World's Last Chance

At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

బైబిల్ ప్రకారం ‘సువార్త ప్రకటించుట’ అంటే ఏమిటి?

ఇది డబ్ల్యుఎల్‌సి వ్యాసం కాదు. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మా బృందం తీసుకుంటుంది. ఈ అధ్యయనాల రచయితలు చాలా సందర్భాల్లో ముఖ్యమైన ప్రాథమిక బోధనల విషయంలో (7 వ దినపు సబ్బాతు మరియు దేవుడు వంటివి) డబ్ల్యుఎల్‌సి తో చాలా విభేదాలు కలిగి ఉన్నారు. ఏది ఏమయినప్పటికీ, లేఖనాలకు సంపూర్ణంగా సరిపోవుచున్న వారి రచనల ద్వారా ఆశీర్వదింపబడకుండా నిరోధించకూడదు. అదేవిధంగా, వారి బోధనలలో కొంత భాగాన్ని అంగీకరించుట అనేది వారి సమస్త బోధనలను అంగీకరించినట్లు కాదు.

యహూషువః ప్రకారం, ఆయన మొత్తం పరిచర్య యొక్క ఉద్దేశ్యం ఏమిటి?

విత్తనాలను నాటుట

క్రైస్తవ మతం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?

మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని (లూకా సువార్త. 5:32).

నశించినదానిని వెదకి రక్షించుటకు నేను వచ్చితిని (లూకా సువార్త. 19:10).

అపవాది(సాతాను) యొక్క క్రియలను లయపరచుటకే నేను వచ్చితిని. (1 యోహాను. 3:8).

అయితే ఆయన దీనిని ఎలా చేశాడు?

నేను ఎలోహీం రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితిని. (లూకా 4:43).

సువార్త ప్రకటన యొక్క ఒక ప్రసిద్ధ విధానం మనకు ఇలా చెబుతుంది, “ఆయనను మీ హృదయాలలోనికి ఆహ్వానించండి” అని యహూషువః ప్రజలకు విజ్ఞప్తి చేసెను. ఈ భాషకు లిఖితం చేయబడిన యహూషువః యొక్క మాటలలో ఎటువంటి ఆధారం లేదు. ఇది మానవ ఊహకు స్వేచ్చను ఇస్తుంది. ఇది యహూషువః సువార్త పద్ధతిని ప్రతిబింబించేలా లేదు. అప్పుడు యహూషువః పాపులను విశ్వాసులుగా మారుటకు ఎలా ఆహ్వానించాడు?

ఈ ప్రశ్నకు సమాధానం బైబిలు రచయితల యొక్క ప్రాధమిక అంశము. అన్నిటి తరువాత, వారు కూడా సువార్తికులుగా, వారి వ్రాతపూర్వక జాబితాల ద్వారా ఇతరులు రక్షింపబడాలని ఆశించుదురు. వారి సందేశం మరియు పద్ధతి ఏమిటి?

నిస్సందేహంగా ఇది సువార్త ప్రకటించుటలోని యహూషువః యొక్క సొంత ఉదాహరణ నుండి నేర్చుకున్న సందేశం మరియు పద్ధతి. అయితే, నేడు చాలా మంది, యహూషువః ఒక సువార్త-బోధకుడు అనే ఆలోచనతో తికమకపడుతున్నారు. అతడు మరణించి మృతులలోనుండి లేవలేదా? అది రక్షణకు తగిన ఆధారం కాదా? సమాధానం స్పష్టంగా “కాదు” గా ఉండాలి. యహూషువః యొక్క మరణం మరియు పునరుత్థానం మాత్రమే సువార్త అయి ఉంటే, యహూషువః మూడు సంవత్సరాల పాటు తన మరణం మరియు పునరుత్థానం గురించి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, సువార్తను ఎందుకు ప్రకటించాడు? యహూషువః మరణం మరియు పునరుత్థానం గూర్చి తమకు తెలియకముందే, అపొస్తలులు యహూషువః పర్యవేక్షణలో బయటకు వెళ్లి సువార్తను బోధించి రక్షణను ఎలా ప్రకటించగలిగారు (లూకా 8:1; 9:2,6)? (లూకా 18:31-34; యోహాను 20:9 చూడండి).

