World's Last Chance

At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

హనోకు & ఏలియా స్వర్గంలో లేరు! వారు ఎక్కడ ఉన్నారని బైబిలు చెబుతుందో మీకు తెలుసా?

క్రైస్తవులు హనోకు మరియు ఏలియా స్వర్గానికి “కొనిపోబడిరి” అని చాలా కాలంగా నమ్ముతున్నారు. అయితే, ఆ నమ్మకం తప్పు ఊహపై ఆధారపడి ఉంటుంది. యహువః వారిని తీసుకున్న తర్వాత నిజంగా ఏమి జరిగిందని బైబిలు చెబుతుందో తెలుసుకోండి. ఇది మీకు ఇప్పటివరకు చెప్పబడుతున్నది కాదు!

మీరు పూర్తిగా తప్పులో ఉన్నారని తరువాత తెలుసుకోవడానికి మాత్రమే దేనినైనా నిజమని మీరు ఎప్పుడైనా విశ్వసించారా . . . (అదంతా ఎందుకంటే మీ నమ్మకం తప్పు ఊహపై ఆధారపడుట వలన)? నేను విశ్వసించాను! మరియు సత్యాన్ని తెలుసుకొనుట ఎల్లప్పుడూ నన్ను ఆశ్చర్యపరుస్తుంది, ఎందుకంటే, సాధారణంగా, వాస్తవాలు అన్నింటికీ ఉన్నాయి, నేను అప్పటికి వాటిని పట్టించుకోలేదు ఎందుకంటే అవి నా ఊహతో ఏకీభవించలేదు.

హనోకు మరియు ఏలియా కథలలో అదే జరిగింది. యః వారిని “తీసుకున్నప్పుడు”, అతడు వారిని స్వర్గానికి తీసుకువెళ్ళాడని మనము ఊహించాము. కానీ అది అలా కాదు మరియు నేను దానిని బైబిల్ నుండి నిరూపించగలను!

హనోకు

హనోకుహనోకు గురించి మనకు తెలిసినవాటిలో చాలా వరకు ఆదికాండము 5 లోని నాలుగు చిన్న వచనాలలో ఉన్నాయి:

హనోకు అరువది యైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందలయేండ్లు యహువఃతో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు. హనోకు యః తో నడిచిన తరువాత యః అడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను. (ఆదికాండము 5:21-24)

హనోకు ఇప్పటికీ యః తో నడుస్తున్నాడని మోషే చెప్పకపోవడం ఆసక్తికరం. చెప్పాలనుకుంటే అతడు ఖచ్చితంగా అలా చేయగలడు; అతడు దానిని వ్యక్తీకరించడానికి పదాలను కలిగి ఉన్నాడు! కానీ అలా చేయలేదు. బదులుగా, అతడు దానిని హనోకు (గత కాలంలో) చేసిన పనిగా పేర్కొన్నాడు. ఇంకా, మోషే స్పష్టంగా ఇలా చెబుతున్నాడు: “హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు.” మనము ఊహించినట్లుగా హనోకు స్వర్గానికి కొనిపోబడినట్లయితే, అతని రోజుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. కానీ మోషే చెప్పినది అది కాదు.

కారణం చాలా సులభం: హనోకు మరణించాడు. ఆ హింసాత్మక, పూర్వపు కాలంలో, ఈ ధర్మ బోధకుడు వాస్తవానికి హత్య చేయబడుట కూడా చాలా సాధ్యం. పవిత్రమైన లేఖనాల జాబితా ఈ వివరాల గురించి మౌనంగా ఉంది. ఏదేమైనా, మనం నిస్సందేహంగా తెలుసుకోగల ఒక వాస్తవం హనోకు మరణించాడనుట. సహస్రాబ్ది తరువాత, ప్రియమైన యోహాను, ప్రేరణతో ఇలా వ్రాశాడు: “పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.” (యోహాను 3:13) దీనిని “ఆల్-నెస్” స్టేట్‌మెంట్ అంటారు. ఇది ప్రతి ఒక్కరినీ కలుపుకొని ఉంది: “ఎవరూ పరలోకానికి ఎక్కలేదు.”

ఈ గందరగోళమంతా “కొనిపోయెను” అనే పదం వలన వచ్చింది. హెబ్రీయులు 11: 5 ఇలా చెబుతోంది: “విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను; … కాగా యహువః అతడిని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు.” కొనిపోబడినప్పుడు హనోకు పరలోకానికి తీసుకోబడెనని చెప్పలేదని గమనించండి. అతడు కనబడలేదని అది పేర్కొంది.

