World's Last Chance

At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

ప్రధాన విషయం ఏమిటి?

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

ప్రధాన విషయం ఏమిటి?

“ప్రధాన విషయాన్ని ప్రధాన విషయంగా ఉంచటమే ప్రధాన విషయం.” కాబట్టి వ్యాపారంలో లేదా జీవితంలో మంచి పద్ధతి యొక్క సలహాదారుల చెప్పుదానిని విన్నాను.

ఆ ఆలోచనను కలిగియుంటూ, “ప్రపంచం మొత్తాన్ని మోసగించేవాడు”, “ప్రపంచం మొత్తం తన శక్తితో ఉన్న” అపవాది ప్రధాన విషయాన్ని జనులు దృష్టిలో ఉంచుకోకుండా ఉండునట్లు వంచియున్నాడని నేను ప్రతిపాదించాను. “ప్రధాన విషయం” ఏమిటో తెలుసుకోవడానికి అతడు మీకు ఆసక్తి ఇవ్వడు. బోధకుడైన యహూషువః ఇలా చెప్పినప్పుడు అతడి సాంకేతికత అద్భుతంగా గుర్తించబడింది మరియు బహిర్గతం చేయబడింది: “[దేవుని రాజ్యం గురించి, మత్తయి. 13:19] వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది (అనగా, సాతాను) వచ్చి వారి హృదయములోనుండి వాక్యమెత్తి కొని పోవును.” (లూకా 8:12).

యహూషువః తాను యహువః చేత నియమించబడెనని ఎందుకు అనుకున్నాడు మరియు తన యొక్క మొత్తం ఉద్దేశ్యంగా తాను ఏమి చూశాడు అనే దానిని అర్థం చేసుకోవటమే ప్రధాన విషయం అని ఒకరు అనుకుంటారు. అలా అయితే, మన జీవితాలలో యహువః సంకల్పాన్ని తెలుసుకోవడానికి (ఈ విషయంలో తన కుమారుడితో మనం ఐక్యం‌ చేయబడి) ఒక ముఖ్య ప్రారంభ బిందువుగా లూకా 4:43 ను గుర్తించ వలసి ఉంటుంది: “నేను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను… ఇందునిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పెను.” మనము అలా చేస్తున్నామా? సంఘంలో నిత్యమైన బోధగా మీరు ఈ వాక్యంపై ఉపన్యాసాలు విన్నారా?

ఆలోచిస్తున్న వ్యక్తి

అమరత్వాన్ని (మానవుడు జన్మతః కలిగిలేనిది) ఎలా పొందాలో అర్థం చేసుకోవడం ప్రధాన విషయం అని ఒకరు అనుకుంటారు. ఒకరు అమర్త్య బీజాన్ని గూర్చిన కేంద్ర సువార్త ఉపమానం అన్ని సంఘ బోధనలో ప్రముఖమైనదిగా భావిస్తారు. అయితే అది నిజమా? కాకపోతే, ఎందుకు కాదు?

ప్రధాన విషయం ఏమిటంటే, యహువః జ్ఞానం యొక్క మానవ స్వరూపం అయిన యహూషువః ప్రకారం, మొదటి ప్రాధాన్యతగా యహువః రాజ్యాన్ని వెదుకుట (మత్త. 6:33), మరియు యహువః రాజ్య శిష్యులుగా ఉండుట (మత్త. 13:52), భవిష్యత్ రాజ్యం భూమిపై ఉనికిలోకి రావాలని మొదట ప్రార్థన చేయుట (మత్త. 6: 10) మరియు యహూషువః రాజ్య సువార్త ప్రకటనలో పాల్గొనుట (మత్త. 28:19, 20). ఇది మానవులైన మన కోసం యహువః యొక్క తెలివైన ప్రణాళిక. జీవితంలో మిగతావన్నీ ద్వితీయమైనవి. యహూషువః ఒక్క-గురి కలిగిన వ్యక్తి. ఆయనను మరియు తన సువార్తను ప్రేమించుట కంటే ఎక్కువగా కుటుంబాన్ని ప్రేమించుట ఒక వల మరియు మాయ అని కూడా ఆయన హెచ్చరించాడు. నాకంటే ఎక్కువగా తండ్రిని, తల్లిని ప్రేమించేవాడు నాకు శిష్యుడు కాలేడు అని ఆయన అన్నారు. “ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపనియెడల వాడు నా శిష్యుడు కానేరడు.” (లూకా 14:26, 27).