ఈ వాస్తవాలు చాలా సులభం. నశించిన దానిని వెదకి రక్షించుటకు యహూషువః వచ్చెను. ఆయన పాపులను మారుమనస్సు పొందుడని పిలుచుటకు వచ్చాడు. అయితే, ఆయన ఈ ప్రధాన కర్తవ్యము కొరకు ఎలా వెళ్ళాడు అనేది, చర్చికి వెళ్లేవారి ఆలోచన నుండి తప్పించుకుంటూ ఉంది. స్పష్టమైన జవాబు ఏమిటంటే, యహూషువః ఒక సందేశాన్ని అందించి, ఆ సందేశాన్ని నమ్మమని ప్రజలను ఆహ్వానించాడు. ఆయన ప్రారంభ మాటలు ఇక్కడ ఉన్నాయి, మరియు అవి ఆయన సమస్త పరిచర్యకు ప్రాముఖ్యమైనవి.

పశ్చాత్తాపం మార్కు 1: 14-15

రక్షణణను ఎలా పొందాలి అనే దానిని గూర్చి యహూషువః చెప్పిన ప్రతిదీ నిజంగా ఈ ప్రారంభ ప్రకటన యొక్క విస్తరణే: మారుమనస్సు పొంది ఎలోహీం రాజ్యసంబంధమైన సువార్తను నమ్మండి. (మార్కు 1:14, 15). ఇది యహూషువః యొక్క సువార్తతీకునిగా అపొస్తలుడైన మార్కు ద్వారా అందించబడిన క్రైస్తవ విశ్వాసం యొక్క సారాంశ ప్రకటన. యహూషువః బోధించిన సమస్తానికీ రాజ్యమే నిర్వహణా కేంద్రం.

యహూషువః అసలైన సువార్తీకుడు.

రక్షణ మొదటిగా ప్రభువు [యహూషువః] చే ప్రకటించబడెను. (హెబ్రీ. 2: 3)

యహూషువః బోధించిన క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రాతిపదికను మనం ఎలా కోల్పోయాము?

సమాధానం ఏమిటంటే, పాపం మరియు క్షమాపణ మరియు యహూషువః యొక్క రక్తం (సువార్త యొక్క ముఖ్యమైన అంశాలు కూడా) వంటి అంశాలపై భాషద్వారా దాడి జరిగెను, కాని రాజ్యమును గూర్చిన యహూషువః సువార్తకు జ్ఞాణముగా స్పందించుట ఆధారంగా కూడా అలాంటి క్షమాపణను పొందగలము అనే స్పష్టమైన వాస్తవం (ఒకసారి చూసిన తర్వాత) నుండి మనం దూరమయ్యాము.

