World's Last Chance

At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

యెషయాలోని ”వాక్యం”: కొత్త నిబంధన అవగాహనకు తాళపు చెవి

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

యెషయా లోని వాక్యం

“యోహాను లోగోస్ అనే శీర్షిక ద్వారా కుమారుడిని పిలిచిన కారణంగా… అది[లోగోస్] చాలా పరిశోధనలకు కారణమైంది. దీనికి సాధారణంగా ఒక గ్రీకు నేపథ్యం (మెటాఫిజికల్ ఫిలాసఫీలో లోగోస్ ఒక ప్రముఖ భావన) మరియు ఒక హెబ్రీ నేపథ్యం (యహువః వాక్కు కోసం వాస్తవంగా పాత నిబంధన లోని భాగాలలో వ్యక్తీకరించబడింది – ఉదా. సామెతలు. 8) ఉన్నదని అనుకోవడం జరిగింది. 1

పాత నిబంధనలోని “వాక్యం” యొక్క హెబ్రీ నేపథ్యాన్ని మరియు యోహాను ఆ భావనను మెస్సీయ కోసం ఎందుకు ఎంచుకున్నాడు అనేదాన్ని అర్థం చేసుకొనుటకు, యెషయా చాలా సహాయకారిగా ఉంటాడు. ప్రవక్త “యహువః వాక్యం” గురించి చాలా వివరణాత్మక వర్ణనను అందిస్తాడు.

యెషయాలోని ”వాక్యం”: కొత్త నిబంధన అవగాహనకు తాళపు చెవి image

పాత నిబంధనలోని “వాక్యం” యొక్క హెబ్రీ నేపథ్యాన్ని మరియు యోహాను ఆ భావనను మెస్సీయ కోసం ఎందుకు ఎంచుకున్నాడు అనేదాన్ని అర్థం చేసుకొనుటకు యెషయా చాలా సహాయకారిగా ఉంటాడు. ప్రవక్త “యహువః వాక్యం” గురించి చాలా వివరణాత్మక వర్ణనను అందిస్తాడు. మరియు క్రొత్త నిబంధన రచయితలు తరచుగా యెషయా నుండి తీసుకున్నారు కాబట్టి “వాక్యాన్ని” గూర్చిన వారి రచనలను (ముఖ్యంగా యోహాను సువార్తను) యెషయా భావన ప్రకారం చదువుట జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది.

యెషయా యొక్క ప్రారంభ అధ్యాయాలలో “వాక్యం” పాత నిబంధనా కోణంలో (యహువః యొక్క ఉపదేశము లేదా ధర్మశాస్త్రము వలె) ఉంటుంది. యెషయా 2: 3 మరియు 5: 24 రెండింటి పర్యాయపద సమాంతరత “యహువః వాక్యాన్ని” ఆయన ధర్మశాస్త్రము అని నిర్వచించింది. 2: 3 లోని చివరి రెండు పంక్తులు ఇలా ఉన్నాయి: “ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యహువః వాక్కు బయలు వెళ్లును.” అదేవిధంగా, యెషయా 1:10 వ వచనము “మాట” ను యహువః యొక్క ఉపదేశముగా నిర్వచిస్తుంది: “సొదొమ న్యాయాధిపతులారా, యహువః మాట ఆల కించుడి. గొమొఱ్ఱా జనులారా, మన యహువః ఉపదేశమునకు చెవి యొగ్గుడి.” ఈ మూడు భాగాల నుండి, మనం “వాక్యాన్ని” యహువః ఉపదేశము లేదా ధర్మశాస్త్రము అని నిర్వచించవచ్చు.