ప్రధాన విషయం, యహూషువః ప్రకారం, మొదటి ప్రాధాన్యతగా యహువః రాజ్యాన్ని వెదుకుట, యహువః రాజ్యానికి శిష్యులుగా ఉండుట, భవిష్యత్ రాజ్యం భూమిపై ఉనికిలోకి రావాలని మొదట ప్రార్థించుట మరియు యహూషువః రాజ్య సువార్త ప్రకటనలో పాల్గొనుట.

ప్రధాన విషయం ఏమిటి? image

కఠినమైన పదాలు, నిజానికి, కానీ చాలా వాస్తవికమైనవి. మీతో మరియు మీ అమరత్వ ప్రాముఖ్యతతో సమానంగా దేనిని పోల్చగలం? మీరు దాన్ని పొందవచ్చు లేదా కోల్పోవచ్చు. ప్రధాన విషయం ఏమిటంటే మనం అమరత్వాన్ని కోల్పోకూడదు. “ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే తనకేమి ప్రయోజనము?” (మత్త. 16:26). ప్రధాన విషయంపై యహూషువః కనికరం లేకుండా దృష్టి పెట్టాడు. సంఘాలు ప్రధాన విషయాన్ని విజయవంతంగా ప్రధాన విషయంగా ఉంచుటలేదని నేను 1998 నుండి ఎత్తి చూపడానికి ప్రయత్నించాను. మరో మాటలో చెప్పాలంటే, బైబిల్ చదివేటప్పుడు (ఇది చాలా మంది సంఘస్తుల జీవితాలలో చాలా విస్తృతంగా జరగదు) పాఠకులు ప్రధాన విషయం యొక్క ప్రాముఖ్యత గురించి యహూషువః యొక్క ఎంతో స్పష్టమైన బోధలను ఆలోచించకుండా తొందరపాటుతో చదువుతారు.

ఇది ఎలా సాధ్యమవుతుంది అనే దానిని నేను అవగాహన చేసుకొనుటకు ఇది ఎంతో సహాయకరంగా ఉంది. ఇతర దస్తావేజులు అలా పరిగణించబడవు. చాలా మంది ప్రధాన విషయం గురించి “మీకోసం మీరే చేయండి” అనే విధానంలో సరిగ్గా చదవరు. అన్ని రకాల బోధనా పుస్తకాలు చదువరులకు అవసరమైన సమాచారాన్ని తెలియజేయుటలో తమ వంతు కృషిని చేస్తాయి. కానీ ఏదో ఒకవిధంగా, యహూషువః మాటలు ప్రజలకు తెలియజేయబడునప్పుడు, అవి ఆధ్యాత్మిక పొగమంచులో కప్పబడి ఉంటాయి. యహూషువః యొక్క బోధనలను, మెస్సీయ మొదటిగా అనేక విభిన్న రంగాలకు చెందిన సాధారణ ప్రజలకు అందించినప్పటికీ, మెదడుకు చేరలేదు. ప్రతిష్టంభన ఉంది. గ్రహించని ఫలితాలు. యెషయా బాగా చెప్పాడు:

“దీనినంతటినిగూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యములవలె ఉన్నది. ఒకడునీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షర ములు తెలిసినవానికి వానిని అప్పగించును; అతడు అది నావలన కాదు అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షర ములు తెలియనివానికి దానిని అప్పగించును అతడు అక్షరములు నాకు తెలియవనును. యహువః ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొని యున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధు లనుబట్టి వారు నేర్చుకొనినవి.” (యెషయా. 29:11-13).

