World's Last Chance

At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

రక్షణ: స్వీకరించబడుతుంది, సాధించబడదు!

సమస్త క్రైస్తవులు రక్షణ అనేది కృప యొక్క బహుమానము అని అంగీకరిస్తున్నారు. మరియు ఇంకా, ఈ హామీ ఉన్నప్పటికీ, క్రైస్తవులలో అధిక శాతం, తమకు తెలియకుండానే, వారు అంగీకరిస్తున్న నమ్మకానికి విరుద్ధంగా క్రియల ద్వారా రక్షణ అనే మనస్తత్వంలోనికి జారిపోతున్నారు.

రక్షణ యొక్క అద్భుతమైన బహుమానమును మరియు దానిలో మీ పాత్రను గురించి గ్రంథం ఏమి చెబుతుందో చూడండి.

హడ్సన్హడ్సన్ టేలర్, చైనాకు 19 వ శతాబ్దపు మిషనరీ, ఒకసారి ఇలా వ్రాశాడు:

ప్రయాసపడి, భారము-మోయు ప్రతి పాపికి, [యహూషువః] ఇలా చెప్పుచుండెను, “నా యొద్దకు వచ్చి విశ్రాంతి తీసికొనుడి.” చాలా మంది ప్రయాసపడి, భారము-మోయుచున్న విశ్వాసులు ఉన్నారు. ఈ ఆహ్వానం వారికి ఉద్దేశించబడినది. మీరు మీ పనిలో భారీ భారముతో ఉంటే, [యహూషువః] యొక్క మాటలను బాగా గుర్తుంచుకోండి, మరియు దానిని అపార్ధం చేయకండి. దీనర్థం “వెళ్ళండి, శ్రమపడండి, అని కాదు. దీనికి విరుద్ధంగా, “ఆగండి, వెనుకకు తిరిగండి, నా యొద్దకు వచ్చి విశ్రాంతి తీసుకోండి.” అని అర్థం. ఎప్పుడూ, ఎప్పుడూ, క్రీస్తు ప్రయాసపడుతున్న ఒక వ్యక్తిని భారము గల పనికి పంపలేదు; ఎప్పుడూ, ఆయన ఆకలితో ఉన్న, అలసి ఉన్న, అనారోగ్యం లేదా బాధతో ఉన్న ఒక వ్యక్తిని పనికి పంపలేదు. అలాంటి వారికి బైబిలు ఒక్కటే చెబుతుంది: “రండి రండి రండి”.

రక్షణ ఉచిత బహుమానము అని హామీ ఇవ్వబడిన తర్వాత క్రైస్తవులు హామీ ఇవ్వబడ్డారు. మరియు ఇంకా, దయ యొక్క రక్షణ స్థితిని కాపాడుకొనుటలో విశ్వాసి కొంత భాగాన్ని పంచుకోవాలి. రక్షణ ఒక ఉచిత బహుమానం కావచ్చు, దానిని విశ్వాసి అంగీకరిస్తాడు, కానీ తప్పనిసరిగా అనుదినం లోబడుట, మంచిది తినుట, స్వయమును తిరస్కరించుట, పాపము మీద విజయం సాధించట మొదలైనవి జ్ఞాపకముంచుకొనుట విశ్వాసి యొక్క విధిగా ఉండాలి. అతడు అలా చేయకపోతే, మోక్షం యొక్క బహుమానము తీసివేయబడుతుందని భావించాలి.

అనుదినము లోబడుట, చుట్టుకొనియున్న పాపములపై విజయం, మరియు దైవిక జీవితము, అన్నియు రక్షణ యొక్క ఫలములు.

రక్షణ: స్వీకరించబడుతుంది, సాధించబడదు! image

ఈ వాదనను గొప్ప ప్రొటెస్టంట్ సంస్కర్తయైన, మార్టిన్ లూథర్ తిరస్కరించారు, ఆయన ఇలా ప్రశ్నించారు: “రక్షణ మనకు (క్రియలకు) వెలుపల ఉన్నదని నమ్ముట అద్భుతమైన వార్త కాదా?”

అనుదినము లోబడుట, చుట్టుకొనియున్న పాపములపై విజయం, మరియు దైవిక జీవితము, అన్నియు రక్షణ యొక్క ఫలములు. అవి ఇప్పుడు, మరియు ఎప్పటికీ, రక్షణ బహుమానమును కాపాడుకొను క్రమంలో అవసరమైన నీతి క్రియలు కాదు.

రక్షణ ఎల్లప్పుడూ స్వీకరించబడుతుంది; ఎన్నడూ సాధించబడదు.

