World's Last Chance

At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

While WLC continues to uphold the observance of the Seventh-Day Sabbath, which is at the heart of Yahuwah's moral law, the 10 Commandments, we no longer believe that the annual feast days are binding upon believers today. Still, though, we humbly encourage all to set time aside to commemorate the yearly feasts with solemnity and joy, and to learn from Yahuwah's instructions concerning their observance under the Old Covenant. Doing so will surely be a blessing to you and your home, as you study the wonderful types and shadows that point to the exaltation of Messiah Yahushua as the King of Kings, the Lord of Lords, the conquering lion of the tribe of Judah, and the Lamb of Yahuwah that takes away the sins of the world.
WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

బయటకు పిలువబడిన వారి సంఘము

మీరు ఒంటరిగా ఆరాధింతురా? మీరు మీలాంటి-మనస్సు గల విశ్వాసులతో సహవాసం కోసం చూస్తున్నారా? మీరు ప్రేమగల సంఘ కుటుంబాన్ని కోల్పోతున్నారా?

ప్రార్ధిస్తున్న యువకుడుగొఱ్ఱెపిల్లను వెంబడించువారికి వెలుగు మరియు సత్యము ఎల్లప్పుడూ పురోభివృద్ధి చెందుతూనే ఉంటాయి. అలా, యహువః చిత్తాన్ని నిజాయితీగా అనుసరించుటకు కట్టుబడివున్న ప్రతి సత్యాన్వేషి, ముందుగానో లేదా తరువాతనో, అతడు ముందుగా నమ్మిన లేదా అనుసరిస్తున్న దానికి భిన్నమైన నూతనమైన కాంతికి తారసపడతాడు. ఈ క్రొత్త సత్యాన్ని స్వీకరించునప్పుడు అది అతడిని తన పూర్వపు సంఘ సహవాసులనుండి నుండి (వారు ఈ క్రొత్త సత్యాన్ని అంగీకరించని యెడల) వేరుచేసి ప్రత్యేకపరుస్తుంది.

ఒక నిజాయితీ హృదయం గల వ్యక్తి, సంఘంలో బోధించబడు సిద్దాంతాలను పరలోకం-మంజూరు చేసిన సత్యాలుగా విశ్వసిస్తేనే తప్ప ఆ సంఘానికి హాజరుకాడు. అయితే, అది యహువః యెడల విశ్వసనీయత చూపాలా లేక సంఘానికి విశ్వసనీయత చూపాలా అనే విషయంలో తికమక కలిగించును. సంఘము / చర్చి అనేది పరలోక రాజ్యానికి ఒక ద్వారము అని తెలియజేసే అనేకమైన వాక్యాలు బైబిలు గ్రంథంలో కనిపిస్తాయి. నిజానికి, కొన్ని సంఘాలైతే ముత్యపు గుమ్మముల ప్రవేశం పొందాలంటే తమ మతశాఖలలో సభ్యత్వం కలిగియుండుట తప్పనిసరి అని బోధిస్తాయి.

అలాంటి బైబిలు వాక్యాలలో ఎక్కువగా ఉదహరించబడిన ఒక వాక్యం, సీమోను పేతురుకు యహూషువః చేసిన ఒక ప్రతిపాదన:

మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపుచెవులు నీ కిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. (మత్తయి 16: 18-19, KJV)

ఈ ఏకైక బైబిలు వాక్యాన్ని, మోక్షం కేవలం తమ సమాజంలో మాత్రమే ప్రత్యేకంగా ఉన్నదని జనులకు బోధించుటకు 1,500 కన్నా ఎక్కువ సంవత్సరాలు రోమన్ కాథలిక్ సంఘము ఉపయోగించియున్నది.

“సంఘం” పై దృఢమైన విశ్వాసమును మరియు గౌరవమును కలిగియుండాలనుటకు మద్దతుగా ఇతర బైబిల్ వాక్యాలు కూడా వాడబడుతున్నవి: “ యహువః రక్షణ పొందుచున్నవారిని అనుదినము “సంఘముతో” చేర్చుచుండెను”. (అపొస్తలు 2:47, NKJV)

బైబిలు యొక్క కింగ్ జేమ్స్ వెర్షన్ లో, “చర్చి” అనే పదం 80 సార్లు ఉపయోగించబడినది, మరియు ఇవన్నీ క్రొత్త నిబంధనలో ఉన్నాయి. సమస్య ఏమిటంటే, ఆంగ్ల పదమైన “చర్చ్” యొక్క నిర్వచనం అసలు పదం యొక్క నిర్వచనానికి సరిపోదు. వాడబడిన అసలు పదం ఎక్లేసియా (Strong’s #1577), మరియు దీనర్ధం “ బయటకు పిలుచుట”; మరియు ఇది “చర్చి” అనే నేటి ఆధునిక అవగాహనకు చాలా భిన్నమైన అర్థంగా ఉన్నది.