యువ జంట దిశలును చదివుచున్నారు

ఇది ఎలా సాధ్యమవుతుంది? మొదట అపవాది, అనగా తనకు అనుమతించిన పరిమితుల మేరకు యహువఃను వ్యతిరేకించే తెలివైన వ్యక్తి ఉన్నందున. ఉప-చంద్ర స్థలం యొక్క శక్తి యొక్క యువరాజుగా అతడు, బైబిల్లో ఉన్న సత్యం యొక్క విలువైన వాక్యాలను గందరగోళపరిచే పని నిమిత్తం ఉన్న అనేక అపవాది శక్తులను నియంత్రిస్తున్నట్లు మనకు గ్రంథం వలన తెలుస్తుంది. (అపవాది యొక్క ప్రధాన తిరుగుబాట్లలో ఒకటి అతడు లేడని కొంతమందిని ఒప్పించడం! చాలా మంది బైబిల్ పాఠకులకు, ఈ భావన ఊహించలేనిది, కాని మొత్తం సమాజాలు, వారు ఎన్నుకున్న వ్యవస్థాపకుడిపై నమ్మకం ఉంచిన తర్వాత, దాదాపు ప్రతిదానిని ఒప్పుకొనేలా చేయబడుదురు, అసంభావితమైనప్పటికీ. మృదువైన మనస్సులపై ప్రియమైన ఉపాధ్యాయులను కలిగి ఉన్నప్పుడు, బోధన ముఖ్యంగా ప్రభావవంతంగా మరియు వినాశకరమైన శక్తివంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక “శస్త్రచికిత్స” మరియు ఏదేమైనా మోసపోకుండా ఉండాలనే కోరిక మాత్రమే ఆ పరిస్థితిని పరిష్కరిస్తుంది.)

కాబట్టి యహూషువః యొక్క మరియు క్రొత్త నిబంధన యొక్క విశ్వాసం ఎలా విచ్ఛిన్నమై గందరగోళంగా మారిందనే “సమస్య” కోసం చూద్దాం. దీనికి గల అంతర్గత కారణమేమిటి? మనం యహూషువః మరియు మోక్షం గురించి సరైన అవగాహనకు రావాలంటే గ్రహించవలసిన ప్రధాన విషయం ఏమిటి?

ఈ రోజు ప్రముఖ పండితులు సరైన సమస్యపై దృష్టి పెట్టాలని నేను సూచిస్తున్నాను, అయినప్పటికీ వారు సరిగ్గా గుర్తించిన సమస్యకు బైబిల్ జవాబును అందించడంలో వారు అంతగా సహాయపడకపోవచ్చు. నా ఉద్దేశ్యం ఏమిటో ఇక్కడ ఉంది. నేను జాగ్రత్తగా ఆలోచించాల్సిన సమస్యగా దీనిని అందిస్తున్నాను.

యహూషువఃపై తాను చేసిన ‘జీసస్ అండ్ ది విక్టరీ ఆఫ్ గాడ్ (ఫోర్ట్రెస్ ప్రెస్, 1996)’ అనే ప్రధాన రచనలో, ప్రఖ్యాత డర్హామ్ బిషప్ టామ్ రైట్ మనకు ప్రశంసనీయమైన తెలివితో ఇలా చెబుతున్నాడు: “ఒక కోణంలో నేను ఈ పుస్తకం కోసం నా జీవితంలో ఎక్కువ భాగం తరచూ పని చేస్తున్నాను. అయితే, 1978 లో కేంబ్రిడ్జ్‌లో ‘సువార్తలోని సువార్త’ అనే అంశంపై ఉపన్యాసం ఇవ్వడానికి నన్ను ఆహ్వానించినప్పుడు తీవ్రమైన ఆలోచన ప్రారంభమైంది. నాకు అర్థం కాలేదు. కేవలం సిలువపై ఆయన మరణం మాత్రమే కాక, [యహూషువః] యొక్క మొత్తం జీవితం, ఏదో ఒకవిధంగా ఎలా ‘సువార్త’ అనే ప్రశ్నకు అసలు నాదగ్గర అసలు సమాధానం లేదు.”

