World's Last Chance

At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

అధికారం క్రింద గల శక్తి

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

ప్రాచీన ప్రపంచంలోని నాయకులు నేటి పాలకుల కంటే ఎక్కువగా ప్రతినిధుల/ప్రాతినిధ్యంపై ఆధారపడేవారు. ఈ రోజుల్లో చాలా చోట్ల ఒకేసారి వ్యక్తిగతంగా వ్యాపారాలు నిర్వహించడానికి ఎవరూ భౌతికంగా ఉండకపోయినా, ఫోన్ చేయడం, ఇమెయిల్ పంపడం లేదా కాన్ఫరెన్స్ కాల్స్ చేయడం కూడా సాధ్యమౌతుంది. సమాచార సాంకేతికతకు ధన్యవాదాలు, ప్రశ్నలు, సమాధానాలు, నవీకరణలు మరియు నిర్ణయాలు తక్షణమే అపరిమితమైన దూరాలు ప్రయాణించగలవు.

స్పార్టన్ యోధుడుగత కాలంలో అలా కాదు. అప్పటికి ఒక సంస్థను నియంత్రించడానికి, మధ్యవర్తులు ఎంతో అవసరం. తమ ప్రభువు తరపున వ్యాపారాలు నిర్వహించుటకు విశ్వసనీయ వ్యక్తులు అవసరమయ్యేవారు, వారు మారుమూల ప్రాంతాలకు నియమించబడి మరియు పంపించబడేవారు.

ఒక రాజు లేదా వ్యాపారి తరుపున, వారి సేవకులలో ఒకరిని సంక్లిష్టమైన ఒప్పందం లేదా ఒప్పందంపై చర్చలు జరపడానికి వారితో క్రమం తప్పకుండా సంబంధాలు కొనసాగించడానికి వీలు కాని చోట్లకు వారిని పంపించేవారు. వారు ఎంత దూరం ప్రయాణించారనే దానిపై ఆధారపడి, వారి నుండి వచ్చిన సందేశం మీ వద్దకు తిరిగి రావడానికి రోజులు, వారాలు లేదా నెలలు పట్టవచ్చు. ఫలితం అప్పటికే నిర్థారణ అయినప్పటికీ, ఆ విషయం చాలా కాలం వరకు ప్రభువుకు తెలిసేది కాదు.

దీని పర్యవసానంగా, ఎంతటి స్థాయిలోనైనా సామర్థ్యంతో పనులు చేయాలంటే, ఆ మధ్యవర్తి తన ప్రభువు యొక్క అధికారాన్ని, అనగా అక్కడిక్కడ ఊహించనిది ఏదైనా జరిగితే “అక్కడికక్కడే” నిర్ణయాలు తీసుకోగలిగేంత అధికారాన్ని కలిగి ఉండవలసి ఉంటుంది. తరువాత, సంబంధిత వ్యక్తులు, దళాలు, ఫైనాన్స్ అధికారులు లేదా దిగువ విభాగపు ఉద్యోగులు, రాజుయే స్వయంగా మాట్లాడుతున్నట్లుగా మధ్యవర్తి ఆదేశాలకు సహకరించవలసి ఉంటుంది! రెండవ ఆలోచన ఇక ఉండకూడదు.

ఇది ప్రజలు ఆలోచించిన తీరుపై ప్రభావం చూపింది మరియు పర్యవసానంగా వారు ఉపయోగించిన భాషపై కూడా. మంత్రిత్వము యొక్క అదే సూత్రం నేటికీ కొనసాగుతోంది. బుష్ సద్దాంతో యుద్ధానికి దిగడం గురించి న్యూస్‌రీడర్లు (వార్తలు చదువువారు) మాట్లాడుట మీరు విన్నారా? అయినప్పటికీ, కఠినమైన పరిస్థితి ఉన్నప్పటికీ, బుష్ వాషింగ్టన్లో సురక్షితంగా ఉంచబడ్డాడు మరియు సద్దాం ఒక సొరంగంలో దాక్కున్నాడు! వారు వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదు. బదులుగా, వారు వారి తరపున పోరాటం చేయడానికి ఇతర వ్యక్తుల పిల్లలను పంపారు.

లేఖనాలను అర్థం చేసుకోవడానికి ఇవన్నీ ఎంత ముఖ్యమైనవి? మనుష్యులలో చాలా అసాధారణమైన వారి నుండి మనం ఒక విలువైన పాఠాన్ని నేర్చుకోవచ్చు – గొప్ప విశ్వాసాన్ని గూర్చి యహూషువః చేత ప్రశంసించబడిన వ్యక్తి. అతడు, అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే, యూదుడైన మెస్సీయ నుండి ఎటువంటి ఆమోదం పొందటానికి అవకాశం లేని వ్యక్తి, మరియు ఆక్రమిత అధికారం యొక్క నౌకరీలో ఉన్నాడు, అతడు ఒక రోమా శతాధిపతి! అయినప్పటికీ, ఇశ్రాయేలులో కూడా ఇంతటి సమానుడు లేడని ఈ వ్యక్తి విశ్వాసాన్ని గూర్చి యహూషువః ప్రకటించాడు. నిజానికి ఒక అభినందన!

