World's Last Chance

At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

యూదులు అసూయపడేలా చేయడం: రోమా 9-11 యొక్క మరో కోణం

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

యూదులు అసూయపడేలా చేయడం: రోమా 9-11 యొక్క మరో కోణం

పౌలు రోమీయులకు వ్రాసిన పత్రికలో, తాను “సువార్త విషయంలో సిగ్గుపడలేదు అని చెప్పాడు, ఎందుకంటే అది విశ్వసించే ప్రతి ఒక్కరి రక్షణ కోసం యహువః యొక్క శక్తి: మొదట యూదునికి, తరువాత అన్యజనులకు” (రోమా 1:16). సువార్త ఏ భావంలో “మొదట యూదునికి”? నేటి క్రైస్తవులకు ఇది ఎలా అర్థం అవుతుంది?

రక్షణ అనేది యహువః యొక్క స్వేచ్ఛా ఎంపికపై ఆధారపడి ఉంటుంది—యూదునిగా పుట్టడంపై కాదు.

యూదులు అసూయపడేలా చేయడం: రోమా 9-11 యొక్క మరో కోణం image

తన తోటి యూదులు సువార్తను విశ్వసించనందున, పౌలు తన హృదయంలో “చాలా దుఃఖమును మరియు ఎడతెగని వేదనను” కలిగి ఉన్నాడు (రోమా 9:2). అయితే, ఇది సువార్తకు బలహీనమైన ప్రతిఫలం మాత్రం కాదు—యహువః మాట విఫలం కాలేదు (రోమా 9:6).

యూదునిగా పుట్టడం రక్షణకు హామీ ఇవ్వదని యహువః వాక్యం చూపిస్తుంది. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు ఎంపిక చేయబడ్డాడు, కానీ ఇస్మాయేలు తిరస్కరించబడ్డాడు; యాకోబు ఎన్నుకోబడ్డాడు, కానీ ఏశావు తిరస్కరించబడ్డాడు (రోమా 9:6-13). యహువః కొందరిని తిరస్కరించి, మరికొందరిని రక్షించగలడు—అది ఆయన స్వంత దైవిక ఎంపిక: “యహువః ఎవనిని కనికరింప గోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచ గోరునో వాని కఠిన పరచును” (రోమా 9:18). రక్షణ అనేది యహువః యొక్క స్వేచ్ఛా ఎంపికపై ఆధారపడి ఉంటుంది—యూదునిగా పుట్టడంపై కాదు.

ఇంకా, రక్షణ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. సువార్త బోధించబడినప్పుడు, దానిని నమ్మాలి. అయితే, చాలా మంది యూదులు క్రియల ద్వారా యహువఃతో సమాధాన పడుటకు తీరిక లేకుండా ఉన్నారు, వారు సువార్త వినినప్పుడు, వారు దానిని కొట్టిపారేశారు: “వారు విశ్వాసంతో కాదు, క్రియల ద్వారా దానిని వెంబడించారు” (రోమా 9:32). ఆ విధంగా, పౌలుతో ఉన్న తోటి యూదులు సువార్తను విన్నారు, కానీ దానిని నమ్ముటకు నిరాకరించారు.

సువార్తను విశ్వసించే యూదుల శేషం ఎప్పటినుంచో ఉందని మరియు ప్రస్తుతం ఉనికిలో ఉందని పౌలు రోమీయులకు మరియు మనకు గుర్తు చేస్తున్నాడు.

యూదులు అసూయపడేలా చేయడం: రోమా 9-11 యొక్క మరో కోణం image

దానర్థం యహువః ప్రణాళికలలో యూదులకు ముగింపు అనా?

సువార్తను విశ్వసించే యూదుల శేషం ఎప్పటినుంచో ఉంటూ మరియు ప్రస్తుతం ఉనికిలో ఉందని పౌలు రోమీయులకు మరియు మనకు గుర్తు చేస్తున్నాడు: “కృప యొక్క యేర్పాటు చొప్పున శేషము మిగిలి యున్నది” (రోమా 11:5). సువార్తను విశ్వసించే చాలా మంది యూదులు ఎల్లప్పుడూ ఉంటారు.

