World's Last Chance

At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

While WLC continues to uphold the observance of the Seventh-Day Sabbath, which is at the heart of Yahuwah's moral law, the 10 Commandments, we no longer believe that the annual feast days are binding upon believers today. Still, though, we humbly encourage all to set time aside to commemorate the yearly feasts with solemnity and joy, and to learn from Yahuwah's instructions concerning their observance under the Old Covenant. Doing so will surely be a blessing to you and your home, as you study the wonderful types and shadows that point to the exaltation of Messiah Yahushua as the King of Kings, the Lord of Lords, the conquering lion of the tribe of Judah, and the Lamb of Yahuwah that takes away the sins of the world.
WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

లేఖనములను గుర్తుంచుకొనుట: ఒక జీవన్మరణ విషయము

లేఖనం క్రైస్తవ విశ్వాసం యొక్క అమోఘమైన ఆధారశిలయై ఉండెను. నిత్యజీవం కొరకు త్రోవను (రోడ్ మ్యాప్) సిద్ధం చేసినవారు యహువః. ఆయనను, ఆయన నీతిని ఒక నిజాయితీ గల హృదయంతో వెంబడించువారందరూ, బైబిలును చదువుటను మరియు జీవపు మాటలను హృదయంలో స్థిరపరచుకొనుటను అలవాటు చేసుకొందురు. యహువః యొక్క వాక్యంను చదువుటను విస్మరించుట అనేది జీవితం మీదకు మరణం ఎన్నుకోవటమే. ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, మనము ఆయన వాక్యం యొక్క పెరుగుతున్న వెలుగులో నడవకపోతే, అప్పుడు మనము మరణపు నీడ యొక్క పెరుగుతున్న చీకటిలో కూర్చొనుటకు విడువబడతాము.

సన్నమవుతున్న చివరి సంక్షోభంలో, యహువః ప్రజల యొక్క విశ్వాసం మునుపు ఎన్నడూ లేని విధంగా పరీక్షించబడును. హింసలు పతాక స్థాయిలో ఉన్నపుడు మరియు విపత్తు సంఘటనలు చుట్టుముట్టినప్పుడు, లేఖనముల ఆధారం లేని వారు ఆశను వదులుకొని కొట్టుకొనిపోవుదురు. యహువః యొక్క వాగ్దానాలను పొందుకొనుటకు నేడే మనము ప్రతిజ్ఞ చేద్దాం, మరియు రేపు భయమును అధిగమిద్దాం.

లేఖనాలను గుర్తుంచుకొనుటకు గల 8 కారణాలు:

  1.  యహువః తన లేఖనాలను మన మనస్సులో ఉంచుకొనమని సెలవిచ్చారు.
  2. యహూషువః లేఖనాలను జ్ఞాపకముంచుకొనెను.
  3. లేఖనాలను గుర్తుంచుకొనుట మన మనసులను నూతన పరచుటకును, మరియు ప్రేమగల మన తండ్రి యహువః లో పరిపూర్ణ విధేయతా జీవితాన్ని గడుపుటకును దోహదపడుతుంది.
  4. లేఖనాలను గుర్తుంచుకొనుట వలన శోధన సమయాలలో మనకు అవసరమైన బలం సమకూడును.
  5. లేఖనాలను గుర్తుంచుకొనుట వలన తప్పిపోయిన వారిని సమర్థవంతంగా బలపరచగలం.
  6. లేఖనాలను గుర్తుంచుకొనుట వలన ఇతర విశ్వాసులకు మరింత సమర్థవంతంగా బుధ్ధిచెప్పి, వారిని ప్రోత్సహించవచ్చు.
  7. లేఖనాలను గుర్తుంచుకొనుట వలన యహువః యొక్క సంకల్పం బయలుపడును, మన హృదయాలను ధ్యానింపచేయును.
  8. లేఖన వాగ్దానాలను గుర్తుంచుకొనుట మనలను అంత్య కాలంలో శ్రమలు మరియు విపత్తులను ఎదుర్కొంటున్నప్పుడు మరింత బలంగా నిలబడుటకు అనుమతిస్తుంది.

1. యహువః, తన ప్రవక్తలు మరియు అపొస్తలుల ద్వారా, ఆయన వాక్యంను గుర్తుంచుకొనమని మనకు సెలవిచ్చారు.

