World's Last Chance

At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

While WLC continues to uphold the observance of the Seventh-Day Sabbath, which is at the heart of Yahuwah's moral law, the 10 Commandments, we no longer believe that the annual feast days are binding upon believers today. Still, though, we humbly encourage all to set time aside to commemorate the yearly feasts with solemnity and joy, and to learn from Yahuwah's instructions concerning their observance under the Old Covenant. Doing so will surely be a blessing to you and your home, as you study the wonderful types and shadows that point to the exaltation of Messiah Yahushua as the King of Kings, the Lord of Lords, the conquering lion of the tribe of Judah, and the Lamb of Yahuwah that takes away the sins of the world.
WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

తారీఖు రేఖ(డేట్ లైన్) మోసం: ఇది ఏమిటి & ఇది ఎందుకు ముఖ్యమైనది! [తప్పక చదవండి:సెవెంత్-డే వారు]

అంతర్జాతీయ తేదీ రేఖ/ డేట్ లైన్ యొక్క నిశిత పరిశీలన, ఆధునిక వారాల చక్రం సృష్ట్యారంభం నుండి ఆటంకం లేకుండా నిరంతరంగా తిరుగుట లేదని నిరూపిస్తుంది. సాక్ష్యంను తొలగించుట అనేది – సాంప్రదాయానికి మరియు ఊహలకు విధేయులవ్వమని సూచించటయే.


అంతర్జాతీయ తారీఖు రేఖ అంటే ఏమిటి?

అంతర్జాతీయ తేదీ రేఖ అనేది పసిఫిక్ మహాసముద్రం మధ్యగా వెళ్ళే ఒక ఊహాత్మక రేఖ. ఇది అధికారికంగా 1884 లో వాషింగ్టన్ D.C లోని ఇంటర్నేషనల్ మెరిడియన్ కాన్ఫరెన్స్ నందు స్థాపించబడింది. కేవలం గ్రెగోరియన్ కేలండరులో రోజుల మధ్య వ్యత్యాసంను తెలియజేసే ఒకే ఒక ఉద్దేశ్యం కొరకు ఇది స్థాపించబడింది.

అంతర్జాతీయ తేదీ రేఖ వరుసగా రెండు కేలండరు తేదీలను వేరుచేసే “విభజన రేఖ” గా పనిచేస్తుంది. మీరు తేదీ రేఖను దాటితే, వెంటనే మీరు విభిన్న కాలాల ప్రయాణికుడు అవుతారు! ఒక్క అడుగు పశ్చిమంనకు దాటినచో అది తరువాతి రోజు అవుతుంది; వెనక్కి దాటితే తిరిగి మీరు సరియైన సమయంలోకి/ మునుపటి దినంలోకి వెళ్ళెదరు.” 2

చాలా వరకు, ఈ తేదీ రేఖ 180° మెరిడియన్ ను అనుసరిస్తుంది, ఇది లండన్, ఇంగ్లాండ్ లోని గ్రీన్విచ్ మెరిడియన్ (ప్రధాన మెరిడియన్) కు అభిముఖంగా ఉంటుంది.3. ఈ రేఖ చాలా వరకు నేరుగా ఉంటుంది, అయితే, సమీపంలోని ప్రాంతాలకు రాజకీయ మరియు ఆర్ధిక అనుబంధాలను కల్పించడానికి అనేక కల్పిత వైవిధ్యాలను కలిగియుంటుంది. అంతర్జాతీయ తేదీ రేఖ కోసం ఎంపికచేయబడిన స్థానం స్వతంత్రంగా ఉంటుంది; దాని స్థానము సౌకర్యాల నిమిత్తం ఏర్పాటు చేయబడింది మరియు అది ప్రకృతిలో దేనితోను ఎటువంటి సంబంధంను కలిగి లేదు.

180 డిగ్రీలను [అంతర్జాతీయ తేదీ రేఖకు] ఎంచుకున్నారు, ఎందుకంటే ఇది మధ్య పసిఫిక్ లో సముద్రం ద్వారా ఎక్కువగా నడుస్తుంది, సమీపంలోని దేశాలను వాటి సొంత దినములు మరియు తేదీలలో ఉంచడానికి వీలుగా వంకర టొంకరగా ఉంటుంది. కాబట్టి 180 డిగ్రీల ఎంపిక స్వతంత్రంగా ఉంది, కానీ ఇది నేడు ఉపయోగంలో ఉన్న అంతర్జాతీయ తారీఖు రేఖను ఏర్పాటు చేసింది.4

అంతర్జాతీయ తారీఖు రేఖ ఎక్కడైనా ఉండగలదు. . . కానీ గ్రీన్విచ్, ఇంగ్లాండ్ గుండా వెళుతూ నిర్వచింపబడిన మెరిడియన్ నుండి 180° దూరంలో ఉండుట చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ ప్రాంతం ప్రధానంగా, ఖాళీగా ఉన్న సముద్రంచే ఆవరించి యుండుట దానికి అదృష్టవశాత్తు కలిసివచ్చే అంశం. ఏదేమైనా, స్థానిక పరిస్థితులను అనుగుణంగా ఉండు నిమిత్తం అది ఎల్లప్పుడూ వంకర వంకరలుగా ఉంటుంది.5

తారీఖు రేఖ(డేట్ లైన్) మోసం: ఇది ఏమిటి & ఇది ఎందుకు ముఖ్యమైనది! [తప్పక చదవండి:సెవెంత్-డే వారు] image

“180° మెరిడియన్ అంతర్జాతీయ తేదీ రేఖగా ఎంపిక చేయబడింది, ఎందుకంటే ఇది చాలా తక్కువ జనసాంద్రత గల సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రం గుండా వెళుతుంది. ఇది అధికారికంగా 1884 లో వాషింగ్టన్, D.C. లోని 26 దేశాలు హాజరైన ఇంటర్నేషనల్ మెరిడియన్ కాన్ఫరెన్స్ నందు స్థాపించబడింది.”
(https://www.timeanddate.com/time/dateline.html, retrieved on May 20, 2017.)

అంతర్జాతీయ తేదీ రేఖ (IDL) సారాంశం:

  • IDL ఊహాత్మకమైనది.
  • IDL 1884 లో వాషింగ్టన్, D.C. లోని మనుష్యుల బృందంచే రూపకల్పన చేయబడినది.
  • IDL కొనసాగు ప్రదేశము స్వతంత్రమైనది మరియు ప్రకృతిలో దేనితోను ఎటువంటి సంబంధమును కలిగి లేదు.
  • IDL స్వేచ్ఛగా ఉండుటవలన, ఇది కదపబడుటకు వీలుగా ఉంటుంది. (ఇది రాజకీయ ఆర్ధిక సౌలభ్యం కోసం అనేక సార్లు మార్పుచేయబడినది. మనము దీని గురించి తరువాత మరింతగా చూద్దాం.)

