World's Last Chance

At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

While WLC continues to uphold the observance of the Seventh-Day Sabbath, which is at the heart of Yahuwah's moral law, the 10 Commandments, we no longer believe that the annual feast days are binding upon believers today. Still, though, we humbly encourage all to set time aside to commemorate the yearly feasts with solemnity and joy, and to learn from Yahuwah's instructions concerning their observance under the Old Covenant. Doing so will surely be a blessing to you and your home, as you study the wonderful types and shadows that point to the exaltation of Messiah Yahushua as the King of Kings, the Lord of Lords, the conquering lion of the tribe of Judah, and the Lamb of Yahuwah that takes away the sins of the world.
WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

క్రిస్మస్: ఆరంభము, చరిత్ర & సాంప్రదాయం

“పర్వదినం.” ఈ పదంను చాలా మంది ప్రత్యేకంగా ఒక వేడుకకు వర్తింపజేస్తారు… అది క్రిస్మస్!

 “పర్వదినం” అనే పదం యొక్క నిర్వచనంలో చాలా మందికి తెలియని ఒక మతపరమైన అంశం వుంది.

 పర్వదినం: “ఒక మతపరమైన ఉత్సవం; ఒక పవిత్ర దినం.” (వెబ్స్టర్స్ న్యూ యూనివర్సల్ అనేబ్రిజ్డ్ డిక్షనరీ).

 క్రిస్మస్ ఒక మత సెలవు దినం. దీని యొక్క ఆధునిక వేడుకలలో అనేక వాణిజ్యపరమైన అలంకరణలు ఉన్నప్పటికీ, హృదయాల్లో మాత్రం క్రిస్మస్ ఒక మతపరమైన పండుగగా వున్నది. ఇది ఒక దైవమును స్మరిస్తూ, గౌరవించే సమయమై వున్నది.

 క్రైస్తవులు క్రిస్మస్ సమయంలో యేసు పుట్టిన రోజును జరుపుకుంటారు. “ఎప్పటికీ ఇవ్వబడిన గొప్ప బహుమానమునకు గౌరవార్థంగా వారు బహుమానములను ఇచ్చి పుచ్చుకుంటారు. వారు ఇలా చెప్పెదరు: “ఈ సమయానికి కారణం యేసు!! క్రీస్తును క్రిస్మస్ లోనికి చేరుస్తూ మాట్లాడెదరు.

 సమస్య ఏమిటంటే రక్షకుడైన యహూషువఃతో ప్రారంభించుటకు క్రిస్మస్ తో ఆయన ఎప్పుడూ సంబంధం కలిగి లేరు! లేఖనాలలో రక్షకుని యొక్క పుట్టిన తేదీ గురించి లేనప్పటికీ, ఎక్కువమంది పండితులు ఆయన శరదృతువులో జన్మించెనని అంగీకరిస్తున్నారు, డిసెంబర్ 25 న కాదు!

 క్రిస్మస్ లో పూజించబడే దేవుని కోసం తెలుసుకోవాలంటే, దీనిలోగల అన్యమత మూలాలను పరిశీలన చేయుట అవసరం. డిసెంబర్ 25న వేడుకలు జరుగుట జలప్రళయం తరువాత నిమ్రోదు యొక్క పునర్జన్మగా చెప్పబడిన తమ్మూజు పుట్టిన వెనువెంటనే ప్రారంభమాయెను. నేటి క్రిస్మస్ సాంప్రదాయాలు పురాతన బబులోను మరియు అన్య రోమ్ నుండి నేరుగా వచ్చినవి.

క్రిస్మస్: ఆరంభము, చరిత్ర & సాంప్రదాయం imageఅన్యమత రోమీయులు ​​డిసెంబరు నెలలో సాటర్న్(శని దేవుని) గౌరవార్ధం సాటర్నేలియ అనే ఉత్సవమును ఒక వారం పాటు జరుపుకొనేవారు. సాటర్న్ అనువాడు కాలానికి మరియు పంటలకు సంబంధించిన రోమన్ దేవుడు, అందువలన అతడు సాధారణంగా ఒక పొడవైన కొడవలి పట్టుకొని ఉన్నట్లు చిత్రింపబడతాడు. అతడు ఇతర సమస్త అన్యమత దేవతల కంటే అత్యంత క్రూరమైన దుష్ట దేవుడై ఉండెను. అతడు పిల్లలను బలికోరేవాడు.

