World's Last Chance

At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

While WLC continues to uphold the observance of the Seventh-Day Sabbath, which is at the heart of Yahuwah's moral law, the 10 Commandments, we no longer believe that the annual feast days are binding upon believers today. Still, though, we humbly encourage all to set time aside to commemorate the yearly feasts with solemnity and joy, and to learn from Yahuwah's instructions concerning their observance under the Old Covenant. Doing so will surely be a blessing to you and your home, as you study the wonderful types and shadows that point to the exaltation of Messiah Yahushua as the King of Kings, the Lord of Lords, the conquering lion of the tribe of Judah, and the Lamb of Yahuwah that takes away the sins of the world.
WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

ఆయన రెక్కల నీడ క్రింద: మహోన్నతుని రహస్య స్థలములో దాగుకొనుట


మహోన్నతుని రహస్య స్థలంలో తమను తాము దాచుకొనుటకు పరలోకం విశ్వాసులను పిలుస్తుండెను.

 

హరికేన్ ఇర్మా మరియు నెవిస్

 

ఇర్మా హరికేన్ ఇప్పటివరకు అట్లాంటిక్ లో నమోదు చేయబడిన హరికేన్లలో అతిపెద్ద హరికేన్. అయితే ప్రకృతి యొక్క ఈ గొప్ప శక్తి కూడా యహ్ యొక్క గొప్ప వాగ్దానాలను విశ్వసించిన ఒక వినయపూర్వకమైన విశ్వాసి యొక్క శక్తిని మించలేక పోయెను.

 

 

కరీబియన్లో నెవిస్ ద్వీపం

 

కరీబియన్ లోని నెవిస్ ద్వీపం

హరికేన్లు మానవునికి తెలిసిన ప్రకృతి యొక్క అత్యంత ఘోరమైన శక్తులలో ఒకటైయున్నవి. ఒక హరికేన్ 2 టన్నుల వాహనాన్ని చిన్నపిల్లల ఆట వస్తువు వలె లేపి విసిరివేయగలదు. దాని శక్తివంతమైన గాలులు భవనాల పైకప్పులను చీల్చును, అక్కడ చివరకు రాళ్ల కుప్పలు తప్ప మరేమీ మిగల్చదు. అటువంటి విపరీతమైన గాలులకు జతగా ఏర్పడే తుఫాను, రెండూ ఏకమై తీవ్ర ప్రమాదాన్ని సృష్టించును. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో 8, 5, మరియు 2 సంవత్సరాల వయస్సులు గల ముగ్గురు చిన్నపిల్లలతో, ఎటువంటి రక్షణ ఏర్పాట్లు లేని ఒక కుటుంబం ఎలా నిలవగలిగెను?

జీవితపు తుఫానులలో మీ దృష్టి స్థిరంగా ఉండునా?

జీవితం యొక్క తుఫానులలో మీ దృష్టి స్థిరంగా ఉండునా,
మేఘాలు తమ రెక్కల కలహాలను విప్పుతున్నప్పుడు?
బలమైన అలలు ఎగసి పడుతున్నప్పుడు, మరియు తీగలు జారి పడునప్పుడు,
మీ దృష్టి నిలకడగా లేక స్థిరంగా ఉందా? 1

ఇది నెవిస్ ద్వీపంలో నివసిస్తున్న ఒక కుటుంబం ఎదుర్కొన్న యదార్థ సంఘటన. 2

అది సెప్టెంబర్ 5, 2017, నెవిస్ లోని 15,000 మంది ప్రజలతో ఉన్న చిన్న కరీబియన్ దీవి. నిశ్చలమైన గాలి మరియు స్పష్టమైన ఎండతో కూడిన ఆకాశం పూర్తి భిన్నంగా, మమ్మల్ని అణగగొట్టుటకు రానున్న భయంకరమైన హరికేన్ ఆగమనాన్ని సూచిస్తుండెను.

దాదాపు టెక్సాస్ పరిమాణంలో, ఇర్మా హరికేన్ గంటకు 185 మైళ్ళ వేగమైన గాలులతో, 200 మైళ్ళ కంటే ఎక్కువ ఉద్రిక్తత గల ఈదురు గాలులతో, ఒక ప్రమాదకరమైన తుఫాను యొక్క ఉప్పెన ఘోరమైన గాలులతో సమస్తం తుడిచిపెట్టుకుంటూ మా వైపు దారి తీసెను.

మేము హరికేనును గూర్చిన హెచ్చరికను ఒక వారం రోజుల ముందే విన్నాము, కానీ దాని గురించి ఆలోచిస్తుండగానే, చాలా ముందుగానే అది ప్రారంభమైనది; మేము అప్పటికి దాదాపు 5 కంటే ఎక్కువ సంవత్సరాలుగా కరీబియన్ లో నివసిస్తున్నప్పటికీ అప్పుడప్పుడు ఒక సాధారణ తుఫాను తప్ప అంతకంటే ఎక్కువ అనుభవం లేదు.

సోమవారం, హరికేన్ తాకిడికి ఒక రోజు ముందు, ఇర్మా ఒక 3 వ కేటగిరీ (వర్గపు) హరికేన్ గా ఉండెను. సోమవారం సాయంత్రం మేము హరికేన్ షట్టర్లు కొన్నిచోట్ల పాడైయుండుట చూసాము, ఎందుకంటే వాటి చెక్కలు వంగిపోయి లేదా నట్లు ఊడిపోయి ఉండెను. మరునాటి ఉదయం ఒక వ్యక్తి వాటిని సరిచేయుటలో మాకు సహాయంగా వచ్చాడు, అతడికి మేము కృతజ్ఞులము.

మంగళవారం ఉదయం నా బైబిలు పఠనంలో నేను యెషయా 59 లో ఉన్నాను. యెషయా 59: 19 చదువుతూ, “శత్రువు జలప్రళయమువలె వచ్చునప్పుడు యహువః ఆత్మ అతనిని పైకెత్తి తప్పించును.” అనే మాటలను చూచితిని. (గమనిక: ఈ వచనం తెలుగు బైబిలులో తప్పుగా తర్జుమా అయినది). తన సమయోచితమైన వాగ్దానాన్ని బట్టి యహువఃకు కృతజ్ఞత తెలపుకొంటిని మరియు మాకును మరియు హరికేనుకును మధ్య ఒక దూత నిలబడి ఇలా చెబుతున్నట్లు ఊహించితిని.. “గాలీ, తాక వద్దు.” అలా, నేను ప్రకృతి అధిపతి యొక్క చేతులలో ఉన్నాననే ఆలోచన ద్వారా ఓదార్పు పొందితిని.

