World's Last Chance

At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

మనకు విడుదల కలిగించే సత్యం

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

మనకు విడుదల కలిగించే సత్యం

రాబోయే యహువః రాజ్యం యొక్క నిజమైన సువార్త వాస్తవికంగా జీవితాలను ఎలా మార్చగలదో అని చాలా మంది ప్రజలు ఆశ్చర్యపోవడాన్ని ఇటీవల నేను విన్నాను. ఈ ప్రత్యేక సందేశం ద్వారా రక్షణ కలుగుతుంది? ఎలా? ఇవి మంచి ప్రశ్నలు. విశ్వసించినప్పుడు రాజ్య సువార్తలోగల అలాంటి శక్తిని ఎలా పొందుకుంటాము అనేదానికి సమాధానమిచ్చుటకు ప్రయత్నించడం మరియు ఇంతకుముందు అందించబడిన ఈ విశ్వాసం పట్ల మన శ్రద్ధను ప్రోత్సహించడం ఈ కథనం యొక్క ఉద్దేశ్యం.

యహువః నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. (ఆత్మ, ఆదికాండము 2: 7). భౌతిక మనిషికి ఆత్మ లేదని, భౌతిక మనిషి ఆత్మ అని దయచేసి జాగ్రత్తగా గమనించండి. సృష్టికర్త తన పిల్లలను తాను-ఇచ్చిన విధిలో— భూమిని పరిపాలించే మార్గంలో ఉంచాడు (ఆదికాండము 1: 28). జీవ వృక్షం వారిని బ్రతికిస్తుంది. వేల సంవత్సరాల తర్వాత ప్రవక్త-రాజైన దావీదు కీర్తన 8: 3-8 లో ఇది నిజంగా మనిషి యొక్క విధి అని ధృవీకరించాడు.

హవ్వ

దాదాపు వెయ్యి సంవత్సరాల తరువాత కొత్త నిబంధనలో, హెబ్రీయులకు పత్రిక రచయిత మనం ఇంకా ఆ గమ్యాన్ని చేరుకోనప్పటికీ, రాబోయే యుగంలో మనం అలా చేస్తామని గుర్తు చేస్తున్నాడు (2:1-8 చూడండి). చివరకు, ప్రకటన 5:10 లో సమాధుల నుండి లేచిన భౌతిక మానవులు, రూపాంతరం చెందిన ఆత్మీయ శరీరాలను పొందుకొన్నవారు రాబోవు ఒక దినాన పరిపాలించుదురని మళ్ళీ హామీ ఇవ్వబడిన తర్వాత, మనం బైబిలులోని చివరి అధ్యాయానికి వస్తాము, ఇక్కడ మనిషి యహువః నియమించిన గమ్యానికి చేరుకుంటాడు మరియు భూమిపై జీవ వృక్షం తిరిగి ఇవ్వబడుతుంది, అది జనములను స్వస్థపరుస్తుంది (ప్రక. 22:1-2).

వాస్తవానికి, కథలో పూరించడానికి చాలా వివరాలు ఉన్నాయి, ప్రత్యేకించి యహూషువః క్రీస్తు రాబోయే యహువః రాజ్యాన్ని ప్రకటించి, అలా చేసినందుకు చంపబడ్డాడు మరియు ఆ రాజ్యాన్ని, ఆ కొత్త సృష్టిని ప్రారంభించేందుకు యహువఃచే నియమించబడిన వ్యక్తి అతడే అని నిర్ధారించడానికి మృతులలో నుండి లేపబడ్డాడు. ఇక్కడ విషయమేమిటంటే, రాబోయే యహువః రాజ్యానికి సంబంధించిన ఈ సందేశం మరియు ఆ రాజ్యం విషయంలో మెస్సీయ అయిన యహూషువఃకు సంబంధించిన విషయాలు సువార్తగా ఉన్నాయి – మానవజాతి కోసం యహువః ఉద్దేశ్యం మరియు ఆ ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి అతని ప్రణాళికను బహిర్గతం చేయడం. యహువః-ఇచ్చిన మహిమను కలిగియున్న పురుషులకు మరియు స్త్రీలకు, ఒకదినాన ఆ మహిమ పూర్తిగా ప్రసాదించబడుతుంది (2 కొరి. 3:18; 1 యోహాను 3:2).

