World's Last Chance

At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

While WLC continues to uphold the observance of the Seventh-Day Sabbath, which is at the heart of Yahuwah's moral law, the 10 Commandments, we no longer believe that the annual feast days are binding upon believers today. Still, though, we humbly encourage all to set time aside to commemorate the yearly feasts with solemnity and joy, and to learn from Yahuwah's instructions concerning their observance under the Old Covenant. Doing so will surely be a blessing to you and your home, as you study the wonderful types and shadows that point to the exaltation of Messiah Yahushua as the King of Kings, the Lord of Lords, the conquering lion of the tribe of Judah, and the Lamb of Yahuwah that takes away the sins of the world.
WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

ప్రతి నిజమైన త్రిత్వ/ద్విత్వ సిద్ధాంతీకులు ఆలోచించవలసిన ప్రశ్నలు

యహువః ఒక్కడే. యహూషువః, మెస్సీయ, ఆయన‌ యొక్క జనితైక మానవ కుమారుడు. ప్రసిద్ధి గాంచిన నమ్మకానికి విరుద్ధంగా, మెస్సీయ సృష్టికర్త అని, తండ్రీ మరియు కుమారుడు ఒ్కడేనని, లేదా బెత్లెహేములో పుట్టకముందే యహూషువః ఉనికిలో ఉండెనని గ్రంథం బోధించుటలేదు.

చాలా మంది చక్కని మరియు ప్రియమైన సోదర సోదరీమణులు మన ప్రేమగల పరలోకపు తండ్రి మరియు తన కుమారుడు ఇద్దరూ వాస్తవానికి ఒకే వ్యక్తి అని విశ్వాసంతో ఉత్సాహంగా బోధిస్తారు. ఈ వ్యాసంలో, ఈ బోధకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మేము అడుగుతాము మరియు దీనికి ఆధారంగా తరచూ ఉపయోగించబడు అనేక వాక్య భాగాలను పరిశీలిస్తాము. ఇది ఆలోచింపజేయుటకే తప్ప వాదన కోసం ఉద్దేశించినది కాదు. ఇక్కడ మా లక్ష్యం వెలుగును ఉత్పత్తి చేయడమే, వేడిని కాదు.

లైట్ బల్బుమీరు ఈ అంశాలను/ప్రశ్నలను ప్రార్థనా పూర్వకంగా ఆలోచించినప్పుడు, మీరు సమస్త ఊహలను, ముందుగా కలిగియున్న ఆలోచనలను మరియు ప్రతిష్టాత్మకమైన సాంప్రదాయాలను పక్కన పెడతారని మా ఆశ. మీ అవగాహనను రూపొందించుటకు మీరు బైబిలును మాత్రమే అనుమతించాలని మా వినయపూర్వకమైన మనవి.

“ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును.” (యోహాను 16: 13 ఎ)

ప్రశ్న # 1: తండ్రి మరియు కుమారుడు అక్షరాలా ఒకే వ్యక్తి అయితే, తండ్రి శోధనలకు అతీతంగా ఉన్నప్పుడు, కుమారుడు ఎలా శోధింపబడతాడు?

యహువః శోధింపబడడు:

ఎలోహీం కీడు “చేత” (కెజెవి) శోధింపబడనేరడు మరియు ఆయన ఎవనిని శోధింపడు: గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను ఎలోహీంచేత శోధింప బడుచున్నానని అనకూడదు. (యాకోబు 1:13 కెజెవి)

యహూషువః శోధింపబడెను:

ఆయన సాతానుచేత శోధింపబడుచు అరణ్యములో నలువది దినములు అడవిమృగములతోకూడ నుండెను; మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. (మార్కు 1:13; మత్తయి 4: 1 మరియు లూకా 4: 2 కూడా చూడండి.)

కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, ఎలోహీం సంబంధమైన కార్య ములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్నివిషయములలో ఆయన [యహూషువః] తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై యున్నాడు. (హెబ్రీయులకు 2:17-18)

మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. (హెబ్రీయులకు 4:15)

ప్రశ్న # 2: తండ్రి మరియు కుమారుడు అక్షరాలా ఒకే వ్యక్తి అయితే, యహూషువః రాకడ సమయం తండ్రికి తెలిసినప్పుడు, యహూషువఃకు తన సమయం గురించి ఎందుకు తెలియదు. తండ్రి తన నుండి తానే రహస్యాలను దాచుచున్నట్లు సూచించుట అర్ధంలేనిది కాదా?

“ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు.” (మార్కు 13:32)

ప్రతి నిజమైన త్రిత్వ/ద్విత్వ సిద్ధాంతీకులు ఆలోచించవలసిన ప్రశ్నలు image

ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. (మార్కు 13:32; మత్తయి 24:36కూడా చూడండి.)

ప్రశ్న # 3: యహువః మరణం లేనివాడు మరియు మరణించడు. అయితే, యహూషువః మరణించాడు; ఆయన మీ కోసం మరియు నా కోసం తన ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా అర్పించాడు. తండ్రి మరియు కుమారుడు అక్షరాలా ఒకే వ్యక్తి అయితే, ఇది ఎలా సాధ్యమవుతుంది?

యహువః మరణం లేనివాడు

సమస్తమునకు జీవాధారకుడైన ఎలోహీం యెదుటను, పొంతిపిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన యహూషువః మెస్సీయ ఎదుటను, మన అదోనాయ్ యహూషువః ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైయున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌. (మొదటి తిమోతికి. 6:13-16)

“అమరత్వముగలవాడు – ఇక్కడ ఉన్న పదం – atανασία అథానాసియా – దీనికి సరైన అర్థం ‘మరణం నుండి మినహాయింపు’ అని. ఎలోహీం (తన స్వభావం) మరణం నుండి పరిపూర్ణమైన మరియు నిర్దిష్టమైన మినహాయింపును కలిగియున్నాడని అర్ధం.” – ఆల్బర్ట్ బర్న్స్ నోట్స్ ఆన్ ది బైబిల్

యహూషువః మరణించెను:

యహూషువః మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. (మత్తయి 27:50)

అయితే ఎలోహీం మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే మెస్సీయ మనకొరకు చనిపోయెను. (రోమీయులకు 5:8)

మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమై యున్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా మెస్సీయ చనిపోయి మరల బ్రదికెను. (రోమీయులకు 14:8-9)

తండ్రి మరియు కుమారుడు వాస్తవానికి, ఒకే వ్యక్తి అని సూచించినయెడల, అది సిలువమరణమును అపహాస్యం చేయటయే అవుతుంది. యహూషువఃయే యహువః అనే భావజాలానికి వ్రేలాడుట, యహువః పరలోకంలో బ్రతికే ఉన్నందున యహూషువః మరణం కేవలం కపట మరణము అని మీరు నమ్మునట్లు చేయుచున్నది. దయచేసి అటువంటి సిద్ధాంతం యొక్క పర్యవసానాలను గూర్చి ఆలోచించడానికి ఒక క్షణం ఆగండి. ఇది కాదనలేని విధంగా సువార్త సందేశాన్ని తిరస్కరిస్తుంది.


ప్రశ్న # 4: తండ్రి మరియు కుమారుడు అక్షరాలా ఒకే వ్యక్తి అయితే, మానవాళిని సృష్టించినది యహువః అని యహుఃషువః ఎందుకు చెప్తాడు? తాను సృష్టించానని ఆయన ఎందుకు చెప్పలేదు?

సృష్ట్యాదినుండి (ఎలోహీం) వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. (మార్కు 10: 6; మత్తయి 19: 4 కూడా చూడండి.)

తాను కోరుకుంటే తాను సృష్టికర్తనని అందరికీ తెలియజేయడానికి ఇది ఒక గొప్ప సందర్భం. ఆయన అలా చేయడు. ఆయన ఎప్పుడూ అలాంటి వాదన చేయలేదు.

ప్రశ్న # 5: తండ్రి మరియు కుమారుడు అక్షరాలా ఒకే వ్యక్తి అయితే, యహూషువః తన తండ్రిని ప్రత్యేక వ్యక్తిగా నిరంతరం ఎందుకు సూచిస్తాడు?

నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. (మత్తయి సువార్త. 6:30)

ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పెను. (మార్కు సువార్త 12:27)

ఎలోహీం తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? (లూకా సువార్త 18:7)

ప్రశ్న # 6: తండ్రి మరియు కుమారుడు అక్షరాలా ఒకే వ్యక్తి అయితే, యహూషువః యహువఃను తన “దేవుడు” అని ఎందుకు పదేపదే సూచిస్తాడు? యహువఃకు దేవుడు ఉన్నారా?

