World's Last Chance

At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

While WLC continues to uphold the observance of the Seventh-Day Sabbath, which is at the heart of Yahuwah's moral law, the 10 Commandments, we no longer believe that the annual feast days are binding upon believers today. Still, though, we humbly encourage all to set time aside to commemorate the yearly feasts with solemnity and joy, and to learn from Yahuwah's instructions concerning their observance under the Old Covenant. Doing so will surely be a blessing to you and your home, as you study the wonderful types and shadows that point to the exaltation of Messiah Yahushua as the King of Kings, the Lord of Lords, the conquering lion of the tribe of Judah, and the Lamb of Yahuwah that takes away the sins of the world.
WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

బలమైన విశ్వాసం యొక్క గొప్ప బహుమానాలు!

బలమైన విశ్వాసం యొక్క గొప్ప బహుమానాలు! imageఒక వృద్ధురాలు తన చేతి వేళ్ళలో కొన్ని నాణేలను పట్టుకొని, వాటిని ఊపుకుంటూ, నేను వేడి పానీయం సేవిస్తూ కూర్చున్న కేఫ్‌లో మనుష్యుల చుట్టూ తిరుగుతుంది, మధ్యాహ్నం వేళలో మూయబడిన దుకాణాలు తెరుచుకోవడం కోసం వేచి చూస్తుంది. అక్కడున్న వారినుండి కొన్ని నాణేలు అడుక్కుంటున్నప్పుడు ఆమె గొంతు మృదువుగా ఉంది.

నేను నివసించే చోట బిచ్చగాళ్ళు చాలా తక్కువ. 200,000 జనాభా ఉన్న నగరంలో, నేను సాధారణంగా అరడజను కంటే తక్కువ మందిని చూసాను, వారిలో చాలా వరకు వృద్ధులు లేదా ఒక కాలు లేదా రెండు కాళ్ళు కోల్పోయినవారు. అనేక సంవత్సరాలుగా విదేశాలలో నివసిస్తున్న అమెరికన్‌గా, నేను ప్రతి పర్యాటక సీజన్‌లో పునరావృతమయ్యే నమూనాను చూశాను. అదేంటంటే స్థానికులు మాత్రమే యాచకులకు కొన్ని నాణేలు ఇచ్చుట. మరి పర్యాటకులు? ఎప్పుడూ ఇవ్వరు.

ఇప్పుడు, మంజూరు చేయబడింది. నేను ధనవంతుడనని ప్రజలు తప్పుగా భావించడం వల్ల ఇంతకు ముందు పదే పదే వంచన చేయబడినందున, పర్యాటకులు వారు ప్రధానంగా—ఉత్తర అమెరికాకు—చెందినవారు కావడం వల్లనే తాము లక్ష్యంగా చేయబడుతున్నారని అనుకుంటున్నట్లు నేను అర్థం చేసుకున్నాను. అది చాలా వేగంగా వ్యతిరేకతను మరియు స్థానికులపై బలమైన అనుమానాన్ని పెంచుతుంది. అయితే, ఇక్కడ నివసించే ప్రజలు దీనికి భిన్నంగా ఉంటారు. స్థానికులలో చాలా బలమైన పని-నీతి (కష్టపడి పనిచేయడం అనేది అంతర్గతంగా సద్గుణమైనది లేదా ప్రతిఫలానికి అర్హమైనది అనే సూత్రం) ఉంది, కాబట్టి ఒక వ్యక్తి భిక్షాటన చేస్తే, చాలా నిజమైన అవసరతలో ఉన్నాడని వీరికి తెలుసు. ఇంకా, తీవ్రమైన కోరికతో ఉన్న ఒక వృద్ధ స్త్రీ, 2.50 డాలర్ల కాఫీ తాగుతున్న మిమ్మల్ని చూసి, మీరు ఆమెకు 50¢ లేదా డాలర్ ఇవ్వగలరని భావించడం సహేతుకం.

స్థానికులు బిచ్చగాళ్లకు కొన్ని నాణేలను ఇవ్వడం, పర్యాటకులు వారిని చూడనట్లు పదే పదే నటిస్తుండటం చూడగా, క్రీస్తు ఉపమానాలలో ఒకటైన, ఆధునిక పాఠకులకు కోల్పోయిన లోతుగా పాతిపెట్టిన సత్యం గుర్తుకు వస్తుంది.

బలమైన విశ్వాసం యొక్క గొప్ప బహుమానాలు! image

ధనవంతుడైన వెఱ్ఱివాడు

ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, “పిత్రార్జితములో నాకు పాలుపంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయన నడుగగా”

ఆయన ఓయీ, “మీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించెనని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను.”

మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, “ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని నేనీలాగు చేతును..

“నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి యున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందు ననుకొనెను.”

“అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని ఆతనితో చెప్పెను.”

దేవుని యెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను.” (లూకా 12:13-21)

దాతృత్వం:

“పేదలకు సహాయం లేదా ఉపశమనం; భిక్షాధానం. పేదల సహాయం నిమిత్తం ఇవ్వబడునది; దానం.” (ది అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ)

ఈ ఉపమానం నన్ను ఎప్పుడూ కలవరపెడుతుంది. ఇక్కడ బోధించబడుచున్న పాఠం ఏమిటని నన్ను నేను ప్రశ్నించాను. మీరు ధనవంతులు కాకూడదా? మీరు పెద్ద కొట్లను నిర్మించకూడదా? చివరిగా దీని కారణంగా మనిషి వెఱ్ఱివాడు అని పిలువబడునని నేను నిర్ణయించుకున్నాను—నవ్వకండి. నేను తీవ్రంగా ఈ నిర్ణయానికి వచ్చాను—తన సంపదను ప్రదర్శించాలనే తన ప్రయత్నంలో, అతడు పెద్ద వాటిని నిర్మించే ముందు తన వద్ద ఉన్న కొట్లను కూల్చివేయాలని నిర్ణయించుకున్నాడు.

కానీ ఇక్కడ చెప్పబడేది అది కాదు! ఈ ఉపమానాన్ని అర్థం చేసుకొనే మార్గం, దానం చేయుటపట్ల ఇశ్రాయేలీయులు కలిగియున్న దృక్పథంలో కనుగొనబడుతుంది.

ధానానికి ప్రతిఫలం

ప్రాచీన ఇశ్రాయేలు సంస్కృతి పరంగా చాలా ఉదారంగా ఉండేది. విధవరాండ్రకు, తండ్రిలేనివారికి మరియు పరదేశులకు భృతి కల్పించబడింది. “మీరు మీ భూమి పంటను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు; నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు; నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు; నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను.” (లేవీయకాండము 19:9-10)

ప్రతి ఏడవ సంవత్సరం, భూమి కూడా సబ్బాతు విశ్రాంతిని కలిగి ఉండాలి, ఆ సమయంలో పెరిగిన ఏ పంటయైనను అది పేదలకు చెందుతుంది. “ఆరు సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. ఏడవ సంవత్సరమున దానిని బీడు విడువవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్షతోట విషయములోను నీ ఒలీవతోట విషయములోను ఆలాగుననే చేయవలెను.” (నిర్గమకాండము 23:10-11) నిజానికి, ఆకలితో ఉన్న ఎవరైనా తమ ఆకలిని తీర్చుకొనుటకు అవసరమైన వాటిని తీసుకోవచ్చు మరియు అది దొంగతనంగా పరిగణించబడదు. మత్తయి 12 లో శిష్యులు చేస్తున్నది ఇదే. శిష్యులు ధాన్యాన్ని దొంగిలించారని పరిసయ్యులు ఆరోపించలేదు, బదులుగా, వెన్నులను త్రుంచుట ద్వారా శిష్యులు పంటను “కోస్తున్నారు”, వారి చేతుల మధ్య వాటిని రుద్ది పొట్టును తీయుట ద్వారా, వారు “తూర్పారబడుతున్నారు.” మరో మాటలో చెప్పాలంటే, విశ్రాంతిదినమున పని చేయుచున్నారు.

స్పష్టంగా, ఇశ్రాయేలీయులకు ఇవ్వాలనే దృక్పథం ఉంది, అది నేటి క్రైస్తవులలో కోల్పోబడింది. ఈ దృక్పథం కొండపై ప్రసంగంలో క్రీస్తు మాటల్లో చాలా స్పష్టంగా వివరించబడింది: “భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.” (మత్తయి 6:19-21). లేఖనాల ప్రకారం పేదలకు ఇచ్చుట వలన కలిగే ప్రతిఫలం చాలా వాస్తవమైనది: యహూషువః తిరిగి వచ్చి విశ్వాసులకు తమ తమ క్రియల జాబితా ప్రకారం ప్రతిఫలమిచ్చే రోజు వరకు మీ కొరకు పరలోకంలో ధనము భద్రం చేయబడును.

