైన విషయాల కొరకు నిట్టూర్చి, విలాపం చేయుటకు వారు చర్చిలో తప్పక ఉండవలెను.
ఈ ప్రకరణం/ పాసేజ్ లో ఏమీ లేదు, అయితే, అలాంటి స్థూల హేయక్రియలుజరుగుచున్నచోట యః యొక్క ప్రజలు తప్పకుండా ఉండవలెనని చెప్పబడెను. నిజానికి, లేఖనము,కేవలం దీనికి విరుద్ధంగా బోధిస్తుంది.
ప్రతి వారం, విశ్వాసులు “చర్చితో ఉండునట్లు” సిద్ధాంత బోధన చేయబడుచుండెను. కానీ పరిశుద్ధాత్మ ఆజ్ఞాపిస్తుంది: “కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.” (2 కొరింథీయులు 6:17)
మీ జీవాల నిమిత్తం తప్పించుకోండి!
పరలోకముచివరి తరానికి ఆజ్ఞాపిస్తోంది: “మరియు ఇంకొక స్వరము పరలోకములోనుండి ఈలాగుచెప్పగా వింటిని నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును, దానితెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి. దాని పాపములుఆకాశమునంటుచున్నవి, దాని నేరములను యహువః జ్ఞాపకము చేసికొనియున్నాడు.” (ప్రకటన18: 4-5). WLC లో అన్యత్రా చూపబడినట్లుగా, ఈ ఆజ్ఞ అన్ని విశ్వాసులందరికినీ.ఇతరులందరూ నూతనమైన వెలుగును తిరస్కరించుట ద్వారా బ్రష్టులైరి మరియు తమ చర్చి,మతవర్గము లేదా సంస్థ మాత్రమే మినహాయించబడినదని ఏ ఒక్కరూ అనుకొనరాదు.
కానీమతభ్రష్టత్వంలో ఉన్న సంస్థల నుండి తమకు తామే వేరుపడవలసిన విధిని బోధించే ఇతరలేఖనాల ప్రకరణలు ఉన్నాయి. సొదొమలో ఉన్నా కూడా లోతును కాపాడే శక్తి యివహుకు ఉన్నది.కానీ ఆయన అలా చేయలేదు. బదులుగా, అయిష్టంగా ఉన్న లోతును, అతని కుటుంబాన్ని బయటకులాగుటకు ఆయన దేవదూతలను పంపించాడు, ఆపై తక్షణ ఆజ్ఞ ఇచ్చాడు: “నీ ప్రాణమునుదక్కించుకొనునట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవునశించి పోకుండ ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా” (ఆదికాండము 19:17, KJV)
లోతుసొదొమకు వెలుపట రక్షింపబడెను, దాని లోపల కాదు. నోవహు, అలాగే, చెడ్డవారికి అన్యప్రపంచానికి వెలుపట రక్షించబడెను, దాని లోపల కాదు. పేతురు ఈ భావనను బాగా అర్థంచేసుకొనెను:
యహువఃవారిని విడిచిపెట్టక…. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక,భక్తిహీనుల సమూహముమీదికి (లోకము మీదికి) జలప్రళయమును రప్పించినప్పుడు, నీతినిప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.
మరియుఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటినిదృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి,
దుర్మార్గులకామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆనీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, తాను చూచినవాటిని బట్టియు వినినవాటినిబట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సునునొప్పించుకొనుచు వచ్చెను.
భక్తులనుశోధనలోనుండి తప్పించుటకును, దుర్నీతిపరులను, శిక్షలో ఉంచ బడినవారిని తీర్పుదినము వరకు కావలిలో ఉంచుటకును యహువః సమర్థుడు. (2పేతురు 2: 4-9 చూడండి.)
