World's Last Chance

At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

దేవుడు-ఒక్కడే అను ఏకదైవవాదం ఎందుకు ఎక్కువ బైబిల్ దృక్కోణంలో ఉంది

యహువః స్వభావం ఏమిటి? మరి యహూషువః ఎవరు?

చారిత్రాత్మకంగా, ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చుటకు మూడు మార్గాలు ఉన్నాయి. మరియు, వీటికి సమాంతరంగా, బైబిల్ ను వివరించే మూడు మార్గాలు:

I. త్రిత్వవాదం: ఈ వాదన ప్రకారం యహువః వాస్తవానికి ముగ్గురు వ్యక్తులు: తండ్రియైన యహువః, కుమారుడైన యహువః మరియు పరిశుద్ధాత్మ అయిన యహువః. ప్రతి వ్యక్తి పూర్తిగా యహువః. అయితే, ముగ్గురు దేవుళ్ళు లేరు, కానీ ఒక్కడే. ఈ వ్యక్తులు: సహ-శాశ్వతమైన, సహ-ఆవశ్యకమైన, మరియు సహ-సమాన వ్యక్తులు. త్రిత్వవాదులు యహువఃను ఈ ముగ్గురు వ్యక్తులు మిళితమైయున్న ఒక దైవిక పదార్ధంగా చూస్తారు.

II. మోడలిజం: మోడలిజం యహువఃను ఒక వ్యక్తిగా పరిగణిస్తుంది, ముగ్గురు వ్యక్తులుగా కాదు. అయితే, మోడలిస్టులు, యహువః మూడు వేర్వేరు రీతుల్లో (modes) తనను తాను కనబరచుకొనునని నమ్ముదురు, అందుకే మోడలిజం అనే పదం వచ్చింది.
మరో మాటలో చెప్పాలంటే, యహువః గతంలో తన ప్రజలకు తండ్రిగా సంబంధం కలిగి ఉన్నాడు: తదుపరి మానవ అవతారం ద్వారా రెండవ విధం. ఆపై, పరిశుద్ధాత్మగా మూడవ విధం. మోడలిస్టులు యహువః ఒక్కడే అని, అయినప్పటికీ మూడు వేర్వేరు రీతులు లేదా ముసుగులలో కనిపించెనని నమ్ముతారు.

III. బైబిల్ సంబంధిత ఏకదైవవాదం: యహువః ఒక్కడే; ముగ్గురు వ్యక్తులు మిళితమైయున్న ఒక దైవిక పదార్ధం కాదు. ఇది షెమా యొక్క అసలైన అవగాహన: “ఇశ్రాయేలూ వినుము. మన ఎలోహీం అయిన యహువః అద్వితీయుడగు యహువః.” దేవుడు-ఒక్కడే అను ఏకదైవవాదపు దృక్పథంలో, యహూషువః యహువః యొక్క మానవ కుమారుడు మరియు పరిశుద్ధాత్మ మన మధ్య నివసించే యహువః యొక్క ఆత్మ. యహువః తప్ప రెండవ లేదా మూడవ వ్యక్తి లేడు.

ఈ క్రింది నాలుగు అంశాలు దేవుడు-ఒక్కడే అను ఏకదైవవాదం ఎందుకు ఎక్కువ బైబిలు దృక్కోణంలో ఉండెనో వివరించును.

1. యహువః ఎల్లప్పుడూ ఏకవచనంగా ప్రదర్శించబడును.