అతడు తన దాసుడు స్వస్థత పొందాలని యహూషువఃకు విజ్ఞప్తి చేశాడు. అక్కడ అసాధారణంగా ఏమీ లేదు. తన అభ్యర్థన వెనుక ఉన్న హేతుబద్ధత గురించి అతను ఇచ్చిన వివరణ యహూషువఃకు ఎంతో ఆనందాన్నిచ్చింది. “”ఆ శతాధిపతి ప్రభువా, ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును.” యహూషువః మాట అంతటి అధికారాన్ని కలిగి ఉందని అతను ఏ ప్రాతిపదికన నమ్మాడు? అతడు వివరిస్తూ వెళ్తాడు: “నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను.” (మత్త. 8: 8,9).

“ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును.” యహూషువః మాట అంతటి అధికారాన్ని కలిగి ఉందని అతను ఏ ప్రాతిపదికన నమ్మాడు? అతడు వివరిస్తూ వెళ్తాడు: “నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను.” (మత్త. 8: 8,9).

అధికారం క్రింద గల శక్తి image

ఈ వ్యక్తి బాగా అర్థం చేసుకున్న ఒక విషయం ఏదైనా ఉంటే అది అప్పగించిన అధికారం యొక్క సూత్రం. అతడు తన జీవిత అనుభవం నుండి తనకు తెలిసినదాన్ని తీసుకొని దానిని యహూషువఃకు అన్వయించాడు మరియు ప్రభువు ఆశ్చర్యపోయాడు! శతాధిపతి మత అధికారుల కంటే ముందు వరుసలో ఉండెను.

తన గొప్ప విశ్వాసం తనకి మరియు తన చక్రవర్తికి మధ్యగల సంబంధానికి, అలాగే యహూషువఃకి మరియు దేవునికి మధ్య సంబంధానికి ఒక సమాంతరాన్ని గుర్తించుటపై ఆధారపడి ఉన్నది. అతడు మరియు యహూషువః ఇద్దరూ తమ ప్రభువుకు విధేయత చూపుట వలన అధికారం పొందిన పురుషులు. వారు వారి సొంత విధానాలను కాకుండా తమ యజమానులను అనుసరిస్తున్నారు కాబట్టి, వారి స్థానంలో పనిచేయడానికి వారికి అధికారం ఉంది. మరో మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తి తమ సొంత యజమాని యొక్క అధికారం క్రింద ఉన్నంతవరకు ఇతరులపై అధికారం చూపు ప్రదేశానికి పదోన్నతి పొందుతారు. తన యజమాని యొక్క విధానాలను కొనసాగించడానికి విశ్వసించలేని వ్యక్తిని తన మనస్సుతో ఎవరూ అధికారులను చేయరు. తండ్రి చిత్తానికి పూర్తి అంకితభావానికి సంబంధించి శతాధిపతి యహూషువః ఆధ్యాత్మిక క్రియాశీలతను స్పష్టంగా ఆపాదించాడు.

బహుశా, తన తండ్రి పేరు మీద యహూషువః పనిచేయుచున్నాడని ఆయన చెప్పుకొనుట గురించి కూడా శతాధిపతి వినియుండవచ్చు, ఇది పురాతన కాలంలో వ్యాపారాన్ని నిర్వహించుటకు పంపబడే మధ్యవర్తి (ఒక షాలియాచ్) లాంటిది. మనకు తెలిసిన విషయం ఏమిటంటే, రోగాలను మరియు దెయ్యాలను “పొమ్ము!” అని చెప్పునట్లు, మరియు ప్రాణ శ్వాసను తిరిగి ప్రాణములేని శవంలోకి పిలుచునట్లు, యహువః నుండి వచ్చిన ఒక అధికారాన్ని ఆ శతాధిపతి యహూషువఃలో చూశాడు.

యహువఃలో విశ్వాసం ఎల్లప్పుడూ ఆయన యొక్క నిజమైన మధ్యవర్తులను గుర్తించడం మరియు వారికి అనుగుణంగా నడుచుకోవడం మీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది. మనందరికీ ఇదే తెలివైన విధానం.