లోతుపాపిష్టి పట్టణాలలో చేయబడిన హేయక్రియల నిమిత్తం మూలిగెను మరియు విలపించెను. యాషారుగ్రంధం ప్రకారం, ఒక అపరిచితుని పట్ల దయ చూపించిన సమయంలో తన కుమార్తెలలో ఒకరుఅవినీతిపరులైన వారిచే చంపబడెను. మరియ ఇంకా, అబ్రాము ప్రార్ధిస్తున్న సమయంలో,వెనువెంటనే బయలుదేరుడని తెలియజేయడానికి దేవదూతలు పంపబడ్డారు. వారు కొనసాగుటద్వారా, చర్చి లోపల జరుగుతున్న మత భ్రష్టత్వముకు మౌనంగా మద్దతు ఇచ్చుటకుకారణమౌతుండుట వలన చర్చీలో ఉండకుండునట్లు నమ్మకమైన విశ్వాసులనుండి పరలోకంఆశించచున్నది.
“చర్చి వెళ్ళిపోవుచున్నది!”
సెవెంన్త్-డేఅడ్వెంటిస్టులు దీనిని ఒక అడుగు ముందుకు తీసుకు వెళ్లారు. వారు ఎలెన్ వైట్ కు ఒకవ్యక్తి గురించి ఇవ్వబడిన కలను తీసుకుని, దానిని సైద్ధాంతిక సంస్థకు అన్వయిస్తారు.సంఘ సభ్యులందరూ దానిలో సభ్యులుగా నిలిచియుండు నిమిత్తం ఈ క్రింది పిలుపుతోఒకరినొకరు ప్రోత్సహించుకొనెదరు: “గుర్తుంచుకో, సంఘం వెళ్ళిపోతుంది!”
అయితే,ఇది ఒక అబద్ధపు ఆశ. అయినప్పటికీ, పరలోకం యొక్క నిందను తప్పించుకున్న ఏఒక్క తెగలేనప్పటికీ, నిజాయితీ- హృదయం గల అనేక మంది విశ్వాసులు, పడిపోయిన చర్చికి పట్టుకొనివ్రేలాడుటకు అది దారితీస్తుంది. తప్పుగా అన్వయించబడి చాలా నష్టంకు దారి తీసిన ఆ కలఒకే పేరాలో నమోదు చేయబడింది:
నేనుగత రాత్రి ఒక అద్భుతమైన కలగంటిని. నీవు చాలా కఠినమైన జలాలపై ప్రయాణించేటట్టు,బలమైన ఓడలో ఉన్నావని నేను అనుకున్నాను. కొన్నిసార్లు తరంగాలు పైభాగానికి కొట్టాయి,మరియు నీవు నీటితో తడిసితివి. నీవు ఇలా అన్నావు: “నేను వెళ్ళెదను. ఈ నౌకకిందకు వెళ్తోంది.” “వద్దు,” కెప్టెన్ వలె కనిపించిన ఒక వ్యక్తిఇలా చెప్పాడు,” ఈ నౌక ఓడరేవు వద్దకు వెళుతుంది, అది ఎప్పటికి క్రిందికివెళ్ళదు.” కానీ మీరు ఇలా జవాబిచ్చారు: “నేను ఓవర్ బోర్డును కడుగుతాను.నేను కెప్టెన్ లేదా సహచరుడను కాదు, ఎవరు పట్టించుకుంటారు? నీవు దూరంగా చూచునట్లు ఆనౌకలో నా అవకాశాలను నేను తీసుకుంటాను. “కెప్టెన్ ఇలా అన్నాడు:” నేనుఅక్కడకు వెళ్లనివ్వను, ఎందుకంటే నౌక ఓడరేవుకు రావడానికి ముందు ఆ రాళ్ళను ఢీకొట్టుననినాకు తెలుసు.” నీవు సరిగ్గా నిలబడి, రూఢిగా ఇలా అన్నావు: “ఈ నౌక భగ్నముఅవుతుంది; నేను దానిని తేటగా చూడగలను. కెప్టెన్ గుచ్చుకునే చూపుతో నిన్ను చూస్తూ,”నీవు ఆ పడవను తీసికొని నీ జీవితాన్ని కోల్పోవటానికి నేను అనుమతించను. దానిచట్రం యొక్క కలపను పురుగులు-తినివేసెను, మరియు అది మోసపూరితమైన పడవ. నీవు మంచిజ్ఞానాన్ని కలిగివుంటే నిజమైన దానికి మరియు మోసపూరితమైన దానికి, పవిత్రమైన దానికిమరియు పూర్తిగా నాశనమవుటకు ఏర్పాటు చేయబడిన దానికి తేడాను గుర్తించగలవు.”4
ఎలెన్వైట్ యొక్క పరిచర్యను D. M. కారైట్ అనుమానించినపుడు అతడికి ఒక హెచ్చరికగా ఈ కలఇవ్వబడింది. అయితే, సెవెంత్-డే అడ్వెంటిస్టులు ఈ “నౌక” ను సెవెన్త్-డేఅడ్వెంటిస్ట్ సంస్థగా వివరించుకొనిరి. చర్చి సభ్యులు దానిలో కొనసాగునట్లు తమ్మునుతాము ప్రోత్సహించుకొనుటకు అడ్వెంటిస్టులు ఆత్రుతతో ఈ నమ్మకమును ప్రవేశపెట్టిరి.సంఘ సభ్యులు “చారిత్రాత్మక అడ్వెంటిసిస్టు” కు తిరిగి రావాలని కోరుకునేస్వతంత్ర పరిచారకులు కూడా, సంఘ సభ్యులు “ఓడతో ఉండాలని” మరియు చర్చి లోపలనుండి మార్పును కోరుకోవాలని ప్రేరేపించుదురు.