ఎప్పుడైనా “ప్రధాన విషయం” అద్భుతమైన స్పష్టతతో ఎంపిక చేయబడితే, ఇది ఇలా ఉండాలి! అది మనకు వివరించినట్లు క్రైస్తవ మతం యొక్క సమస్య. సంఘంలో మనం క్రైస్తవ సువార్త అని పిలుస్తున్నది వాస్తవానికి యహూషువః (మరియు పౌలు) నిర్వచించిన సువార్త కాదు. బిషప్ రైట్ ఖచ్చితంగా మరియు సరిగ్గా కుండ బద్దలు కొట్టాడు. “సువార్తలలోని సువార్త” అనే ప్రశ్నకు తన వద్ద సమాధానం లేదని ఆయన చెప్పారు. వాస్తవం ఏమిటంటే, సంఘం గాని లేక అతని వేదాంత శిక్షణ గాని అతనికి సువార్తలలోని సువార్త అంటే ఏమిటో నేర్పించలేదు. సంఘం దాని విశ్వాసాలను మరియు క్రమబద్ధమైన వేదాంతశాస్త్రాన్ని చాలా నిర్మాణాత్మకంగా చేసింది, దానిలో “సువార్తలలోని సువార్త” అనే చర్చకు లేదా పరిశీలనకు సంబంధించిన అంశం లేదు! ఇది కాబోవు-బోధకులు మరియు సువార్తికుల కోసం న్యాయమైన ఆందోళనగా బయటకు నిశ్శబ్దంగా తోసిపుచ్చబడింది. అందువల్ల వారు ఎంచుకున్న వేదాంత సలహాదారుల పాదాల వద్ద కూర్చొను సంఘస్తులలో ఇది ఖచ్చితంగా చర్చకు వచ్చే అంశం కాదు.

అన్నిటి తరువాత, యహూషువః సువార్త పరిచర్యపై విశ్వాసాలు హల్ చల్ చేశాయి, ఆయన ఆశ్చర్యకరమైన పుట్టుక నుండి ఆయన మరణం వరకు పరుగులు తీసాయి, ఆయన జీవిత మధ్య కాలంలో జరిగిన సంఘటనలపై (యహూషువః అందించే అమరత్వం యొక్క రహస్యం కంటే తక్కువ కాదు!) పట్టింపు లేదు. ఈ మాటలు గుర్తుందా? నేను యహూషువఃను నమ్ముతున్నాను “కన్య మరియకు జన్మించాడు, పొంతి పిలాతు అధికారంలో శ్రమలు పడ్డాడు, సిలువ వేయబడ్డాడు …”

అవన్నీ నిజంగా లెక్కించబడుతున్నాయా? లేదా ప్రధాన విషయం విడిచిపెట్టబడుతుందా?

గందరగోళం ఎలా జరిగిందో ఇక్కడ ఉంది. ప్రొటెస్టంట్ క్రైస్తవ మతానికి ప్రధాన వనరు లూథర్. అతడు సువార్తను వెతకడానికి యహూషువః మాటల యొద్దకు వెళ్ళలేదు. అతడు ప్రధానంగా రోమా పత్రికలోని ​​పౌలు వద్దకు వెళ్ళాడు. క్రైస్తవ విశ్వాసాన్ని “తయారు చేయటానికి” ఇది ఒక ఆసక్తికరమైన మార్గం. ప్లేటో లేదా అరిస్టాటిల్ యొక్క విద్యార్థులు వారి బోధన గురించి తెలుసుకోవడానికి మొదట ఆ వ్యక్తుల వద్దకు వెళ్ళుదురా? పౌలు క్రైస్తవ మత స్థాపకుడు అని ఎవరు చెప్పారు? ఖచ్చితంగా బైబిల్ కాదు! పౌలు ఖచ్చితంగా యహూషువః యొక్క అపోస్తలుల ప్రతినిధి, మరియు అతడు తన లేఖలలో అన్ని రకాల క్రైస్తవ సమస్యలపై వ్యాఖ్యానించాడు, కాని అతడు సువార్త యొక్క మొదటి బోధకుడు కాదు, కానీ అది యహూషువః (సువార్త అబ్రాహాముకు ముందుగానే బోధించబడినప్పటికీ కూడా, గల. 3: 8). పౌలు వాస్తవానికి, యహూషువః మాదిరిగానే రాజ్య సువార్తను (19: 8; 20:25; 28:23, 31) ప్రకటించుటను చూడవచ్చు. కాని పౌలు గురించి తెలుసుకోవడానికి ఎవరూ అపోస్తలులలో ప్రారంభించరు.