సూర్య-చంద్ర/ లూనీ-సోలార్ తేదీ రేఖ అంటే ఏమిటి?

సూర్య చంద్ర తేదీ రేఖ అనేది సూర్యుడు మరియు చంద్రుని ద్వారా భూమ్మీద ఏర్పడిన సరిహద్దు రేఖ.6 ప్రతి చంద్ర వలయం (చంద్ర నెల) ప్రారంభంలో ఈ దృగ్విషయం జరుగుతుంది మరియు ఇది ముందుగా ఊహించదగినది కూడా. మానవ నిర్మిత తేదీ రేఖ వలె కాకుండా, సూర్య-చంద్ర తేదీ రేఖ స్వతంత్రమైనది కాదు; బదులుగా, ఇది యహువః ఉద్దేశించినట్లుగా, ఆకాశ జ్యోతుల కదలికలపై ఆధారపడి ఉంటుంది.

ఎలోహీం పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను [ఆరాధన కాలములు7] దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు . . .(ఆదికాండము 1:14)

గమనించండి, ఆదికాండము ఇలా చెప్పుటలేదు…

“మరియు ఎలోహీం ఇలా పలికెను, రాత్రి నుండి పగటిని విభజించుటకు మనుష్యుల కమిటీ (సుమారు 6,000 సంవత్సరాల తరువాత) వారి అభీష్టానుసారం ఒక ఊహాత్మక రేఖను సృష్టించును గాక; మరియు అవి సూచనలను కాలములను[ఆరాధన కాలములు7] దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు . . . “

సూర్య-చంద్ర తేదీ రేఖలోని విశేషమేమిటంటే, ఇది మనిషి యొక్క ఆవిష్కరణల [i.e అంతర్జాతీయ తేదీ రేఖ]8 సహాయం లేకుండా కేలండరులోని రోజుల మధ్య తేడాను గుర్తించుటకు మనకు వీలు కల్పిస్తుంది. సూర్య చంద్ర సముచ్ఛయం అనగా అమావాస్య తరువాతి వేకువజాము నుండి న్యూ మూన్ దినమును లెక్కింపు చేయుట ద్వారా, మొత్తం ప్రపంచం పండుగలు మరియు విశ్రాంతి దినాలలో మాత్రమే కాకుండా, ప్రతి దినమును గమనించుటలో కూడా ఐక్యమౌటను చూడవచ్చు. అంటే, భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ ఒకే 24 గంటల కాలవ్యవధిలో తమ రోజును ప్రారంభిస్తారని చెప్పాలి.

సూర్య-చంద్ర తేదీ రేఖ ఎలా పనిచేస్తుంది?

సూర్య చంద్ర సముచ్ఛయం అనగా అమావాస్య తరువాత మొదటి వేకువజాము ఈ తేదీ రేఖ ప్రారంభంను సూచిస్తుంది. ఆసమయంలో వేకువజాము ప్రపంచానికి న్యూ మూన్ దినమును తీసుకొని వస్తూ ముందుకు కదులుతుంది. తరువాత, ఆరు పని దినాలు ఉంటూ వాటిని అనుసరించి ఏడవ దినపు సబ్బాతు (లూనార్ సబ్బాత్) ఉంటుంది. యహువః యొక్క తారీఖు రేఖ ఆయన యొక్క “వేకువ రేఖ” అని కూడా పిలువబడుతూ, భౌగోళికంగా ఒక చాంద్రమానం నుండి మరొక చాంద్రమానంకు మారుతూ, అమావాస్య తరువాతి వేకువజాము నుండి న్యూ మూన్ దినమును ప్రారంభిస్తూ, భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ ఒకే 24 గంటల కాల వ్యవధిలో తమ దినమును ప్రారంభించుటను నిర్ధారిస్తుంది. పర్యవసానంగా, మనిషి యొక్క నకిలీ తేదీ రేఖ యొక్క ఎటువంటి అవసరత ఉండదు.

తండ్రి యొక్క పండుగ దినములు ఎప్పుడూ మర్చిపోబడలేదు మరియు ఆయన కేలండరు ఎప్పటికీ విడిచిపెట్టబడలేదు, మానవ నిర్మిత IDL మాయాజాలాన్ని చేయుటకు ఎటువంటి కారణం లేదు.

అంతర్జాతీయ తారీఖు రేఖ సూర్య-చంద్ర తారీఖు రేఖతో ఎలా సరిపోతుంది?

(1 ఎ) అంతర్జాతీయ తారీఖు రేఖ పరిశీలనచేయు దృగ్విషయంపై ఆధారపడి ఉందా?

లేదు. IDL 100% ఊహాత్మకమైనది మరియు స్వతంత్రమైనది.

(1 బి) సూర్య చంద్ర తారీఖు రేఖ పరిశీలనచేయు దృగ్విషయంపై ఆధారపడి ఉందా?

అవును. ఇది ఆకాశంలోని జ్యోతుల కదలికల పరిశీలనపై ఆధారపడి ఉంది (ఆదికాండం 1:14 ప్రకారం).

(2 ఎ) అంతర్జాతీయ తారీఖు రేఖను మానవుడు కదల్చగలడా?

అవును. మనుష్యులు రాజకీయ / ఆర్ధిక సౌలభ్యం కోసం ఐడిఎల్ ను చాలా సార్లు మార్చిరి.

(2 బి) సూర్య-చంద్ర తారీఖు రేఖను మానవుడు కదల్చగలడా?

కుదరదు. ఎందుకంటే, సూర్య చంద్ర తారీఖు రేఖ ఆకాశ జ్యోతుల ద్వారా నిర్ణయించబడుతుంది, ఇది మనిషికి అందనంత దూరంలో ఉంటుంది. సూర్య చంద్ర తారీఖు రేఖ, జ్ఞానమువలన భూమిని స్థాపించి వివేచనవలన ఆకాశవిశాలమును స్థిరపరచిన తండ్రి యహువః యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉంది. (సామెతలు 3:19)

(3 ఎ) అంతర్జాతీయ తారీఖు రేఖను ఎవరు సృష్టించారు?

ఇది వాషింగ్టన్, D.C. లోని మానవుల బృందంచే చేయబడినది.