“చర్చి” ని నిఘంటువు ఇలా నిర్వచిస్తుంది:

ఒకే రకమైన పూజాసంబంధమైన ప్రభుత్వం క్రింద ఐక్యమైన, ఒక మతంగా, మరియు ఒకే విధమైన ఆచారాలను మరియు వేడుకలను కలిగియుండు ఒక ప్రత్యేక వర్గానికి చెందిన క్రైస్తవులు . . . ఏదైనా ఒక ప్రత్యేక జిల్లా, నగరం, రాష్ట్రం లేదా దేశంలోని క్రైస్తవుల వ్యవస్థీకృత సంస్థ; . . . మతపరమైన ఆరాధన కోసం ఒకే రకమైన కట్టడలను కలిగియున్న క్రైస్తవుల యొక్క వ్యవస్థీకృత సంస్థ. . . వ్యవస్థీకృత క్రైస్తవ ఆరాధనతో సంబంధం కలిగి ఉండుట. (వెబ్స్టర్స్ న్యూ యూనివర్సల్ అబ్రిడెడ్ డిక్షనరీ)

ఇది ‘బయటకు పిలుచుటను’ సూచించు అసలైన క్రొత్త నిబంధన పదానికి చాలా భిన్నంగా ఉంటుంది. చాలా మంది ప్రజలు “చర్చి” మరియు “మతశాఖ” లను దాదాపుగా ఒకేలా చూచు వాస్తవం కారణంగా ఈ గందరగోళం మరింత అధికమవుతుంది.

చర్చి సమాజంఒక మతశాఖ అనగా “ఒకే పేరుతో పిలువబడు ఒక తరగతి, సమాజం, లేదా వ్యక్తుల సమూహం” (Webster’s New Universal Abridged Dictionary).

“మతశాఖ సంబంధమైన” అనగా “ఒక మతపరమైన విభాగం లేదా విభాగాల యొక్క నియంత్రణలో ఉండు, లేదా వాటి ద్వారా సమర్పించబడు.” (Webster’s New Universal Abridged Dictionary)

వివరణలోకి వెళ్తే, “చర్చి” లేదా “మతశాఖ” పదం ఏదైనా, అది ఒక క్రమానుసారమైన నిర్మాణం ద్వారా నిర్వహించబడే ఒక సంస్థాగత సమూహమై యున్నది. ప్రజలు తరచుగా దీనిని తమ దశమ భాగాలను మరియు సమర్పణలను తీసుకొనే అధికారాన్ని కలిగి ఉంటూ, ఎక్కువ లేదా తక్కువ స్థాయిలో పర్యవేక్షిస్తూ, సమూహాన్ని నడుపు విశ్వాసుల విభాగంగా/సంస్థగా చూచెదరు. దాని నాయకత్వం తరచుగా ఆ నిర్మాణం యొక్క విశ్వాసాలను నిర్వచించుటకును మరియు దాని సొమ్మును ఖర్చుచేయుటకును అధికారం కలిగి ఉంటుంది.

చట్ట పరిధిలోనికి వచ్చే అంశాలను పరిష్కరించుటలో (ఆవశ్యకతలను అందుకొనుటలో) ప్రభుత్వంతో సహకరించు విషయంలో “చర్చి” నాయకత్వం బాధ్యత కలిగియుండుట బహుశా అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థగా ఉండుటకు, కొన్ని చట్టపరమైన అవసరతలను, రాష్ట్రం నిర్దేశించిన విధంగా, తప్పక సమర్పించాలి. ఈ అవసరతలు ఆయా దేశాలనుబట్టి (దేశం నుండి దేశానికి) మారుతూ ఉంటాయి.