యహువః నుండి సువార్త ద్వారా వచ్చిన సందేశం స్పష్టంగా ఉండుటను చూసాము; నేల మట్టి నుండి తయారైన భౌతిక మానవులు ఆయనతో తండ్రి/పిల్లల సంబంధం కలిగియుండి ఆయన సృష్టి యొక్క వ్యవహారాలను విజయవంతంగా నిర్వహించువారిగా తమ సృష్టికర్త/తండ్రి దృష్టిలో ఉన్నారు. వాస్తవానికి, ఈ విజయానికి ముందుగా ఈ ప్రణాళికకు మద్దతిచ్చే సందేశాన్ని యహువః పిల్లలు విశ్వసించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా పిల్లలు వారు సహజంగానే “మంచివారు” అని తమ తల్లిదండ్రులు విశ్వసించకపోతే (నిజానికి ఎదుగుట మరియు పరిపక్వం చెందాల్సిన అవసరం ఉన్నప్పటికీ), వారు తమ జీవితాల్లో భయపడి మరియు ఎందుకూ పనికిరానివారు అవుతారని మనకు తెలుసు. ఇది కేవలం మానవ మనస్సు యొక్క స్వభావం. పాపం అవిశ్వాసాన్ని అనుసరిస్తుంది. ఇది ఈ విధంగా రూపొందించబడింది. తండ్రి మరియు కుమారుడుతల్లిదండ్రులు వారిమీద ఉంచిన నమ్మకం మరియు ప్రేమాభిమానాలకు సంబంధించిన సానుకూల అంచనాపై నమ్మకముంచుట అనేది ప్రతి బిడ్డ విజయవంతంగా పరిపక్వం చెందడానికి మరియు అతడు లేదా ఆమె తాము నిర్ణయించబడిన దానిలోకి ఎదగడానికి తమ గుండెల్లో ఆవశ్యకతతగా ఉండాలి. మీరు ఈ స్థానం నుండి ప్రారంభించకపోతే, అనుకున్న ఫలితాన్ని సాధించలేరు. ఎలాగైనా, మీరు ఈ ప్రారంభ స్థానానికి తిరిగి రావాలి. ఈ స్థానం నుండి ప్రారంభించిన పిల్లవాడు (లేదా పెద్దలు) విజయవంతంగా పరిపక్వం చెందడానికి మరియు అతడు లేదా ఆమె పుట్టుటకు గల కారణాన్ని నెరవేర్చుటకు ఉత్తమమైన అవకాశాన్ని కలిగి ఉంటారు. మళ్ళీ, ఇది ప్రణాళిక ద్వారా. తండ్రి/పిల్లల సంబంధానికి సంబంధించిన ఇదే సూత్రం యహువఃతో మనకున్న సంబంధాన్ని మరియు ఆయన మనకోసం ఉద్దేశించిన విధిని మరియు కీర్తిని సురక్షితమయ్యేలా చేసే మన సామర్థ్యానికి సంబంధించి ఉంటుంది. అందుకే సువార్త, లేదా “రాజ్యం యొక్క వాక్యం, లేదా కేవలం “వాక్యం” అనేది విశ్వసించువారందరికీ రక్షణ కొరకైన యహువః శక్తియై యున్నది (మత్తయి. 13:19; మార్కు 4:14; లూకా 8:11 పోల్చండి). ఈ సందేశంలోనే యహువః తన సృష్టి యొక్క శిఖరంపై (అతని భౌతిక, మానవ పిల్లలపై) నమ్మకాన్ని ప్రకటించాడు. ఈ సువార్త సందేశపు మాటలలోనే విశ్వాసం ఆధారంగా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని తిరిగి మార్చగల పరిశుద్ధాత్మ శక్తి ఉంది (1 థెస్స. 2:13). యహువః రూపకల్పన ప్రకారం, మానవ మనస్సు ఈ విధంగా పనిచేస్తుంది.