(3 బి) సూర్య-చంద్ర తారీఖు రేఖను ఎవరు సృష్టించారు?

సూర్య చంద్ర తారీఖు రేఖను యహువః స్థాపించారు. ఇది ఆకాశంలో జ్యోతుల కదలికల ద్వారా ప్రతి చాంద్రమానం (చంద్రనెల) యొక్క ప్రారంభంలో నిర్ణయించబడుతుంది (ఆదికాండం 1:14 ప్రకారం).

(4 ఎ) అంతర్జాతీయ తారీఖు రేఖ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది?

IDL 1884 లో స్థాపించబడింది.

(4 బి) సూర్య-చంద్ర తారీఖు రేఖ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది?

సూర్యుడు మరియు చంద్రుని సమన్వయంతో సృష్టి వద్ద సూర్య చంద్ర తారీఖు రేఖ ఏర్పాటు చేయబడింది.

ఏ తారీఖు రేఖను పరలోకం ఆమోదిస్తుందని నీవు అనుకుంటున్నావు?
 

అంతర్జాతీయ తారీఖు రేఖ

సూర్య-చంద్ర తారీఖు రేఖ

ఊహాత్మకమైనది & అనియతమైనది

నిజమైనది; ఇది పరలోకంలో గమనించదగ్గ దృగ్విషయం ద్వారా నిష్పాక్షికంగా స్థాపించబడింది.

మనుష్యుల ద్వారా కదిలించబడ గలదు (IDL అనేక సార్లు రాజకీయ / ఆర్ధిక సౌలభ్యం కోసం మార్చబడింది.)

మనుష్యులచే కదిలించబడలేదు (ఎందుకంటే, సూర్య చంద్ర తారీఖు రేఖ ఆకాశ జ్యోతుల ద్వారా నిర్ణయించబడుతుంది, ఇది మనిషికి అందనంత దూరంలో ఉంటుంది. సూర్య చంద్ర తారీఖు రేఖ తండ్రి యహువః యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉంది.)

వాషింగ్టన్, D.C లో కూడిన మానవుల బృందంచే రూపకల్పన చేయబడినది.

సృష్టికర్తచే ప్రవేశపెట్టబడినది. (సూర్య చంద్ర తారీఖు రేఖ ఆదికాండం 1:14 ప్రకారం ఆకాశంలోని జ్యోతుల కదలికల ద్వారా ప్రతి చాంద్రమానం [చంద్రనెల] యొక్క ప్రారంభంలో నిర్ణయించబడుతుంది)

1884 లో స్థాపించబడినది

సృష్టి వద్ద స్థాపించబడినది


తెలుసుకొనుట…

అనేకమంది, నేడు, సంస్థాగత సంఘాలలో ప్రకటించబడుతున్న అర్ధ-సత్యాలను మరియు నిగూఢమైన అబద్ధాలను గురించి తెలుసుకొని మరియు నిబంధన తోరా వద్దకు తిరిగి వస్తున్నారు. వారు యహువః పండుగ దినాల శాశ్వత స్వభావానికి ప్రకాశింప జేయబడుతున్నారు మరియు యహువః ఆజ్ఞాపించిన అన్ని ఆజ్ఞలను అనుసరించి ప్రత్యేకమైన జీవితంను జీవించుటకు ఉత్సాహంగా తిరిగి వస్తున్నారు. పండుగ దినాలను లెక్కించడానికి ఉపయోగించే క్యాలెండర్ చాలా అన్యమత సంబంధమైనదై ఉన్నది అనే విషయం తరచుగా విస్మరించబడుతున్నది. అది మాత్రమే కాక ఈ క్యాలెండర్ అంతర్జాతీయ తారీఖు రేఖపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. లేఖనాలకు మాత్రమే కేవలం కట్టుబడి ఉండాలనుకునే వారికి ఇది ఒక పెద్ద సమస్య. సోలా స్క్రిప్చురా 9 ను ఉత్సాహంగా ప్రకటిస్తూ, యహువః పండుగ దినాలను మానవ నిర్మిత అంతర్జాతీయ తేదీ రేఖతో ఉపయుక్తము చేయుట పూర్తి అస్థిరంగా ఉంటుంది. ఒక నిమిషం పాటు ఆగి దాని గురించి ఆలోచించండి. సబ్బాతులు మరియు వార్షిక పండుగలు 130 ఏళ్ల మానవ నిర్మిత ఆవిష్కరణ మీద ఎలా ఆధారపడి ఉంటాయి?

తారీఖు రేఖ(డేట్ లైన్) మోసం: ఇది ఏమిటి & ఇది ఎందుకు ముఖ్యమైనది! [తప్పక చదవండి:సెవెంత్-డే వారు] image

సోలా స్క్రిప్చురాను ఉత్సాహంగా ప్రకటిస్తూ, అదే సమయంలో యహువః పండుగ దినాలను మానవ నిర్మిత అంతర్జాతీయ తేదీ రేఖతో ఉపయుక్తము చేయుట పూర్తిగా అస్థిరంగా ఉంటుంది.

సెవెంత్-డే వారు & అంతర్జాతీయ తారీఖు రేఖ: దాని పూర్తి జ్ఞానపరమైన వైరుధ్యం.

సెవెంత్-డే అడ్వెంటిస్ట్ సంఘము బైబిలు యొక్క సత్య సంపదతో ఆశీర్వదించబడింది. ప్రత్యేకంగా, పవిత్రమైన సబ్బాతు దినమును పాటించు విషయంలో విపరీతమైన ప్రాముఖ్యతతో గుర్తింపు పొందినది. అయితే దురదృష్టవశాత్తూ, మూడు దూతల సందేశాల సంపూర్ణత్వంను మరియు బైబిల్ కేలండరు విధానం యొక్క పెరుగుతున్న కాంతిని SAD లు నిశ్చయంగా తిరస్కరించారు. పర్యవసానంగా, వారు లేఖనాలను విశ్వాసానికి మరియు విధికి ఏకైక మూలముగా ప్రకటిస్తునప్పటికీ, వారు గుడ్డిగా పోపుసంబంధమైన గ్రెగోరియన్ శనివారం (మానవ నిర్మిత IDL ద్వారా నిర్ణయించబడిన) యొక్క ఉన్నతమైన సమకాలీన వేదాంతంకు కట్టుబడి ఉన్నారు.