ఈ విషయంపై యహూషువః బోధ చాలా సూటిగా ఉంటుంది. ఆయన తన రక్షణ సువార్త బోధను హృదయంలో నాటబడిన విత్తనంతో పోల్చాడు. విత్తనం రాజ్యాన్ని గూర్చిన వాక్యం గా పోల్చబడింది (మత్త. 13:19). కొన్నిసార్లు దీనిని “ఎలోహీం వాక్యం” (లూకా 8:11), “వాక్యం” (మార్కు 4:14) అని పిలుస్తారు. ఆ విత్తనం/సందేశం ను అర్థం చేసుకోమని, విశ్వసించమని మరియు వెంబడించమని ఆయన మనకు ఆదేశించెను. ఇది మన మనసులో అంగీకరించబడాలి మరియు మన జీవితానికి ప్రధానమైనదిగా మారాలి. యహూషువః ప్రకారం, మారుమనస్సు అంటే మన స్వంత జీవిత తత్వాన్ని వదలి ఆయన రాజ్య సువార్తకు అంకితమివ్వడం: మన స్వంత విధానాల నుండి బయటకు వచ్చుట ద్వారా మనం ఆయన విధానాలను స్వీకరించాలి – దీనినే ఆయన యహువః సువార్త రాజ్యం అని నిరంతరం చెప్పేవాడు. నేడు చాలా మంది సంఘ సభ్యులు ప్రస్తుత రాజకీయ విషయాలకు ఎక్కువగా కట్టుబడి ఉన్నారు, అయితే ఇటువంటి సామాజిక చర్యల పట్ల యహూషువః చాలా తక్కువ శ్రద్ధ చూపారు. ఆయన ఎలోహీం రాజ్యముపై పూర్తి ఆసక్తిని కలిగి ఉన్నాడు. ఈ ప్రస్తుత ప్రపంచంలోని రాజ్యాలు నిర్వచనం ప్రకారం క్రైస్తవ రాజ్యాలు కావు. అవి సాతాను ప్రపంచంలో భాగం. నిజ క్రైస్తవులు ఈ వ్యవస్థకు చెందినవారు కాదు; వారు “లోకానికి చెందినవారు కాదు.” క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రపంచం యహువః రాజ్యంగా మారుతుంది (ప్రకటన. 11: 15-18; దానియేలు 7:14, 18, 22, 27; 2:44; మీకా. 4: 8; ఓబద్యా .21).

బైబిలు చదువుటయహువః రాజ్యం క్రీస్తు ఈ భూమికి తిరిగి వచ్చినప్పుడు ప్రారంభించబడు నూతన ప్రపంచం … (అపొస్తలుల కార్యములు 1: 6; 3:21). ఈ రాకడ కోసం మనము ఇప్పుడు అన్ని అవసరతలతో సిద్ధమవ్వాలి. యహూషువః రాజ్య సువార్త పిలుపునకు (ఇందులో అతని సిలువ మరణం మరియు అతని పునరుత్థానం ఉన్నాయి) ఇతరులు ప్రతిస్పందించునట్లు కూడా క్రైస్తవులు వారికి సహాయం చేయవలసి ఉంటుంది.

ఆయన మార్గములకు అనుగుణంగా మార్పు చెందుటకు అనేకులు ఇష్టపడుట లేదని యహూషువః చెప్పెను. వారు తమ సొంత మార్గములను ఇష్టపడుదురు. వారు పాపాత్మకమైన మరియు భక్తిహీనమైనదిగా భావించినదానిని విడిచిపెట్టియుండవచ్చు. కానీ యహూషువః రక్షణకు సంబంధించిన సమస్య భక్తిహీనతను గూర్చిన అస్పష్టమైన ఒప్పుకోలు కాదు, కానీ తన రక్షణ సువార్తకు అవగాహనతో కూడిన ప్రతిస్పందన: అది రాజ్య సువార్తపై విశ్వాసం. రక్షణను గూర్చిన ఈ ముఖ్య వాస్తవాన్ని మార్కు 4:11, 12 లో యహూషువః వివరించాడు. రాజ్యమును గూర్చిన తన సువార్త/వాక్యాన్ని స్వీకరించుటలో వారు విఫలమైతిరని, ఇది ప్రజలను తన వద్దకు రాకుండా మరియు రక్షింపబడకుండా నిరోధించెనని ఆయన వివరించారు.

పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు [క్రైస్తవ శిష్యులకు] అనుగ్రహింపబడియున్నది [మత్తయి 13:11], వెలుపలనుండువారు ఒకవేళ ఎలోహీం వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను. (మార్కు 4:11, 12).

మారుమనస్సు విషయమైన సమస్య ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది, అది యహూషువః యొక్క రాజ్య సువార్తను అంగీకరించుట లేక అంగీకరించకపోవుట. ఇదే సత్యాన్ని లూకా గారు ఇంతే స్పష్టంగా నివేదించెను.