 ఈ దుష్ట దేవున్ని పూజించినవారు రోమీయులు ఒక్కరు మాత్రమే కాదు. ఈ శని దేవుని ఆరాధన పురాతన ప్రపంచంలో ప్రబలంగా ఉండేది. పరలోకానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన సమయాలలో ఇశ్రాయేలీయులు కూడా సాటర్న్ ను పూజించిరి. ఇశ్రాయేలీయులు తరచుగా స్వమత ధర్మముకు విరోధముగా తిరుగుబాటు చేసిన సమయాలలో పూజించబడిన దేవుడు ఈ శని దేవుడే (బైబిలులో కుయిన్, మోలెకు, లేదా రొంఫాయను దేవతలుగా సూచించబడెను). చివరకు ఇశ్రాయేలీయులు రక్తదాహం గల ఈ దుష్ట దేవునికి వారి పిల్లలను కూడా బలిచ్చేవారు.

 “సాటర్న్ ఆఫ్రికన్ విగ్రహారాధన యొక్క విజేతగా నిలిచింది అలాగే …. ఫోనిసియన్ కార్తేజ్ లో బయలు-హమ్మోను దేవత వలెనూ, . . . అతడు పిల్లలను బలి కోరువాడు….. అలాగే ఒక సంతానోత్పత్తి దేవుడు, . . . శని-బయలు… ఏమైనప్పటికీ అతడు కోరే బలి క్రూరమైనది.” (Quodvultdeus of Carthage, ట్రాన్సలేషన్స్ అండ్ కామెంటరీస్, థామస్ మాసీ ఫిన్, పేజి. 14 & 115.)

 రోమీయులు ​​ముందుగా మానవులను బలి ఇచ్చుటను విడిచిపెట్టినప్పటికీ, డిసెంబర్లో సాటర్నేలియా ఉత్సవాలలో ఇప్పటికీ మల్లయోధులు రక్తం చిందించుకొందురు. సాటర్నేలియా ఒక మతపరమైన వేడుక మరియు యోధులు చిందించిన రక్తం సాటర్న్ కు బలి అర్పణ అని అందరూ అర్థం చేసుకొందురు.

 “మల్లయోధుల ప్రదర్శనలు [సాటర్న్ కు] పవిత్రమైనవి.” (Johann D. Fuss, Roman Antiquities , p. 359)

 “ప్రదర్శనాలయం స్వయంగా తన యోధులు” డిసెంబర్ చివరలో వారి రక్తం ద్వారా పరలోకం యొక్క కొడవలి మోయుచున్న-కుమారుని [సాటర్న్] ప్రసన్నం చేసుకుంటారని పేర్కొనెను.” (Ausonius, Eclog , i. p. 156).

 “మల్లయోధులు, సాటర్నేలియా ఉత్సవాల్లో పోరాడుదురు, అలా వారు … సాటర్న్ ను శాంతింపచేసి తన అనుగ్రహం పొందుటకు చేయుదురు.” (Justus Lipsius, tom. ii. Saturnalia Sermonum Libri Duo, Qui De Gladiatoribus , lib. i. cap. 5)

 “ఈ మల్లయోధుల ప్రదర్శనలు ఏ సూత్రంపై నిర్వహించెదరంటే … వారు అనుగ్రహం కలిగించు పరిహార బలులుగా వేడుకలు చేసుకుంటూ.. … దానిని ‘రోమన్ పవిత్ర దినంగా’ చేయుటకు అలాంటి పురుషులు గుంపులు గుంపులుగా చేరి పొడుచుకుంటూ వుంటారు. ఇక్కడ సాటర్న్, తనకు తానే ముక్కలుగా చేసుకొనెనని జ్ఞాపకం చేసుకొనే విధంగా చేసి, తన అనుగ్రహంను పొందే క్రమంలో, తన పుట్టినరోజున మనుష్యులు ఒకరినొకరు పొడుచుకొనేలా అమర్చుట ద్వారా తనకు బలిరూపమైన స్వాగతం చేయించుకోవాలనే తన ఆలోచనను అర్ధం చేసుకొనుట సులభం.” (Alexander Hislop, The Two Babylons, p. 153)

 హింస మరియు రక్తపాతం ఉన్నప్పటికీ, సాటర్నేలియా ఒక విందులు చేసుకునే మరియు ఉల్లసించే సమయం. ఈ అత్యంత రక్త దాహంగల దేవుని గౌరవించే వివిధ పురాతన వేడుకల ఆచారాలు నేడు చాలా ప్రియమైన క్రిస్మస్ సాంప్రదాయాలుగా ప్రపంచవ్యాప్తంగా చేయబడుచున్నవి.

