World's Last Chance

At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

మానవునితో ఆయన ఆలయం: తండ్రి హృదయం యొక్క రహస్య కోరిక!

క్రొత్తగా నిర్మించబడు భూమిపై దేవాలయం ఉండదు అనే ఊహను సాతాను ప్రోత్సహించాడు. ఆవిధంగా, సృష్టికర్త హృదయం యొక్క లోతైన కోరిక తెలియబడలేదు మరియు ప్రశంసించబడలేదు.

జలపాతం


గ్రంథంలో ఉన్న హృదయాన్ని కరిగించే సత్యం సృష్టికర్త తన పిల్లలతో నివసించాలని కోరుకొనుట. పాపానికి ముందు, ఏదేను వనము ఒక కోణంలో, యః యొక్క దేవాలయం, ఎందుకంటే సృష్టికర్త తన మానవ పిల్లలతో గడపడానికి “చల్ల పూటను” వచ్చుచుండేవాడు. (ఆదికాండము 3: 8 చూడండి.) ఆదాము పతనం తరువాత, ఆయన ఇకపై మానవ జాతితో ముఖాముఖి సంభాషణ చేయలేకపోయినప్పుడు ఇటువంటి సన్నిహితమైన, తండ్రి యొక్క ఆత్మ-సహవాసము/సమాజం కోల్పోబడెను.

మోషే కాలంలో ఈ సహవాసం పాక్షికంగా పునరుద్ధరించబడింది. యహువః మోషేతో ఇలా అనెను: “నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను.” (నిర్గమకాండము 25:8).

యహువః గుడారమును తన నివాసంగా చేసుకున్నాడు. నిబంధనా మందసము యొక్క కరుణా పీఠం పైన ఉన్న షెకిన్యా మహిమలో ఆయన యొక్క దృశ్యమైన ఉనికిని చూడవచ్చు.

అరణ్యంలోని గుడారం మరియు తరువాత నిర్మించబడిన రెండు దేవాలయాలూ యహువఃకు గృహాలుగా ఉండెను, అక్కడ ఆయన మానవజాతితో నివశించేవాడు. అన్యజనుల దేవాలయాల మాదిరిగా అవి గొప్ప మెట్లు మరియు ఎత్తైన వేదికలతో కాకుండా, యహువః ఆలయంలో మెట్లు ఉండకూడదు. తన పిల్లలు ఆయన దగ్గరకు కష్టపడి ఎక్కి రావాలని ఆయన కోరలేదు. ఆయనే వారి స్థాయికి దిగి అక్కడ వారిని కలుస్తాడు.

నూతన యెరూషలేములోని ఆలయం

నూతన యెరూషలేము పరలోకం నుండి దిగి వచ్చుటను యోహాను చూసినప్పుడు, ఆయన స్పష్టమైన మరియు విలక్షణమైన మినహాయింపును గమనించాడు. పరిశుద్ధ పట్టణం యొక్క రూపాన్ని వివరించిన తరువాత, అతడు ఇలా చెప్పాడు, “దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు.” (ప్రకటన గ్రంథము 21:22). ఈ ఒక్క పదం అత్యంత విలువైన సత్యాన్ని దాచిపెట్టుటకు కారణమైన విస్తృతమైన ఊహకు దారితీసింది: నూతన యెరూషలేములో దేవాలయ భవనం ఉండదు ఎందుకంటే నూతన యెరూషలేమే యహువః ఆలయం! యోహాను దీనిని ధృవీకరిస్తూ: “దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధి కారియైన యహువఃయును, గొఱ్ఱెపిల్లయు దానికి దేవాలయమై యున్నారు.”

దేవాలయాలు ఎల్లప్పుడూ దైవముల నివాసాలు. ఆ విధంగా, యహువః ఉనికి ఉన్నచోట ఆయన ఆలయం ఉంటుంది. పౌలు కొరింథీయులను ఇలా అడిగాడు: “మీరు ఎలోహీం ఆలయమైయున్నారనియు, ఎలోహీం ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?” (1 కొరింథీయులకు 3:16 చూడండి.)

ఆదాము పతనం తరువాత తండ్రి తిరిగి మానవుని మధ్య అడుగు పెట్టవలసి వచ్చినప్పటి నుండి ఇలా తండ్రి ఎంతో ఆశగా కృషి చేస్తున్నాడు. ఆయన తన ప్రతి పిల్లలతో సన్నిహితమైన మరియు ప్రేమపూర్వక సంబంధం కోసం ఎంతో ఆశపడెను. మరియు, యాహూషువః కొత్తగా తయారుచేయబడిన భూమిపైకి నూతన యెరూషలేము దించబడువరకు, ఆయన తన హృదయ కోరికను కలిగియుంటూనే ఉంటాడు.