ఎవడైనను వాక్యమును [రాజ్యమును గూర్చిన సువార్తను మత్తయి 13:19] వినియు గ్రహింపక యుండగా, వారు వినును గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది [అనగా, సాతాను] వచ్చి వారి హృదయములోనుండి వాక్యమెత్తికొని పోవును. (లూకా 8:12).

ఇక్కడ మారుమనస్సు మరియు పాపక్షమాపణ అనేవి యహూషువః యొక్క రాజ్య సువార్తను జ్ఞాణముతో అంగీకరించుట అనే షరతుపై స్పష్టంగా ఆధారపడి ఉన్నాయి.

అయితే, నేటి సువార్త ప్రచారంలో, మార్పు చెందబోవు వ్యక్తికి యహువః రాజ్యమును గూర్చి అటువంటి సమాచారం ఇవ్వబడుటలేదు. బదులుగా తన కోసం మరణించిన “యహూషువఃను అంగీకరించమని” మరియు “తన పాపాలను అంగీకరించమని” అతడికి చెప్పబడుతుంది. అయితే, ఈ పద్ధతి యహూషువః అత్యంత ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమైన విషయమును దాటవేస్తుంది – మార్గం మళ్ళిస్తుంది. పైన పేర్కొన్న యహూషువః మాటల ఆధారంగా, మారుమనస్సు మరియు రాజ్య సువార్తను అంగీకరించుటకు వేరుగా రక్షణ ఇవ్వబడుతుందా? యహువః రాజ్యంపై పట్టు/జ్ఞానం లేకుండా విమోచన సాధ్యమేనా?

అపొస్తలు 8:12 లో క్రీస్తు శరీరంలో సభ్యులు కావడానికి లూకా గారు చాలా స్పష్టమైన “సూత్రాన్ని” ఇస్తున్నారు. మళ్ళీ, యహూషువః యొక్క సొంత సువార్త మాదిరిని అనుసరించి, ఈ విషయం రాజ్యాన్ని గూర్చిన సువార్తను అంగీకరించుట లేక తిరస్కరించుటపై ఆధారపడి ఉన్నది.

అయితే ఫిలిప్పు ఎలోహీం రాజ్యమును గూర్చియు యహూషువః మెస్సీయ నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి, పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి. (అపొస్తలుల కార్యములు 8:12).

నదీ బాప్తీస్మం

ఆశ్చర్యకరంగా ఆధునిక సువార్తికులు రక్షణను చూసే మార్గం ఇలా లేదు. వారి ఆలోచనలలో యహూషువః మరణం మరియు పునరుత్థానం అనే అంశాల ద్వారా యహూషువః రక్షణను ప్రకటించినప్పుడు చెప్పిన వాస్తవ మాటలను వినవలసిన అవసరత మింగివేయబడెను. ఈ అస్పష్ట పరిస్థితికి ఒక పరిష్కారం నాలుగు సువార్తల నుండి అనగా మత్తయి మార్కు లూకా మరియు యోహానులలోని యహూషువః మాటలతో మొదలు పెట్టి సువార్త ప్రకటించుటకు పూనుకొనుట. ఈ నాలుగు ధృవీకరణ వృత్తాంతాలు సువార్త యొక్క ప్రాధమిక మరియు ఆధార అంశమైన రాజ్య సువార్తను అంగీకరించుట మాత్రమే యహూషువఃను అంగీకరించుట అనే సాధారణ వాస్తవాన్ని కప్పిపుచ్చుట అసాధ్యం అని ధృవీకరిస్తాయి.

“మీరతని [మోషే] లేఖనములను నమ్మనియెడల నా మాటలు ఏలాగు నమ్ముదురు?” “నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు.” (యోహాను 5:47, 24).