బలమైన విశ్వాసం యొక్క గొప్ప బహుమానాలు! image

ఇది కొత్త విధానం కాదు. వెనుకటి ఇశ్రాయేలీయుల అరణ్య సంచారం సమయంలో, యహువః ఇలా ఆజ్ఞాపించాడు:

నీ దేవుడైన యహువః నీవు చేయు నీ చేతిపని అంతటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు మూడేసి సంవత్సరముల కొకసారి, ఆ యేట నీకు కలిగిన పంటలో పదియవ వంతంతయు బయటికి తెచ్చి నీ యింట ఉంచవలెను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులును, నీ యింటనున్న పరదేశులును, తండ్రిలేనివారును, విధవరాండ్రును వచ్చి భోజనముచేసి తృప్తిపొందుదురు. (ద్వితీయోపదేశకాండము 14:28 & 29)

అందుకే ఇవ్వమని లేఖనాలు చెబుతున్నాయి: అలా మీ చేతి పని అంతటిలోను యహువః మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

సేవా కార్యము

నేడు ప్రజలు ఇచ్చుటకు చాలా వెనుకాడుతున్నారు. ఒకవేళ అతడు దానిని మాదక ద్రవ్యాలో లేక మద్యమో కొనుటకు ఉపయోగిస్తాడేమో? నన్ను ఒక అమెరికా వ్యక్తిగా భావించి ఆమె నన్ను అడుగుతుందేమో? వారు నా జేబును కొట్టివేయుటకో లేదా నా జోలెను దొంగిలించుటకో వేచి ఉన్నారేమో? ఇలా మనల్ని మనం ప్రశ్నించుకుంటుంటాము.

ఇశ్రాయేలీయులు అలాంటి వాటి గురించి చింతించలేదు. వారు ఉచితంగా ఇచ్చారు మరియు ఫలితాలను యహువఃకు వదిలేశారు. వాస్తవానికి, పేదలకు సహాయం చేయుట శాపము నుండి తప్పించుకొనుట అని విశ్వసించబడింది, ఎందుకంటే అది యహువఃకే ఇచ్చుటగా భావించబడింది. ఆ విధంగా, ఇది సృష్టికర్త యొక్క అత్యున్నత ఆరాధన మరియు ఆరాధన యొక్క చర్యగా మారింది.

సామెతలు 10: 2 ఇలా ప్రకటిస్తోంది: “భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణమునుండి రక్షించును.” “నీతి” అనగా “నీతిమంతమైన చర్య” అని ఆధునిక నిఘంటువులు నిర్వచించాయి 1 మరియు లేఖనం కూడా ఈ అర్థాన్ని కలిగి ఉంది. “నీతి” అనేది హెబ్రీ పదమైన tsedâqâh (ట్సెదేకా/ నుండి వచ్చింది. దీని అర్థం నైతికంగా ఉండుట, న్యాయంగా, సద్గుణంగా మరియు ధర్మబద్ధమైన చర్యలను కలిగి ఉండుట. కాబట్టి, సామెతలు 10:2 ని “దుష్టత్వపు సంపదలు లాభకరము కాదు, అయితే నీతి క్రియలు మరణమునుండి విడిపించును” గా అనువదించవచ్చు.

ఒక ధర్మబద్ధమైన క్రియ, కొన్ని విషయాలలో, ఖచ్చితంగా భౌతిక జీవితాన్ని రక్షించగలిగినప్పటికీ, అది ఆత్మీయ జీవితంపై మరింత ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. మీరు స్వయం-త్యాగం చేయవలసి వచ్చినప్పటికీ కూడా పేదలకు ఇచ్చుట, అవసరమైన వారికి సహాయం చేయుట అనేది తన పిల్లలను చూసుకునే మరియు ప్రతిఫలమిచ్చే సజీవ దేవునిపై గల మీ విశ్వాసాన్ని ప్రపంచానికి బహిరంగంగా తెలియజేస్తుంది. సామెతలు 19:17 ఇలా చెబుతోంది, “బీదలను కనికరించువాడు యహువఃకు అప్పిచ్చువాడు; వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.”

బలమైన విశ్వాసం యొక్క గొప్ప బహుమానాలు! image

బలమైన విశ్వాసం

బిచ్చగాడికి ఒక డాలర్ ఇవ్వడం చాలా సులభం, కానీ మీకు ఆ ధనము యొక్క అవసరత కలిగి ఉండియు ఇచ్చినప్పుడు అది ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మీరు అవసరతలో ఉన్నవారికి—ఆ ధనము మీకు అవసరమై ఉన్నప్పటికీ కూడా—సహాయం చేసినప్పుడు యహువః మీకు ఇచ్చుననే విశ్వాసాన్ని మీరు కనబరుస్తున్నారు. ఇది మీరు ఇచ్చిన దానికి యహువః తిరిగి చెల్లించుననే మీ విశ్వాసం యొక్క బహిరంగ ప్రకటన.