ఆ తరువాత ఉదయం, ఇర్మా హరికేన్ తీవ్రత పెరుగుతూ 3 వ కేటగిరీ నుండి 5 వ కేటగిరీకి మారినదని మేము తెలుసుకున్నాము. ఇర్మా హరికేన్ అట్లాంటిక్ బేసిన్ ఎన్నడూ ఎరగనటువంటి అతిపెద్ద హరికేన్ మరియు అది ఉత్తరానికి గాలివీచే దీవులను మొదట తాకుతున్నది, వాటిలో సెయింట్ కిట్స్ మరియు నెవిస్ దీవులు ఉన్నాయి. హరికేన్ సెయింట్ కిట్స్ మరియు నెవిస్ దీవుల నుండి కుడివైపునకు ప్రయాణిస్తున్నదని ముందస్తు వాతావరణ హెచ్చరికలు సూచించెను.

ఆండ్రూ 1992 మరియు ఇర్మా 2017

లాంటిదే మరొక 5 వ కేటగిరీ హరికేన్ అయిన హరికేన్ ఆండ్రూ యొక్క సాపేక్ష పరిమాణాన్ని,
హరికేన్ ఇర్మాతో పోల్చుచున్న ఉపగ్రహ ఛాయాచిత్రం.

రికార్డులను భద్రపరచుట ప్రారంభమైనప్పటి నుండి, యునైటెడ్ స్టేట్స్ ను ఢీ కొట్టిన 5 వ కేటగిరీకి చెందిన హరికేన్లు 3 మాత్రమే ఉన్నాయి: 1935 లో “లేబర్ డే” హరికేన్; 1969 లో కామిల్లె హరికేన్; మరియు 1992 లో ఆండ్ర్యూ హరికేన్. ఇర్మా హరికేన్ ఈ వర్గీకరణను మించిపోయినది. 5 వ కేటగిరీకి చెందిన హరికేన్లు గంటకు 157 మైళ్ళ కంటే ఎక్కువ గాలి వేగాన్ని కలిగిన హరికేన్లుగా ఉంటాయి. అయితే ఇర్మా హరికేన్ యొక్క గాలి వేగం గంటకు 185 మైళ్ళకు (గంటకు 295 కి.మీ) చేరుకుంది, కొంతమంది వ్యాఖ్యాతలు హరికేన్ కేటగిరీ స్కేలుపై కొత్త వర్గాన్ని (కేటగిరీని) చేర్చాలని సూచించారు: గతంలో వినియుండని 6 వ కేటగిరీ/ వర్గం. అయితే ఇర్మా యొక్క పరిపూర్ణ పరిమాణం మాత్రం ఊహలకు అందనంతగా ఉంది. ఇది గతంలో వచ్చిన ప్రతి తుఫానును చిన్నదానిగా మార్చివేసెను.

నేను నిలబడి ఉండలేననియు మరియు ఏదైనా సంభవిస్తే ఆ విషయంలో కృతజ్ఞతతో ఉండలేననియు భయపడ్డాను. మన జీవితం విషయంలో యహువః పరిపూర్ణ సంకల్పాన్ని కలిగియుండెనని మరియు ఆయన దేనినైనా అనుమతించిన యెడల అది మన శాశ్వతమైన మంచికేనని నేను నమ్మితిని. నేను ప్రశాంతంగా ఉండునట్లును, విశ్వాసము మరియు కృతజ్ఞతతో ఉండునట్లును సహాయం చేయమని ఆయనను అడిగాను.

5 వ కేటగిరీ తుఫానుల గురించి సమాచారాన్ని సేకరించి, తద్వారా మాకు ఏమి సంభవించునో తెలుసుకొనుటకు 5 వ కేటగిరీ తుఫానుల సమయంలో ఏమి జరిగిందో వివరించు కొన్ని వీడియోలను పరిశీలించుట కోసం నేను అంతర్జాలం (ఇంటర్నెట్) లోనికి వెళ్ళాను. అట్లాంటిక్ మహాసముద్రానికి అభిముఖంగా ఉన్న, ఒక తలుపు మరియు ఒక కిటికీతో పునాదిపై ఉన్న ఒక గదిలో ఉండాలని మేము నిర్ణయించుకున్నాము. పెరుగుతున్న తుఫాను ఇంటి పైకప్పును ఎగరవేసి, గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుందని మేము విశ్వసించినందున మనము అక్కడ నిద్రపోవుదుమని, అయితే జల ప్రళయంలో నోవహును అతని కుటుంబాన్ని కాపాడినట్లు దేవదూతలు మనల్ని కాపాడునని మేము 8, 5 మరియు 2 సంవత్సరాల వయస్సులలో ఉన్న మా పిల్లలకు వివరించాము. మాతో కలిసి ఉండటానికి మా అన్నయ్యను మరియు తన మూడు సంవత్సరాల మనుమడును పిలిచితిమి.

మంగళవారం మధ్యాహ్నం మేము పునాది గదిలోనికి దుప్పట్లు, తువ్వాళ్లు, నీరు మరియు అల్పాహారాన్ని తీసుకొని వెళ్లాము. ప్రక్కనే గల మరొక పెద్ద గదిలో మేకలను మరియు కోళ్లను ఉంచాము.

ఆ సాయంత్రం, “ఆయన రెక్కల క్రింద” “మేము కాయబడుదుము”, “తుఫాను సమయంలో ఒక ఆశ్రయమును” “మేము బండపై నిర్మించుదుము”, మరియు “ఇది నా ప్రాణమునకు మంచిదై యున్నది” అంటూ పాటలు పాడుకొంటిమి. ఆపత్కాలంలో యహువః ఎలా సహాయంగా ఉండునో తెలిజేసే బైబిల్లోని కొన్ని ఉదాహరణలను చదివాము.

పిల్లలు నిద్రలోకి పోయినప్పుడు, నేను అలా పడుకున్నాను. ప్రార్థన కోసం యుద్ధ ప్రణాళిక, అనే ఒక ఆడియో పుస్తకాన్ని నేను విన్నాను ఎందుకంటే, ఒక టోర్నడో (సుడిగాలి) సంభవించినప్పుడు ఒక కుటుంబం యొక్క కథను జ్ఞాపకం చేసుకొంటిని, భోజనపు బల్ల క్రింద వారు దాగుకొని మరియు తమను రక్షించమని యహువఃను వారు వేడుకొనిరి. తరువాత తమ చుట్టూ ఉన్న సమస్తము నాశనమైనప్పటికి వారు కాపాడబడితిరి. నేను ఆ రాత్రి ఆ కథను చాలాసార్లు విన్నాను. హరికేన్ రాత్రి 2 గంటలకు చేరుతుందని కొందరు, మరికొందరు మరుసటి రోజు, బుధవారం ఉదయం 8 గంటలకు రావచ్చునని చెప్పుచుండిరి.