మనము మన తండ్రియైన యహువఃతో సజీవమైన సంబంధంను కలిగియుండవలెను, మనము అధ్యయన ప్రబోధమును లక్ష్యపెట్టాలి; మన హృదయంలో ఆయన మాటలను భద్రపరచుకోవాలి.

లేఖనములను గుర్తుంచుకొనుట: ఒక జీవన్మరణ విషయము imageఎలోహీం యెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను (సరిగా విభజించు వానిగాను) నిన్ను నీవే ఎలోహీంకి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము. (2 తిమోతి 2:15)

ఇశ్రాయేలూ వినుము, మన ఎలోహీం అయిన యహువః అద్వితీయుడగు యహువః. నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ ఎలోహీం అయిన యహువఃను ప్రేమింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు మాటలు నీ హృదయములో ఉండవలెను.

నీవు నీకుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీచేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను. నీ యింటి ద్వార బంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను. (ద్వితీయోపదేశకాండము 6: 4-9)

సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో ఎలోహీంను గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో మెస్సీయ వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి. (కొలస్సీయులకు 3:16)

2. యహూషువః లేఖనాలను జ్ఞాపకముంచుకొనెను.

యహూషువః, భూమ్మీద ఉన్నప్పుడు, నిరంతరం తన శ్రోతలకు లేఖనములను చూపించేవారు. ఆయన తన విశ్వాసులను ప్రోత్సహించుటకు మరియు మెస్సీయగా ఆయనను తిరస్కరించిన వారి అజ్ఞానంను ఎత్తి చూపుటకు మళ్ళీ మళ్ళీ లేఖనాలను ఉపయోగించారు.

మరియు యహూషువః వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది అదోనాయ్ వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువ లేదా? (మత్తయి 21:42)

“ప్రజలు తమకు తాము లేఖనాలను చదివితే తప్ప వారు కృపలో పెరగలేరు. (ఒక) చదివే ప్రజలు ఎల్లప్పుడూ (ఒక) తెలుసుకొనే ప్రజలుగా ఉంటారు.”
(జాన్ వెస్లీ)

అందుకు యహూషువః లేఖనములనుగాని ఎలోహీం శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. (మత్తయి 22:29)

ఆ గడియలోనే యహూషువః జనసమూహములను చూచి బందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి. (మత్తయి 26: 55-56)

ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచిఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారుని గూర్చి ప్రవక్తలచేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును. (లూకా 18:31)

అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా, మెస్సీయ ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలును మొదలు కొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. (లూకా 24: 25-27)

అంతట ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. (లూకా 24:44)

నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును. వారందరును ఎలోహీం చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును. (యోహాను 6: 45-46)

మనము రక్షకుని ప్రేమలో నిలిచియుండాలంటే, మనము లేఖనాలను ఎక్కువగా అధ్యయనం చేయుటతో సహా ఆయనను అన్ని విషయాలలోనూ అనుకరించాలి.

ఆయన వాక్యమును ఎవడు గైకొనునో వానిలో ఎలోహీం ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను; ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయన యందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము. (1 యోహాను 2: 5-6)

3. లేఖనాలను గుర్తుంచుకొనుట మన మనసులను నూతన పరచుటకును, మరియు ప్రేమగల మన తండ్రి యహువః లో పరిపూర్ణ విధేయతా జీవితాన్ని గడుపుటకును దోహదపడుతుంది.

నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. (కీర్తన 119: 11)

యౌవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా? (కీర్తన 119: 9)

లేఖనములను గుర్తుంచుకొనుట: ఒక జీవన్మరణ విషయము imageయహువః యొక్క వాక్యమునకు జీవితాలను రూపాంతరం చేయగల మరియు పాపపు- చీకటి మనస్సులను నూతనపరచగల శక్తి ఉంది.

మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న ఎలోహీం చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. (రోమా 12: 2)

లేఖన భాగాలను ప్రార్థనాపూర్వకంగా అధ్యయనం చేసినప్పుడు, అవి మనలోని బలహీనతలను బహిర్గతం చేసి మన ఆలోచనలను బయలుపరచి, పరలోకం యొక్క దృష్టిలో మన హృదయాల నిజమైన పరిస్థితి స్పష్టంగా చూపించును:

ఎందుకనగా ఎలోహీం వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. (హెబ్రీయులు 4:12)

పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము “మన ప్రతి ఆలోచనను మెస్సీయకు లోబడునట్లు బంధించుటకు” లేఖనాలు మనకు అవగాహనను సమకూర్చును.

మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని, ఎలోహీం యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముగలవై యున్నవి. మేము వితర్కములను, ఎలోహీంను గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను మెస్సీయకు లోబడునట్లు చెరపట్టి (2 కొరింథీయులు 10: 4-5)

4. లేఖనాలను గుర్తుంచుకొనుట వలన శోధన సమయాలలో మనకు అవసరమైన బలం సమకూడును.

సర్వోన్నతుని పాపము లేని కుమారుడైన యహూషువః, శోధనలో పోరాడేందుకు ఎల్లప్పుడూ లేఖనాలను ఉపయోగించెను. అలాంటప్పుడు మన దిగజారిన మరియు పాపాత్మకమైన స్థితిలో, మనకు ఎంత ఎక్కువగా, ఈ ఇరువైపులా వాడిగల ఖడ్గం యొక్క ప్రావీణ్యత అవసరమైయుంది? మనం విజయం పొందాలంటే, మనము యహువః యొక్క వాక్యంతో అత్యంత అనుబంధం కలిగి ఉండాలి.

“అలమరలో వున్న బైబిలు కంటే
మనసులో వున్న బైబిల్ ఉత్తమం.” (చార్లెస్ స్పర్జన్)

అప్పుడు యహూషువః అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చి నీవు ఎలోహీం కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను. అందుకాయన మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని ఎలోహీం నోటనుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించును అని వ్రాయబడి యున్నదనెను. అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు ఎలోహీం కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును,నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి యున్నదని ఆయనతో చెప్పెను. అందుకు యహూషువః అదోనై అయిన నీ ఎలోహీంను నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను. మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా, యహూషువః వానితో సాతానా, పొమ్ము అదోనాయ్ అయిన నీ ఎలోహీం కి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను. అంతట అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. (మత్తయి 4: 1-11)

5. లేఖనాలను గుర్తుంచుకొనుట వలన మనము తప్పిపోయిన వారిని సమర్థవంతంగా బలపరచగలం.

నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు మెస్సీయను అదోనిగా ప్రతిష్ఠించుడి; అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై మెస్సీయనందున్న మీ సత్‌ప్రవర్తన మీద అపనిందవేయువారు సిగ్గుపడుదురు. (మొదటి పేతురు 3:15,16)

మనము గొప్ప ఆజ్ఞాపణను [the great commission] నెరవేర్చాలంటే, యహువః మరియు ఆయన కుమారుడు మనకాజ్ఞాపించిన దానికి మనము కట్టుబడి ఉండాలి.

కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి . . . నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను. (మత్తయి 28: 19-20)

6. లేఖనాలను గుర్తుంచుకొనుట వలన ఇతర విశ్వాసులకు మరింత సమర్థవంతంగా బుధ్ధిచెప్పి, వారిని ప్రోత్సహించవచ్చు.

లేఖనాలు నీతి బోధన యొక్క జీవపు ఊట, మరియు గొప్ప సిద్ధాంతం యొక్క అమోఘమైన వనరు.

దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది. (2 తిమోతి 3:16)

యహువః యొక్క వాక్యంను హృదయంలో స్థిరపరచుకొనుట ద్వారా మన సోదర, సోదరీమణులను విశ్వాసంలో మరింత సమర్థవంతంగా కట్టుటకు అనుమతిస్తుంది.

సహోదరులారా, జీవముగల ఎలోహీంను విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరాయన శబ్దమును వినినయెడల, కోపము పుట్టించి నప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక, (హెబ్రీయులు 3: 12-13)

కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. (హెబ్రీయులు 10: 24-25)

7. లేఖనాలను గుర్తుంచుకొనుట వలన యహువః యొక్క సంకల్పం బయలుపడును మన జీవితాల్లో కేంద్రబిందువైన మన హృదయాలను ధ్యానింపచేయును.