 ఈ సంప్రదాయాలు ఇలా ఉన్నాయి:

  • పన్నెండు రోజుల క్రిస్మస్
  • విందులు సాయంత్రం పూట జరుగుట
  • క్రిస్మస్ చెట్లను దీపాలతో అలంకరించుట (నిజానికి పిల్లల [బలిత్యాగ బాధితుల] మృతదేహాల కొవ్వు నుండి తయారు చేసిన కొవ్వొత్తులు ఉండేవి)
  • క్రిస్మస్ చెట్లకు బంతులు కట్టుట (పురాతన కాలంలో బలిత్యాగ బాధితుల శిరచ్చేదనం చేసిన తలలు)
  • అల్లరి చేసే వారితో వేడుకలు
  • బహుమతులు మార్చుకొనుట
  • మిసిల్ టో(ఇది ఒకరకమైన క్రిస్మస్ లో వాడే చెట్టు) కింద ముద్దు పెట్టుకొనుట
  • పవిత్ర బెర్రీలు (దేవతల ఆహారం)
  • సతతహరిత చెట్ల రెమ్మలు.
  • ఇంటింటికీ సంకీర్తనలు చేయుచూ తిరుగుట (వాస్తవానికి కామముగా ప్రవర్తించే నగ్నగాయకులు తిరిగేవారు)
  • ఆగమన కొవ్వొత్తులు
  • క్రిస్మస్ కార్డులు
  • . . . మరియు ఇంకా అనేకమైనవి.

క్రిస్మస్: ఆరంభము, చరిత్ర & సాంప్రదాయం imageచివరకు “ఫాదర్ క్రిస్మస్”/ శాంతాక్లాజ్ కూడా ఆశ్చర్యకరంగా సాటర్న్ యొక్క సార్యూపాన్ని కలిగి ఉంటాడు., పొడవాటి గడ్డంతో ఒక ముసలి వ్యక్తి, చుట్టూ పిల్లలతో ఉంటాడు.

 సాటర్న్; దుష్టుడైన, పిల్లలను బలికోరే పాత మనిషి ఆధునిక సమాజంలో మరో రెండు విధాలుగా కనిపిస్తున్నాడు. ప్రతి “డిసెంబరు”, సాటర్న్, కాల దైవమునకు సాదృశ్యంగా వుంటూ, “పాత తండ్రి కాలము/ ఓల్డ్ ఫాదర్ టైమ్” వలె తిరిగి ఉద్భవించుచుండును. తరువాత వచ్చే కొత్త సంవత్సరం “కొత్త బిడ్డ సంవత్సరం/ బేబీ న్యూ ఇయర్” అనేది పిల్ల బాధితుడికి గుర్తు. (ఇక్కడ డిసెంబరు అనే పాతగిల్లుచున్న కాలము “పాత తండ్రి కాలం” గాను, తరువాత వచ్చే కొత్త సంవత్సరం ” కొత్త బిడ్డ సంవత్సరం” గాను పోల్చబడెను).

 “కొత్త బిడ్డ సంవత్సరం” తో “పాత తండ్రి కాలము” యొక్క ఒక గొగుర్పాటు కలిగించే సంబంధమును ఈ క్రింది 19 వ శతాబ్దపు ఉదాహరణ చిత్రం నుండి చూడవచ్చు. దీనిలో కాలము అనే తండ్రి , (సమయ దేవునిగా వున్న సాటర్న్), ఒక పెద్ద గడియారం ముందు, తన కొడవలి పట్టుకొని నిలబడి ఉండెను. పాత సంవత్సరాలు ఒక పూర్తిగా ఎదిగిన దేహాము చుట్టబడి ఖననానికి వెళ్ళుచున్నట్లు గతించుచుండెను. క్రొత్త సంవత్సరము ఒక చిన్న బిడ్డవలె వచ్చుచుండెను. చిత్రం చాలా చీకటిగా ఉండగా, ఇరువైపులా పొగ విస్తృత వృత్తాలుగా లేచుచున్నప్పుడు అగ్ని నుండి ఒక జ్వాల చిన్న పిల్లవాడిని వెలిగించుచుండెను. రాబోవుచున్న కొత్త సంవత్సరాలు బలికి సిద్ధంగా ఉన్న చిన్నపిల్లల వలె చిత్రించబడెను. దహనబలి చేయునప్పుడు వారి తల్లిదండ్రులు వారిని గుర్తించకుండా ఉండునట్లు బలివ్వబడుచున్న పిల్ల బాధితులు ఎల్లప్పుడూ భారీగా కప్పబడుదురు. ఈ అఘోరమైన దేవుని యొక్క భయంకరమైన సమస్త అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి.