క్రియల ద్వారా నీతి రాదు

ఎందుకనగా మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వమునందును అసూయ యందును కాలము గడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని

మన రక్షకుడైన ఎలోహీం యొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన (పునఃస్థితిస్థాపన సంబంధమైన) స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి, నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యహూషువః మెస్సీయ ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను. (తీతుకు 3: 3-7)

పౌలు ఖచ్చితంగా ఉన్నాడు: రక్షణ ఒకడు చేసిన నీతికి చెందినది కాదు. బదులుగా, అది తండ్రి యొక్క దయ మరియు ప్రేమ వలన మాత్రమే. ఇంకనూ, విశ్వాసులు తమను తాము పరిశుద్ధ పరచుకొనుటకు బాధ్యులు కారు. బదులుగా, పునరుద్ధరణలో మరియు పరిశుద్ధ పరచుటలో ఒక కర్త బహుమానముగా ఉండెను: యహువః యొక్క ఆత్మ, యహూషువః రక్తము యొక్క గొప్పదనములో విశ్వసించే వారందరికీ కుమ్మరించబడుతుంది.

రక్షణ, ఎల్లప్పుడూ, ఒక బహుమానము.

ఎప్పుడూ మరియు ఎల్లప్పుడూ విశ్వాసం ద్వారానే

ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా ఎలోహీం నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు. అది యహూషువః మెస్సీయనందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు ఎలోహీం నీతియైయున్నది.

ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి ఎలోహీం అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, యహూషువః మెస్సీయనందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను ఎలోహీం తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని యహూషువః మెస్సీయ రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. ఎలోహీం ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యహూషువః నందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.

కాబట్టి అతిశయకారణ మెక్కడ? అది కొట్టి వేయ బడెను. ఎట్టి న్యాయమునుబట్టి అది కొట్టి వేయబడెను? క్రియాన్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతి మంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము. (రోమీయులకు 3:21-28)

విమోచన అనేది కేవలం నీతిమంతుడిగా ప్రకటించబడుట అనుదానికి ఒక పెద్ద పదం. ఒక వ్యక్తి విమోచింపబడినప్పుడు, యహూషువః యొక్క పాపములేని జీవితం మరియు మచ్చలేని మరణం యొక్క యోగ్యతలను యహువః తీసుకొని దానిని విశ్వాసులకు అందజేస్తాడు. అప్పుడు విశ్వాసి క్రీస్తు నీతిని ధరించుకొని, ఎన్నడూ పాపము చేయనివానివలె యహువః ఎదుట నిలబడతాడు.

ఇది ఒక బహుమానము, అయితే ఇది ఇచ్చుటను కొనసాగించే బహుమానము. ఇది ఒక్క సారి మాత్రమే జరుగు లావాదేవీ కాదు. నీ క్రైస్తవ నడక ప్రారంభంలో నీవు విమోచించబడలేదు, విజయం కూడా ఒక బహుమానమైనప్పటికీ, నీవు నేర్పుగా పాపము చేయని జీవనము ద్వారా ఆ నీతిని కాపాడుకోవలసి ఉంది.

బహుమానము

అది యహువః యొక్క క్రియ

అయినను ఎలోహీం కరుణా సంపన్నుడైయుండి, మనము మన అపరాధముల చేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతో కూడ బ్రదికించెను. కృపచేత మీరు రక్షింపబడియున్నారు. యహూషువః మెస్సీయనందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము, యహూషువః మెస్సీయనందు మనలను ఆయనతో కూడ లేపి, పరలోకమందు ఆయనతో కూడ కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, ఎలోహీం వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని ఎలోహీం ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము యహూషువః మెస్సీయనందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము. (ఎఫెసీయులకు 2: 4-10)

క్రీస్తు యొక్క ఐశ్వర్యం నుండి మీ స్వంత క్రియల వైపు మీ దృష్టిని మార్చిన క్షణం అది క్రియల ద్వారా రక్షణగా మారుతుంది. మీరు ఒక చాక్లెట్ తినడానికి తిరస్కరించినప్పుడు సంతృప్తి యొక్క సూక్ష్మమైన భావన మీలో కలగవచ్చు, మీరు నిజంగా, నిజంగా దానిని చేయుదురు ఎందుకంటే చాక్లెట్ కెఫిన్ అను పదార్థమును కలిగి ఉంటుంది, మరియు అది మీకు చెడును కలిగిస్తుంది. మీరు రహస్యంగా చేయాలనుకునేదాన్ని ఇతర క్రైస్తవులు చేయుటను మీరు చూచినప్పుడు, ఆధిపత్యం యొక్క సూక్ష్మమైన భావన అంతగా ఉండదు. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు మీరు స్వీయ నియంత్రణతో మరియు దూరంగా ఉంటున్న వాటిని చేయడు/తినడు/త్రాగడు/చూడడు.