ఏదేమైనా, యెషయా 9: 8 లో, “వాక్యం” అనే భావన మానవీకరణ ద్వారా విస్తరించబడింది. “ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలువరకు దిగివచ్చియున్నది.” ఇక్కడ “వాక్యం” ను “వర్తమానము” అని అనువదించినప్పటికీ, ఒక వ్యాఖ్యాత మరింత వ్యక్తిగత వివరణను సూచించాడు: “ఈ వాక్యం ప్రకృతి మరియు చరిత్రలో ప్రభువు యొక్క దూత: ఇది భూమియందంతటికీ త్వరగా వచ్చుచు, మరియు ప్రభువు పంపినప్పుడు మనుషులను నాశనం చేయుటకు లేదా స్వస్థపరుచుటకు వచ్చును, మరియు దాని పంపినవారిని యొద్దకు నిష్పలముగా తిరిగి రాదు.”2 దూతను గూర్చి ఈ వివరణను క్రీస్తుతో పోల్చవచ్చు. ఇక్కడ “వాక్యము” స్వీయ-నెరవేర్పు శక్తిని కలిగి ఉంది; ఇది సాధారణ వర్తమానము లేదా ఉపదేశము కంటే ఎక్కువ వ్యక్తిగత శక్తిని కలిగి ఉంటుంది.

“గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన యహువః వాక్యము నిత్యము నిలుచును. ” (యెషయా. 40: 8). ఒక వ్యాఖ్యాత ఈ వాక్యాన్ని ఇలా వివరించాడు: “నరుడు మరియు నరుని శక్తి క్షణికమైనవి, అయితే యహువః యొక్క వాక్యము, ప్రకటించబడిన చిత్తము, నిత్యము నిలిచి ఉంటుంది.”3 “ప్రకటించబడిన చిత్తము” ఈ సందర్భంలో ప్రభువు యొక్క గొప్పతనాన్ని బహిర్గతం చేసే శుభవార్తను సూచిస్తుంది. వాక్యము అనగా కొత్త నిబంధన భావన ప్రకారం “రాజ్య సువార్త” అనే విషయాన్ని ఇక్కడ యెషయా వివరిస్తాడు. మరొక వ్యాఖ్యాత ఈ భాగాన్ని వివరించాడు:

“శరీరమందు నివసిస్తున్న నరులు విశ్వవ్యాప్తంగా బలహీనులు, నశించెడివారు, హద్దులు గలవారు; అయితే దీనికి విరుద్ధంగా, యహువః, సర్వశక్తిమంతుడు, శాశ్వతమైనవాడు, సమస్తమును-నిర్ణయించువాడు; మరియు ఆయన వలె, ఆయన వాక్యం, ఆ వాక్యం ఆయన చిత్తము మరియు ఆలోచన యొక్క వాహకము మరియు ఉచ్ఛారణగా ఉంది, అది ఆయన నుండి వేరేదో కాదు, అందువలన అది ఆయనే.”4

ఈ వ్యాఖ్యాతలు ఇద్దరూ, యెషయాను వివరించుటలో యోహాను 1: 1 ను స్పష్టం చేయడం ఆసక్తికరంగా ఉంది. ఆదియందు వాక్యముండెను – “యాహువః ప్రకటించిన ప్రణాళిక” లేదా “ఆయన చిత్తము మరియు ఆలోచన యొక్క వాహకము మరియు ఉచ్ఛారణ” – మరియు ఈ వాక్యము యహువఃతో ఉండెను, మరియు అది “ఆయనవలె” ఉండెను. ఈ వాక్యం యహూషువఃలో మాంసంగా మారింది.

“వాక్యం” ను మానవీకరించుటలో, ఇది కేవలం సంభాషణ, ఉపదేశము లేదా ధర్మశాస్త్రము కంటే ఎక్కువ అని యెషయా స్పష్టం చేశాడు. అనగా, “హెబ్రీయులు ఒక ఉచ్చారణను దాదాపుగా తనకు తానూ నెరవేర్చుకునే వ్యక్తిగత శక్తిగా చూసేవారు” అని అతడు వివరించాడు.