ఈ బ్రహ్మాండమైన మతసంబంధమైన గజిబిజి ఫలితం కొత్త నిబంధనలో ప్రతిబింబిస్తుంది. “సువార్తలలోని సువార్త” సమస్యను ఎలా పరిష్కరించాలో కూడా అతనికి అర్థం కాలేదని రైట్ యొక్క నిజాయితీ గల ఒప్పుకోలు. ఆశ్చర్యం లేదు. సువార్తలలో సువార్త గురించి సంఘంలో ఎవరూ ఆయనకు చెప్పలేదు. అతని తరువాతి పరిశోధన మరియు రచన సువార్తలలో సువార్తపై పనిచేయుట కొరకు అంకితం చేయబడింది. అతని చారిత్రక జ్ఞానం ఖచ్చితంగా మనందరికీ ఒక ఆశీర్వాదం, అయినప్పటికీ అతను ఈ సమస్యకు నిజంగా న్యాయం చేశాడా అని నాకు అనుమానం ఉంది. సువార్తలలోని సువార్త ఏమిటో ఆయన రచనల నుండి ఇంకా స్పష్టంగా తెలియలేదు. సువార్తలలో యహూషువః రెండవ రాకడ (పరోసియా) క్రీ.శ 70 లో జరిగిందని కూడా అతను భావిస్తాడు! పౌలు మరియు యహూషువః చెప్పిన దానికి పూర్తిగా భిన్నమైన విషయాలను అర్ధం చేసుకోవటానికి ఇది మరొక భారీ గజిబిజిని ప్రారంభించడం కాదా? గజిబిజిని విడదీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఈ విషయంపై బిషప్ మనల్ని మరొక భయంకరమైన గజిబిజిలో పడవేయలేదా?

సి.ఎస్. లూయిస్ఇదే సమయంలో, లక్షలాది మంది చదవరులను కలిగిన సి.ఎస్. లూయిస్ ప్రకారం, యహూషువః చాలా ఖచ్చితంగా సువార్త బోధకుడు కాదు! సువార్త సువార్తలలో లేదని అతడు తీవ్రంగా ప్రకటించాడు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైనది. సంఘాలలోని ఇబ్బంది మరియు గందరగోళాల పరంగా “ప్రధాన విషయం” పై శ్రద్ధ పెట్టడానికి ఇది సహాయపడుతుంది. శిశు సంఘాలకు సి.ఎస్. లూయిస్ రాసిన లేఖలను చూడండి:

“పత్రికలు చాలావరకు మన దగ్గర ఉన్న తొలి క్రైస్తవ పత్రాలు. సువార్తలు తరువాత వస్తాయి. సువార్తలు ‘సువార్త’ కాదు, క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రకటన. అప్పటికే మతం మార్చబడిన, అప్పటికే “సువార్తను” అంగీకరించిన వారి కోసం అవి వ్రాయబడ్డాయి. అవి అనేక సమస్యలను వదిలివేస్తాయి,‌ అది వేదాంతశాస్త్రం, ఎందుకంటే అవి ఇప్పటికే దానికోసం బోధించబడిన పాఠకుల కోసం ఉద్దేశించబడ్డాయి. ఆ కోణంలో, సువార్తలు కంటే పత్రికలు చాలా ప్రాచీనమైనవి మరియు కేంద్రకమైనవి – సువార్తలు వివరించే గొప్ప సంఘటనల కంటే ఎక్కువ వీటిలో లేనప్పటికీ. దేవుని చర్య (అవతారం, సిలువ, మరియు పునరుత్థానం) మొదట వస్తుంది: దాని యొక్క ప్రారంభ వేదాంత విశ్లేషణ పత్రికలలో వస్తుంది; అప్పుడు, ప్రభువును తెలుసుకున్న తరం చనిపోతున్నప్పుడు, విశ్వాసులకు గొప్ప కార్యాలను మరియు ప్రభువు యొక్క కొన్ని సూక్తుల జాబితాను అందించడానికి సువార్తలు లిఖితం చేయబడ్డాయి.”1