SDA/ సెవెంత్-డే ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క నిశిత పరిశీలన:

మీరు ఒక ఎస్.డి.ఏ. అయితే, ఒక క్షణం ఆగి ఈ విషయాన్ని గురించి ఆలోచించాలని మేము వినయపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము: అంతిమ పోరాటం కేవలం శనివారంనకు మరియు ఆదివారంనకు మధ్య సాధారణమైనదిగా ఉంటే, ఈ రెండు రోజుల మధ్య గల ఒకే తేడా 1884 లో వాషింగ్టన్ DC లోని పురుషుల కమిటీచే చేయబడిన ఒక ఊహాత్మక రేఖయే అయినప్పుడు అది పోరాటం ఎలా అవుతుంది?తారీఖు రేఖ(డేట్ లైన్) మోసం: ఇది ఏమిటి & ఇది ఎందుకు ముఖ్యమైనది! [తప్పక చదవండి:సెవెంత్-డే వారు] image

సెవెంత్-డే అడ్వెంటిస్టులు శనివారంను బైబులు సబ్బాతు (“యహువః ముద్ర”) అనియు మరియు ఆదివారపు ఆరాధన అన్యమత దినం (“మృగం యొక్క ముద్ర”) అనియు ఉత్సాహంగా చెప్పెదరు, అయినప్పటికీ, వారు ఈ రెండు రోజులను వేరుచేసేది మానవ నిర్మిత తేదీ రేఖ మాత్రమే అనే విషయంను వారు విస్మరిస్తున్నారు.

వారు సబ్బాతును ఆచరించుటలో గల ప్రాముఖ్యతను మరియు అన్యమత సూర్య-దినంను/ Sun-day ఘనపరిచుటలోను గల భయంకరమైన లోపాన్ని గుర్తించారు, అయితే, విచిత్రంగా ఏడవ రోజు ముగిసి మరియు తరువాతి రోజు ప్రారంభమవుటను (అంతర్జాతీయ తారీఖు రేఖ ద్వారా) మానవుడు నిర్ణయించుటలో వారికి ఎటువంటి సమస్య కనబడలేదు. ఇది అర్థవంతమైనది కాదు. SDA బోధనలో “మృగం యొక్క ముద్ర” కు మరియు “యహువః ముద్ర” కు మధ్య తేడా మానవ-నిర్మిత తేదీ రేఖ మాత్రమే. మీరు ఒక ఎస్.డి.ఏ. అయితే, ఒక నిమిషం ఆగి మరియు దీని గురించి ఆలోచించుమని మేము మిమ్మల్ని వినయంగా ప్రార్థిస్తున్నాము: అంతిమ పోరాటం కేవలం శనివారంనకు మరియు ఆదివారంనకు మధ్య, సాధారణమైనదిగా ఉంటే, ఈ రెండు రోజుల మధ్య గల ఒకే తేడా 1884 లో వాషింగ్టన్ DC లోని మానవుల బృందంచే చేయబడిన ఒక ఊహాత్మక రేఖయే అయినప్పుడు అది పోరాటం ఎలా అవుతుంది? మరియు శనివారం లేఖనాల యొక్క పురాతన సబ్బాతు అయితే, ఎందుకు అది ప్రత్యేకంగా ఒక 1884 ఆవిష్కరణ ద్వారా ప్రభావితం చేయబడుతుంది?

స్థానభ్రంశము

అంతర్జాతీయ తారీఖు రేఖ ప్రవేశ పెట్టబడినప్పటినుంచి అది సౌకర్యార్ధం అనేకసార్లు మార్చబడింది. అది మాత్రమే కాక, IDL కు ముందు ఉన్న అనధికారిక10 తాత్కాలిక రేఖ కనీసం రెండు సందర్భాలలో కదిలింపబడింది:

1888 depiction of the International Date Line

మేయర్స్ కొన్వర్వర్సలెక్కిన్స్ యొక్క 4 వ ఎడిషన్ (1885-90) లో ప్రచురించిన విధంగా 1867 యొక్క అలస్కా సర్దుబాటు తరువాత తాత్కాలిక తేదీ రేఖ కదలిక జరిగెను, కానీ 1844/45 యొక్క ఫిలిప్పీన్ సర్దుబాటును నిర్లక్ష్యం చేయడం జరిగెను, (పొడవాటి ఫెర్రో మరియు పారిస్ యొక్క మెరిడియన్స్ నుండి లెక్కించారు) Source: https://www.staff.science.uu.nl/~gent0113/idl/idl_philippines.htm

ఫిలిప్పీన్స్: 1844 లో, ఫిలిప్పీన్స్ (మరీనా దీవులు, గ్వామ్, మరియు కారోలిన్ దీవులతో పాటుగా) డిసెంబరు 31, మంగళవారంను దాని కేలండరు నుండి తొలగించింది. ఇది తేదీ రేఖను తూర్పునకు బదిలీ చేస్తుంది. పర్యవసానంగా, గతంలో శుక్రవారంగా గుర్తించబడినది శనివారం అయింది, మరియు గతంలో శనివారంగా గుర్తించబడినిది ఆదివారం అయింది. ఫిలిప్పీన్స్ లో సెవెంత్-డే అడ్వెంటిస్టులు ఈ ఘర్షణను పూర్తిగా అలక్ష్యం చేస్తున్నారు, అయితే, నూతన శనివారంన పూజిస్తున్నాము, “మా సబ్బాతు కొత్త నిబంధన సబ్బాతు” అని వారు అతిశయిస్తున్నారు.11 గతంలో శనివారంగా ఉన్న దానిని (కొత్త ఆదివారంను) ఎవరైతే ఘనపరిచెదరో వారు “మృగం యొక్క ముద్రను” స్వీకరించే ప్రమాదంలో ఉన్నారని యస్.డి.ఏ వేదాంతశాస్త్రం చెబుతోంది. ఇది అతార్కికమైనది మరియు పరస్పర విరుద్ధమైనది.

ఒక నిజాయితీగల సత్య శోధకుడు ఎవరైనా ఇలాంటి పరస్పర విరుద్ధంగా ఉన్న స్పష్టమైన సాక్ష్యాలను చూస్తూ నిరంతర వారాల చక్రపు దోషపూరిత సిద్ధాంతానికి ఎలా వ్రేలాడతాడు?

అలస్కా: యునైటెడ్ స్టేట్స్ 1867 లో అలస్కాను రష్యా నుంచి కొనుగోలు చేసినప్పుడు, తాత్కాలిక రేఖ పశ్చిమమునకు తరలించబడింది. పర్యవసానంగా, అలస్కాకు రెండు శుక్రవారాలు వరుసగా ఏర్పడినవి.