తరువాత ఆ రాత్రి నందు, నేను ప్రతిదీ వెదజల్లబడినట్లు మరియు యహువః ఎరిగియున్నట్లు నా జీవితంలో ఏమి జయించితిని మరియు ఇంకా ఏమి జయించవలసి యున్నది అనే లెక్క మాత్రమే మిగిలి యున్నట్లుగా చూచితిని. నాకు మరియు యహువః యొక్క రక్షణకు మధ్య గల సంబంధం ఆయన వాగ్దానాలే. మరియు నేను విడిచిపెట్టిన ఇవన్నియు, చాలా విలువైనవని నేను భావించాను. నేను వాగ్దానాలను ఉచ్చారణ చేసితిని మరియు ముఖ్యంగా కీర్తన 46 అలాగే కీర్తన 121 లు నాకు ఓదార్పునిచ్చెను. కాబట్టి నేను వాటిని గైకొంటిని.

ఎలోహీం మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పునొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము. (సెలా.) ఒక నది కలదు, దాని కాలువలు ఎలోహీం పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష పరచుచున్నవి. ఎలోహీం ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున ఎలోహీం దానికి సహాయము చేయు చున్నాడు. (కీర్తనల గ్రంథము 46:1- 5)

కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యహువః వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యహువః యే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యహువః నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండ యహువః నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యహువః నిన్ను కాపాడును. (కీర్తనల గ్రంథము 121)

రాత్రంతా మేము ఏమియు వినలేదు లేదా ఏమీ అనుభూతి చెందలేదు, కానీ కొంత సమయం ఒక చిన్న గాలి శబ్ధం వినిపించినది, అయితే భారీగా వర్షాలు పడేటప్పుడు వచ్చే శబ్దం ఏమాత్రం వినబడలేదు. కిటికీ రెక్కలలో ఒకటి ముందుగానే విరిగిపోయెను మరియు హరికేన్ షట్టర్లు పూర్తిగా కిటికీని మూయలేదు కాబట్టి మేము షట్టర్లోని పగుళ్లు ద్వారా వర్షం కురుస్తుందని అనుకున్నాము, మరియు ఒకవేళ హరికేన్ వస్తే అలా మాకు తెలిసి యుండేది. అయితే, ఇది జరగలేదు.

నేను ఉదయాన్నే మేల్కొని, ఉదయం 8 గంటలకు హరికేన్ వచ్చునేమోనని భావించాను, ఎందుకంటే అది ఇంకా రాలేదనుకొనుట వలన. మేము రేడియో వేసి వార్తలు విన్నాము మరియు హరికేన్ ఇప్పటికే మమ్మల్ని దాటి వెళ్ళిపోయినట్లు తెలుకున్నాము! నేను నమ్మలేకపోయాను.

మేము బయటికి వెళ్ళినప్పుడు మేము తోటలో కొన్ని విరిగిన కొమ్మలను కనుగొన్నాము, కానీ తెరిచిన ప్రవేశం గల చికెన్ కూప్ గాని మరియు గోడల లోపల గాని చిన్న తడి కూడా అంటలేదు! తన దయగల అద్భుతమైన రక్షణ మరియు ప్రేమపూర్వక సంరక్షణ నిమిత్తం మేము యహువఃకు మోకరిల్లి, కృతజ్ఞతలు తెలిపాము.

హరికేన్ రోజున మరియు తరువాత రోజున నీటి ప్రవాహం సంభవించినది. మా ఇంటి ముందు గల రహదారి నీళ్ళతో కూడిన నదిగా మారిపోయింది. ద్వీపమంతా పూర్తిగా శుభ్రం చేయవలసి వచ్చెను. ఇర్మా హరికేన్ శాంతముగా నెవిస్ దీవి మీదగా ఉత్తరానికి కదిలింది.

శ్రయ దుర్గము. ఆయన తుఫాను సమయంలో ఆశ్రయముగా ఉండెను. ఆయన జీవితం యొక్క ప్రతి తుఫానులో ఆశ్రయమై ఉండెను.యహువః మన ఆ

నమ్మకమైన యహువః తన వాగ్దానాలను నెరవేర్చాడు.

హరికేన్ ఇర్మా తరువాత సెయింట్ బార్ట్స్

హరికేన్ ఇర్మా పోయిన తరువాత, సెయింట్ బార్ట్స్ యొక్క ఒక ఇంటిపై ఒక రాళ్లు కుప్ప మిగిలినది.

తుఫాను సమయంలో ఒక ఆశ్రయం

యహువః మన బండ, ఆయనలో మనము దాగుకొందుము;
తుఫాను సమయంలో ఒక ఆశ్రయం;
ఎటువంటి వ్యాధి వచ్చినను రక్షించును,
తుఫాను సమయంలో ఒక ఆశ్రయం. 3

యహువః తన పిల్లలతో అనేక విధాలుగా మాట్లాడును. లేఖనాల ద్వారా ఆయన వారితో మాట్లాడును, పరిశుద్ధాత్మ వలన కలుగు హృదయ స్పందనల ద్వారా ఆయన వారితో మాట్లాడును మరియు ప్రకృతి ద్వారా ఆయన వారితో మాట్లాడును. సాధారణంగా, విశ్వాసులు ప్రకృతి యొక్క అందంపై దృష్టి పెడతారు: సృష్టికర్త గాలిలో పక్షులకు, మరియు ప్రకృతి యొక్క పుష్పములకు సమస్తమును ఆయన సమకూరుస్తున్న విధానం ద్వారా మనకు తన సంరక్షణను ప్రదర్శించాడు. అలాగే ప్రకృతి యొక్క విధ్వంసకరమైన శక్తి ద్వారా కూడా ఆయన మాట్లాడవచ్చు.