” . . . వెళ్లి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను. (యోహాను సువార్త 20:17)

ప్రతి నిజమైన త్రిత్వ/ద్విత్వ సిద్ధాంతీకులు ఆలోచించవలసిన ప్రశ్నలు image

ఇంచుమించు మూడు గంటలప్పుడు యహూషువః ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. (మత్తయి. 27:46; మార్కు 15:34 కూడా చూడండి.)

యహూషువః ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరుల యొద్దకు వెళ్లి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను. (యోహాను సువార్త 20:17)

యహూషువః తన తండ్రిని “ఏకైక నిజమైన దేవుడు” అని సూచిస్తున్నాడు – తన నుండి వేరుగా మరియు ప్రత్యేకంగా.

అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యహూషువః మెస్సీయను ఎరుగుటయే నిత్య జీవము. (యోహాను సువార్త 17:3)

ప్రశ్న # 7: తండ్రి మరియు కుమారుడు అక్షరాలా ఒకే వ్యక్తి అయితే, యహూషువః తండ్రిని ఎందుకు ప్రార్థిస్తాడు? అతడు తనను తాను ప్రార్థిస్తున్నాడా?

ఆ సమయమున యహూషువః చెప్పినదేమనగా తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. (మత్తయి సువార్త. 11:25)

నాయనా తండ్రీ, నీకు సమస్తము సాధ్యము; ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము; అయినను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము అనెను. (మార్కు సువార్త 14:36)

యహూషువః కన్నులు పైకెత్తి తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను. (యోహాను 11:41-42)

యహూషువః ఈ మాటలు చెప్పి ఆకాశమువైపు కన్నులెత్తి యిట్లనెను: తండ్రీ, నా గడియ వచ్చియున్నది. (యోహాను 17:1)

ప్రశ్న # 8: తండ్రి మరియు కుమారుడు అక్షరాలా ఒక్కడే అయితే, మానవాళికి తీర్పు తీర్చువాడు తండ్రి కాదు, యహూషువః అని గ్రంథం ఎందుకు స్పష్టంగా చెబుతుంది? ఒకే వ్యక్తి ఒకే సమయంలో ఎలా తీర్పు తీర్చును మరియు తీర్పు తీర్చడు?

తాను నియమించిన మనుష్యుని [యహూషువః] చేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చబోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. (అపొస్తలుల కార్యములు 17:31)

ప్రతి నిజమైన త్రిత్వ/ద్విత్వ సిద్ధాంతీకులు ఆలోచించవలసిన ప్రశ్నలు image

తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని . . . తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు. (యోహాను 5:22, 23)

ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు. (అపొస్తలుల కార్యములు 17:31)

[ఇవి కూడా చూడండి: మత్తయి. 25: 31-32; యోహాను 5: 26-27; రోమా ​​2:16; 2 తిమోతి. 4: 1]

ప్రశ్న # 9: తండ్రి మరియు కుమారుడు అక్షరాలా ఒకే వ్యక్తి అయితే, యహూషువః యహువఃను తన “తండ్రి” అని పదేపదే ఎందుకు సూచిస్తాడు? యహూషువః తన సొంత తండ్రినా?

ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. (మత్తయి. 7:21)

గనుక నాతండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా . . . నేనును మీకు రాజ్యమును నియ మించుచున్నాను. (లూకా 22: 29,30)

అయితే యహూషువః, నా తండ్రి యిది వరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. (యోహాను 5:17)

ప్రశ్న # 10: తండ్రి మరియు కుమారుడు అక్షరాలా ఒకే వ్యక్తి అయితే, యహూషువః తనను తాను యహువః “కుమారుని” గా పదేపదే ఎందుకు సూచిస్తాడు? యహువః తన సొంత కొడుకునా?

అందుకు సీమోను పేతురునీవు సజీవుడగు దేవుని కుమారుడవైన మెస్సీయవని చెప్పెను. అందుకు యహూషువః సీమోను బర్‌యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనే కాని నరులు (మూలభాషలో రక్తమాంసములు) నీకు బయలు పరచలేదు. (మత్తయి 16:16-17)

పై వాక్యభాగంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

  1. “జీవము గల దేవుని కుమారుడు” అని పేతురు ఒప్పుకున్నాడు. (యహూషువఃయే జీవము గల దేవుడు అని పేతురు చెప్పలేదు.)
  2. పేతురు ఒప్పుకోలును యహూషువః ధృవీకరించెను మరియు పేతురు యొక్క గ్రహింపుకు తన “తండ్రే” మూలం అని చెప్పాడు.