నిర్గమకాండము 4 వ అధ్యాయంలో ఇశ్రాయేలు పెద్దలకు తనను తాను తెలియజేసుకొనే ముందు ఇశ్రాయేలు దేవుడు తనను పంపెనని వారు అర్థం చేసుకోవాలని మోషే అనుకున్నాడు. అదేవిధంగా 1 రాజులు 18:36 లో ఏలియా. యోహాను 11: 41-42 లోని లాజరు సమాధి వద్ద యహూషువః మాటలను గమనించండి. ఆయన ఇలా ప్రార్థించాడు, “తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను.” — నేను మీ ద్వారా ప్రత్యేకంగా పంపబడిన మధ్యవర్తిని అని వారు తెలుసుకొని గ్రహించు నిమిత్తం.

మీరు అలాంటి వ్యక్తిని యూదుల మార్గంలో వర్ణించాలనుకుంటే, వారు “నూనెతో అంటబడిరి” అని మీరు చెబుతారు. చాలా మంది “అభిషిక్తుడు” అనే పదాన్ని ఇష్టపడతారు ఎందుకంటే ఇది మరింత అధునాతనమైనది మరియు చాలా తక్కువ గజిబిజిగా అనిపిస్తుంది. కానీ హెబ్రీ బైబిల్ అంతటా, ఒక నిర్దిష్ట ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి, అనగా తన ప్రజలను రాజుగా పరిపాలించటానికి గాని, యాజకునిగా మధ్యవర్తిత్వం వహించటానికి, లేదా అబ్రాహాము లాంటి మూలపురుషుడుగా ఉండటానికి, యహువః ఒక వ్యక్తిని మధ్యవర్తిగా ప్రత్యేకించినప్పుడు, అతడు ఒక “అభిషిక్తుడు” లేదా మెస్సీయ (కీర్త. 105: 15 చూడండి) గా పిలువబడతాడు. కాలం గడుస్తున్న కొద్దీ మరియు ఇశ్రాయేలీయులు యహువః ముందస్తు ప్రణాళిక యొక్క జ్ఞానంలో పెరిగేకొద్దీ, వారు యహువః యొక్క అంతిమ మధ్యవర్తి, అత్యున్నత అధికారం మరియు అత్యంత విధేయుడైన ఒకరికోసం ఎదురు చూస్తూ వస్తారు. వారు ఈ వ్యక్తిని “మెస్సీయ” అని పిలుస్తారు.

సుగంధ ద్రవ్యాలు

ఎన్.టి. రైట్ వారి నిరీక్షణను సంక్షిప్తీకరిస్తాడు: “మెస్సీయ కనిపించినప్పుడు, మరియు ఆయన ఎవరిని మెస్సీయగా చేసినా, అతడు ఇశ్రాయేలీయులకు దేవుని మధ్యవర్తి అవుతాడని స్పష్టమవుతుంది. ఇక్కడ అతడు తనలో తాను ఒక అతీంద్రియ వ్యక్తి అని, స్థలం మరియు కాలంలో కనిపించడానికి ముందు ఒక అతీంద్రియ రీతిలో అతడు ఉన్నట్లు స్పష్టంగా గుర్తించబడాలి.” (రైట్, ది న్యూ టెస్టేమెంట్ అండ్ ది పీపుల్, పేజి 320).

యహూషువః యే మెస్సీయ అని విశ్వసించడం అనేది క్రొత్త నిబంధన విశ్వాసానికి మూలమైయున్నది. యహువఃతో మన వ్యవహారాలన్నీ మరియు మనతో యహువః వ్యవహారాలన్నీ ఆధ్యాత్మిక విషయాల యొక్క “అధీకృత నిర్వాహకుని” ద్వారా మధ్యవర్తిత్వం వహించబడతాయి, యహువః ఆమోదించిన వ్యక్తి, నజరేతుకు చెందిన యహూషువః. మన విశ్వాసం యొక్క ఈ సరళత, తరువాతి త్రిత్వ విశ్వాసం యొక్క భయంకరమైన సంక్లిష్టతలకు [ఇది నిజంగా మధ్యవర్తిత్వ సూత్రాన్ని నాశనం చేస్తుంది] భిన్నంగా ఉంటూ, పునరాలోచన చేయ విలువైనది. “దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన మెస్సీయ యహూషువః అనే నరుడు.” (1 తిమో. 2: 5) అని మన పిల్లలు ఎప్పటికీ మరచిపోకుండును గాక.


ఇది అలెక్స్ హాల్ రాసిన వ్యాసం. డబ్ల్యుఎల్సి వ్యాసం కాదు. (ఫోకస్ ఆన్ ది కింగ్డమ్, వాల్యూమ్ 8, నం 10, జూలై, 2006)

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి – కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృందం.

Comments

Leave a Reply

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.