![]() |
డగ్బ్యాచిలర్, అమేజింగ్ ఫ్యాక్ట్స్ అనే పుస్తకం యొక్క స్పీకర్, బాగా పేరున్న సెవెన్త్-డేఅడ్వెంటిస్ట్ స్వతంత్ర మంత్రి అడ్వెంటిస్టును దృఢపరచుటకు కొరకు ఒక వ్యాసం రాశారు, దాని పేరు: “మనంఎప్పుడైనా చర్చిని విడిచిపెట్టవలెనా”? బ్యాట్చెలర్ యొక్క ప్రతిస్పందన (కేవలంచర్చిలో మాత్రమే గొప్ప భద్రతను కనుగొందుము అని వాదిస్తూ) “కాదు” అనిప్రతిధ్వనిస్తుంది.
అదేవిధంగా,దేవుని ఓడ, చర్చి (దాని సమస్త సమస్యలు మరియు లోపాలతో) ప్రపంచంలో మీరు ఉండదలిచినచివరి స్థానం అని మీరు అనుకొనవచ్చు. నేను మీకు వాగ్దానం చేస్తాను, మీరు నీటిలోసొరచేపలతో తినబడుట కంటే పాపాత్ములతో చర్చిలో భరించుట చాలా మేలు…
విడిచిపెట్టుమనిఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహించినప్పుడు, “నేను ఎందుకు వెళ్లాలి? నేను ఆయనఓడతో ఉంటే నన్ను తీరంనకు సురక్షితంగా తీసికొని పోవుదునని దేవుడు వాగ్దానంచేసాడు” అని చెప్పండి. …
చర్చిలోసమస్యలు ఉన్నాయా? అవును, పెద్దవి! ఇది కొత్తగా ఉందా? లేదు. దేవుని ప్రజల యొక్క దుఃఖకరమైనచరిత్ర ఒక రాజీ మరియు తిరోగమనమే. కానీ ప్రజలతో ఉంటూ మరియు పునరుజ్జీవనంనుప్రభావితం చేయడానికి పోరాడుడి అని మళ్ళీ మళ్ళీ తన నాయకులకు చెప్పారు. మీరు వెలుపలనుండి ఇంటిని శుభ్రపరచలేరు; మీరు లోపల ఉండాలి. మీరు నీటిలో ఉన్నట్లయితే మీరు ఒకపడవను కాపాడలేరు; మీరు పడవలో ఉండాలి.5
అన్నిటి తరువాత, బ్యాచిలర్ తన పాఠకులకు వారే శేషించబడినవారని అనిచెప్పుచూ, లవొదకియ యొక్క ఆధ్యాత్మిక గర్వమును చూపిస్తుండెను:
చరిత్రలో ఇశ్రాయేలీయులు ఎన్నోసార్లు తిరుగుబాటు చేసారు, అయినా వారుఇప్పటికీ దేవుని ప్రజలే అయి ఉన్నారు. ఎందుకు? “ముఖ్యంగా” పౌలువివరించినట్లుగా, “దేవోక్తులు యూదుల పరము చేయబడుట వలన.” (రోమా 3: 2).