దురదృష్టవశాత్తూ, యహువః నుండి వచ్చిన ఈ సందేశంపై అవిశ్వాసం మొదటి నుండి మానవజాతి యొక్క సామూహిక క్రియా రాహిత్యానికి మరియు పాపభరితమైన ధోరణులకు వెనుక చోదక శక్తిగా ఉంది. విశ్వాసంతో ముందుకు సాగాలని మన తల్లిదండ్రుల సాధారణ ప్రోత్సాహం తర్వాత అతి త్వరగా ఏమి జరిగిందో పరిశీలించండి. ఆదికాండము 3 లో మన విరోధియైన అపవాది యొక్క సూక్ష్మ మోసం ద్వారా అవిశ్వాసం, తద్వారా అవిధేయత ఎలా ప్రవేశించాయో క్లుప్తంగా వివరించబడింది. యహువః దృష్టిలో అంగీకారయోగ్యంగా ఉండాలంటే వారు మానవుల కంటే ఎక్కువగా ఉండాలని పిల్లలు విశ్వసించేలా మనం నడిపించబడ్డాము. ఆధ్యాత్మికంగా వివేచన జ్ఞానాన్ని పొందడం ద్వారా, వారు భౌతిక శరీరంలోని జీవితానికి మాత్రమే పరిమితం కాకుండా ఉంటారు. యహువః సందేశాన్ని నమ్మకపోవడం మరియు అవిధేయత చూపడం ద్వారా వారు “చావనే చావరు” (ఆది. 3:1-5) అనే తప్పుడు సమాచారం వారికి అందించబడెను. భౌతిక శరీరం మరణించవచ్చు, కానీ జీవితం స్పష్టంగా ఏదో ఒక రకమైన “ఆత్మ” రాజ్యంలో కొనసాగుతుంది. మరియు ఖచ్చితంగా, వివిధ రూపాల్లో, “అమర్త్య ఆత్మ” యొక్క సిద్ధాంతం విశ్వవ్యాప్తంగా ఆమోదించబడింది, ఇది తప్పుడు తాత్విక జ్ఞానం ద్వారా బలపరచి నిర్మించిన ఏకైక ప్రపంచ మత వ్యవస్థకు పునాది అని చెప్పవచ్చు. ఇది “విశ్వాస విధేయత” (రోమా. 1:5; 16:26) ద్వారా మరియు మన తండ్రి యొక్క దయ ద్వారా సమర్థించబడిన బైబిలు సత్యానికి చాలా వ్యతిరేకం. భౌతిక మానవులు యహువః-నిర్ణయించిన తమ విధిని చేరుకోవడానికి సరిపోరు అనే సూక్ష్మ సందేశాన్ని తప్పుడు వ్యవస్థ పంపుతుంది మరియు తద్వారా అది యాహువః పిల్లల ఆధ్యాత్మిక ఎదుగుదలపై కుంటుపడే ప్రభావాన్ని చూపుతుంది. అమర్త్యమైన ఆత్మ ద్వారా స్వర్గానికి (లేదా నరకానికి) వెళ్లడం బైబిలు ప్రకారం తప్పు మాత్రమే కాదు, కానీ అది యహువః పిల్లల మనస్సు మరియు హృదయానికి హాని కలిగిస్తుంది. రాబోవు యహువః రాజ్యాన్ని గూర్చిన నిజమైన సువార్త మరియు ఆ రాజ్యంలో పాలించడానికి మరణించిన భౌతిక మానవుల పునరుత్థానమవుట అనేవి మాత్రమే మానవ మనస్సును మరియు హృదయాన్ని సరిదిద్దడానికి ఒక దిద్దుబాటు శక్తిగా పనిచేస్తాయి.

నూతన జన్మ

మన పాఠకులలో చాలా మందికి తెలిసినట్లుగా, భౌతికమైనది “చెడ్డది” లేదా భౌతిక శరీరంలో నివసించే “మంచి” అని భావించే అమర్త్య ఆత్మ కంటే భౌతికమైనది చాలా తక్కువ ప్రాధాన్యత గలది అనే ఊహపై ఈ అమర్త్య ఆత్మ యొక్క సిద్ధాంతం ఏర్పడియున్నది. ఈ ఊహాత్మక దృష్టాంతం ప్రకారం “నిజమైన” జీవి ఈ శాశ్వతమైన/అమరమైన ఆత్మ అయితే, శరీరం ఆ ఆత్మను తాత్కాలికంగా కలిగియుండే నాసిరకమైన బాహ్య తొడుగు మాత్రమే. ఇది ఒక గ్రీకు తాత్విక భావన, బైబిలుకు అన్యమైనది మరియు ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంగా నిలుస్తుంది. ఇది యహువః స్వరూపంలో సృష్టించబడిన తన భౌతిక మానవ పిల్లలకు వినాశకరమైనదిగా ఉంటూ వారిని పాపానికి బందీలుగా ఉంచే ప్రభావాన్ని కలిగి ఉంది. ఇది స్వాభావికమైన విలువ మరియు ప్రేమకు సంబంధించిన విషయంలో తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని కలిగియుండాల్సిన అవసరత గలవారిగా యహువః రూపొందించిన కర్బన-ఆధారిత పిల్లలకు “మీరు చేయగల శక్తి లేనివారు” అనే సందేశాన్ని పంపుతుంది. కానీ నిజం ఏమిటంటే, మనం దేనికోసం సృష్టించబడ్డామో అంతటి విలువైనవాళ్ళం, ఎందుకంటే మనం యహువః స్వరూపంలో సృష్టించబడ్డాము మరియు మన తండ్రి అలా చెప్పారు. ఇప్పుడు ఇది పరిపూర్ణ దయ, తన పిల్లల పట్ల తండ్రి యొక్క దయ! ఎంత సరళమైనది, ఆచరణాత్మకమైనది, తార్కికమైనది మరియు ఇంకా అద్భుతమైనది! మరియు మానవ మనస్సు మరియు హృదయానికి ఎంత శక్తివంతమైన సందేశం!