జీవ కిరీటమునకైన మన పరుగులో, ఎప్పుడూ మన ముందున్న తండ్రి మాటను గైకొనుట కీలకమైనది.

“మీరు జాగరూకతతో [యహువః] వాక్యమును తెలుసుకొనుటకు ప్రయత్నించాలి . . . . మరియు మీరు ఎప్పడూ నాకు తెలుసు అని అనుకొనరాదు . . . . దుష్టుడు మీరు ఆనుకున్న దానికంటే మరి ఎక్కువ దుష్టుడు. అతడు ఏ విధమైనవాడో మరియు మీరు ఎంత నిరాశాజనకంగా ఉన్నారో ఇంకా తెలియనట్లు నడుచుచున్నారు. అతడి ఖచ్చితమైన ప్రణాలిక మిమ్మల్ని వాక్యం నుండి మరియు ఈ మార్గం నుండి పూర్తిగా దూరం చేయుటయై యున్నది. ఇది అతడి లక్ష్యము.” (మార్టిన్ లూథర్)

నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువక యుందును. (కీర్తన 119: 15-16)

నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నాకన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచుకొందును. (కీర్తన 119: 148)

నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. (కీర్తన 119: 105)

యహువః యొక్క వాక్య ధ్యానం నిజమైన అభ్యుదయానికి మరియు విజయానికి తాళపు చెవి.

ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపో కూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు. (యెహోషువ 1: 8)

8. లేఖన వాగ్దానాలను గుర్తుంచుకొనుట మనలను అంత్య కాలంలో శ్రమలు మరియు విపత్తులు ఎదుర్కొంటున్నప్పుడు బలంగా నిలబడుటకు అనుమతిస్తుంది.

మీరు ముందుకు గల శ్రమలలో బలమైనవారిగా ఉండునట్లు యహువః విలువైన వాగ్దానాలుయందు నేడే ఆనందించుడి!

మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా ఎలోహీం. నేను యహువఃను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై యున్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకురాదు. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యహువః, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన ఎలోహీంను నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు. నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను. (కీర్తన 91)

లేఖనములను గుర్తుంచుకొనుట: ఒక జీవన్మరణ విషయము imageపర్వతములలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారము దొరకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. (యెషయా 33:16)

యహువః కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు. (యెషయా 40:31)

నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ ఎలోహీంనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును. నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయమొందెదరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు, నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు అభావులగుదురు. నీ ఎలోహీం అయిన యహువఃనగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను. (యెషయా 41: 10-13)

అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యహువః, ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యహువః నగు నేను నీకు ఎలోహీంను, ఇశ్రాయేలు పరిశుద్ధ ఎలోహీంనైన నేనే నిన్ను రక్షించువాడను. నీప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి యున్నాను నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించు చున్నాను. భయపడకుము, నేను నీకు తోడైయున్నాను తూర్పునుండి నీ సంతానమును తెప్పించెదను పడమటినుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. (యెషయా 43: 1-5)

మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండాలంటే, మన దీపములు నిరంతరము నూనెతో నింపబడి ఉండవలెను. “కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.” (1 థెస్స 5: 6).

ని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారినడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలుమాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి; అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చిఅయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా, అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. (మత్తయి 25: 1-13)పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రివేళ ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని, బుద్ధిలే. తీసికొనిపోయిరి నూనె సిద్దెలలో కూడ దివిటీలతో తమ బుద్ధిగలవారుపరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్యకలను పోలియున్నది. వీరిలో అయిదుగురు బుద్ధిలేని వారు, అయిదుగురు బుద్ధిగలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు.

 


మనందరమూ, తండ్రి యొక్క శక్తినిచ్చు దయ ద్వారా, ప్రతి దినం ఆయన యొక్క జీవపు మాటలను చదువుటకు మనకు మనమే అప్పగించుకొందుము. మనము ఒక నిజాయితీ హృదయంతో యోబుతో పాటు ఇలా చెబుదాం,

ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదు. ఆయన నోటిమాటలను నా అవసరమైన ఆహారం కంటే kjv [స్వాభిప్రాయముకంటె] ఎక్కువగా ఎంచితిని. (యోబు 23:12)

లేఖనములను గుర్తుంచుకొనుట: ఒక జీవన్మరణ విషయము image

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.