5 వ కేటగిరీ హరికేన్లు చాలా శక్తివంతమైనవి కావున వాటిని తరచుగా “దేవుని చర్యలు” గా సూచిస్తారు. ఇర్మా హరికేన్ ఖచ్చితంగా ఆ అర్హతను కలిగి యున్నది. చుట్టుపక్కల ప్రాంతాలలో తుఫాను గాలులు చాలా బలంగా వీచెను, అవి వాస్తవానికి బహామాలో ఉన్న సముద్ర తీరాల నుండి నీటిని మైళ్ళ దూరం వరకు పీల్చివేసెను. వాషింగ్టన్ పోస్ట్ యొక్క వాతావరణ శాస్త్రవేత్త ఏంజెలా ఫ్రిట్జ్ కు మాత్రమే ఇలాంటి ఒక దృగ్విషయం (సిద్ధాంతంలో) సాధ్యమవునని ముందుగా తెలుసు. 4

ఈ విషయాల గురించి తెలుసుకొనుట చాలా ముఖ్యం, ఎందుకనగా ఇవి మన గొప్ప, ఆధ్యాత్మిక మంచి కోసం ఉపయోగపడేందుకు యహువః మాత్రమే అనుమతించగల సంఘటనలు.

ట్విట్టర్ యూజర్ అయిన అడ్రియన్ ద్వారా సెప్టెంబర్ 8, 2017 న పోస్ట్ చేయబడిన ఒక ఫోటో ఆరిపోయిన సముద్రాన్ని చూపిస్తుంది.

ట్విట్టర్ యూజర్ అయిన అడ్రియన్ ద్వారా సెప్టెంబర్ 8, 2017 న పోస్ట్ చేయబడిన ఒక ఫోటో
కనుచూపు మేరలో ఆరిపోయి ఉన్న సముద్రాన్ని చూపుతుంది.

ఆమోసు 3 విశ్వాసుల హృదయాలకు విలువైన వాగ్దానాన్ని కలిగి ఉంది: “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలు పరచకుండ అదోనాయ్ అయిన యహువః యేమియు చేయడు”. (ఆమోసు 3: 7). ఈ వాక్యం జరగబోయే సంగతులను యహువః తన సేవకులకు తెలియజేయునని స్పష్టంగా మరియు ప్రధానంగా సూచిస్తున్న సమయంలో, జరగబోయేదానిని యహువః తెలియజేసే విషయం ప్రకృతికి కూడా వర్తిస్తుంది.

యోబు ప్రశ్నలకు యహువః ప్రతిస్పందించినప్పుడు, మహోన్నతుని యొక్క శక్తిని మరియు మానవుని బలహీనతను, అజ్ఞానాన్ని పోల్చి ప్రదర్శించుటకు రూపొందించిన వరుస ప్రశ్నలను అడగడం ద్వారా ఆయన అలా చేసెను.

అప్పుడు యహువః సుడిగాలిలో నుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను.జ్ఞానములేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము. నీకు తెలిసిన యెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. (యోబు 38: 1-5, KJV)

అక్కడి నుండి, యహువః ఎన్నో సూటి ప్రశ్నలను అడిగెను:

సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు? (యోబు 38: 8, KJV)

సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా? మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా? భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైన తెలిసివయెడల చెప్పుము. (యోబు 38:16 & 18, KJV)

ఇవి మనుష్యులు ఎన్నడూ ఆలోచన చేయని ప్రశ్నలై ఉన్నాయి. ఇంకా, విపత్తులు వచ్చినప్పుడు, వాటిని రాబోయే సంఘటనలకు సూచనలుగా చూచుట చాలా ప్రాముఖ్యమైనది. అది ఈ క్రింది రెండింటిలో యహువః చేసిన ఏదేని కారణమై యుండును: 1) విధ్వంసకర తుఫానులను ఆయనే పంపుట; లేదా, 2) దుష్ట మానవులు వారి దుష్ట విధానాలతో వాతావరణాన్ని మార్చుటకు మరియు కృత్రిమంగా ప్రజలకు అపాయకరమైన పరిస్థితులను సృష్టించేందుకు ఆయనే వారిని అనుమతించుట. 4 వ కేటగిరీకి చెందిన హార్వే హరికేనును, ఇర్మా మరియు జోస్ హరికేన్లు అత్యంత వేగంగా వెంబడించాయి, (ప్రస్తుతం ఈ వ్యాసం సమయంలో ఇప్పటికీ భయము ఉండెను), మరియు ఇంకా ఎక్కువ ఇప్పటికే సిద్ధమవుతూ, పరలోకం యొక్క ఆందోళనకరమైన హెచ్చరికలుగా ఉన్నాయి.

ఏ పర్యవసానాలు కనబడని కారణంగా ప్రకృతి వైపరీత్యాలను తేలికగా తీసివేసి తప్పు చేయవద్దు. యహువః యోబును అడుగుచుండెను: వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచుగడ్డ యెవని గర్భములో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? (యోబు 38: 28-29, KJV). ఇవి పనిలేని ప్రశ్నలు కాదు. ఇక్కడ, యహువః భూమి యొక్క వాతావరణ నమూనాలపై అంతిమ అధికారమును తీసుకొనుచుండెను. కానీ ఆయన అక్కడితో ఆగలేదు. అంత్య కాలంలో వాతావరణం యొక్క విపరీతమైన పరిస్థితులు ఉపయోగించబడతాయని ఆయన సూటిగా చెప్పారు.

“నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా?” (యోబు 38: 22-23, KJV)

తుఫానులు భూమి యొక్క సహజ పర్యావరణ వ్యవస్థలోని భాగంగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం కరీబియన్ ను వెంటాడే -హార్వే, ఇర్మా, జోస్, మరియు మేరియా – వంటి ప్రస్తుత వరుస తుఫానులు అత్యంత గొప్పగా మరియు విధ్వంసకరంగా ఉన్నప్పుడు, కూర్చుని వాటిని గూర్చి విచారణ చేయవలసిన అవసరం ఉంది, ఎందుకంటే మరింత ఎక్కువ రాబోతున్నదని యహువః హెచ్చరిక చేయుచుండెను.

హరికేన్ ఇర్మాకు ముందు మరియు తరువాత బ్రిటిష్ వర్జిన్ ద్వీపంలో పారాక్విటా బే.