ఒక సంస్థాగత సంఘంగా ప్రభుత్వం నుండి గుర్తింపు పొందుట వివిధ కారణాల వలన తప్పనిసరిగా అవసరం ఉండును. కొన్ని దేశాల్లో విశ్వాసులైనవారు తమ ప్రభుత్వం యొక్క గుర్తింపును కలిగి లేకుండా ఆరాధన కొరకు సమావేశమవుట చట్టవిరుద్ధం. ఇతర దేశాలలో, పూర్తిగా ఆర్ధిక కారణాల వలన చర్చిలు పన్నులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఒక చర్చిలో పాడుతున్న యువకులుప్రభుత్వం ద్వారా చట్టబద్ధంగా గుర్తింపు పొందిన ఒక సంస్థగా ఉండుట, సహజంగా, ఒక పాపం కాదు. అయితే, ఇది కొద్దికాలం తరువాత చట్టపరమైన అవసరతలను మార్పు చేయుట ద్వారా చర్చిపై నియంత్రణ సాధించు క్రమంలో సాతానుకు ద్వారం తెరుస్తుంది. ఒక చర్చి యొక్క సిద్ధాంతాలను దేశ చట్టాల కారణంగా మార్చవలసి వచ్చినప్పుడు, చట్టపరమైన గుర్తింపును మరియు ఇతర ప్రయోజనాలను కాపాడుకొనుటకు దాని సిద్ధాంతాలను సర్దుబాటు చేసుకొను విధంగా అది ప్రేరేపించబడుతుంది.

ఇది, ఎక్కువ లేదా తక్కువ స్థాయిలో, అన్ని మతశాఖలకు సంభవించినది. ఒక చర్చి దాని రాష్ట్రంచే గుర్తింపు పొందిన చట్టబద్ధమైన సంస్థగా మారినప్పుడు, తన అనుమతితో, అది దానంతట అదే ప్రభుత్వం యొక్క నియంత్రణలోనికి వెళుతుంది. రాష్ట్రం గుర్తింపును ఎలా మంజూరు చేయునో, అలానే ఉపసంహరించుకోవచ్చు కూడా.

“గృహ సంఘాలు” అనేది భూచరిత్రలోని ఈ చివరి దినాలలో యహువః యొక్క ప్రజల కోసం ఒక ప్రత్యామ్నాయ ఆరాధన రూపం మాత్రమే కాక, అవి “ఆత్మతోను సత్యముతోను ఆరాధించేవారందరికి” అందుబాటులో ఉన్న ఏకైక అవకాశమై యున్నవి. (యోహాను 4:24)

సమస్త సంస్థాగత సంఘాలు తమ ఆరాధన దినాలను అన్యమత జూలియన్ క్యాలెండర్ యొక్క మరో రూపమైన ఆధునిక గ్రెగోరియన్ క్యాలెండర్ (పోప్ గ్రెగొరీ XIII క్యాలెండర్) ద్వారా లెక్కిస్తాయి. అందువలన, ఏ సంస్థాగత సంఘం కూడా సృష్టికర్తను ఆయన నియమించిన కాల-సూచిక పద్ధతి ద్వారా లెక్కించబడు ఆయన పవిత్ర దినాలలో ఆరాధించదు, ఆ కాల-సూచిక పద్ధతి: సూర్య-చంద్ర క్యాలండర్ పద్ధతి.

ఆయన యొక్క గొప్ప ప్రేమా-కనికరం మరియు కృపలో, అన్యమత సెలవుదినాలలో ఆరాధనకు దారితీసే అజ్ఞానాన్ని యహువః క్షమిస్తారు. “ఆ అజ్ఞానకాలములను ఎలోహీం చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు… (అపొస్తలు 17:30). సృష్టి యొక్క అసలు క్యాలెండర్ ద్వారా లెక్కించబడు, అసలైన విశ్రాంతిదినము యొక్క జ్ఞానం పునరుద్ధరణగుటతో, ఇకపై ఎవరూ అజ్ఞానంలో ఉండుటకు వీలులేదు. సత్యాన్ని తెలుసుకున్న వారందరూ ఇప్పుడు సత్యానికి విధేయత కలిగియుండాలి.