“సువార్తలు సువార్త కాదు.” గ్రంథస్థం చేయబడిన బైబిలు సంబంధించిన తప్పుడు సమాచారం యొక్క అసాధారణమైన ముక్కలలో ఇది ఒకటి అని నేను సూచిస్తున్నాను. “సువార్తలలోని సువార్త” గురించిన ప్రశ్న అతనిని మాటలు లేకుండా చేసెనని బిషప్ రైట్ అంగీకరించుట ద్వారా దాని విస్తృతమైన ప్రభావాలు వివరించబడ్డాయి. సువార్తలలో కనిపించే సువార్త గురించి ఏమి చెప్పాలో ఆయనకు తెలియదు.

C.S. లూయిస్, ఏమైనప్పటికీ, లూథర్ నుండి వచ్చిన తన అస్థిర సంస్కరణ వారసత్వాన్ని మాత్రమే నిర్మిస్తున్నాడు. మత్తయి, మార్కు మరియు లూకాలో సువార్తను చూడలేనటువంటి లూథర్ మాటలు ఇక్కడ ఉన్నాయి. టామ్ రైట్ సువార్తలోని సువార్తను ప్రశ్నించినా ఆశ్చర్యపోనవసరం లేదు. లూథర్, ఇది నిజం, యోహానును ఇష్టపడ్డాడు, కాని అతడు మత్తయి, మార్కు మరియు లూకాలలో పునరావృతం చేయబడిన రాజ్య సువార్తను ఎలా తోసివేయుచున్నాడో గమనించండి:

“యోహాను యొక్క సువార్త ఒక మృదువైన, నిజమైన ముఖ్యమైన సువార్త, మిగతా మూడింటికంటే ఎక్కువ, దీనికి మరి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి మరియు వాటికి పైన ఉంచాలి. కాబట్టి, పరిశుద్ధ పౌలు మరియు పరిశుద్ధ పేతురు యొక్క పత్రికలు మిగతా మూడు సువార్తలను మించిపోయాయి – మత్తయి, మార్కు మరియు లూకా … ఒక్క మాటలో చెప్పాలంటే, పరిశుద్ధ యోహాను సువార్త మరియు అతని మొదటి ఉపదేశం.

పరిశుద్ధ పౌలు పత్రికలు, ముఖ్యంగా రోమీయులకు, గలతీయులకు మరియు ఎఫెసీయులకు మరియు పరిశుద్ధ పేతురు యొక్క మొదటి పత్రిక మీకు క్రీస్తును చూపించే పుస్తకాలు మరియు మీరు తెలుసుకొనవలసిన, మీకు అవసరమైన మరియు మంచివి అన్నింటినీ మీకు నేర్పిస్తాయి, మీరు ఎప్పుడూ చూడనప్పటికీ లేదా విననప్పటికీ. పుస్తకం లేదా సిద్ధాంతం. అందువల్ల పరిశుద్ధ యాకోబు పత్రిక వాటితో పోలిస్తే నిజంగా గడ్డివంటి లేఖనం; ఎందుకంటే దానిలో సువార్త స్వభావం ఏమీ లేదు.”

మనం ప్రధాన విషయాన్ని పరిష్కారిద్దాం. క్రైస్తవ విశ్వాసాన్ని అర్థం చేసుకొనుటలో ఇది మొదటి తాళపు చెవిగా స్థాపించబడాలి, అనగా వాస్తవానికి క్రైస్తవ సువార్తను రక్షించే మొదటి సంరక్షకుడు యహూషువః. హెబ్రీయులు 2: 1-4 సరసమైన హెచ్చరిక, కానీ అది అలక్ష్యం చేయబడెను:

“ఈ కారణంగా మనం విన్న వాటిపై మనం మరింత శ్రద్ధ వహించాలి, తద్వారా మనం దాని నుండి దూరం చేయబడము. దేవదూతల ద్వారా చెప్పబడిన వాక్యం మార్పులేనిదని నిరూపణ అయినప్పుడు, మరియు ప్రతి అతిక్రమానికి మరియు అవిధేయతకు తగిన శిక్ష ఉన్నప్పుడు; ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటాము? ఇది మొదట ప్రభువు ద్వారా మాట్లాడబడిన తరువాత, అది విన్నవారి ద్వారా మనకు ధృవీకరించబడింది, సంకేతాలు మరియు అద్భుతాలు మరియు వివిధ ఆశ్చర్యకార్యాల ద్వారా మరియు పరిశుద్ధాత్మ యీవుల ద్వారా తన చిత్తానుసారం యహువః వారి ద్వారా సాక్ష్యమిచ్చాడు.”