హరికేన్ ఇర్మాకు ముందు మరియు తరువాత బ్రిటిష్ వర్జిన్ దీవులలో పారాక్విటా ఖాతము

నా విశ్వాసము ఉన్నతమైన దానిపై నిర్మించబడింది

చీకటి ఆయన ముఖాన్ని దాచుటకు చూచినప్పుడు,
నేను ఆయన మార్పులేని కృప మీద విశ్రాంతి తీసుకొందును.
ప్రతి అధిక మరియు తీవ్ర తుఫానులో,
నా జీవితం ఆశ్రయంలో నిలిచి ఉంటుంది. 5

 

ఇర్మా హరికేన్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఇప్పటివరకు నమోదు చేయబడిన అత్యంత శక్తివంతమైన తుఫానులలో చేర్చబడెను. ఈ తుఫాను యొక్క గాలి వేగం గంటకు 180 మైళ్ళుగా ఉంటూ కనీసం 30 గంటలపాటు అదే వేగంతో కొనసాగి, ఈ భూమిపై ఏర్పడిన తుఫానులలోకెల్లా సుదీర్ఘ మరియు అత్యంత తీవ్రమైన తుఫానుగా చరిత్ర సృష్టించినది. ఇది దాదాపు 400 మైళ్ళు విస్తరించిన, ఒక సంపూర్ణమైన పెద్ద హరికేన్, మరియు హరికేన్ యొక్క బలమైన గాలులు తుఫాను కేంద్రం నుండి బాహ్యంగా 80 మైళ్ల వరకు విస్తరించెను.

ఇర్మా యొక్క కేంద్రం సెప్టెంబరు 6, 2017 బుధవారం 1:47 గంటలకు బార్బుడా మీదగా వెళ్ళినది. నెవిస్ కు తూర్పున 70 మైళ్ల కంటే తక్కువగా ఉండి 1,800 జనాభాను కలిగిన చిన్న ద్వీపమైన బార్బూడా, పూర్తిగా నాశనమైనది. ఆంటిగ్వా మరియు బార్బుడా ప్రధాన మంత్రి అయిన గాస్టన్ బ్రౌన్, అసోసియేటెడ్ ప్రెస్ తో ఇలా అన్నారు, “ఇది నిజంగా ఘోరమైన పరిస్థితి.” బార్బుడాలోని విధ్వంసం యొక్క విస్తృతి మునుపెన్నడూ లేని విధంగా ఉన్నది.

నివాసిత ప్రాంతాలు పూర్తిగా ఖాళీ చేయబడెను, ఎందుకంటే విద్యుత్తు లేదు, నీరు లేదు, ఆహారం లేదు, మరియు ఏదైనా అందించుటకు ఎటువంటి మార్గము లేదు. ఖాళీ చేయుట నిమిత్తం వేచియున్న ఒక మహిళ ఇలా వివరించారు, “ప్రతిదీ నాశనం అయ్యింది. సహాయం చేయుటకు ఎవరూ లేరు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రభావితమయ్యారు”.

ఇర్మా హరికేన్ నెవిస్ కు ఉత్తరాన దాదాపు 50 మైళ్ళ దూరంలో ఉన్న సెయింట్ మార్టిన్ ను, మరియు వాయువ్యంగా 170 మైళ్ల దూరంలో ఉన్న వర్జిన్ దీవులను సర్వ నాశనం చేసినది.

సెప్టెంబరు 7, 2017 న, సెయింట్ మార్టిన్ లో ఉన్న పరిస్థితుల గురించి ది న్యూయార్క్ టైమ్స్ ఇలా నివేదించింది:

దేశం యొక్క ఫ్రెంచ్ భూభాగ పాలక సంస్థ అధ్యక్షుడు, డానియెల్ గిబ్స్ ప్రకారం, దాదాపుగా సెయింట్ మార్టిన్ ద్వీపం మొత్తం సర్వనాశనం చేయబడింది.

“ప్రతిచోటా నౌకలు నాశనమయ్యాయి, ప్రతిచోటా ఇల్లు నాశనమయ్యాయి, ప్రతిచోటా ఇంటి పైకప్పులు శిధిలమయ్యాయి,” రేడియో కారాయిబ్స్ ఇంటర్నేషనల్ తో గిబ్స్ చెప్పారు. “ఇది నమ్మశక్యం కనిది, ఇది వర్ణించలేనిది.”6

కొద్దిరోజుల తరువాత 4 వ కేటగిరీ హరికేన్, జోస్, తృటిలో సెయింట్ మార్టిన్ నుండి తప్పి పోయెను కానీ, ఈ సమయంలో, హరికేన్ మేరియా, మరొక 5 వ కేటగిరీ హరికేన్, సెయింట్ మార్టిన్ ను తాకనుంది.

పరలోకం పిలుస్తుంది, వేడుకొంటుంది, యాచిస్తుంది: మెల్కొనుము!

డొమినికా

కరీబియన్ ద్వీప దేశమైన డొమినికా మేరియా హరికేన్ వలన “అంతు చిక్కని” నష్టాన్ని చవిచూసింది, దాని ప్రధాన మంత్రి చెప్పారు… గంటకు దాదాపు 160 మైళ్ళ గరిష్ట వేగం గల గాలులతో తుఫాను యొక్క తాకిడికి, తన సొంత ఇంటితో సహా భవనాల పైకప్పులు శిధిలమయ్యాయి.”

మత్తయి 24 లో, రక్షకుడు ఇలా వివరించాడు: జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదనలకు ప్రారంభము. (మత్తయి 24: 7-8, KJV)

మరియు ఇది నిజం. వార్తలను క్రమంగా అనుసరిస్తున్న ఎవరైనా 1960 ల నుండి “ప్రకృతి ” వైపరీత్యాలు విస్తృతమైన స్థాయిలో పెరుగుతున్నాయని గ్రహించుదురు. రికార్డులు బద్దలవుతున్న కొత్త సంఘటనలు: రికార్డు బద్దలు కొట్టిన వేడి తరంగాలు; రికార్డు బద్దలు కొట్టిన వరదలు; రికార్డు బద్దలు కొట్టిన వరదలు; రికార్డు బద్దలు కొట్టిన ఆర్కిటిక్ చలి. యునైటెడ్ స్టేట్స్ లో, ఒక్క 2016 లో, “1000 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే” మూడు వరదలు వచ్చాయి! మరో మాటలో చెప్పాలంటే, వరదలు చాలా చెడ్డగా ఉన్నాయి, అవి 1,000 సార్లులో ఒక్కసారి వచ్చే వరదలై యున్నాయి. మరియు అవి కేవలం యునైటెడ్ స్టేట్స్ లోపల వచ్చు వరదలు!

2010 వైపరీత్యాలను చూపుతున్న పట్టిక.

ఈ పట్టికలో 2010 లో తగ్గుదల కనిపించినప్పటికీ, అప్పటి నుండి వాస్తవానికి ప్రకృతి వైపరీత్యాల సంఖ్య గణనీయంగా పెరిగెను.