యెషయాలోని ”వాక్యం”: కొత్త నిబంధన అవగాహనకు తాళపు చెవి image

“యహువః యొక్క వాక్యాన్ని” వివరించుటలో యెషయా 45:23 మరియు 55:11 ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. ఇది యహువః నోటి నుండి బయటకు వెళ్లునని, వెనక్కి తిరిగిరాదు అని రెండూ వివరిస్తున్నాయి. “నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును. ” (55:11). “వాక్యం” యొక్క అంతిమ మానవీకరణ అయున యహూషువః, యహువః యొక్క చిత్తాన్ని నెరవేర్చు విషయంలో విజయం సాధించకుండా యహువః యొద్దకు అధిరోహించలేదు. ఇక్కడ “వాక్యం” గురించి ఒక వ్యాఖ్యాత యొక్క వివరణ కూడా క్రీస్తును సంపూర్ణంగా వివరిస్తుంది:

“అది యహువః నోటనుండి బయటకు వెళ్లినప్పుడు అది ఆకారాన్ని పొందుతుంది, మరియు ఆ ఆకారంలో ఒక దైవిక జీవితం దాగి ఉంది, దాని దైవిక మూలం కారణంగా; అది నడుస్తుంది, మరియు యహువః నుండి వచ్చిన జీవంతో, దైవిక శక్తితో, దైవిక ఆజ్ఞాపణతో నింపబడింది, ప్రకృతి ద్వారా మరియు మానవ ప్రపంచం ద్వారా వేగవంతమైన దూత వలె, స్వస్థపరుచుటకును మరియు రక్షించుటకును బయలువెళ్ళును; మరియు తనను పంపినవారి చిత్తాన్ని నెరవేర్చే వరకు దాని పని నుండి తిరిగి వెళ్ళదు. ఈ వాక్యం దేవుని‌‌ యొద్దకు తిరిగి వెళ్ళుట కూడా దాని దైవిక స్వభావాన్ని అంచనా వేస్తుంది.”5

“వాక్యం” ను మానవీకరించుటలో, ఇది కేవలం సంభాషణ, ఉపదేశము లేదా ధర్మశాస్త్రము కంటే ఎక్కువ అని యెషయా స్పష్టం చేశాడు. అనగా, “హెబ్రీయులు ఒక ఉచ్చారణను దాదాపుగా తనకు తాను నెరవేర్చుకునే వ్యక్తిగత శక్తిగా చూసేవారు” అని అతడు వివరించాడు.6‌ కాబట్టి యోహాను 1: 1 లోని “వాక్యం” ను యహువః యొక్క స్వీయ-నెరవేర్పు శక్తిగల వ్యక్తిగత శక్తిగా అర్థం చేసుకోవడానికి యెషయా సహాయం చేస్తుంది. అది యహూషువఃలో మాంసంగా మారింది మరియు యహువః యొక్క ఉద్దేశ్యాన్ని సంపూర్తి చేసింది.


1 మెరిల్ టెన్నీ, ఎడి., ది న్యూ ఇంటర్నేషనల్ డిక్షనరీ ఆఫ్ ది బైబిల్, గ్రాండ్ రాపిడ్స్: జోండర్వన్, 1987, పే. 1069.

2 F. డెలిట్జ్చ్ మరియు C.F. కైల్, పాత నిబంధనపై వ్యాఖ్యానం, పీబాడీ, MA: హెండ్రిక్సన్, 1989, p. 256.

3 ఆర్థర్ పీక్, సం., బైబిల్ మీద వ్యాఖ్యానం, లండన్: థామస్ నెల్సన్ అండ్ సన్స్, 1919, p. 461.

4 కైల్ మరియు డెలిట్జ్, p. 143.

5 అదే, పి. 359.

6 పీక్, p. 468.


ఇది సారా బజార్డ్ రాసిన కథనం. డబ్ల్యూ.యల్.సీ కథనం కాదు.

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి – కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృందం.

Comments

Leave a Reply

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.