ప్రత్యేకమైన ప్రజలు. ప్రపంచ విశ్వాసాలు మరియుతెగల మధ్య సెవెంత్-డే అడ్వెంటిస్టులను ప్రత్యేకమైనదిగా ఉంచేది ఇదే. దేవుడు మాకునిజమైన దేవోక్తులను ఇచ్చెను. మనము ఆధునిక, ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులము. “ఇదిదుర్భరముగా మరియు లోపభూయిష్టంగా కనిపించునట్లు భావించబడినప్పటికీ, దేవుడు చర్చికితన ప్రత్యేకమైన ఆలోచనలో ఒక ప్రత్యేకమైన అర్ధాన్నిచ్చాడు.” (ది యాక్ట్స్ ఆఫ్ది అపోస్టిల్స్, పేజి 12).
మరియుచర్చి దేవుని యొక్క సర్వోన్నత గౌరవం పొందిన వస్తువు అయి ఉంటే, అప్పుడు అదిదుష్టుడు తన అత్యంత తీవ్రమైన కోపంను కేంద్రీకరించు వస్తువని కూడా చెప్పుటకుకారణమై ఉంటుంది. “ఆ ఘట సర్పము [స్త్రీ సంతానంపై] ఆగ్రహం తెచ్చుకొని”(ప్రకటన 12:17).
ఒకతోడేలు గొర్రెల మందలోని ఒక గొర్రెను క్రిందికి తెచ్చుటకు గొర్రెలకాపరి నుండి దానినిచెదరగొట్టునట్లుగా, దేవుని గొఱ్ఱెలను గొర్రెలకాపరి నుండి మరియు ఒకదాని నుండి మరొకదానిని వేరుచేయటకు అపవాది పిచ్చిగా పని చేస్తున్నాడు. విభజించబడితే మనముపడిపోవుదుము!6
ఇతర మత నాయకుల వలెనే, డౌగ్ బాచిలర్ సంఘ సభ్యులను, నిలిచియుండి, ప్రార్థన చేసి, లోపలి నుండి సంఘంలో మార్పులు చేయుడని కోరుచుండెను. సంస్థను విడిచిపెట్టడం అనేది సత్యాన్ని విడిచిపెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టడముతో సమానం.
ఇదిపొరపాటు. ఎలెన్ వైట్ యొక్క చిన్న స్వప్నంలో ఇలాంటిది ఏమీ లేదు-మరియు అలాంటి వ్యాఖ్యానానికిమద్దతు ఇచ్చేది ఖచ్చితంగా గ్రంథంలోనూ ఏమీ లేదు. విశ్వాసులు ఎల్లప్పుడూ సత్యానికైనిలబడటానికి పిలువబడుదురు. వారు మతభ్రష్టత్వం వైపునకు ఒక గ్రుడ్డివారిగాతిరగాల్సిన అవసరం లేదు. ఎటువంటి చెడు విషయాలను చూచినప్పటికీ, ఒకడు చేయాల్సినదంతాపరలోకంనఖు టికెట్టును హామీ పొందాలంటే చర్చి సభ్యుల జాబితాలో తన పేరును కలిగియుండేలా చూసుకోవలసిన అవసరం ఉన్నదని చెప్పే తప్పుడు హామీలు ఇచ్చు సంస్థకు గుడ్డివిధేయతను ఎవ్వరూ ఎప్పుడూ చూపరాదు.
ముద్రించబడెను & క్షేమము
యెహెజ్కేలుదర్శనంలో నిట్టూర్చి మరియు విలపిస్తున్న నగర ప్రజలను చూపించెను. ప్రజలు చర్చిలోఉండాలని అర్థం వచ్చేలా మత నాయకులు దీనిని వివరించెను. మూలిగు మరియు విలపించు చర్యవారు శేషించబడిన వారని రుజువు చేస్తుండెననియు మరియు “శేషపు చర్చి”తోఉండాలనియు వారు బోధిస్తారు. ఏదైనా మార్పును వారు చర్చిలో ఉన్న సభ్యుల నుండిమాత్రమే తీసుకురావచ్చునని వారు చెప్పుదురు.