ప్రపంచవ్యాప్తంగా, ప్రకృతి వైపరీత్యాలు సంఖ్యలోను మరియు పరిమాణంలోను పెరుగుతూ ఉన్నాయి. 2017 లో ప్రతి నెల ఒక ప్రకృతి వైపరీత్యం తరువాత మరొక ప్రకృతి వైపరీత్యంతో నిండి ఉన్నవి. నిజంగా, రక్షకుడి మాటలు మునుపెన్నడూ లేని విధంగా నెరవేరుతున్నవి. ఇవి వాతావరణ మార్పులు కారణంగా తలెత్తే వాస్తవమైన ప్రకృతి వైపరీత్యాలా లేక మానవుని యొక్క దుర్మార్గపు విధానాల కారణంగా కలుగుచున్న కృత్రిమ వైపరీత్యాలా?, అయితే యుగాంతం ద్వారం వద్దనే ఉన్నదని ఇవన్నియు తెలియజేయుచుండెను.

జనవరి

జింబాబ్వేను భారీ వర్షాలు అతలా కుతలం చేసెను, మరియు వరదల వలన వందల మంది మృత్యువాత పడ్డారు. దగ్గరలో 2,000 మంది నిరాశ్రయులయ్యారు. పాకిస్తాన్, పెరూ, మలేషియా, ఫిలిప్పీన్స్, యునైటెడ్ స్టేట్స్, ఇండోనేషియా, థాయ్ లాండ్ మరియు దక్షిణాఫ్రికాలో కూడా వరదలు సంభవిస్తున్నాయి. ఇటలీలో నాలుగు గంటల వ్యవధిలో నాలుగు ప్రధాన భూకంపాలు వరుసగా ఏర్పడెను.

ఫిబ్రవరి

ఇంగ్లాండ్ లోని కెంట్ ఫీల్డ్ మరియు యునైటెడ్ స్టేట్స్ లోని న్యూ ఓర్లీన్స్ లలో వరదలు ఏర్పడెను, స్పెయిన్ లోని మాలాగాలో మెరుపు వరదలు భవనాలు, రహదారులు మరియు వాహనాలకు విస్తృతమైన నష్టాన్ని కలిగించాయి. చిలీలో భారీ వర్షాల వలన వరదలు మరియు కొండచరియలు విరిగి పడుతున్నాయి, తద్వారా శుభ్రమైన త్రాగునీరు లేక లక్షలాది మంది అలమటిస్తున్నారు. మొజాంబిక్, మొరాకో, మరియు కొలంబియాలను వరదలు చుట్టుముట్టాయి. ఇండోనేషియా, దక్షిణాఫ్రికాల్లో వరదలు కొనసాగుతున్నాయి.

మార్చి

దక్షిణ ఆఫ్రికా ఇప్పటికీ గొప్ప వరదల క్రింద నలిగిపోతోంది. న్యూజిలాండ్, పెరు, బ్రెజిల్, అర్జెంటీనాలలో కూడా వరదలు సంభవిస్తున్నాయి. భారీ తుఫాను డెబ్బీ ఆస్ట్రేలియన్ క్వీన్స్ లాండ్ పై ప్రభావం చూపినప్పుడు $ 1.84 బిలియన్ల (US) నష్టానికి కారణమైనది. పద్నాలుగు మంది మరణించారు. జింబాబ్వేలో అదనపు వరదలు మరింత మంది ప్రజల మరణాలకు కారణమవుతున్నాయి.

ఏప్రిల్

ఇండోనేషియా మరియు చైనాలో వరదలు మరియు భారీ భూకంపాలు ఏర్పడుతున్నవి. న్యూజిలాండ్ మరియు అర్జెంటీనాలో వరదలు కొనసాగుతున్నాయి. ఇరాన్, కజఖ్ స్తాన్, కొలంబియా, జమైకా మరియు మిస్సౌరీ, యునైటెడ్ స్టేట్స్ అన్నియు వినాశకరమైన వరదలను చవిచూస్తున్నాయి. బోట్స్వానా దేశం 6.5 పరిమాణం గల భూకంపంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచెను. ఆఫ్రికాలోని ఈ స్థిరమైన ప్రాంతంలో వాస్తవానికి భూకంపాలను గూర్చి వినబడదు.

మే

కెనడాలోని, మాంట్రియల్ పదుల సంఖ్యలో (అనుభవించిన) ఘోరమైన వరదలతో ముంచివేయబడినప్పుడు అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ప్రభుత్వం తప్పనిసరి తరలింపులను అమలు చేస్తుంది. జమైకాలో వరదలు కొనసాగుతున్నాయి, యునైటెడ్ స్టేట్స్ లో ఆర్కాన్సాస్, కెనడాలోని క్యుబెక్, నీటిలో మునిగిపోయాయి. హైతీ, ఇండోనేషియా, చైనా మరియు శ్రీలంకలు కూడా జలాలతో ముంచివేయబడ్డాయి. యునైటెడ్ స్టేట్స్ లోని కొలరాడోలో చాలా బలమైన వడగళ్ళ తుఫాను కార్ల యొక్క కిటికీలను కూడా విరగగొట్టెను.

జూన్

పోర్చుగల్ లో అడవి మంటలు చెలరేగెను, ఫలితంగా 60 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. యునైటెడ్ స్టేట్స్ లో “తీవ్రమైన వాతావరణం మిలియన్ల మందిని ప్రభావితం చేయుచుండెనని” ABC న్యూస్ నివేదించుచుండెను. వివిధ తీవ్ర వాతావరణాలు గృహాలు మరియు వ్యాపారాలను నాశనం చేసి, మిలియన్ల డాలర్లు విలువ గల ఆస్తి నష్టం కలిగించెను. ఈ ఘటనల్లో 4.4 పరిమాణం గల భూకంపం ఉంది, తరువాత భారీగా, యెల్లోస్టోన్ అగ్నిపర్వతం వద్ద 2,000 తీవ్రస్థాయిలో ఉన్న భూ ప్రకంపణలు ఉన్నాయి. ఈ అపారమైన “గొప్ప అగ్నిపర్వతం” పేలుడు సంభవిస్తే, యునైటెడ్ స్టేట్స్ లో నివసిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని మరణింపజేయునని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చైనా, ట్యునీషియాలు నాశనకరమైన వరదల వలన దెబ్బతింటున్నాయి.

జూలై

ఇస్తాంబుల్ లో చారిత్రక వరదలు సంభవించిన కేవలం వారంలో మరొక్కసారి ఇస్తాంబుల్, టర్కీకిలో తీవ్ర వడగండ్ల వరదలు సంభవించాయి. ఇదే సమయంలో చైనాలో 60 పైగా నదులు ఉప్పొంగినప్పుడు 50 మందికి పైగా మృతి చెందారు మరియు 38,000 నివాస గృహాలు నాశనమయ్యాయి. వరదల ఉధృతికి 1.2 మిలియన్ల మందిని నివాస ప్రాంతాలను ఖాళీ చేయించారు. భారతదేశం, టర్కీ, అమాన్ మరియు జపాన్ లు ఉప్పొంగే వరదలతో ముంచబడుతున్నాయి.