యహూషువఃయే దేవుడు అని బోధించే వారు ఇక్కడ పేతురు మరియు యహూషువః ఇద్దరినీ అబద్ధికులను చేస్తున్నారు. అలా చేయుటను యహువః నిషేధించారు.

యహూషువః ఎప్పుడు / ఎందుకు “యహువః కుమారుడు” అని పిలువబడెను?

మరియు దూత సమాధానం ఇస్తూ ఆమెకు ఇలా చెప్పెను: “పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై యహువః కుమారుడనబడును. (లూకా సువార్త 1:35)

పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఆవరించుట ద్వారా మరియ గర్భం దాల్చినందున యహూషువః “యహువః కుమారుడు” అని పిలువబడెను. యహువః యొక్క మార్పులేని వాక్యం కన్య మరియ గర్భంలో గర్భందాల్చుట ద్వారా, అక్షరాలా శరీరధారిగా మారెను. (యోహాను 1:14).

ఈ అద్భుత సంఘటననే కీర్తనకారుడు దాదాపు 1,000 సంవత్సరాల క్రితం ప్రవచించాడు. యహూషువః, వాగ్దానం చేయబడిన మెస్సీయ, దావీదు వంశస్థుడు మరియు సింహాసనపు వారసుడు అక్షరాలా ఒక ఖచ్చితమైన సమయంలో జన్మించాడు.

కట్టడను నేను వివరించెదను: యహువః నాకీలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు; నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు; కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు. (కీర్తన 2: 7-9)

మానవ పిండం కావడానికి ముందు యహూషువః పరలోకంలో ఉన్నట్లు గ్రంథం బోధించుటలేదు.


నిబంధనలను అర్థం చేసుకొనుట

హెబ్రీయులు “క్రీస్తు” ని ఎలా అర్థం చేసుకున్నారు? “మెస్సీయ” ఎవరు లేదా ఏమిటి?

పశ్చిమాన మనం, బైబిల్ రచయితలు రాసిన మెస్సీయ మరియు క్రీస్తు యొక్క నిజమైన అర్ధాన్ని తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటాము. ఈ రెండు పదాలకు కేవలం “అభిషిక్తుడు” అని అర్ధం. అవి ఏ విధంగానూ దైవత్వాన్ని గానీ దేవున్ని గానీ సూచించవు. పాత నిబంధనలో పారసీక రాజై కోరేషును యహువః యొక్క “మెస్సీయ” అని పిలుచుటను మీరు ఆలోచించినప్పుడు ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.

అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను . . . అని యహువః తాను అభిషేకించిన[H4899: మాషియాఖ్ (మెస్సీయ)], కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. (యెషయా. 45:1a)

లైట్ బల్బులుమెస్సీయ / క్రీస్తు అనే పదం ప్రత్యేక ఉద్దేశ్యం కోసం అభిషేకించుటను సూచించును.

మాషియాఖ్ అనగా “అభిషిక్తుడు” అని అర్ధం. (1) మాషియాఖ్ అనే నామవాచకం పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన అవగాహనలకు ముఖ్యమైన పదం, ఇది మనకు మెస్సీయ అనే పదాన్ని ఇస్తుంది. (2) క్రియలో నిజం ఉన్నట్లుగా, మాషియాఖ్ అనే పదం ప్రత్యేక కార్యం లేదా విధి కోసం అభిషేకించుటను సూచిస్తుంది. (2ఎ) ఈ విధంగా, సౌలు “దేవుని చేత అభిషేకం” పొందినవాడు (1 సా 24: 6) గనుక దావీదు సౌలుకు హాని చేయటకు నిరాకరించాడు . . . (4) క్రీస్తు అనే క్రొత్త నిబంధన పదము గ్రీకు పదమైన క్రిస్టోస్ నుండి ఉద్భవించింది, ఇది హెబ్రీ మాషియాఖ్ తో సమానంగా ఉంటుంది, ఎందుకంటే ఇది ‘నూనెతో అభిషేకించుట’ అనే ఆలోచనలో కూడా పాతుకుపోయింది. కాబట్టి క్రీస్తు అనే పదం దేవుడు ఎన్నుకున్న వ్యక్తిగా తన పాత్ర నిమిత్తం నజరేయుడైన యేసు యొక్క ప్రత్యేక అభిషేకాన్ని నొక్కి చెబుతుంది. (ది న్యూ స్ట్రాంగ్స్ ఎక్స్‌పాండెడ్ డిక్షనరీ ఆఫ్ బైబిల్ వర్డ్స్)

యహూషువః “దైవిమా?