సంయుక్త రాష్ట్రాల విదేశాంగ కార్యదర్శి విలియం సెవార్డు ప్రోద్బలంతో, అమెరికా సంయుక్తరాష్ట్రాల సెనేట్ ఏప్రిల్ 9, 1867 న $ 7,200,000 తో రష్యా నుండి అలస్కా కొనుగోలుకు ఆమోదించినది మరియు యునైటెడ్ స్టేట్స్ జెండా అదే సంవత్సరంలో అక్టోబరు 18 న (ఇప్పుడు అలాస్కా డే అని పిలువబడుతుంది) ఎగురవేయబడింది. యాజమాన్య మార్పుతో అనుకోకుండా, వాస్తవ అంతర్జాతీయ తేదీ రేఖ పశ్చిమమునకు తరలించబడింది, మరియు అలస్కా జూలియన్ కేలండరు నుండి గ్రెగోరియన్ కేలండరుకు మార్చబడింది. కాబట్టి, ఆ దేశపు వారికి, శుక్రవారం, అక్టోబరు 6, 1867 ను వెంబడించి మరొక శుక్రవారం, అక్టోబర్ 18, 1867 వచ్చింది; తారీఖు రేఖ కదలిక కారణంగా వరుసగా రెండు శుక్రవారాలు సంభవించాయి.12

దీని అర్థం అంతకు మునుపు శనివారంగా గుర్తించబడినది శుక్రవారం అయ్యింది, మరియు ఆదివారంగా గుర్తించబడినది శనివారం అయింది. దాని గురించి ఆలోచించండి; నేడు అలస్కా లో శనివారం సబ్బాతీయులు 150 సంవత్సరాల క్రితం ఆదివారంగా ఉన్నదానిని మాత్రమే ఆరాధిస్తున్నారు. మళ్ళీ, SDA సంఘం యొక్క శాఖలు భారీగానే ఉన్నాయి ఎందుకంటే ఆదివారం ఆచరణను కొనసాగించేవారు చివరకు మృగం యొక్క గుర్తును ధరించియున్నారని వారి వేదాంతశాస్త్రం నొక్కిచెప్పుచుండెను. అయితే, వారి ఆరాధనా దినము (శనివారం) 150 ఏళ్ల క్రితం, ఆదివారంగా మాత్రమే ఉంటే ఇది ఎలా కుదురుతుంది? పరలోకపు పవిత్ర దినాలను మానవ నిర్మిత తేదీ రేఖకు అనుబంధంగా మార్పుచేసిన తప్పుడు అబద్దంను యహువః యొక్క విశ్వాసులు గుర్తించాలని నిష్కాపట్యత్వము కోరుచున్నది.

సమోవా దీవులు మరియు టోకెలావు: 1892 లో, IDL సమోవా దీవుల యొక్క పశ్చిమానికి తరలించబడింది. ఈ ద్వీపాలలో వరుసగా రెండు రోజులు పాటు, జూలై 4, సోమవారంను కలిగియుండుట ద్వారా దీనిని సాధించారు. 119 సంవత్సరాల తరువాత, 2011 లో, సమోవా దాని కేలండరు నుండి డిసెంబర్ 30, శుక్రవారంను తొలగించడం ద్వారా తిరిగి అంతర్జాతీయ తారీఖు రేఖకు తూర్పు వైపునకు మారింది. టోకెలావ్, దగ్గరగా ఉన్న న్యూజిలాండుకు చెందిన ద్వీపం కూడా పరివర్తనం చేసింది. నేడు, అంతర్జాతీయ తారీఖు రేఖ సమోవా మరియు అమెరికన్ సమోవా దీవులకు మధ్యగా వెళుతుంది.

సమోవాలో ఎక్కువమంది సెవెంత్-డే అడ్వెంటిస్టులు ఇప్పుడు ఆదివారం నాడు ఆరాధించుచున్నారు, ఎందుకంటే నిరంతర వారాల చక్రం విషయం కారణంగానే. అయితే 2011 సర్దుబాటు, సమోవాను కేవలం అది 1892 ముందు ఉపయోగించియున్న కేలండరు వారానికి తిరిగి తీసుకుని వచ్చిన వాస్తవంను వాయు విస్మరిస్తున్నారు. ఇది పూర్తిగా నిరర్థకమైనది మరియు ఆధునిక వారం సృష్ట్యారంభము నుండి నిరంతరంగా, అంతరాయం లేకుండా తిరుగుతూ ఉన్నదనే వాదన తప్పు అని నిరూపిస్తుంది.

SDA ఆధ్యాత్మికశాస్త్రం ప్రకారం, సమోవాలో యహువః ముద్ర (ఏడవ రోజు సబ్బాతు ఆచరణ) మరియు మృగం యొక్క ముద్ర (ఆదివారం ఆచరణ) రెండూ ఒకటే అయి ఉండాలి. ఇది, ఒంటరిగా, నిజాయితీ గల ఏ సెవెంత్-డే అడ్వెంటిస్టులు అయినా, వారి రూపావళిని తిరిగి పరిశీలన చేసేందుకు దోహదపడుతుంది. (సూచించిన పఠనం: అంతర్జాతీయ తారీఖు రేఖ మారుతుంది: సబ్బాతు మారలేదా?)

 

క్వాజాలీన్ అటోల్: 1993 లో, క్వాజలీన్ (మార్షల్ దీవుల్లో ఒకటి) దాని కేలండరు నుండి ఆగష్టు 21, శనివారంను తొలగించింది, ఫలితంగా ఐడిఎల్ తూర్పునకు జరిగినది. ఇది క్వాజెలేన్ ను ఇతర ద్వీపాలకు అనుగుణంగా తీసుకొచ్చింది, ఆ సమయం వరకు, అది వేరొక దినములో ఉండేది.

తూర్పు కిరిబాటి: 1995 లో, కిరిబాటి తారీఖు రేఖను “పరిపాలనా సౌలభ్యం” కోసం తూర్పు వైపునకు తరలించెను.13 (దీనికి ముందు, రిపబ్లిక్ అఫ్ కిరిబాటి తారీఖు రేఖ ద్వారా విభజించబడి ఉండేది.)

ఆధునిక “యూదులు” ఒక సమస్యను చూపెదరు.