ఆగష్టు

భారతదేశం మరియు నేపాల్ లో వరదలు కారణంగా 1,200 కన్నా ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు, మరియు లక్షలాది మంది తమ గృహాలను ఖాలీ చేస్తున్నారు. అదే సమయంలో, సియెర్రా లియోన్లో భారీ వర్షాలు వందల సంఖ్యలో ప్రజలను చంపెను వేలాది మందిని నిరాశ్రయులను చేసెను. ఇదిలా ఉంటే కాలిఫోర్నియాలో, సాధారణంగా చల్లగా ఉండు ఆగష్టులో, శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో 106 F/41 C ఉష్ణోగ్రత నమోదై, ఇది నగరానికి దక్షిణాన 115 F./115 C కు చేరుతూ అన్ని రికార్డును బద్దలు కొట్టెను. ఉత్తర కాలిఫోర్నియా మూడంకెల ఉష్ణోగ్రతలతో అట్టుడుకుట కొనసాగుతోంది.

సెప్టెంబర్

ఈ సమయంలో నెవిస్ లో ఉన్న కుటుంబం దైవిక రక్షణ కోసం వేడుకుంటుంది, ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల్లో ఇతర ప్రజలు హానికరమైన సంఘటనలను చవిచూస్తున్నారు. వాస్తవానికి, చాలా వరకు అన్నీ ఒకేసారి సంభవిస్తాయి, అయితే ఇతర ప్రాంతాల్లో ఏమి జరుగుతుందనేది చాలా మందికి తెలియదు. హార్వే, ఇర్మా, జోస్ మరియు మేరియా హరికేన్ల సమయంలో ప్రపంచంలో ఇతర ప్రాంతాలలో జరిగిన సంఘటనల జాబితా:

  • కాలిఫోర్నియా అగ్నిప్రమాదంలో ఉంది.
  • ఒరెగాన్ అగ్నిప్రమాదంలో ఉంది.
  • మోంటానా అగ్నిప్రమాదంలో ఉంది.
  • వాషింగ్టన్ అగ్నిప్రమాదంలో ఉంది.
  • బ్రిటీష్ కొలంబియా, కెనడా అగ్నిప్రమాదంలో ఉంది.
  • అల్బెర్టా, కెనడా అగ్నిప్రమాదంలో ఉంది.
  • మానిటోబా, కెనడా అగ్నిప్రమాదంలో ఉంది.

వీటిలో చాలా వరకు పిడుగుపాటుకు కలిగిన మంటలు. దక్షిణ కాలిఫోర్నియాలో సెప్టెంబరు 10 నుంచి 11 వరకు, 24 గంటల కాల వ్యవధిలో దాదాపుగా 40,000 పిడుగుపాట్లు సంభవించెను.

  • గ్రీస్ లో అగ్ని అగ్నిప్రమాదం.
  • బ్రెజిల్ లో అగ్నిప్రమాదం.
  • పోర్చుగల్ లో అగ్నిప్రమాదం.
  • అల్జీరియాలో అగ్నిప్రమాదం.
  • ట్యునీషియాలో అగ్నిప్రమాదం.
  • గ్రీన్లాండ్ లో అగ్నిప్రమాదం.
  • రష్యా యొక్క సామ్రా రిపబ్లిక్ లో అగ్నిప్రమాదం.
  • సైబీరియాలో అగ్నిప్రమాదం.
  • హార్వే హరికేన్ వలన టెక్సాస్ నీటిలో ఉంది.
  • భారతదేశం, నేపాల్, పాకిస్థాన్ మరియు బంగ్లాదేశ్ లు రికార్డు స్థాయిలో రుతుపవనాలను మరియు భారీ మృత్యువాతను చవిచూసెను.
  • సియర్రా లియోన్ మరియు నైజర్ లలో వరదలు, మరియు వేలాది మరణాలు సంభవించాయి.
  • ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, హంగేరీ, పోలాండ్, రొమేనియా, బోస్నియా, క్రోయేషియా మరియు సెర్బియాలలో మూడంకెల ఉష్ణోగ్రతలు మరణకరంగా పెరిగెను.
  • సదరన్ కాలిఫోర్నియా మూడంకెల ఉష్ణోగ్రతలతో నిలకడగా ఉంది.
  • ఒక 5.3 పరిమాణపు భూకంపం ఇదాహో ద్వారా ప్రకంపనలు పుట్టించెను.
  • జపాన్ 6.1 పరిమాణపు భూకంపాన్ని సునామీతో అనుభవించింది.
  • హార్వే, జోస్ మరియు కాటియా హరికేన్లు అట్లాంటిక్ చుట్టూ వణుకు పుట్టిస్తున్నవి, ఇంకా మరింత శక్తివంతమైనవి 8 సిద్ధమవుచున్నాయి.
  • సెప్టెంబర్ 6 న అపార X- తరగతి 9.3 సౌర జ్వాల సంభవిస్తుంది.
  • సెప్టెంబర్ 7 న మెక్సికోలో 8.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. తీర ప్రాంతం కనీసం 50 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వెనుకకు వెళ్ళెను. ఇది ఒక శతాబ్ద కాలంలో మెక్సికోని ఢీకొట్టిన బలమైన భూకంపం అని CNN నివేదించెను. డజన్ల మంది మృత్యువాత పడ్డారు.
  • సెప్టెంబర్ 10 న సూర్యుడి నుండి మరొక్క పెద్ద విస్ఫోటనం ఉంది. మరొక X- తరగతి జ్వాల మొత్తం 8.2.

సహజ విపత్తు పట్టిక (1950-2012)

ప్రకృతి వైపరీత్యాల తీవ్ర పెరుగుదలను చూపిస్తున్న మరొక పట్టిక.