మనిషి యొక్క ఈ భౌతిక/అభౌతిక ద్వంద్వత్వం హెబ్రీ గ్రంథం ద్వారా యహువః నుండి మనకు వచ్చిన ప్రత్యక్షతలో పాత నిబంధనలో గానీ కొత్త నిబంధనలలో గానీ కనుగొనబడలేదు. మానవుడు ఆత్మ అని, ఈ ఆత్మ (భౌతిక జీవి) చనిపోతుందని బైబిలు పదే పదే ప్రకటిస్తుంది (యెహెజ్కేలు 18:20; మత్తయి 10:28). మరణం తరువాత, ప్రతి వ్యక్తి ఒక నూతనమైన, అమర్త్యమైన, మహిమాన్విత శరీరాన్ని పొందుకొనే వరకు; భౌతిక శరీరం సమాధి నుండి పైకి లేపబడే వరకు, నిద్రపోతాడు. మళ్ళీ, యహువః యొక్క సందేశం ఏమిటంటే భౌతిక/పదార్ధమైన శరీరం “మంచిది”; అయితే మొదటి నుండి అబద్ధ బోధ యొక్క సందేశం ఏమిటంటే, పదార్థం “తగినంత మంచిది కాదు.” ఈ తరువాతి అబద్ధ విశ్వాస వ్యవస్థలో పిల్లలు విజయవంతంగా పనిచేయలేరు లేదా తగిన విధంగా పరిపక్వం చెందలేరు. వారు ఈ వ్యవస్థలో ఉంటూ భయపడేవారిగా, పోట్లాడేవారిగా, అసూయపడేవారిగా, వ్యభిచారులుగా మరియు నరహత్యలు చేసే తోబుట్టువులుగా కూడా మారతారు. ఈ రకమైన విశ్వాసం (వాస్తవానికి “అవిశ్వాసం”) పై ఆధారపడిన మనస్సులో లేదా ప్రపంచంలో యహువః ఆత్మ పనిచేయదు.

లైట్ తో మనిషిఅందుకే యహువః రాజ్య సువార్త అనేది స్త్రీపురుషులను పాపం మరియు అన్యాయం నుండి విముక్తి చేయుటను ప్రారంభించగల సత్యం (యోహాను 8:32; లూకా 4:18). మనకు వచ్చే అనారోగ్యానికి ఒకే ఒక విరుగుడు ఉంది, అది ఈ రాజ్య సువార్త సందేశం. చీకటితో నిండిన ప్రపంచంలో, ఇది రక్షణ మరియు స్వస్థత కోసం ఆశ యొక్క చొచ్చుకుపోయే కాంతి.

యహూషువః తాను భూమిపైకి తిరిగి వచ్చినప్పుడు భూమిపై “విశ్వాసాన్ని” కనుగొనలేడని అంచనా వేస్తున్నట్లు అనిపించింది (లూకా 18:8). ఇప్పుడు చూస్తే, అది సరైనదేనని అనిపిస్తుంది. అయితే విశ్వసించిన వారితో ఆయన “లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి” (మత్తయి 25: 34) అని చెబుతాడు.

గమనిక: యహువః కుమారుడైన యహూషువః తన మానవ జన్మకు పూర్వం ఉన్న శాశ్వతమైన జీవి అని ప్రకటించే త్రిత్వ భావన సహజంగా అమర-ఆత్మ సిద్ధాంతానికి సమాంతరంగా ప్రవహించే సహచర సిద్ధాంతం. మరోసారి, మనం (బహిష్కరణ బెదిరింపుల ద్వారా కూడా బలవంతం చేయబడతాము) మానవుడిగా ఉండటం సరిపోదని విశ్వసించాలని అడగబడ్డాము. అందుకే ఈ బోధన మరియు నమ్మకం మానవులకు మరియు వారి ఆధ్యాత్మిక పరిపక్వత ప్రక్రియకు చాలా ప్రమాదకరం.


ఇది రాబిన్ టాడ్ రాసిన వ్యాసం WLC వ్యాసం కాదు.

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి – కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృందం.

Comments

Leave a Reply

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.