ఈ ప్రశ్న చాలా మందిలో గందరగోళానికి కారణమౌతుంది ఎందుకంటే “దైవిక” యొక్క అర్ధం స్పష్టంగా వివరించబడలేదు.

వెబ్‌స్టర్ నిఘంటువు “దైవిక” ని ఇలా నిర్వచిస్తుంది:

1 మతం
a: దేవునికి సంబంధించిన లేదా లేదా ఒక దేవుడి నుండి నేరుగా వచ్చుట
b: ఒక దేవుడు/దేవత

ఇక్కడ ప్రశ్న, “యహూషువః నేరుగా యహువః యొద్దనుండి వచ్చెనా?” అని అయితే, (నిర్వచనం 1a), అప్పుడు సమాధానం అవును. అతడు యహువః యొద్దనుండి వచ్చెను; అతడు శరీరం ధరించిన యహువః యొక్క మాట. (అయినప్పటికీ, మరియ గర్భంలో అతని అద్భుత గర్భధారణకు ముందు అతడు ఉనికిలో లేడు.)

ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని(లేక, జనితైకకుమారుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి (యోహాను 1:14)

యహూషువః వారితో ఇట్లనెను; యహువః మీ తండ్రియైన యెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను యహువః యొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. (యోహాను 8:42)

ఇక్కడ ప్రశ్న, “యహూషువః దైవమా”? అని అయితే, (నిర్వచనం 1 బి), అప్పుడు సమాధానం కాదు. యహూషువః; దావీదుకి వాగ్దానం చేయబడిన వారసునిగా, యహువః ఆత్మ యొక్క అద్భుత క్రియ ద్వారా కన్య నుండి జన్మించిన మానవుడు.

“అతని[దావీదు] సంతానమునుండి ఎలోహీం తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యహూషువఃను పుట్టించెను.” (అపొస్తలుల కార్యములు 13:23)

ప్రతి నిజమైన త్రిత్వ/ద్విత్వ సిద్ధాంతీకులు ఆలోచించవలసిన ప్రశ్నలు image

దూత పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. (లూకా సువార్త 1:35)

యహూషువః మెస్సీయ, శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి ఎలోహీం కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. (రోమీయులకు 1: 4)

తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను. అతని సంతానమునుండి ఎలోహీం తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుకొరకు రక్షకుడగు యహూషువః ను పుట్టించెను.

యహూషువః ఒక “మానవుడు” అని చెప్పినప్పుడు లేఖనం యొక్క అర్థం ఏమిటి?

దీనర్థం అది చెప్పునదే. మన పరలోకపు తండ్రి అయిన యహువః “మనిషి” గా ఎప్పుడూ సూచించబడలేదు. చాలామంది నిజమైన క్రైస్తవులు యహూషువఃను 100% యహువః మరియు 100% మనిషి అని బోధిస్తారు. ఇది పూర్తిగా అర్ధంలేనిది, మరియు లేఖనంలో ఎక్కడా కనుగొనబడదు.

అయితే అపరాధము కలిగినట్టు కృపా వరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరి యెక్కువగా ఎలోహీం కృపయు, యహూషువః మెస్సీయ అను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును, అనేకులకు విస్తరించెను. (రోమీయులకు 5:15)

ఎలోహీం డొక్కడే, ఎలోహీంకిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన యహూషువః మెస్సీయ అను నరుడు. (1 తిమోతికి 2:5) [“క్రీస్తు యహూషువః అను నరుడు” “ఒకే దేవుడు” నుండి ప్రత్యేకంగా ఉన్నట్లు పేర్కొనండి.]

ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని [యహూషువః] చేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు. (అపొస్తలుల కార్యములు 17:31)

ఇశ్రాయేలువారలారా, యీ మాటలువినుడి. ఎలోహీం నజరేయుడగు యహూషువః చేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనబరచెను; ఇది మీరే యెరుగుదురు. (అపొస్తలుల 2:22)

పై భాగంలో పేతురు ప్రకటనను జాగ్రత్తగా గమనించండి. యహూషువః “యహువః ద్వారా ఆమోదించబడిన వ్యక్తి” అని ఆయన చెప్పారు. ఆయనే యహువః అనలేదు. యహూషువః యహువః ఏర్పాటు చేసిన ఒక “నరుడు” అనే పౌలు ప్రకటనతో ఇది అంగీకరిస్తుంది. (అపొస్తలుల 17:31)

ఇద్దరు దైవములు ఉన్నారా?