బైబిలు చదువుతున్న ఇద్దరు మనుష్యులుసత్యాన్ని తెలుసుకొనియు, ఇంకను సత్యానికి విధేయత చూపని ఒక సంఘానికి, ఆరాధన నిమిత్తం హాజరగుట అనేది యహువఃను అగౌరవపరచుట అవుతుంది. ఒక సంఘం యహువః ప్రత్యక్షతతో దీవించచబడాలంటే, తెలియజేయబడిన సమస్త సత్యానికి విధేయత చూపాలి. నూతన కాంతి సముఖంలో సంఘము ఒక్క లోపాన్ని కలిగి దానిని కొనసాగించినప్పటికీ, ఆ సంఘం దైవిక ఉనికిని తిరస్కరించినట్లే.

నిజమైన సబ్బాతును మరియు దాని సృష్టికర్తను ప్రేమించు వారందరూ, ఏడవ దినపు సబ్బాతును గూర్చిన సత్యాన్ని తాము ప్రేమించే వ్యక్తులతో పంచుకుంటారు. ఒకవేళ ఆ వ్యక్తులు సత్యాన్ని తిరస్కరించినట్లయితే, నూతన సత్యానికి విశ్వసనీయతను మరియు విధేయతను కలిగియున్న సదరు వ్యక్తి, (అతడు లేదా ఆమె) సత్యాన్ని అంగీకరించని సంఘం యొక్క సహవాసం నుండి ఇకపై బయటకు వచ్చివేయును. “సమ్మతింపకుండ ఇద్దరు కూడి నడుతురా?” (ఆమోసు 3:3)

కేవలం యహువః ద్వారా గుర్తింపుపొందిన వ్యవస్థాపక సంస్థ వారు మాత్రమే బయటకు పిలువబడిన వారు; వారి సంఘానికి శిరస్సు యహూషువః; మరియు వారి పరిపాలక విభాగం పరలోకంలో ఉన్నది. పరలోకం ద్వారా గుర్తింపుపొందిన విశ్వాసుల సంస్థకు శిరస్సైన యహూషువఃను గూర్చి మాట్లాడుతూ, పౌలు ఇలా వ్రాశాడు:

సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను. (కొలొస్సయులకు 1:18)

నిజమైన “సంఘం” లో ఉండుటకు బయటకు పిలువబడియున్న విశ్వాసులు, ఈ భూమిపై అక్కడక్కడా చెల్లాచెదురుగా ఉంటారు. భూమిపై గుర్తింపులేనివారిగా మరియు తెలియబడనివారిగా ఉందురు, కానీ పరలోకంలో గుర్తించబడి గౌరవించబడుదురు. వీరు తమ రక్షకుడిని ఒక లోతైన మరియు గౌరవప్రదమైన ప్రేమతో వెంబడిస్తారు, వీరు నిత్యజీవం అనుగ్రహించువానిని గౌరవించు నిమిత్తం సమస్తమును విడిచిపెట్టుటకు సిద్ధంగా ఉంటారు.

వారు యహూషువఃకు చెందినవారు మరియు పరలోకం యొక్క కుటుంబ సభ్యులుగా లెక్కించబడిరి. ఇది అతిపెద్ద ప్రాపంచిక సంఘాల సభ్యత్వ జాబితాలలో ప్రవేశించుటకంటే అత్యంత ఉన్నతమైనది మరియు గొప్ప గౌరవప్రదమైనది.

ఇప్పుడైతే . . . వేవేలకొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్టుల [బయటకు పిలవబడిన వారి] సంఘమునకును, . . అందరి న్యాయాధిపతియైన ఎలోహీం యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్తనిబంధనకు మధ్యవర్తియైన యహూషువః నొద్దకును . . . మీరు వచ్చియున్నారు. (హెబ్రీయులుకు 12:22-24)

పిలాతుతో మాట్లాడుతూ రక్షకుడు ఒక ముఖ్యమైన సూత్రాన్ని చెప్పాడు: “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను. (యోహాను 18:36, NKJV)