ఇదితప్పు! మూలుగుట మరియు విలపించుట అనేది దానంతట అది దేనినీ నిరూపించలేదు. యహూషువఃదినాలలోని పరిసయ్యులు “నిట్టూర్చుట, విలపించుట”, ఉపవాసముండుట మరియు వారిపవిత్రతను నిరూపించుకొనుటకు బాహ్య ప్రదర్శనలు చేయుటను గొప్పగా విశ్వసించేవారు.చివరకు అంత్యక్రియల సమయాలలో కూడా నిట్టూర్చుటకు మరియు విలపించుటకు వారు మనుష్యులనుఅద్దెకు తెచ్చుకునేవారు. నిట్టూర్చుట మరియు విలపించుట అనేది కేవలం ఒకని భక్తినిప్రదర్శించుటకు చేయబడు ఒక బాహ్య ప్రదర్శన మాత్రమే మరియు అది యహువఃతో ఎటువంటియోగ్యతను కలిగియుండదు. యహూషువః ఇలా అన్నారు: “మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమమనవి వినబడునని వారు తలంచుచున్నారు; ” (మత్తయి 6: 7, NKJV)
పరిసయ్యులవలె లవొదికీయులు కూడా గొప్ప మూల్గువారు మరియు విలపించువారు. వారు ఇతరుల పాపాలనుగూర్చి నిట్టూర్చి, విలపించుట ద్వారా, వారు లవొదికీయులు కారని వారికి వారునిరూపించుకుందురు. అంతేగాక, వారు నిట్టూర్చి, విలపించుటకు ఇంకా ఏదో ఉందనిగుర్తిఉంచు ఆధ్యాత్మిక వివేచనను కలిగి ఉన్నారు! వారు గుడ్డి వారు కారు!
![]() |
ఆ ముద్రను స్వీకరించేవారు ఆత్మ యొక్క నిజమైన వేదన నుండి పుట్టు నిట్టూర్పు మరియు కన్నీళ్లతో ఉన్నవారు. పరలోకం, నేడు, పడిపోయిన సంఘాల నుండి వేరవ్వమని మనలో ప్రతి ఒక్కరికీ పిలుపు ఇచ్చుచుండెను! నీవు దేని కోసం ఎదురు చూస్తున్నావు?
|
అయితే,ఈ మూల్గువారు మరియు విలపించువారు సిరాబుడ్డితో మనిషి ద్వారా ముద్రవేయించుకున్నవారు కారు. చర్చిలో మతభ్రష్టత్వము గురించి దుఃఖించినట్లు నటించేవ్యక్తులు, మరియు నిజానికి చర్చిని వదిలి వెళ్ళటం కన్నా దానిలోనే మరణించేవ్యక్తులు, ముద్రించబడరు. తమ నమ్మకాలతో ముందుకు నడిపించబడువారిని నిరుత్సాహపర్చడానికిసాతాను ఈ నేరస్థులను ఉపయోగిస్తాడు. బయటకు పారిపోవుటకు నిష్కపటమైన హృదయాలనుప్రోత్సహించే పరిశుద్ధాత్మ యొక్క స్వరమును వారు నిశ్శబ్దం చేయుదురు.
ఆ ముద్రను స్వీకరించువారు ఆత్మ యొక్క నిజమైన వేదన నుండి పుట్టునిట్టూర్పును మరియు కన్నీళ్లను కలిగియుందురు. వారు ఎంత భక్తిపరులో తమకు తాము లేకఇతరులకు నిరూపించేది ఏ పరిసయ్యుల వేషమో లేదా లవోదకియుల ప్రదర్శనో కాదు. ఈ ముద్రనుపొందిన వారు చర్చిని వదిలి వెళ్ళటకు సిద్ధంగా ఉంటారు – మరియు – అర్థం చేసుకొనుటకువారికి మరింత సమయం మరియు ఎక్కువ స్పష్టత కలిగి ఉన్నట్లయితే, దానిలో ఉండాలని యహువఃకోరుటలేదని తెలుసుకొందురు.