యహూషువః యొక్క ఈ క్రింది మాటలు మన పాఠ్యాంశానికి చాలా సందర్భోచితమైనవి మరియు మనం రక్షణ కొరకు ప్రజలకు ప్రకటించాల్సినదాని విషయంలో విప్లవం కోసం పిలుపునివ్వాలి:

“చిన్న బిడ్డవలె ఎలోహీం రాజ్యమును అంగీకరింపనివాడు దానిలో ఎంతమాత్రమును ప్రవేశింపడు.” (లూకా 18:17; యోహాను 17:8).

“మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరు.” (మత్తయి. 18:3).

“ఒకడు క్రొత్తగా( లేక,పైనుండి) జన్మించితేనే కాని అతడు ఎలోహీం రాజ్యమును చూడలేడు.” (యోహాను 3:3-5).

యహూషువః యొక్క వివిధ ప్రకటనలను ఒకచోట చేరిస్తే: మీరు యహూషువః మరియు అపొస్తలుల రాజ్య సువార్తను విని అర్థం చేసుకోకపోతే మీరు విమోచింపబడలేరు మరియు క్షమాపణ పొందనేరరు. మీరు మార్పునొంది, బిడ్డలవంటి వారై, తిరిగి జన్మించి యహువః రాజ్యాన్ని స్వీకరిస్తేనే గాని, మీరు దానిలోకి ప్రవేశింపలేరు, రక్షింపబడరు. (మార్కు 4:11,12,14; యోహాను 3:3,5; లూకా 8:12; మత్త. 13:19.)

బైబిలు అధ్యయనంపౌలు యొక్క నిజాయితీని అతని శ్రోతలు తిరస్కరించినప్పుడు, ఉదయమునుండి సాయంకాలమువరకు అతడు ఎలోహీం రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. అతడు చెప్పిన సంగతులను కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. ”(అపొస్తలుల కార్యములు 28:23, 24). కాబట్టి, విశ్వసించుట, క్రైస్తవునిగా మారుట‌ అనగా రాజ్యమును మరియు యహూషువఃను గూర్చి వివరముగా బోధించబడి ఒప్పించబడుట.

“వారు తమ మనస్సులను మూసివేసికొనక, రాజ్య సువార్తను హృదయపూర్వకంగా విని, చూసి, అర్థం చేసుకుంటే వారు పశ్చాత్తాపము పొంది క్షమించబడుదురు” (మార్కు 4:12).

యహూషువః మాటల ప్రకారం రక్షణ ఎల్లప్పుడూ యహువః రాజ్యమును మరియు యహూషువః మరణ-పునరుత్థానములను గూర్చిన సత్యమును జ్ఞానానుసారమైన అవగాహన ద్వారా మనస్సులో అంగీకరించుటపై మీద ఆధారపడి ఉంటుంది.

కావున, “నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు.” (యోహాను 5:24).

రక్షణ అనేది యహూషువః మాటలను వినుట, అర్థం చేసుకొనుట మరియు ఆచరించుట మీద ఆధారపడి ఉంటుంది. విశ్వాసం అంటే యహూషువః మరియు అపొస్తలులు చెప్పేదాన్ని నమ్మటం మరియు ఆ మాటల ప్రకారం పనిచేయడం. ఆ విధంగా పౌలు రాజ్య సువార్త యొక్క వృత్తి బోధకునిగా (అపొస్తలుల కార్యములు 20:25) “వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును” అని తేల్చి చెప్పెను (రోమా. 10:17). అయితే రక్షణ గొలుసులో తప్పిపోయిన బంధం, జనాదరణ పొందినట్లుగా, సువార్తగా యహూషువః ప్రకటించిన దానిని పెద్దగా పట్టించుకోక పోవుట.


ఇది ఆంథోనీ బజార్డ్ రాసిన వ్యాసం. డబ్ల్యుఎల్‌సి కథనం కాదు. ఇది (http://jesuskingdomgospel.com/ లో ప్రచురించబడింది).

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి మరియు కుమారుని శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి టీం.

Comments

Leave a Reply

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.