“కొనిపోయెను” అనే పదం గ్రీకు పదమైన మెటాటిథెమి/metatithemi నుండి వచ్చింది. ఈ పదం యొక్క ప్రాధమిక నిర్వచనం “మరొక ప్రదేశానికి తెలియజేయడం . . . [బదిలీ].” 1 ఇదే గ్రీకు పదం, అపొస్తలుల కార్యములు 7: 16 లో యాకోబు మరణంను గూర్చి వివరించునప్పుడు ‘తేబడెను’ గా అనువదించబడెను, అతని దేహం షెకెమునకు తేబడి/కొనిపోబడి/మెటాటిథెమి, మక్పెలా గుహలో తన తండ్రులతో ఉంచబడెను. మరో మాటలో చెప్పాలంటే, యహువః తరువాత మోషేకు ఏమి చేయబోతున్నాడో అదే‌ హనోకుకు చేసాడు: “యహువః సేవకుడైన మోషే యహువః మాటచొప్పున మోయాబు దేశములో మృతినొందెను. బెత్పయోరు యెదుట మోయాబు దేశములోనున్న లోయలో ఆయన [యహువః] అతడిని [మోషేను] పాతిపెట్టెను. అతని సమాధి యెక్కడనున్నదో నేటివరకు ఎవరికి తెలియదు.” (ద్వితీయోపదేశకాండము 34: 5-6, కెజెవి)

మోయాబు

హనోకు కొనిపోబడెను అనే పదబంధం ప్రకారం, “అతడు మరణాన్ని చూడకూడదు,” అయితే రెండు మరణాలు ఉన్నాయని లేఖనం బోధిస్తుందని గుర్తుంచుకోండి: పాపం ఫలితంగా శరీర మరణం ఉంది, మరియు ఆత్మ యొక్క మరణం (అంతిమ నాశనం) ఉంది. పశ్చాత్తాపంతో యః వైపు తిరగడానికి నిరాకరించిన వారందరికీ ఈ విధి ఎదురుచూస్తోంది. ఈ రెండవ మరణం గూర్చియే హెబ్రీ 11 రచయిత ప్రస్తావించినందున, తరువాత, అదే అధ్యాయంలో, అతడు నిస్సందేహంగా ఇలా చెప్పాడు, “వీరందరు తమ విశ్వాసముద్వారా సాక్ష్యము పొందినవారైనను మనము లేకుండ సంపూర్ణులుకాకుండు..” (హెబ్రీయులు 11:39). హెబ్రీయులు 11 లో చెప్పబడిన ప్రతిఒక్కరూ — మరియు అందులో హనోకు కూడా — భౌతిక మరణం మరణించారు, కాని విశ్వాసం ద్వారా వారు వినాశనం యొక్క రెండవ మరణాన్ని చూడరు”.

ఏలీయా

ఏలీయాఏలీయా కథ ముఖ్యంగా రహస్యంగా ఉంది, ఎందుకంటే యహువః అతడిని అగ్ని రథంపై మరొక ప్రదేశానికి “తీసుకువెళ్లెను”, అయితే, తరువాత అతడు కనీసం నాలుగైదు సంవత్సరాలు భూమిపై నివసించెనని లేఖనం వెల్లడించింది! 2.

రెండవ రాజులు 2:11 ఇలా చెబుతోంది, “ఏలీయా సుడిగాలి చేత ఆకాశము/పరలోకమునకు ఆరోహణ మాయెను.” గ్రంథంలోని “ఆకాశము” అనే పదం వాస్తవానికి అనేక స్థాయిలను సూచిస్తుంది. అక్కడ వాటిలో—మూడవ ఆకాశం—ఇది సృష్టికర్త యొక్క నివాసం. గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు ఉన్న రెండవ ఆకాశం కూడా ఉంది. 2వ రాజులు 2: 11 లో సూచించిన ఆకాశం మొదటి ఆకాశం: వాతావరణం. సహజంగా, ఒక సుడిగాలి ఉండాలంటే, అది “ఆకాశం” యొక్క మొదటి స్థాయిలో ఉండాలి. మనము అర్థం చేసుకున్నట్లుగా, భూమికి పైన గల వాతావరణాన్ని చుట్టి ఉండే ఒక పరిధికి మించి సుడిగాలి ఉండదు.

తరువాత ఏలియాకు ఏమి జరిగిందో మరింత ఆసక్తికరంగా ఉంది. ఏలియా ఎక్కడికి తీసుకెళ్లబడెనో గ్రంథం చెప్పలేదు, కాని యూదా మరియు ఇశ్రాయేలు రాజుల చరిత్రను తెలుసుకున్న తర్వాత ఏలియా జీవించి ఉండగానే నాయకత్వం యొక్క ఆవరణ ఎలీషాకు చేరెను అని అర్థమవుతుంది. ఏలియా కొనిపోబడే ముందు, ఒక కొత్త రాజు ఇశ్రాయేలు సింహాసనాన్ని అధిష్టించెను. ఆధునిక పాఠకులకు తికమకగా ఉండేలా, ఇశ్రాయేలు యొక్క కొత్త రాజు యూదా రాజు పేరును కలిగియుండెను. వారిద్దరూ యెహోరాము అని పిలువబడిరి! (రెండవ రాజులు 1:17 చూడండి.) యూదా యొక్క యెహోరాము ఈ సమయంలో తన తండ్రి యెహోషాపాతుతో కలిసి రెండు సంవత్సరాలు పరిపాలించాడు. నాలుగు సంవత్సరాల తరువాత, క్రీస్తుపూర్వం 845 లో యెహోషాపాతు రాజు మరణించాడు. వెంటనే యూదా రాజు అయిన యెహోరాము సింహాసనాన్ని కాపాడుకోవడానికి తన సహోదరులను చంపాడు. అతడు యూదా అంతటా అన్యమతత్వాన్ని పునః స్థాపించుటకు పూనుకొనెను. “అతడు తన పితరుల ఎలోహీమ్‌ అయిన యహువఃను విడిచిపెట్టెను” అని బైబిలు నమోదు చేసింది. (రెండవ దినవృత్తాంతములు 21:10). అయితే, ఆశ్చర్యకరమైన విషయం జరిగింది! ఏలియా మరణించి ఉంటే లేదా యహువఃతో పరలోకంలో ఉంటే అక్కడ ఒక విషయం జరిగేది కాదు. దుష్ట రాజైన యెహోరాముకు ఒక ఉత్తరం వచ్చింది.