యహువః”యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీయెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.” (2 పేతురు 3: 9, kjv). వారు ఇంకనుప్రస్తుత సర్వ సత్యాన్ని తెలుసుకోవడానికి తగినంత సమయం, అవకాశం లేకపోయినప్పటికీ,సంభవించబోవు దానితో సంబంధం లేకుండా హృదయపూర్వకంగా నిజాయితీని అనుసరించుటకు ఇష్టపడువారిని ఆయన తిరస్కరించడు. వారి హృదయము శుపరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వంకులోబడుతున్నదని వారి హృదయపూర్వక దుఃఖము చెప్పుచున్నది ఎందుకంటే చర్చిలోమతభ్రష్టత్వము గుర్తించట అనేది చివరకు చర్చిని వదిలి వెళ్ళట యొక్క మొదటి అడుగు.అప్పటికి వారు వెళ్ళగలరనే లేదా తప్పక వెళ్లిపోవలెననే అవగాహనను కలిగియున్న స్థితికిచేరుకోలేదు. అయితే యహువః వారి హృదయాలను చదివి, వాటిపై ఒక ముద్రను ఉంచుతారు.
మరింతపరిణతి చెందు అవగాహనను పెంపొందించుకొనుటకు సమయంను తీసుకుని ఉంటే వారు చివరకు వదిలివెళ్ళుదురను దానికి ఈ ముద్ర మరింత ఆధారంగా ఉంటుంది. ఈ ముద్ర యహువః యొక్క ఆత్మ, ఇదిసత్యం లోనికి దారితీస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క పని పాపాన్ని శిక్షించుట మరియుమరింత సత్యం లోనికి దారితీయుట అని యహూషువః వివరించారు! “అయితే నేను మీతోసత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడలఆదరణకర్త(లేక,ఉత్తరవాది) మీ యొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దకుపంపుదును. ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమునుఒప్పుకొన జేయును. “(యోహాను 16: 7-8, NKJV)
ఎలాఈ చివరి కాలంలో కొందరు – మూల్గుచు, దుఃఖిస్తూ – చర్చిలో ఉంటూ ఇంకా రక్షణ యొక్కగుర్తును అందుకోగలరో తెలుసుకొనుటకు ఇది కీలకమైనది. నిజాయితీ గల హృదయంను కలిగిఉండి చర్చిలో జరిగిన అసహ్యకరమైన విషయాలపట్ల దుఃఖించువారు పాపము యొక్కపాపపుస్థితిని నిజముగా అవగాహన చేసుకొనుట ద్వారా అలా చేసెదరు. ఇది పరిశుద్ధాత్మనుండి మాత్రమే నేర్చుకొన గలము.
మద్రించబడుటనులేఖనము ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నిండి ఉండటంతో సమానంగా చూస్తుంది: “ఎలోహపరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడియున్నారు.” (ఎఫెసీయులు 4:30, KJV)
“మీతోకూడ మెస్సీయ నందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు ఎలోహయే.ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువునుఅనుగ్రహించియున్నాడు.” (2 కొరింథీయులు 1: 21-22, KJV)
“ఎలోహ తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, మెస్సీయ నందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఎలోహ మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. “ (ఎఫెసీయులకు 1: 12-14, KJV) |
పరలోకముమనలో ప్రతి ఒక్కరిని బయటకు రమ్మని పిలుస్తుండెను. మిగిలి ఉన్నవారికి తీర్పుతీర్చుటకు మనము పిలువబడలేదు. యహువఃకు ప్రతీ హృదయం బాగా తెలుసు; మనకు తెలియదు.యహువః కు
ప్రతిఒక్కరిని వ్యక్తిగతంగా నడిపించే జ్ఞానం ఉంది; మనకు లేదు. మనలో ప్రతి ఒక్కరు మనహృదయాల్లో పరిశుద్ధాత్మ నడిపింపునకు స్పందిచాలి. ఈ మార్గంలో స్పందించు ప్రతిఒక్కరినీ [మరియు వారి యొక్క సరియైన సమయంలో] ఆయన కూడా నడిపించునని మేమువిశ్వసిస్తున్నాము.