“ఇశ్రాయేలూ వినుము. మన ఎలోహీం అయిన యహువః అద్వితీయుడగు యహువః..” (ద్వితీయోప. 6:4)

దేవుడు-ఒక్కడే అను ఏకదైవవాదం ఎందుకు ఎక్కువ బైబిల్ దృక్కోణంలో ఉంది image

యహువః మనకు లేఖనాలను సాధారణ మానవ పరిభాషలో ఇచ్చాడు. మరియు “నేను”, “నాకు”, “అతడు” మరియు “అతడికి” అనే ఏకవచన వ్యక్తిగత సర్వనామాలు ఏకైక వ్యక్తిని సూచిస్తాయి. అందువల్ల, యహువఃను సూచించుటకు బైబిలు ఈ పదాలను ఉపయోగించుట ద్వారా, యహువః అద్వితీయుడని మనకు బోధిస్తుంది. బైబిల్ కొన్నిసార్లు యహువఃను సూచించుటకు ఉపయోగించిన బహువచన సర్వనామాలను యహువః కోసం వేల సార్లు ఉపయోగించబడిన ఏకవచన వ్యక్తిగత సర్వనామాలతో సరితూచాలి. కింది భాగాలను పరిశీలించండి:

  • ద్వితీయోపదేశకాండము 4:39: “కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమియందును యహువఃయే ఎలోహీం అనియు, మరియొక ఎలోహీం లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము.”
  • ద్వితీయోపదేశకాండము 32:39: “ఇదిగో నేను నేనే ఎలోహీంను, నేను తప్ప వేరొక ఎలోహీం లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే; గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే; నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు.”

ఈ వాక్య భాగాలు మనకు యహువః ఒక్కడే అని, ఆయనలాంటి వారు ఎవరూ లేరని చెబుతుండెను.

2. బైబిలు ఎల్లప్పుడూ యహూషువఃను యహువః నుండి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూపిస్తుంది.

“ప్రతివాని నాలుకయు తండ్రియైన ఎలోహీం మహిమార్థమై యహూషువః మెస్సీయ ప్రభువని ఒప్పుకొనునట్లును,.” (ఫిలిప్పీయులకు. 2:11)

దేవుడు-ఒక్కడే అను ఏకదైవవాదం ఎందుకు ఎక్కువ బైబిల్ దృక్కోణంలో ఉంది image

1 కొరింథీయులకు 15: 27-28లో మనం ఇలా చదువుతున్నాము: “ఎలోహీం సమస్తమును మెస్సీయ పాదముల క్రింద లోపరచియుంచెను. సమస్తమును లోపరచబడియున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడియున్నదను సంగతి విశదమే.” యహువః తనను తప్ప మిగతా సమస్త విషయాలను మెస్సీయ పాదాల క్రింద ఉంచాడని చెప్పుచుండెను. ఇది మహిమపరచబడిన మెస్సీయకును మరియు ఆయనను మహిమపరచిన యహువఃకును మధ్య గల వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తుంది.

ఈ వ్యత్యాసం ఫిలిప్పీయులకు 2: 9-11 లో మరొక్కసారి కనబడుతుంది: “అందుచేతను[యహువఃకు లోబడి యున్నందున] పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యహూషువః నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన ఎలోహీం మహిమార్థమై యహూషువః మెస్సీయ1 ప్రభువని ఒప్పుకొనునట్లును, ఎలోహీం ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.”

తండ్రి అయిన యహువః తన కుడిచేతితో అధికముగా హెచ్చించిన తన కుమారుని నుండి తిరస్కరించలేని విధంగా ప్రత్యేకంగా ఉన్నాడు.

3. యహూషువఃయే యహువః అని నమ్మాలని లేఖనం ఎప్పుడూ కోరలేదు.

“యహూషువః ఎలోహీం కుమారుడైన మెస్సీయ అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను….” (యోహాను 20:31)

దేవుడు-ఒక్కడే అను ఏకదైవవాదం ఎందుకు ఎక్కువ బైబిల్ దృక్కోణంలో ఉంది image

మత్తయి 16: 16 లో, పేతురు యహూషువఃను సజీవమైన యహువః కుమారుడైన మెస్సీయ అని ఒప్పుకున్నాడు. మరియు యోహాను 20:31 ఇలా చెబుతోంది: “యహూషువః ఎలోహీం కుమారుడైన మెస్సీయ అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.” కావున పేతురు గానీ యోహాను గానీ యహూషువఃయే యహువః అని చెప్పలేదు; బదులుగా, వారు యహూషువఃయే మెస్సీయ అనియు మరియు ఆయన యహువః కుమారుడు అనియు చెప్పారు.