అతడు [యూదా యొక్క యెహోరాము] యూదా పర్వతములయందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్థులు దేవుని విసర్జించునట్లు చేసెను. యూదావారిని విగ్రహపూజకు లోపరచెను (వ్యభిచరింపజేసెను). అంతట ప్రవక్తయైన ఏలీయా యొక పత్రిక వ్రాసి అతనియొద్దకు పంపెను. నీ పితరుడగు దావీదునకు ఎలోహీమ్ అయిన యహువః సెలవిచ్చునదేమనగా, నీవు నీ తండ్రియైన యెహోషాపాతు మార్గములందైనను యూదారాజైన ఆసా మార్గములందైనను నడువక; ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచి అహాబు సంతతివారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్థులను వ్యభిచరింపజేసి, నీకంటె యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నీవు చంపియున్నావు. కాబట్టి గొప్ప తెగులుచేత యహువః నీ జనులను నీ పిల్లలను నీ భార్యలను నీ వస్తువాహనములన్నిటిని మొత్తును. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై యుందువు. (రెండవ దినవృత్తాంతములు 21:11-15)

ఇది ఆశ్చర్యకరమైనది! ఏలియా “సుడిగాలి ద్వారా ఆకాశంలోనికి వెళ్ళిన” సుమారు నాలుగు సంవత్సరాల తరువాత ఈ లేఖ వచ్చింది. (రెండవ రాజులు 2:11) అతడు తన తరువాతి సహజ జీవితం ఎక్కడ నివసించాడో మనకు తెలియదు, కానీ అది పరలోకంలో కాదు. స్పష్టంగా, యోహాను దాదాపు వెయ్యి సంవత్సరాల తరువాత చెప్పినట్లుగా, “పరలోకమునకు ఎవరునూ ఎక్కిపోలేదు” (యోహాను 3:13). హనోకు మరియు ఏలియాలు, సర్వోన్నతుని యొక్క నమ్మకమైన సేవకులుగా, అన్ని యుగాల యొక్క విశ్వాసులతో పాటు సజీవంగా లేచుటకును, భూమిపై శాశ్వతంగా జీవించుటకును యహూషువః రెండవ రాకడ కొరకు ఎదురుచూస్తూ, సమాధిలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ ఆశ్చర్యకరమైన ప్రత్యక్షతను గూర్చి లేఖనం నుండి మరిన్ని ఆధారాల కోసం, మా ఈ రేడియో కార్యక్రమం చూడండి: “లెర్న్ వాట్ హ్యాపెన్డ్ టు ఇనోక్ అండ్ ఏలియా. ఇట్స్ నాట్ వాట్ యు థింక్!”


1 క్రొత్త నిబంధన యొక్క గ్రీక్-ఇంగ్లీష్ లెక్సికాన్, 1969 ఎడిషన్.

2 యః యొక్క ఆత్మ ద్వారా కొనిపోబడుట వినని విషయం కాదు. కనీసం ఒకటి, లేదా బహుశా రెండు ఇతర సంఘటనలు లేఖనంలో ఇవ్వబడ్డాయి. మొదటిది, లూకా 4 లో నమోదు చేయబడింది, నజరేతు గ్రామస్తులు సబ్బాతు సందర్భంగా యహూషువఃను చంపడానికి ప్రయత్నించినప్పుడు:

సమాజమందిరములో ఉన్నవారందరు ఆ మాటలు విని, ఆగ్రహముతో నిండుకొని, లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్లగొట్టి, ఆయనను తలక్రిందుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటువరకు ఆయనను తీసికొని పోయిరి. అయితే ఆయన వారి మధ్యనుండి దాటి తన మార్గమున వెళ్లిపోయెను. అప్పుడాయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి, విశ్రాంతిదినమున వారికి బోధించు చుండెను. (లూకా 4:28-31)

రెండవ సంఘటన ఫిలిప్పు ఐతియొపీయ నపుంసకుడికి బాప్తిస్మం ఇచ్చిన తరువాత:

వారు నీళ్లలోనుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్లెను; అతడు ఫిలిప్పును మరి యెన్నడును చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడనుండి కైసరయకు వచ్చువరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. (అపొస్తలుల కార్యములు 8: 39-40)

Comments

Leave a Reply

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.