ఆయన రెక్కల నీడలో

ఆయన రెక్కల క్రింద నేను సురక్షితంగా ఉందును.
రాత్రి తీవ్రంగా మరియు శ్రమలు ఘోరంగా ఉన్నప్పటికీ,
ఇంకను నేను ఆయనను విశ్వసించెదను, ఆయన నన్ను కాపాడునని నాకు తెలుసు.
ఆయన నన్ను విమోచించెను, మరియు నేను ఆయన కుమారుడను. 7

 

మనలో ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే “ఇవన్నీ పురిటి నొప్పులకు ప్రారంభాలు.” ముగింపు మనకు దగ్గరగా ఉన్నదని ఈ విపత్తులు ప్రకటిస్తున్నవి! ఇది మొదలుకొని, ప్రపంచంలో జరగబోయే సంఘటనలు తీవ్రంగా ఉంటాయి. సంఘటనలు సాధ్యమైనంత చెడ్డవిగా ఉంటూనే, అవి ముందుకు జరుగబోవు వాటిని తెలియజేయును. ప్రపంచవ్యాప్త విపత్తుల తీవ్రతలు అంత్యకాల సంఘటనల తీవ్రతలకు సరితూగుచున్న వాస్తవం, ఇంకా ఏమి సంభవించబోవునో అనే హెచ్చరికను జారీ చేయుచుండెను.

ఏడుగురు దూతలు మరియు ఏడు బూరల చిహ్నాల ద్వారా సమీప భవిష్యత్తులో జరుగు సంఘటనల వివరాలను ప్రకటన 8 వ మరియు 9 వ అధ్యాయాలు తెలియజేయుచుండెను. ప్రతి ఒక్కొ బూర ఊదబడినప్పుడు, ఒక్కొక్క కొత్త విపత్తు భూమి మీదకు వస్తుంది. చివరి మూడు బూరలు అత్యంత భయానకమైనవి, చివరకు బైబిలు కూడా వాటిని “శ్రమలు” గా సూచిస్తుంది. మునుపు ఎన్నడూ లేని విధంగా ఆయన యొక్క ఘనమైన, విలువైన వాగ్దానాలపై ఆధారపడుటకు ఇదే గొప్ప తరణం.

మరియు ఇంకా, వీటన్నిటి ద్వారా, యహువః మంచితనం ముందుకు ప్రకాశిస్తుంది. మునుపెన్నడూ లేనట్టి విషాదాలు మరియు విపత్తులన్నియు ప్రపంచంలోని ఈ ప్రాముఖ్యమైన చివరి సమయంపై మన దృష్టిని కేంద్రీకరించునట్లు చేయుటకు రూపొందించబడినవి.

అంత్య కాలం ఆరంభమయినదని తెలుపు విపత్తులలో చాలామంది మంచి వ్యక్తులు తమ ప్రాణాలను కోల్పోయారు. మనం మరణం ద్వారా పరలోకానికి వెళతామా లేక మరణం చూడకుండా వెళతామా అనేది, చివరిగా, ప్రతి ఒక్కరి వ్యక్తిగత పరిస్థితులలో ఏది ఉత్తమమైనదో తెలిసిన తండ్రి చేతిలో ఉండును.

అర్ధరాత్రిలో ఇలా గంభీరంగా “ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక” వినబడినప్పుడు నిద్రించుచున్న కన్యకలు తమ నిద్ర నుండి మేల్కొనిరి, మరియు ఆ సందర్భం కోసం ఎవరు సిద్ధంగా ఉండిరో అక్కడ కనబడెను. ఇరు బృందాలూ ఆదమరచి నిద్రించిరి, కానీ కొందరు అత్యవసర పరిస్థితికి సిద్ధంగా ఉన్నట్లు, మరికొందరు సిద్ధంగా లేనట్లు కనుగొనబడిరి. ఇప్పుడు, అకస్మాత్తుగా మరణాన్ని ముఖాముఖికి తెచ్చే ఒక విపత్తు, మరియు [యహువః] యొక్క వాగ్దానాల్లో నిజమైన విశ్వాసం ఉందో లేదో చూపు సందర్భం సంభవించినది. మానవుని కృపాకాలం ముగియుటకు దగ్గరలో గొప్ప తుది పరీక్ష వస్తుంది, మరియు అప్పటికి ఆత్మ యొక్క అవసరానికి సహాయం చేయటకు సమయం మించిపోయి ఉంటుంది. 8

దీనిని వ్రాస్తున్న సమయానికి, ఇర్మా హరికేన్ వెళ్ళిపోయింది, కానీ విపత్తులు కొనసాగుతున్నాయి. మేరియా హరికేన్ ప్యూర్టో రికోకు వెళ్ళే మార్గంలో ఉంది. జాతీయ వాతావరణ శాఖ ఇలా పేర్కొంది: “ఇది అత్యంత ప్రమాదకరమైన హరికేన్ మరియు PR [ప్యూర్టో రికో] మరియు వర్జిన్ ద్వీపాల అంతటా ప్రాణాంతకమైన ప్రభావాలు సంభవించవచ్చు.” 9 ఇది తీవ్రమైన సమస్య. ఎందుకంటే, ఇర్మాకు హరికేన్ కు ముందు మరియు తర్వాత ఇతర ద్వీపాల నుండి తరలించబడిన అనేకమంది ఈ ప్యూర్టో రికోకు తీసుకెళ్ళబడిరి! ఒకవేళ మేరియా హరికేన్ ప్యూర్టో రికోలో భూమిని పతనం చేసినచో, అది 85 సంవత్సరాలలో అలా చేసిన మొట్టమొదటి 4 వ లేక 5 వ కేటగిరీ హరికేన్ అవుతుంది.

ఏమైనప్పటికీ, నెవిస్ లో ఒక కుటుంబపు వారు తాము ఎవరిని విశ్వసించాలో తెలుసుకొనిరి.

నీవును అలా చేయుదువా?

వరల్డ్స్ లాస్ట్ ఛాన్స్ మిమ్మల్ని వేడుకొటుంది: పరలోకపు హెచ్చరికను పెడచెవిని పెట్టవద్దు!


1 1882 లో ప్రిస్సిల్ల జేన్ ఓవెన్స్ రాసినది.

2 అభ్యర్థనపై పేర్లు ఇవ్వబడలేదు.

3 వెర్నాన్ జే. ఛార్లెస్ వర్త్ వ్రాసెను, సిర్కా 1880.

4
http://reverepress.com/news/ocean-missing-irma-strong-sucking-water-away-shore-miles/

5
ఎడ్వర్డ్ మోట్ వ్రాసినది.

6
https://www.nytimes.com/2017/09/07/world/americas/hurricane-irma-caribbean-destruction-video-photos.html

7
విలియం ఓ. కుషింగ్ వ్రాసినది.

8 ఎల్లెన్ జి. వైట్, క్రైస్ట్ ఆబ్జెక్ట్ లెసెన్స్, p. 412, ప్రాముఖ్యత ఇవ్వబడింది.

9 http://edition.cnn.com/2017/09/19/americas/hurricane-maria-caribbean-islands/index.html

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.