పౌలు తనకు ఇచ్చుటలోని ఫిలిప్పీయుల యొక్క ఉదారతను మెచ్చుకున్నాడు, అది వారి ఆధ్యాత్మిక ప్రయోజనానికి కారణమని పేర్కొంటూ, యః వారికి తిరిగి ప్రత్యుపకారం చేయుననే హామీని జోడించాడు.

ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప నారంభించి మాసిదోనియలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపువారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియును.

ఏలయనగా థెస్సలొనీకలో కూడ మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి.

నేను యీవిని అపేక్షించి యీలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తారఫలము రావలెనని అపేక్షించి చెప్పుచున్నాను.

నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను; అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునైయున్నవి.

కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యహూషువఃనందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. (ఫిలిప్పీయులకు 4:15-19)

ఆ విధంగా, ప్రాచీన ఇశ్రాయేలీయులు మరియు ప్రారంభ క్రైస్తవులు కూడా పేదలకు ఇచ్చుటను ఒక ఆరాధనా చర్యగా భావించారు, ఎందుకంటే పేదలకు ఇచ్చుటలో మీరు యహువఃతో వ్యవహరిస్తున్నారు. కాన్‌స్టాంటినోపుల్‌లోని నాల్గవ శతాబ్దపు ప్రధాన బిషప్ అయిన జాన్ క్రిసోస్టమ్, పేదలను, నిజమైన అర్థంలో, యహువఃను ఆరాధించే బలిపీఠంగా చూడవచ్చని బోధించాడు. అతను ఇలా వ్రాశాడు, “ఎప్పుడైనా . . . మీరు ఒక పేద విశ్వాసిని చూసినప్పుడు, మీరు ఒక బలిపీఠాన్ని చూస్తున్నారని ఊహించుకోండి. మీరు బిచ్చగాడిని కలిసినప్పుడు, అతనిని అవమానించకండి, కానీ అతనిని గౌరవించండి. ఇది ఆధునిక విశ్వాసులను కాస్త బలంగా కొట్టవచ్చు, కానీ క్రీస్తు స్వయంగా తీర్పు యొక్క శక్తివంతమైన ఉపమానంలో ఈ విషయాన్ని బోధించాడు.

బలమైన విశ్వాసం యొక్క గొప్ప బహుమానాలు! image

తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.

అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి;

తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును.

అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.

నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి;

దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును.

అందుకు నీతిమంతులు ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకాహారమిచ్చి తిమి? నీవు దప్పిగొనియుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి?

ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి?

ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు.

అందుకు రాజు మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.

అప్పుడాయన యెడమ వైపున ఉండువారిని చూచి శపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.

నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు; దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు;

పరదేశినై యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు; దిగంబరినై యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు; రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును.

అందుకు వారును ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పిగొని యుండుటయైనను, పరదేశివై యుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను, రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను చూచి, నీకు ఉపకారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు.

అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును.

వీరు నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు. (మత్తయి 25:31-46)

మనం ఇతరుల బాధలను ఏ విధంగానైననూ తీర్చినప్పుడు, వారు అనుభవిస్తున్నదంతటినీ అనుభవించే తండ్రి యొక్క బాధలను మనం చాలా నిజమైన మార్గంలో తీరుస్తున్నట్లే. అలాగే, మనం అవసరమైన వారికి మన సహాయాన్ని నిలిపివేసినప్పుడు, మనము తండ్రికి దానిని నిలిపివేస్తాము. ఇతరులకు ఇచ్చుట అలా ఒక ప్రత్యేకత మరియు ఆరాధన చర్య అవుతుంది.

యహూషువః ఉపమానంలోని ధనవంతుడు తాను ధనవంతుడైన కారణంగానో లేదా పెద్ద గాదెలు నిర్మించాలనుకొనుట కారణంగానో మూర్ఖుడు కాలేదు. అతని దృష్టంతా ఇతరులకు సహాయం చేయుటపై కాకుండా (ఇది అతనికి పరలోకపు పుస్తక జాబితాలో ఒక నిధిని సమకూర్చి యుండేది) భూమిపై ధనమును సమకూర్చుకొనుటపైనే ఉండుట వలన అతడు ఒక మూర్ఖుడుగా ఉన్నాడు.

మనలో ప్రతి ఒక్కరూ మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, నేను ఇచ్చే నా దృక్పథం యః పై నా విశ్వాసాన్ని గూర్చి ఏమి వెల్లడిస్తుంది?

బలమైన విశ్వాసం యొక్క గొప్ప బహుమానాలు! image


1ది సెంచరీ డిక్షనరీ

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.