యహూషువః ఈ లోకంలో ఉంటూనే, ఈ లోకానికి చెందనప్పుడు, ఆయనను వెంబడించువారు కూడా అదేవిధంగా ఉందురు. వారు సౌకర్యం కోసం నకిలీ క్యాలెండర్ ద్వారా ఆరాధించే వ్యవస్థీకృత మతసంబంధమైన సంస్థలతో తమను తాము సమైక్యపరచరుకోరు. ఈ పిలువబడినవారి యొక్క శిరస్సు యహూషువః. ఆయన ఉనికి విశ్వాసి మనో నేత్రానికి తప్ప దేనికీ కనబడనట్లే, ఆరాధన కూడా వ్యక్తిగత-ఆత్మకు మరియు యహువఃకు మధ్యగల రహస్య విషయం. ఇది మీ సభ్యత్వం ఆమోదించబడునట్లు, మీ విశ్వాసాలు ఆయా సంఘాలకు అనుగుణంగా ఉండునట్లు నిర్మాణాత్మక అధిక్రమం యొక్క వేదికపై చేయు బాహ్య ప్రదర్శన వంటిది కాదు. అలా చేయుటను, యహువః ఎన్నడూ అనుమతించలేదు.

నవ్వుతున్న పెద్ద మహిళయహువఃకు ఆమోదయోగ్యమైన ఆరాధనకు ఒక సమూహం అవసరం లేదు. బయటకు పిలువబడినవారు కొద్దిమందిగా మరియు దూరం దూరంగా ఉంటారు, వీరిని కేవలం యహువః మాత్రమే ఎరిగియుండును. సమయం వచ్చినప్పుడు ఆయన కొందరిని మీ యొద్దకు పంపును, మరియు ఆయనను మాత్రమే ఆరాధించుటకు మిమ్మల్ని నడిపిస్తాడు. యహువః తన పిల్లలతో నిశ్చలమైన నిశ్శబ్ద స్వరంతో మాట్లాడునట్లు, అదే నిశ్చల మరియు నిశ్శబ్ద స్వరంతో ఆయనను మాత్రమే ఆరాధించుట మీ యొక్క గొప్ప ఆవశ్యకత అని ఆయనకు తెలుకు, మీరు మీ సొంత ఆధ్యాత్మిక అవసరాలను గురించి ప్రస్తావించు, ఆయన గుసగుసలను చాలా స్పష్టంగా వినవచ్చు.

ప్రపంచానికి పరలోకం యొక్క ఆఖరి హెచ్చరిక సందేశం ప్రకటన 18 లో గలదు, అక్కడ యహువఃను ప్రేమించువారు బబులోనునుండి బయటకు రావలెనని పిలువబడుచుండిరి:

అటుతరువాత మహాధికారముగల వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమచేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో అర్భటించి యిట్లనెను – “మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను. అది దయ్యములకు నివాసస్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయెను. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి . . .” మరియు ఇంకొక స్వరము పరలోకములోనుండి ఈలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను ఎలోహీం జ్ఞాపకము చేసికొనియున్నాడు. (ప్రకటన గ్రంథము 18:1- 5)

మద్యం ఒక మత్తు పానీయం, ఇది మనస్సును మొద్దుబార్చి మరియు ఇంద్రియాలను గందరగోళానికి గురిచేస్తుంది. సమస్త జనములు త్రాగిన బబులోను యొక్క “మద్యం” అనగా మతపరమైన ఆచారాలకు దాని తప్పుడు క్యాలెండరును స్వీకరించిరి అని అర్థం. బబులోనును విడిచిపెట్టాలనే పిలుపుకు స్పందించనివారు దాని సంఘాలలో మిగిలియుండి, అసత్యమైన పరిశుద్ధ దినాలలో ఆరాధన చేయుదురు.
 

లేఖనం స్పష్టంగా ఉంది. శేషించబడిన “సంఘం” ఆఖరి సంస్థాగత మతశాఖ కాదు. నిర్వచనం ప్రకారం, ఆఖరి సంస్థాగత నిర్మాణం ఉండదు. అయితే, వారు బయటకు పిలువబడిన వారి యొక్క ఆఖరి శేషం. వారు అన్ని మతశాఖల నుండి పిలువబడుదురు; వారు క్రింది వాటినుండి చివరిగా విభజించబడుదురు: బబులోను నుండి, దాని సంఘాల నుండి, సమస్త తప్పుడు సిద్ధాంతాలు మరియు ఆచారాల నుండి.

నేడు పిలువబడిన వారితో నిలబడండి. మీ కోసం తన కుమారుని అర్పించునంతగా ప్రేమించినవానిని గౌరవించండి. సమస్త లోపాలు మరియు సాంప్రదాయాల నుండి బయటకు వచ్చి ఆయనను ఆరాధించండి. జ్యేష్టుల సంఘం [ఎక్లేసియా] లో చేరండి.

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.