ఆధ్యాత్మిక స్వంత ఆధిపత్యపు ఆలోచన ఎల్లప్పుడూ ఒక క్రియల-ద్వారా-రక్షణ యొక్క లక్షణం. దీనికి విరుద్ధంగా, పౌలు “క్రీస్తుతో కూడ మనలను బ్రతికించుచున్నది యహువః అని చెప్పుచుండెను.” ఇవ్వబడిన బహుమానము యొక్క సామర్ధ్యమును విశ్వసించుటయే మన కర్తవ్యం. “అదేమనగా యహూషువః ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, ఎలోహీం మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.” (రోమీయులకు 10:9)

సృష్టికర్త మన పునః సృష్టికర్త

కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను; సమస్తమును ఎలోహీం వలననైనవి; ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, ఎలోహీం వారి అపరాధములను వారి మీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. (రెండవ కొరింథీయులకు 5:17-19)

రక్షణ ప్రణాళిక యొక్క ఉద్దేశ్యం నిత్య మరణం నుండి పాపులను కాపాడాలనే కోరిక కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క అంతిమ లక్ష్యం సృష్టికర్తతో వారిని సన్నిహిత సంబంధంలోనికి మరొక్కసారి తీసుకువచ్చుట. ఇది సృష్టికర్త మాత్రమే స్వయంగా చేయగలిగిన పని. ఆదాము పతనంతో పోగొట్టుకున్న స్వచ్ఛతను మానవ హృదయంలో పునరుద్ధరిస్తూ, ఆయన తన రూపంలోనికి మళ్లీ మనలను మారుస్తాడు.

ఒకసారి శుద్ధి చేయబడిన తరువాత, విశ్వాసి తండ్రితో “ఐక్యం” అవును. అప్పుడు, స్వీయ-తిరస్కరణతో వేదన పడుచుండుటకు బదులుగా, యహువః యొక్క చిత్తాన్ని చేస్తున్నప్పుడు విశ్వాసి తన సొంత లోతైన కోరికలను నియంత్రించుకుంటాడు.

రక్షణ: స్వీకరించబడుతుంది, సాధించబడదు! image

ఇది ఒక అమూల్యమైన బహుమానము! ఒకసారి శుద్ధి చేయబడిన తరువాత, విశ్వాసి తండ్రితో “ఐక్యం” అవును. ఇప్పుడు, స్వీయ-తిరస్కరణతో వేదన పడుచుండుటకు బదులుగా, యహువః యొక్క చిత్తాన్ని చేస్తున్నప్పుడు విశ్వాసి తన సొంత లోతైన కోరికలను నియంత్రించగలుగుతాడు. అందుకే, మీకు మీరుగా ఉత్పత్తి చేసుకున్న విధేయత అయితే ఆ విధేయత మిమ్మల్ని కాపాడదు. కేవలం పరిశుద్ధమైన ఉద్దేశ్యాల నుండి ప్రవహిస్తున్న విధేయత మాత్రమే యహువఃకు ఆమోదయోగ్యమైనది, మరియు స్వచ్ఛత యొక్క అంతటి స్థాయి బహుమానంగా మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఎంపిక మీదే

ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. (ప్రకటన గ్రంథము 22:17)

తొలి క్రైస్తవ వేదాంతి అయిన హిప్పో యొక్క అగస్టీన్, ఒకసారి ఇలా చెప్పాడు: “మన సహాయం లేకుండా మనలను సృష్టించినవాడు మన సమ్మతి లేకుండా మమ్మల్ని రక్షించడు.” రక్షణ, మొదట మరియు చివర, మరియు ఎల్లప్పుడూ ఒక బహుమానమైయున్నది. కానీ మీరు దానిని అంగీకరించుటను ఎన్నుకుంటారో లేదో మీకే వదిలివేయబడింది. అగస్టీన్ వివరణ: ఆయన మన సహాయం లేకుండా మనలను సృష్టించెను మరియు, మన సమ్మతితో, మన సహాయం లేకుండా మనలను పునఃసృష్టి చేయును.

సెయింట్ అగస్టీన్

రక్షణ మీదే, సరిగ్గా ఇదే క్షణం. ఇంతటి అమూల్యమైన బహుమానమును సంపాదించుకొనుటకు మీరు ఏమీ చేయలేరు, మీరు దానిని నిలుపుకొనుటకు విధేయత యొక్క ఏ క్రియలను చేయనవసరం లేదు. రక్షణ మిమ్మల్ని దైవిక చిత్రంలోనికి పునరుద్ధరించుటకు అవసరమైన ప్రతిదానినీ అందిస్తుంది, మరియు అది పరిశుద్ధమైన ఉద్దేశ్యాల నుండి ప్రవహిస్తున్న విధేయతను కలిగి ఉంటుంది.

మీరు ఎప్పుడూ రక్షణను సాధించలేరు. అయితే, మీరు దాన్ని అంగీకరించాలి. “కాబట్టి ఎలోహీం ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. ఎందుకనగా ఎలోహీం తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును.” (హెబ్రీయులకు 4:9-10)

ఆ ఎంపిక నేడే చేసుకోండి! యహువః యొక్క రక్షణ బహుమానమును స్వీకరించి, మీరు కూడా, మీ విశ్రాంతిలోనికి ప్రవేశించవచ్చు.

“ఎలోహీం మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు;
లోకమును జయించిన విజయము మన విశ్వాసమే.”
(1 మొదటి యోహాను 5:4.)

సెయింట్ అగస్టీన్

Comments

Leave a Reply

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.