ఆధునిక యూదామతంలో, తేదీ రేఖ ఎక్కడ ఉండాలి అనే దానిపై నాలుగు ప్రధాన అభిప్రాయాలు ఉన్నాయి:

  1. యెరూషలేముకు 90° తూర్పున
  2. యెరూషలేముకు 180° తూర్పున
  3. మధ్య-పసిఫిక్: అంతర్జాతీయ తారీఖు రేఖకు దగ్గరగా
  4. నిర్దిష్టమైన “తారీఖు రేఖ” లేదు (స్థానికులు చేసేటప్పుడు చేయును)

నిజమైన సత్య శోధకులు ఎవరూ దేని నిమిత్తము అశ్కేనాజీ “యూదుల” వైపు చూడకపోయినప్పటికీ, వాస్తవానికి స్వంత-పద్ధతి/self-styled రబ్బీల మధ్య జరుగు ఏవైనా చర్చలు పెద్ద సమస్యను సూచించును.

పితరులు & ప్రవక్తలు

కాబట్టి, పితురులు మరియు ప్రవక్తలు సమయాన్ని ఎలా నిర్వహించారు? జల ప్రళయంనకు మునుపటి యహువః భక్తులు మరియు ప్రళయం తరువాత పితరులు/ ప్రవక్తలు, సబ్బాతులు మరియు పండుగ దినాలు ఎప్పుడు వచ్చునోనని గుర్తించుటకు పసిఫిక్ సముద్రపు మధ్యలో ఒక వంకర వంకరలుగా ఉన్న ఊహాత్మక తారీఖు రేఖను ఉపయోగించారు అని మనం నమ్మలా? ఇది నిజంగా అసంబద్ధం. మళ్ళీ తెలియజేస్తున్నాం, ఆధునిక తారీఖు రేఖ 1884 లో కేవలం ప్రపంచపు వాణిజ్యం సౌలభ్యం కొరకు, కేవలం మనుష్యులచే సృష్టించబడింది.

నోవాహు యొక్క వారసులు

ఒక క్షణం దీని గురించి ఆలోచించండి. జలప్రళయం తర్వాత నోవహు కుటుంబం భూమిపై విస్తించుట మొదలుపెట్టినప్పుడు, కొందరు తూర్పునకు ప్రయాణించారు మరియు కొంతమంది పశ్చిమానికి ప్రయాణించారు అనుకుందాం. చివరికి ఈ రెండు బృందాలు ప్రపంచంలోని మరొక వైపున ఒకరినొకరు కలుసుకుని ఉండేవారు. ఇప్పుడు దీనిని పరిశీలిద్దాం: నోవాహు యొక్క వారసులు నిరంతర వారాల చక్రాన్ని పాటించి ఉన్నట్లయితే, వారు ప్రపంచానికి మరొక వైపున కలుసుకున్నప్పుడు వారు ఒక క్యాలెండరులో ఒక దినము వ్యత్యాసంను కలిగి ఉంటారు. (ఉదా. ఒక సమూహం ఆరవ రోజును కలిగియుండవచ్చు, అదే సమయంలో ఇతర సమూహం ఏడవ రోజు కలిగియుండవచ్చు). దీనికి కారణం ఏమిటంటే, తూర్పుకు ప్రయాణించిన వారు ఉదయిస్తున్న సూర్యుని వైపు ప్రయాణం చేశారు (తూర్పు వైపునకు ప్రతి గమనము వలన వారి దినములు ముందుగా మొదలవుతాయి), పశ్చిమానికి ప్రయాణించిన వారు అస్తమిస్తున్న సూర్యుని వైపు ప్రయాణం చేశారు (పశ్చిమానికి చేయు ప్రతి గమనము వలన వారి దినములు ఆలస్యంగా మొదలవుతాయి). పర్యవసానంగా, ఈ రెండు వర్గాలు ప్రపంచంలోని అవతలి ప్రాంతంపై కలుసుకున్నప్పుడు, తూర్పును ప్రయాణిస్తున్న వారు పశ్చిమ దిశగా ప్రయాణిస్తున్నవారికంటే ఒక రోజు ముందు ఉంటారు. అప్పుడు, ఎవరు సరియైనవారై ఉండును? ఎవరి కేలండరు సరైనదై ఉండేది? సమాధానం: వారు నిరంతర వారాల చక్రాన్ని గమనించి ఉన్నట్లయితే, వారు ఇరువురూ సరైనవారిగా ఉండాలి. ఇది సాధ్యం కాదు. ఇది మళ్ళీ నిరంతర వారాల చక్రం యొక్క అవాస్తవంను చూపిస్తుంది.

ప్రశ్న: యహువః యొక్క పురాతన జనులు సమయంను కొలిచేందుకు ఆధునిక నకిలీ తారీఖు రేఖను ఉపయోగించి ఉండకపోతే, వారు ఏమి ఉపయోగించారు?

మరియు ఎలోహీం పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు… (ఆదికాండము 1:14)

జవాబు: వారు “సూర్య-చంద్ర తారీఖు రేఖ” ను ఉపయోగించారు, ఇది ప్రతి చాంద్రమానంకు “ఆకాశ విశాలమందలి జ్యోతుల ద్వారా” ఏర్పాటు చేయబడుతుంది. తప్పిపోయిన మనుష్యులు పరలోకపు కేలండరును విడిచిపెట్టకుండా మరియు యహువః యొక్క పండుగ దినాలను నిర్లక్ష్యం చేయనట్లయితే, నకిలీ తారీఖు రేఖ యొక్క అవసరత ఉండదు. పరలోకానికి వ్యతిరేకంగా బహిరంగ తిరుగుబాటు ఫలితంగా మానవ నిర్మిత అంతర్జాతీయ తారీఖు రేఖ ఆవసరత ఏర్పడెను.

సమస్త శనివారపు సబ్బాతీయులకు సవాలు: (బోధకులు మరియు కాపరులకు కూడా)

తారీఖు రేఖ(డేట్ లైన్) మోసం: ఇది ఏమిటి & ఇది ఎందుకు ముఖ్యమైనది! [తప్పక చదవండి:సెవెంత్-డే వారు] imageప్రశ్న: మానవ నిర్మిత అంతర్జాతీయ తారీఖు రేఖను ఉపయోగించకుండా మీరు శనివారపు సబ్బాతును ఎంత వరకు నిలకడగా గైకొనగలరు?