రోమీయులకు ​​10: 9 లో పౌలు ఇలా అంటాడు: “అదేమనగా యహూషువః ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, ఎలోహీం మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు..” యహూషువఃనే యహువః అని మనం అంగీకరించాలని పౌలు చెప్పుటలేదు; బదులుగా, “యహూషువః ప్రభువు” అని ఒప్పుకోవాలని మరియు “యహువః ఆయనను మృతులలోనుండి లేపెను” అని విశ్వసించాలని ఆయన మనకు ఉపదేశిస్తుండెను.

మొత్తానికి, యహూషువః విశ్వంలో అత్యున్నత వ్యక్తి, అయితే ఆయన ఇంకా యహువః కింద ఉన్నాడు. యహూషువః యహువః యొక్క పాపములేని మానవ కుమారుడు.

“అద్వితీయ సత్య ఎలోహీం అయిన నిన్నును, నీవు పంపిన యహూషువః మెస్సీయను ఎరుగుటయే నిత్య జీవము..” (యోహాను 17:3)

దేవుడు-ఒక్కడే అను ఏకదైవవాదం ఎందుకు ఎక్కువ బైబిల్ దృక్కోణంలో ఉంది image

4. యహువః మానవునికి సరిపడని కొన్ని అసాధారణ లక్షణాలను కలిగి ఉన్నాడు, అవి.

1 తిమోతి 1:17 నుండి యహువః “మరణం లేనివాడును మరియు అదృశ్యుడును” అని మనం తెలుసుకున్నాము. అదే పత్రికలోని 6:16 ప్రకారం, ఆయన “ఒక్కడు మాత్రమే అమరత్వాన్ని కలిగి ఉన్నాడు.” యోహాను 1:18 “యహువఃను ఎవరూ చూడలేదు” అని చెబుతుంది. క్రొత్త నిబంధన ప్రకారం, యహూషువః లోకంలోనికి వచ్చెను, ఆయన కనిపించెను, మరియు ఆయన మరణించెను ఎందుకనగా మన విశ్వాసం యొక్క పునాది ఆయన యొక్క మరణం, ఖననం మరియు పునరుత్థానం పై ఆధారపడి ఉన్నది.

తీర్మానం: బైబిల్ యొక్క అన్ని భాగాలను సమస్తమైన వెలుగులో అర్థం చేసుకోవాలి. దేవుడు-ఒక్కడే అను ఏకదైవవాదం ఎందుకు ఎక్కువ బైబిల్ దృక్కోణంలో ఉండెనో తెలుపుటకు ఇవి కొన్ని అంశాలు.

“అద్వితీయ సత్య ఎలోహీం అయిన నిన్నును, నీవు పంపిన యహూషువః మెస్సీయను ఎరుగుటయే నిత్య జీవము..” (యోహాను 17:3)

ఈ సత్యాన్ని స్వీకరించి, యహూషువః యొక్క పరిపూర్ణతలో యహువః ముందు నిలబడుటకు నిత్యజీవపు బహుమానమును అంగీకరించండి.

ఈ ముఖ్యమైన అంశంపై మరింత సమాచారం కోసం: # ట్రినిటీ (డాక్ట్రినల్ ఎర్రర్)


పై వ్యాసం యూనిటేరియన్ (ఏకదైవవాద) పాస్టర్, డేనియల్ కాల్కాగ్నో చేసిన 2 వీడియోల ఆధారంగా వ్రాయబడినది.

1G5547(క్రిస్టోస్): “క్రీస్తు” అనేది “అభిషిక్తుడు” లేదా “మెస్సీయ” అనే పదాలకు గ్రీకు పదం. హెబ్రీలో దీనికి సమానం పదం H4899 మాషియాఖ్ (mâshı̂yach).

Comments

Leave a Reply

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.