మీకుమీరే బయటకు రండి. మిగిలి ఉన్నవారి కొరకు ప్రార్థించండి. కానీ ఆయన సమీపిస్తున్నఆత్మకు వ్యతిరేకంగా ఇంకా గట్టిపడని హృదయాలను తెలుసుకొనుటకు ప్రేమగల పరలోకపుతండ్రిని నమ్మండి. పరిశుద్ధాత్మకు ప్రతిస్పందించే ప్రతి వారు వారిని వేరుగా ఉంచేముద్రను అందుకుంటారు. మన శక్తితో మనము ప్రతి విషయంలో మన ముందు ఉంచిన మార్గంలోనడిచేటప్పుడు, అవగాహనలో భిన్నమైన స్థానంలో ఉన్నవారిని మనము సురక్షితంగా తండ్రిచేతికి విడిచిపెట్టవలెను.
అయినప్పటికీ,కొందరు చర్చిల నుండి వెలుపలికి వచ్చుట గురించి తేలికగా గ్రహించగలిగిన స్థితికిఇంకా చేరుకోలేకపోయినా, ఆ కాంతి ఉండియు పడిపోయిన చర్చిలలో మిగిలి ఉన్న మనకుమన్నింపు లేదు. బయటకు వచ్చుట మన విధి. ఇప్పుడు.
విధేయత కలిగి ఉండుము … మరియుఇతరులకు మార్గం చూపించు.
నేడు సమస్త సంఘములు మరియు మతపరమైన సంస్థలు పడిపోయెను ఎందుకంటే ఏమినహాయింపు లేకుండా, అన్నియూ, వృద్ధియగుచున్న కాంతిని ఏదో వొక స్థానంలోతిరస్కరించెను. కొందరు ఒక స్థానమును లేదా మరొక దానిని అంగీకరించినప్పుడు ఇతరసత్యాలను వారు తిరస్కరిస్తారు, ఒకవేళ ఆమోదిస్తే, అది వారిని చాలా ప్రతికూలంగాప్రభావితం చేస్తుంది.
సొదొమనుండి లోతును దూరం చేయటకు దేవదూతలు పంపబడినట్లుగా, అందరును ఈసంస్థలు మరియు తెగలనుండి పారిపోవుటకు హెచ్చరికగా పరలోకం యొక్క సందేశము బయలువెళ్ళుచున్నది. మినహాయింపులు లేవు. అవన్నీ “దయ్యములకు నివాసస్థలమును, ప్రతిఅపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికిపట్టునుఆయెను. (ప్రకటన 18: 2, కె.జి.వి)
అవును! సంఘంలో చేయబడుహేయక్రియల నిమిత్తం నిట్టూర్చి, విలపించుము. కానీ సంఘము బయట నుండి చేయుము. మీవిధేయత యొక్క ఉదాహరణ ద్వారా, వ్యవస్థీకృత మతాలకు వెలుపల ఉంటూ గొర్రెపిల్లనుఅనుసరించుట సురక్షితమని ఇతరులకు చూపించు. రక్షణ యహూషువః నందు విశ్వాసం ద్వారాకలుగుతుంది, చర్చి యొక్క ప్రవేశ ద్వారము ద్వారా కాదు.
యహువః ఒక శేషము కలిగి ఉండును, చిన్నది అయినప్పటికీ, అది ప్రపంచంద్వారా మళినమవకుండా ఉంటుంది. ఈ పిలవబడిన వారు యహువః యొక్క నిజమైన సంఘమును మరియుఆయన కను గ్రుడ్డునై ఉందురు.
1 http://careynieuwhof.com/a-response-to-christians-hho-are-done-with-church/
2 ఐబిడ్.
3 డేవ్ ఫెర్గూసన్, చర్చి ట్రాన్స్ఫ్యూషన్, నీల్ కోల్ & ఫిల్ హెల్ఫెర్చే
4 ఎల్లెన్ జి. వైట్, టెస్టిమోనీస్ ఫర్ ది చర్చ్, వాల్యూమ్. 5, పే. 571.
5 http://www.adventistsaffirm.org/article/32/previous-issues/volume-16-number-2/should-we-ever-leave-the-church
6 Ibid.