జవాబు: మీకు అసాధ్యం. మానవ నిర్మిత తేదీ రేఖను ఉపయోగించకుండా రోమన్ పాపల్ గ్రెగోరియన్ కేలండరును ఉపయోగించుట వందశాతం అసాధ్యం – ఇది ఒక రోజు నుంచి మరొక రోజుకు మారెనని మీకు తెలియజేసే రేఖ; ఇది ఏ రోజులను పవిత్రమైనవిగా లేక ఏ రోజులను సాధారణమైనవిగా పరిగణనలోకి తీసుకోవాలి అనేదాన్ని మీకు తెలియజేస్తుంది. ఇది బహుశా ధర్మశాస్త్రం అవసరం లేదని బోధించే సంస్థాగత ఆదివారపు సంఘాలకు ఏ విబేధమును చూపించదు, అయితే యహువః ఆజ్ఞల విషయంలో ఉత్సాహంతో ఉంటూ మరియు ఆయన సబ్బాతులు మరియు పండుగ దినాల యొక్క శాశ్వతమైన విలువను గుర్తించేవారికి, ప్రపంచంలో పెద్ద తేడాను చూపుతుంది!

రాజీపడకుండా తండ్రిని సేవించాలంటే, సాధారణమైన దానినుండి పవిత్రమైన దానిని వేరుపర్చడానికి మనం ఆయన వాక్యానికి మాత్రమే అనుమతివ్వాలి. అంటే, సబ్బాతులు మరియు పండుగ దినాలు వచ్చుటను కనుగొనుటకు మనము గత 130 సంవత్సరాలుగా పసిఫిక్ మహాసముద్రం గుండా వెళ్ళే మానవుడు రూపించిన నకిలీ తారీఖు రేఖను కాకుండా, పరలోకం యొక్క కేలండరును మాత్రమే ఉపయోగించాలి.

ప్రశ్నలు అడగండి

మీరు శనివారం సబ్బాతును ఆచరించువారైతే, మీ పాస్టరును అడగండి, “130 ఏళ్ల మానవ నిర్మిత అంతర్జాతీయ తారీఖు రేఖను ఉపయోగించకుండా మనము శనివారం సబ్బాతును ఎంత వరకు నిలకడగా గైకొనవచ్చును?” అతడు నిజాయితీగా ఉంటే, అతను అది సాధ్యంకాదని అంగీకరిస్తాడు. అంతర్జాతీయ తేదీ రేఖను ఉపయోగించకుండా ప్రపంచం గ్రెగోరియన్ దినమును/ తేదీని వుపయోగించుటలో ఐక్యమవలేదు. ఈ ప్రశ్న, తరువాత తార్కికంగా ఇలా అనుసరిస్తుంది: “అయితే శనివారం పరలోకం నియమించిన ఏడవ దినపు సబ్బాతు ఎలా అవుతుంది?” దానియందు ఎటువంటి మార్గం లేదు; దినము ప్రాముఖ్యమైతే, అప్పుడు దినమును లెక్కించేందుకు ఉపయోగించే పద్ధతి కూడా ప్రాముఖ్యమైనదే. మీరు దీనిని రెండు విధాలుగా కలిగి యుండలేరు, అనగా, ఏడవ దినపు సబ్బాతు ప్రారంభమవుటను మరియు ముగియుటను ఈ లోక మనుష్యులు నిర్ణయించుట సమ్మతమే అని చెబుతూనే, అదే సమయంలో ఏడవ దినపు సబ్బాతు పరలోకంలో ఉన్న మన తండ్రికి అత్యంత ప్రాముఖ్యమైనదని మీరు చెప్పలేరు.

సత్యంను హత్తుకొనుట

ఇప్పుడు ఆధునిక కేలండరు యొక్క మోసంను గూర్చి మీకు నేత్రములు తెరవబడ్డాయి, ఇప్పుడు మీరు ఏమి చేయుదురు? మీరు ఒక్కసారి విధేయులై మరియు పరలోక కేలండరును చదవడానికి/ గమనించటానికి ప్రారంభిస్తారా? లేదా మీరు మీ చెవులను మూసివేసుకొని, మీ కళ్ళను కప్పివేసి, సత్యానికి మీ వెన్ను చూపెదరా? మీరు మీ శిలువను తీసికొని, గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్లినా అక్కడకు అనుసరిస్తారా? లేదా మీరు ఆహ్వానం నుండి మరలి, మీరు పిలువబడిన నిశ్చయతకు మరియు చీకటికి తిరిగి వెళ్ళుదురా? ఇది మా ప్రార్థన, మీరు లవొదికయ యొక్క ఆత్మను వదిలించుకొని, సమయం ఉండగానే బబులోను నుండి బయటకు రమ్ము.

దయచేసి జనసంఖ్యలో భద్రత ఉందని నమ్మే పొరపాటు చేయవద్దు. మీ పాస్టర్ చీకటిలో ఉండుటకు ఎంచుకోవచ్చు. మీ సంఘ కుటుంబం సిలువను కలిగి ఉండుటలోని అసౌకర్యానికంటే, చర్చిలోని బల్లపై కూర్చుండే సౌలభ్యాన్ని ఇష్టపడవచ్చు. మీకు తెలిసిన ప్రతి ఒక్కరూ కడవరి వర్షం మరియు తండ్రి కేలండరు యొక్క పెరుగుతున్న కాంతిని తిరస్కరించవచ్చు. అయితే ఇది సత్యంను స్వీకరించు విషయంలో మీ యొక్క బాధ్యత నుండి మిమ్మల్ని మన్నించదు. యహువః మీకు తెలుసా. విశ్వసించి లోబడు వారికి ఊహింపశఖ్యము కాని ఆశీర్వాదాలు ఎదురుచూచు చున్నవి.

పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును, (సామెతలు 4:18)
 


1 “అంతర్జాతీయ తారీఖు రేఖ 1880 ల వరకు అధికారికంగా స్థాపించబడలేదు, కానీ దిములను సర్దుబాటు చేయడానికి భూమి మీద అలాంటి ఒక రేఖకు అవసరమైన అవసరం 1512 నుండి 1521 మధ్య, ప్రపంచాన్ని మొదటిగా చుట్టివచ్చిన మాగెల్లాన్ సిబ్బందిచే అనుకోకుండా గుర్తించబడింది.” (పీటర్సన్, జేమ్స్ ఎఫ్., సాక్, డోర్టీ., గ్యాబ్లర్, రాబర్ట్ ఇ. “ఫిజికల్ జియోగ్రఫీ.” 11 వ ఎడిషన్, సెగగేజ్ లెర్నింగ్, ఫిబ్రవరి 4, 2016. ఎడ్యుకేషన్ 672 పేజీలు 34. http: // tinyurl. Com / kps2efn, మే 11, 2017 న పునరుద్ధరించబడింది.)

2. జాతీయ మహాసముద్ర మరియు వాతావరణ యంత్రాంగం, http://oceanservice.noaa.gov/facts/international-date-line.html, ఏప్రిల్ 29, 2017 న పునరుద్ధరించబడింది.