చాలామంది, తండ్రి మరియు కుమారుని మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని లేఖనం ద్వారా గుర్తించి, వారు వేర్వేరు వ్యక్తులని అంగీకరిస్తూనే, ఇప్పటికీ యహూషువః సహ-సృష్టికర్త అనియు మరియు బెత్లెహేములో పుట్టకముందే పరలోకంలో ముందుగానే ఉన్నాడు అనే ఆలోచనకు కూడా వ్రేలాడుదురు. అలాంటి భావన మనకు స్పష్టమైన వైరుధ్యాన్ని సూచిస్తుంది.

యహువః మాత్రమే సృష్టికర్త మరియు ఏకైక నిజమైన ఎలోహీం అని లేఖనం స్పష్టం చేయిచున్నది. యహువః ఎహాద్ (ఒక్కడు).

శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను. అందుకు యహూషువః, ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలూ, వినుము; మన ఎలోహీం అయిన యహువః అద్వితీయ అదోనాయ్. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ ఎలోహీం అయిన యహువఃను ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ. (మార్కు 12:28-30.)

గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యహువః ఈలాగు సెలవిచ్చుచున్నాడు; యహువఃనగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను. (యెషయా. 44:24)

స్పష్టంగా చెప్పబడిన ఈ సత్యాన్ని క్రైస్తవులు తిరస్కరించట మూలంగానే యూదులు మరియు ముస్లింలు సువార్తను ఎక్కువ తిరస్కరించారు. యహువః ఒక్కడే. ఆయన మాత్రమే దేవుడు. ఆయన మాత్రమే సృష్టికర్త. త్రిత్వ మరియు ద్విత్వ సిద్దాంతీకుల యొక్క ఈ తప్పుడు సిద్ధాంతం నిజాయితీగల యూదులను మరియు ముస్లింలను వ్యతిరేకిస్తుంది, ఎందుకంటే దేవుడు ఒక్కడే అని వారిరువురికీ తెలుసు. పర్యవసానంగా, వారి చెవులు యహూషువఃలో గల జీవమునిచ్చే సత్యానికి విరోధంగా మూసుకుపోయాయి మరియు వారు కృపను, కృప యొక్క అద్భుతమైన సువార్తను గ్రహించలేకపోతున్నారు.


తరచుగా తప్పుగా అర్ధం చేసుకోబడుతున్న కొన్ని భాగాలను దగ్గరగా చూద్దాం

యహూషువః మరియు యహువః వాస్తవానికి ఒక్కడే అని నిరూపించడానికి చాలా మంది ప్రేమగల మరియు హృదయపూర్వక త్రిత్వ / ద్విత్వ వాదులు ఉపయోగించే కొన్ని వచనాలు క్రింద ఉన్నాయి.

“నేనును తండ్రియును ఏకమైయున్నాము …” (యోహాను 10:30)

మనం వెనక్కి తిరిగి ఈ వాక్యాన్ని సందర్భోచితంగా పరిశీలిస్తే, తాను మరియు తండ్రి అక్షరాలా ఒకే వ్యక్తి అని యహూషువః పేర్కొనుటలేదని వెంటనే స్పష్టమవుతుంది.

27నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. 28నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. 29వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి యెవడును వాటిని అపహరింపలేడు;‌ 30నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను. 31యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లుచేత పట్టుకొనగా, 32యహూషువః తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను. 33అందుకు యూదులు నీవు మనుష్యుడవై యుండి ఎలోహీంనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. 34అందుకు యహూషువః మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా? 35 ఎలోహీం వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల నేను ఎలోహీం కుమారుడనని చెప్పినందుకు, 36తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? (యోహాను 10:27-36)

కింది వాటిని గమనించండి:

  • 29 వ వచనం: తన తండ్రి “అందరికంటే గొప్పవాడు” అని యహూషువః చెప్పాడు. (యోహాను 14:28 కూడా చూడండి: “… నా తండ్రి నాకంటె గొప్పవాడు.”). యహూషువః మరియు అతని తండ్రి అక్షరాలా ఒకే వ్యక్తి అని బోధించే వారు దీనినిబట్టి, యహువః తనకంటే తాను గొప్పవాడు అని అర్థం చేసుకోసుకోవాలి. ఇది అర్థరహితం.
  • 33, 36 వ వచనం: తనను తాను “దేవుడు” గా యెంచుకొనుచున్నాడని యూదులు ఆరోపిస్తున్నారు. కాని యహూషువః, తన తండ్రి తనను లోకంలోనికి పంపెననియు, అందువలన తాను దేవుని కుమారుననియు, తాను తండ్రిని కాదనియు చెప్పుట ద్వారా యహూషువః వారి ఆరోపణలను ఖండించారు. మళ్ళీ చదవండి: “తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితో” నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?. (యోహాను 10: 27-33)