ఇంకా, క్రీస్తు మరణ పునరుత్థానాలు మొదలుకొని ఆయన తిరిగి వచ్చే వరకు యూదుల జోక్యంతో జరిగే ఒక ప్రక్రియ ఉంది. క్రీస్తుకు ముందు, అన్యజనులు నిరీక్షణ లేకుండా మరియు యహువః లేకుండా ఉన్నారు (ఎఫె. 2:12). ఇప్పుడు యూదుల అవిధేయత ఫలితంగా అన్యజనులు రక్షింపబడుతున్నారు (రోమా 11:30). కానీ ప్రక్రియ అక్కడ ఆగిపోదు. అన్యజనుల రక్షణ యూదులను అసూయకు గురిచేయడానికి రూపొందించబడింది, తద్వారా వారు రక్షించబడతారు: “వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను” (రోమా 11:11). వాస్తవానికి, అన్యులు అంటుకట్టబడిన ఒలీవ చెట్టు (చర్చి) యూదు మూలాలను కలిగి ఉంది—అన్యజనులు “అడవి” ఒలీవ చెట్టు నుండి “ప్రకృతికి విరుద్ధంగా” అంటు కట్టబడ్డారు (రోమా 11:24).

యహూషువః మరియు యహూషువః మాత్రమే తమ మెస్సీయ అని ఇప్పుడు యూదులు చూస్తున్నందున, సహజమైన కొమ్మలైన వారు తిరిగి అన్యజనులతో పాటు తమ సొంత చెట్టులోకి అంటుకట్టబడతారని మా ఆశ.

యూదులు అసూయపడేలా చేయడం: రోమా 9-11 యొక్క మరో కోణం image

అవిధేయులైన యూదులు, అసూయపడినప్పుడు (వారి స్వంత ఎలోహిమ్, వారి స్వంత మెస్సీయ మరియు వారి స్వంత బైబిల్ ద్వారా అన్యజనులు రక్షించబడటం చూచుట ద్వారా), వారి స్వంత ఒలీవ చెట్టులో తిరిగి అంటుకట్టబడతారు: వారు “సహజమైన” కొమ్మలు (రోమా 11:24). సువార్త అనేది “మొదట—యూదులకు”—వారు సహజ వారసులు మరియు ఇప్పటికీ సువార్త గ్రహీతలు—వారు “సహజమైన” కొమ్మలు. యూదులు “బయట” మరియు అన్యులు “లోపల” అనే ఈ ప్రక్రియ అక్కడితో అంతం కాదు: కొంతమంది రక్షింపబడునట్లు యూదులను అసూయపడేలా పురికొల్పే ఉద్దేశ్యం కూడా ఈ ప్రక్రియకు ఉంది (రోమా 11:14). నిజానికి, ఇది యూదులు రక్షించబడే ప్రక్రియ. మరియు అంత్య దినాన, క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు, నిజంగా ఇశ్రాయేలు అయిన ఇశ్రాయేలీయులందరూ రక్షింపబడతారని మనం చూసాము (రోమా 11:26); అనగా యహువః మాట విఫలం కాలేదు (రోమా 9:6); మరియు ఆయన తన ఇశ్రాయేలు యెడల తన పిలుపును మరియు వాగ్దానాలను నిలబెట్టుకున్నాడు, అవి మార్పులేనివి (రోమా 11:29).

కాబట్టి క్రైస్తవులు, యూదులు మరియు అన్యజనులు, యూదులకు (మరియు దేశాలకు, లేక యూదులు కానివారికి; కానీ ఎప్పుడూ దేశాలకు మాత్రమే కాదు) సువార్తను తీసుకెళ్లుటను కొనసాగించాలి. అది విని, నమ్మి, రక్షింపబడే శేషం ఉంది. యహూషువః మరియు యహూషువః మాత్రమే తమ మెస్సీయ అని ఇప్పుడు యూదులు చూస్తున్నందున, సహజమైన కొమ్మలైన వారు తిరిగి అన్యజనులతో పాటు తమ సొంత చెట్టులోకి అంటుకట్టబడతారని మా ఆశ. మరియు క్రైస్తవులు కూడా యహువః ద్వారా రక్షణను మరియు తమ స్వంత వాగ్దానాల నెరవేర్పును మరియు లేఖనాలను కలిగియున్నారు.


ఇది మార్టిన్ పాకుల రాసిన వ్యాసం. WLC వ్యాసం కాదు.

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి – కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృందం.

Comments

Leave a Reply

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.