3. గ్రీన్విచ్ మెరిడియన్ (ప్రధాన మెరిడియన్) 1851 లో సర్ జార్జ్ బిడ్డెల్ ఎరే అనే ఆంగ్ల గణిత శాస్త్రజ్ఞుడు మరియు ఖగోళ శాస్త్రవేత్తచే స్థాపించబడింది. ఈ గ్రీన్విచ్ మెరిడియన్, నేడు సమన్వయ యూనివర్సల్ టైమ్ (UTC) ను స్థాపిస్తుంది. సమయంను కొలిచుటకు గ్రీన్విచ్ ను లంగరు స్థానంగా ఎంచుకోవడం “అనియతగా ఉండేది. ఇది జాతీయ ఔన్నత్యం మరియు సౌలభ్యం మీద ఆధారపడి ఉంది.” (Http://www.livescience.com/44292-international-date-line-explained.html, ఏప్రిల్ 29, 2017 న పునరుద్ధరించబడింది.)

4. http://www.livescience.com/44292-international-date-line-explained.html, ఏప్రిల్ 29, 2017 న పునరుద్ధరించబడింది.

5. అస్ట్రోనోమికల్ అప్లికేషన్స్ డిపార్టుమెంట్ ఆఫ్ U.S. నావల్ అబ్జర్వేటరీ, http://aa.usno.navy.mil/faq/docs/international_date.php, మే 8, 2017 న పునరుద్ధరించబడింది.

6. సూర్యుడు, దాని వేగవంతమైన కదలిక కారణంగా, ప్రతిరోజూ చంద్రునికంటే 12.2 ° ముందుకు వెళ్ళును. పర్యవసానంగా, ఇది చంద్రుడికి ముందుకెళ్తుంది మరియు అది దాని చుట్టూ వెనుక తిరుగుతున్న చంద్రన్ని 29.5 రోజులు (12.2 ° x 29.5 = 360 ° = పూర్తి వృత్తం) తర్వాత మళ్లీ దాటిపోతుంది. చంద్రునితో (అదే ఖగోళ రేఖాంశం) సమాంతరమైన రేఖలోనికి సూర్యుడు వచ్చిన ఖచ్చితమైన సమయం సూర్య చంద్ర సముచ్ఛయం/ అమావాస్య, దాని తరువాత మరొకసారి చంద్రుడు తన చక్రంను ప్రారంభించును. సముచ్ఛయ సమయంను తరచుగా ఖగోళ “న్యూమూన్” గా సూచిస్తారు.

7. ఆదికాండము 1:14 లో “కాలములు” అని అనువదించబడిన పదం మో’ఎద్. “Mo’ed [మోఎద్] అనేపదము విస్త్రుతార్ధంలో అన్నిఆరాధనా సమావేశాలను సూచించును. ఇది ప్రత్యక్షగుడారమునకు సంబంధించి వుండెను…… [యహువః] ఇశ్రాయేలియులకు తన చిత్తమును తెలియజేయుటకు విశేషమైన సమయములయందు ప్రత్యక్షమాయెను. “ఇదియహువ ప్రజల యొక్క ఆరాధనా సమావేశాలకు సామాన్య పదము.”(చూడుము #4150, “లెక్షికల్ అయిడ్స్ టు ది ఓల్డ్ టెస్టమెంట్,హిబ్రూ-గ్రీక్ కీ వర్డ్ స్టడీ బైబిలు, పేజి 1626.)

[8] అమావాస్య సంభవించే సమయంను సరిగ్గా గుర్తించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఉండగా, మానవ నిర్మిత తారీఖు రేఖను మేము ఉపయోగించము; బదులుగా, మేము ఆదికాండము 1:14 లో ఉపదేశము చేయబడినట్లుగా, సమయమును లెక్కించుటకు ఆకాశంలో నియమించిన జ్యోతులను మాత్రమే ఉపయోగిస్తాము. పూర్వీకులు చాలా మట్టుకు, మనం ఈ రోజు ఉన్నదాని కంటే పరలోకానికి అనుగుణంగా ఉన్నారు. ప్రపంచంలోని అసంఖ్యాక పురాతన నిర్మాణాలచే ఇది స్పష్టంగా గ్రహించ బడుతుంది, ఇవి గ్రహణాలు, విషువత్తులు, సూర్యాస్తమయాలు మొదలైనవాటిని ఖచ్చితంగా తెలియజేస్తుండెను. తత్ఫలితంగా, వారు ఆధునిక సౌకర్యాలను ఉపయోగించకుండా ఆకాశపు దృగ్విషయాన్ని ఖచ్చితంగా ఊహించగలిగారు.

9. సోలా స్క్రిప్టురా ప్రొటెస్టంట్ సంస్కరణల యొక్క నినాదమై ఉండెడిది. ఇది ఒక లాటిన్ పదము, అనగా “లేఖనము మాత్రమే.”

10 “కేలండరు తారీఖు రేఖ యొక్క అవసరాన్ని 13 వ శతాబ్దానికి చెందిన భౌగోళికవేత్తలు ప్రచారం చేశారు, వారు ఒక ప్రయాణాత్మక వ్యక్తి తన ప్రయాణ దిశను బట్టి ఒక తేదిని ఎలా పొందుచున్నాడో లేదా కోల్పోతున్నాడోనని ఆశ్చర్యపడెను .. వివిధ పోప్ లు మరియు సామ్రాజ్యాలు తదనంతరం వారి అవసరాలకు అనుగుణంగా కేలండరు తారీఖు రేఖలను కదిలించిరి. ” (ది జెరూసలెస్ట్ పోస్ట్ [ఎంఫసిస్ సప్పైడ్], http://www.jpost.com/Jewish-World/Judaism/Ask-the-Rabbi-A-matter-of-time-167236, మే 18, 2017 న పునరుద్ధరించబడింది.)

11 http://adventist.ph/philippines-profile, మే 8, 2017 న పునరుద్ధరించబడింది.

12 https://en.wikipedia.org/wiki/Department_of_Alaska, మే 12, 2017 లో తిరిగి పొందబడింది.

13 బిబిసి న్యూస్ మైఖేల్ వాల్ష్ ను ఉటంకిస్తూ, (కిరిబాటి గౌరవ కాన్సుల్ UK) http://www.bbc.com/news/world-13334229, మే 13, 2017 లో తిరిగి పొందబడింది.

14 http://www.chabad.org/library/article_cdo/aid/1736567/jewish/The-Sabbath-the-International-Date-Line-and-Jewish-Law.htm, మే 18, 2017 లో తిరిగి పొందబడింది.

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.