ఇది అక్కడ ఉంది. ప్రధాన విషయం. సువార్తను “మొదట యహూషువః బోధించాడు.” అందువల్ల సువార్తను తెలుసుకోవడానికి సువార్తలకు వెళ్ళండి. సి.ఎస్. లూయిస్ ఇక్కడ నిజంగా తప్పుగా ఉన్నారు మరియు లూథర్ అలాగే చేసాడు. హెబ్రీ పత్రిక ఈ ఉపదేశాన్ని మరింత విప్పెను: “మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు.” (హెబ్రీ. 2: 5). విషయం ఏమిటంటే, ప్రపంచ చరిత్ర యొక్క భవిష్యత్తు యుగాన్ని, యహువః రాజ్యాన్ని, దేవదూతలకు కాక, యహూషువఃకు మరియు అతని అనుచరులకు నిర్ణయించెను (యా. 7:18, 22, 27; ప్రక. 5:10; 20: 1-6, మొదలైనవి). ముఖ్యమైన గమ్యం!

ఆలోచిస్తున్న స్త్రీ

చరిత్రకారుడు జి.ఎఫ్. మూర్ ఇలా వ్రాశాడు (చదరపు బ్రాకెట్లలో ఉన్నవి నా వ్యాఖ్యలు): “పుస్తకాల నియమావళిలో సువార్త యొక్క నియమావళిని లూథర్ ఒక పిడివాద ప్రమాణం ద్వారా సృష్టించాడు [అతను ఎంపిక మరియు తప్పుదోవ పట్టించే విధానాన్ని ఉపయోగించి కొన్ని పుస్తకాలను ఎన్నుకున్నాడు మరియు ఇతర వాటిని విస్మరించాడు]. ఇక్కడ లేఖనం యొక్క లోపం స్పష్టంగా లేదు, వాస్తవానికి [లూథర్] ఒప్పుకోలులో లోపం లేకపోతే, (పోపులు మరియు సభ యొక్క తప్పును అనుసరించాడు) విశ్వాసం ద్వారా లూథర్ యొక్క సమర్థన సిద్ధాంతంతో తన ఒప్పందం యొక్క అంతిమ ప్రమాణం ద్వారా తీర్పు తీర్చబడుటకు లేఖనం కూడా సమర్పించుకోవాలి.”2 [లూథర్, మరో మాటలో, ఒక పిడివాద వ్యవస్థను మరొకదానితో భర్తీ చేసి, తన స్వంత ఎంపిక ప్రక్రియకు గ్రంథం తలొగ్గేలా చేసాడు.]

ఈ ఏకపక్ష విధానంలో ప్రభావితమయ్యేది క్రైస్తవ రాజ్య సువార్త, సువార్తలలోని సువార్త. అది చిన్న విషయమా? నేను కాదు అనుకుంటున్నాను. (1) యహూషువః మాటలకు మనం నమ్మకంగా కట్టుబడి ఉండుట ద్వారా మనం తీర్పు తీర్చబడాలి (“వ్యభిచారమును పాపమునుచేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నామాటలనుగూర్చియు సిగ్గుపడువాడెవడో, వానినిగూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతోకూడ వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను.”మార్కు 8:38); మరియు (2) యహూషువః సువార్త యొక్క మాదిరి బోధకుడైతే, మరియు (3) యహూషువః మాటలను తిరస్కరించడం అంతిమ ఆపద అయితే (I తిమో. 6: 3), అప్పుడు మన బోధకుడైన యహూషువః మాటల నుండి సువార్తను సరిగ్గా నిర్వచించు విషయంలో అన్ని లాంతరులను అటువైపు అత్యవసరంగా తిప్పాల్సిన అవసరం లేదా?