సూర్య కాంతి

మానవత్వంతో నివసించుచు దైవత్వం

రక్షణ ప్రణాళిక చివరికి ఆదాము పతన సమయంలో కోల్పోయిన సృష్టికర్త మరియు మానవుని మధ్య గల సన్నిహిత సంబంధాన్ని పునరుద్ధరిస్తుంది. ఇది జయించినవారికి వాగ్దానం చేయబడిన బహుమానం మరియు నూతన యెరూషలేములో ప్రత్యేకమైన ఆలయ నిర్మాణం కనబడుటలేదు ఎందుకంటే, ముందటి ఏదేను వనము వలె, నూతన యెరూషలేము కూడా ఆలయమే. విశ్వాసం ద్వారా రక్షణ బహుమానాన్ని అంగీకరించే వారందరూ సర్వశక్తిమంతుని ఉనికిని కలిగి ఉన్న ఆ దేవాలయంలో, సజీవ ఆలయంలో భాగస్వాములుగా చేర్చబడి గౌరవించబడతారు.

మనుష్యులచేత విసర్జింపబడినను, ఎలోహీం దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు అదోనాయ్ నొద్దకు వచ్చినవారై,
యహూషువః మెస్సీయ ద్వారా ఎలోహీంకి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు,
మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

“ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు
అమూల్యమునగు మూలరాతిని సీయోనులొ స్థాపించుచున్నాను;
ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు”
(1 పేతురు 2: 4-6 చూడండి.)

జయించిన వారికి ఇవ్వబడు బహుమానం ఇది!

అడవుల్లో ఉన్న వ్యక్తి

విశ్వసనీయతకు ప్రతిఫలం

పౌలు ఇలా చెప్పెను: “ఇందును గూర్చి ఎలోహీం తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.” (మొదటి కొరింథీయులకు 2:9.) మానవ హృదయమునకు గోచరముకాని ఆ ప్రతిఫలం: యహువః సమక్షంలోనే జీవించుట.

యహూషువః ఇలా వాగ్దానం చేసాడు: “జయించు వానిని నా ఎలోహీం ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలుపలికిపోడు. మరియు నా ఎలోహీం పేరును, పరలోకములో నా ఎలోహీం యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా ఎలోహీం పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.” (ప్రకటన 3:12, KJV)

యాహువఃను పడిపోయిన మానవత్వంతో తిరిగి ఐక్యపరుచుటకు యహూషువః జన్మించాడు. గెత్సెమనేలో తాను పట్టుబడుటకు ముందు, ఆ సమయమంతా ఆయన విశ్వాసుల కోసం ప్రార్థించాడు:

మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమైయున్నలాగున, వారును ఏకమైయుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. (యోహాను సువార్త 17:20-23.)

క్రీస్తు ద్వారా, విశ్వాసులు యహువఃతో రాజీచేయబడ్డారు. యెషయా ఇలా ప్రవచించాడు: “కాబట్టి అదోనాయ్ తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.” (యెషయా గ్రంథము 7:14.) ఇమ్మానుయేలు అను పేరుకి “ఎలోహీం మనతో” అని అర్థం. ఈ వాగ్దానం, యహూషువః జన్మించినప్పుడు పాక్షికంగా నెరవేరింది, కానీ, తండ్రి తన పరిశుద్ధులతో శాశ్వతంగా నివాసముండుటకు నూతన యెరూషలేమును భూమిపైకి దించినప్పుడు అది దాని అంతిమ నెరవేర్పుకు చేరుకుంటుంది.

అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న ఎలోహీం యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో ఎలోహీం నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, ఎలోహీం తానే వారి ఎలోహీమై వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.” (ప్రకటన గ్రంథము 21:1-4.)

ఈ రోజే రక్షణను అంగీకరించుటకు ఎంచుకోండి అప్పుడు మీరు కూడా, తండ్రితో ఏకమై అపరిమితమైన ఆనందంలో శాశ్వతంగా ఆనందిస్తూ గడపవచ్చు.

యహువః ఆలయం మరియు నూతన యెరూషలేము గురించి మరింత సమాచారం కోసం, WLC రేడియోలో “హిజ్ టెంపుల్ విత్ మెన్: ది సీక్రెట్ లాంగింగ్ ఆఫ్ ది ఫాదర్స్ హార్ట్” ఎపిసోడ్ వినండి!


ఎటర్నల్ లవ్ సిరీస్ కూడా చూడండి:

Comments

Leave a Reply

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.