తాను మరియు తండ్రి అక్షరాలా ఒకే‌ వ్యక్తి అని యహూషువః చెప్పుకొనుటలేదనే మరింత రుజువును యోహాను సువార్త 17 లోని, ఆయన ప్రార్థనలో చూడవచ్చు:

“మనము ఏకమైయున్నలాగున, వారును ఏకమైయుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.” (యోహాను 17:22)

ప్రతి నిజమైన త్రిత్వ/ద్విత్వ సిద్ధాంతీకులు ఆలోచించవలసిన ప్రశ్నలు image

నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమైయున్నలాగున వారును ఏకమైయుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. (యోహాను 17: 11)

మనము ఏకమైయున్నలాగున, వారును ఏకమైయుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. (యోహాను 17:22)

యహూషువః, పై వాక్య భాగాలలో, తాను మరియు తండ్రి ఏకమైయున్నలాగున తన శిష్యులును ఏకమైయుండాలని ప్రార్థిస్తున్నాడు. మనమందరం అక్షరాల ఒకే వ్యక్తిగా మారాలని ఆయన ప్రార్థిస్తున్నారా? కాదు. ఆయన మరియు తన తండ్రి ఉన్నట్లే మనమందరం కూడా ఒకే మనస్సు, ఒకే తాత్పర్యం మరియు ఒకే ఆత్మతో ఉండాలని ఆయన ప్రార్థిస్తున్నాడు (యోహాను 10:30). పౌలు మరియు పేతురు ఇద్దరూ ఇదే భావనను ప్రతిధ్వనించారు.

యహూషువః మెస్సీయ చిత్తప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు ఎలోహీం మీకు అనుగ్రహించును గాక. (రోమీయులకు 15:6)

తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులైయుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏకమనస్సుగలవారై యుండుడి సమాధానముగా ఉండుడి; ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును. (2 కొరింథీ 13: 11)

నేను వచ్చి మిమ్మును చూచినను, రాకపోయినను, మీరు ఏ విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు, ఏక మనస్సుగలవారై నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున, మీరు మెస్సీయ సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. (ఫిలిప్పీయులకు 1:27)

మీరు ఏకమనస్కులగునట్లుగా ఏక ప్రేమకలిగి, యేక భావముగలవారుగా ఉండి, ఒక్కదానియందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. (ఫిలిప్పీయులకు 2:2)

తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి. (మొదటి పేతురు 3:8)

తరచుగా తప్పుగా అర్ధం చేసుకొనుచున్న మరొక వచనం …

తండ్రీ, లోకము పుట్టక మునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము.” (యోహాను 17:5)

ప్రపంచం సృష్టించబడుటకు ముందే యహూషువః తండ్రితో ఉన్నాడని పై వాక్యం ద్వారా తరచూ వివరిస్తారు. అతను చెప్పేది కాదు. అయితే, ఇక్కడ ఆయన చెప్పేది అది కాదు. ప్రపంచ సృష్టికి ముందు (అతడు పుట్టకముందే) యహువః తన కోసం ముందే నిర్ణయించిన మహిమను గూర్చి యహూషువః ఇక్కడ చెప్పుచుండెను. పేతురు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు.

పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని, అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన ఎలోహీం యెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు ఎలోహీం యందు ఉంచబడియున్నవి. (1 పేతురు 1:18-20).

ఈ ముందస్తు-నియమాన్ని గూర్చి క్రొత్త నిబంధన అంతటా క్రమం తప్పకుండా వివరించుటను మనము చూస్తాము. మోక్షానికై యహువః యొక్క ప్రణాళిక ప్రపంచ పునాదికి ముందే స్థాపించబడింది, కాని తన కుమారుడు, మన రక్షకుడైన యహూషువః పుట్టుక, మరణం మరియు పునరుత్థానం వరకు అది వ్యక్తపరచబడలేదు.

“అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి మెస్సీయ రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని . . . కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను.” (మొదటి పేతురు 1:19,20)

ప్రతి నిజమైన త్రిత్వ/ద్విత్వ సిద్ధాంతీకులు ఆలోచించవలసిన ప్రశ్నలు image

తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, యహూషువః మెస్సీయ ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, (ఎఫెసీయులకు. 1:4)

మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు, అనాదికాలముననే యహూషువః మెస్సీయ మనకు అనుగ్రహింపబడినదియు, యహూషువః మెస్సీయ మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ యహూషువః మెస్సీయ మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను. (2 తిమోతికి 1:9-10).

ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని ఎలోహీం అనాదికాలమందే వాగ్దానము చేసెను గాని, యిప్పుడు మన రక్షకుడైన ఎలోహీం ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలములయందు బయలుపరచెను. (తీతుకు 1:‌ 3)

యోహాను 17: 5 యొక్క ఈ వివరణపై మీలో ఎవరికైనా అనుమానం ఉంటే, మీరు యహూషువః ప్రార్థనను పూర్తిగా చదవాలి. “మరియు ఇప్పుడు, తండ్రీ, లోకము పుట్టక మునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము,” ఆయన ఇంకా ప్రార్థిస్తూ ఇలా పలికెను:

మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండవలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమైయున్నలాగున, వారును ఏకమైయుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. (యోహాను 17:20-22)

పై వాక్య భాగంలో, యహూషువః తన బహుమానమును కీర్తిని ఇంకా పుట్టని వారికి ఇచ్చుచున్నాడని చెప్పాడు – “[శిష్యులు ప్రకటింపబోవు వాక్యం ద్వారా ఆయనను నమ్మబోవు వారికి కూడా.]” మనం పుట్టకముందే ఆయన తన మహిమను మనతో పంచుకుంటున్నాడు – తన తండ్రి తన యెడల చేసినట్లే.

ప్రపంచం సృష్టించబడక ముందే యహువః ప్రణాళిక స్థాపించబడెనని గుర్తుంచుకోండి. అందుకే, యహూషువః కోసం ఈ విధంగా చెప్పవచ్చు: “జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొఱ్ఱెపిల్ల” (ప్రకటన గ్రంథము 13:8)

ముగింపు

నిజం చెప్పాలంటే, క్రీస్తు ముందస్తు-అవతారం/ఉనికికి సంబంధించిన బోధకు మద్దతుగా పైపైన కనిపించే అనేక వచనాలు ఉన్నాయి. బైబిల్ అనువాదకులు తమ పనిలో నిష్పక్షపాతంగా లేరని మనం గుర్తుంచుకోవాలి. వారు మీలా మరియు నాలా ముందస్తు భావనలు మరియు వారసత్వ సంప్రదాయాలతో ఉండే పొరబడే మానవులు – మరియు ఉద్దేశపూర్వకంగానో, లేక కాదో, వారి పక్షపాతం వారి అనువాదాలలో కనిపిస్తుంది.

ఈ విషయాలపై ఇంకా చాలా విషయాలు చెప్పవచ్చు, కాని మీరు (పాఠకుడు), నిజాయితీగల బైబిల్ విద్యార్థిగా మరియు నిజాయితీగల సత్యాన్వేషిగా ఈ విషయాలను మీ స్వంతంగా ప్రార్థనాపూర్వకంగా పరిశీలనచేయండి. సూక్ష్మ పరిశీలనకు సత్యం భయపడదు.

ఎలోహీం ఒక్కడే, ఎలోహీంకిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే; ఆయన యహూషువః మెస్సీయ అను నరుడు. (1 తిమోతికి. 2:5)

యహువః యొక్క సాటిలేని నామమును ఇప్పుడు మరియు ఎల్లప్పుడూ స్తుతించుడి.

ఒక వ్యక్తి బైబిల్ పట్టుకొని, కలపలో కూర్చొనెను.


క్రీస్తు ముందస్తు-అవతార/ఉనికి సిద్ధాంతానికి మద్దతు ఇవ్వడానికి తరచుగా ఉపయోగించే వచనాల వివరణ కోసం, దయచేసి ఈ క్రింది వాటిని చూడండి:

https://www.worldslastchance.com/topical-biblical-studies/anti-trinitarian-studies

త్రిత్వ సిద్ధాంతం యొక్క లోపం గురించి మరింత తెలుసుకోవడానికి: https://www.worldslastchance.com/directory#The-Trinity-(doctrinal-error)

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.