సువార్తల నుండి సువార్తను ప్రకటించమని వారి బోధకులకు విజ్ఞప్తి చేయాలని మరియు వాటిలో నుండి సువార్తను బోధించే వరకు యహూషువః యొక్క జీవ వాక్యాలను ఒంటరిగా వదిలివేయవద్దని పాఠకులను మేము కోరుతున్నాము. అప్పుడు మాత్రమే మనం సువార్తను నిజంగా విన్నట్లు భరోసా ఇవ్వవచ్చు. సి.ఎస్. లూయిస్ మరియు లూథర్ యొక్క తప్పుదోవ పట్టించే వాక్యాలు ఉన్నంతవరకు, సువార్త ఖచ్చితంగా పొగమంచులో ఉంచబడుతుంది. సంఘాల యొక్క ఆధ్యాత్మిక వాతావరణం కలుషితమై ఉన్నప్పుడు, సంఘం నిజంగా దైవభక్తి లేని ప్రపంచాన్ని ప్రభావితం చేసే అవకాశాన్ని కలిగి ఉందా?

సంబంధిత సువార్త అంశంపై బిషప్ రైట్ యొక్క ఇతర మాటలకు తిరిగి రావడం ప్రోత్సాహకరంగా ఉంటుంది, “నా భయం ఏమిటంటే, మనము ఒక గజిబిజి మరియు గందరగోళంలో చిక్కుకుపోతున్నాము, వివిధ ముక్కలను మరియు సాంప్రదాయాలను, ఆలోచనలను మరియు అభ్యాసాల భాగాలను కలిపి అవి అర్థాన్ని ఇచ్చునేమో అనే ఆశతో ఇలా చేస్తున్నాము. అవి అలా చేయవు … విమోచన పొందిన వారి అంతిమ లక్ష్యాన్ని సూచించుటకు ‘స్వర్గం’ అనే పదాన్ని ఉపయోగించుటకు మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి, మధ్యయుగ విశ్వాసం ద్వారా ఎక్కువగా ఉద్ఘాటించబడినప్పటకీ, ఇవి ఇప్పటికీ జనాదరణ పొందిన స్థాయిలో తీవ్రంగా తప్పుదారి పట్టించేవిగా ఉంటూ, అది క్రైస్తవ ఆశకు అన్యాయం చేయుచున్నవి.” 3

ఆశతో

మనం ప్రేమిస్తున్నట్లు చెప్పుకునే మెస్సీయకు న్యాయమైన సేవను తీసుకురావడానికి విప్లవం ప్రారంభిద్దాం: “దేహంనుండి వేరైన ఆత్మలకు స్వర్గం” అనే దాన్ని గూర్చిన అన్యమత విశ్వాసాన్ని మరియు అత్యంత పక్షపాతమైన మరియు సరిపోని సంస్కరణపై నిర్లక్ష్యంగా విశ్రాంతి తీసుకుంటున్న ఒక దగ్ధమైన సువార్తను, రక్షించే రాజ్య సువార్త యొక్క బోధకుడిగా యహూషువః కలిగియున్న అత్యున్నత స్థానాన్ని, అలాగే రాజ్య సువార్త కోసం మరియు మన కోసం ఆయన మరణమును నిరాకరిస్తున్న సువార్తను బహిష్కరిద్దాం.

ఈ ముఖ్యమైన విషయం గురించి మరింత తెలుసుకోవడానికి, WLC యొక్క కంటెంట్ డైరెక్టరీని సందర్శించండి: ది ట్రినిటీ (డాక్ట్రినల్ ఎర్రర్)


1 J.B. ఫిలిప్స్, పరిచయ. p. 10.

2 మూర్, హిస్టరీ ఆఫ్ రిలిజియన్స్, స్క్రైబ్నర్స్, 1920, పే. 320.

3 ఆల్ సెయింట్స్ కొరకు, పే. 21.


ఇది ఆంథోనీ బజార్డ్ రాసిన వ్యాసం. డబ్ల్యుఎల్సి వ్యాసం కాదు.

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి – కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృందం.

Comments

Leave a Reply

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.