క్రిస్మస్: ఆరంభము, చరిత్ర & సాంప్రదాయం image

 సాటర్న్ ఆధునిక సమాజంలో దుష్ట కోతగాని వలె తన పాలిపోయిన ఆత్మల పంటను కూర్చుకొనుచుండెను. ఆధునిక సమాజంలో అతికొద్ది మంది మాత్రమే ఈ తండ్రి క్రిస్మస్, దుష్ట కోతగాడు మరియు “పాత తండ్రి కాలము” ఇవన్నీ ఆ అత్యంత అసహ్యకరమైన దేవుడు తప్ప మరెవరో కాదని గుర్తిస్తున్నారు. ఒక పూర్వీకుడు అయితే వీటన్నిటినీ సాటర్న్ తప్ప వేరెవరూ కాదని వెంటనే గుర్తించగలడు. సాటర్న్ గుర్తించబడే చిహ్నములు మరియు “పాత తండ్రి కాలము”/ “దుష్ట కోతగాడు” గుర్తించబడే చిహ్నములు ఒకటే: కొడవళ్లు మరియు కాలాన్ని తెలిపే ఏదో ఒక గుర్తు.

సాటర్న్ ను గౌరవించు అన్యమత దినాలకు అంటిపెట్టుకొనియున్న అనేకమైన మంచి వ్యక్తులు నేడు అనేక సాకులు చెబుతూ ఉన్నారు, అవి:

  • “కుటుంబంతో గడపడానికి క్రిస్మస్ అద్భుతమైన సమయం. మేము ఏడాది పొడవునా తీరికలేకుండా ఉన్నాము, ఇది నిజంగా కలిసి గడుపుటకు ఒకే ఒక అవకాశం.”
  • “సాక్ష్యమిచ్చుటకు క్రిస్మస్ ఒక గొప్ప సమయం! సంవత్సరంలో ఈ సమయంలో ప్రజలు సద్హృదయం కలిగి ఉంటారు, కావున నేను వాక్యాన్ని పంచుకోవడానికి అవకాశంగా ఉపయోగించవచ్చు.
  • “క్రిస్మస్ మాత్రమే యేసుపై దృష్టి పెట్టు నిజమైన పవిత్ర దినంగా ఉంది!”
  • “యేసు నిజంగా క్రిస్మస్ సమయంలో పుట్టలేదని నాకు తెలుసు. కావున నేను మోసపోలేదు. అయితే, నేను ఏ అన్యమత దేవతలను పూజించుట లేదు, కాబట్టి ఇది నామట్టుకు సరియే!”

క్రిస్మస్: ఆరంభము, చరిత్ర & సాంప్రదాయం imageఅన్యమతస్థులకు సృష్టికర్త, యహువః ను గూర్చి తెలియదు. వారు భూత దేవతలను పూజిస్తారు ఎందుకంటే వారికి యుక్తమయినది ఏదియు తెలియదు. అయితే నేటి క్రైస్తవులు కూడా ఇవే మాటలను చెప్పించుకోరాదు.

 లేఖనం బోధిస్తుంది:

 “ఆ అజ్ఞానకాలములను యహువః చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.” (అపొస్తలుల కార్యములు 17:30, KJV)

 క్రిస్మస్ ఒక అన్యమత పండుగ అని తెలుసు. నేటి ఆధునిక ఆచారాలు, సాటర్న్ ను గౌరవించిన పురాతన అన్యమత ప్రక్రియలు ఒకేలా ఉన్నవని తెలుసు. ఒకనికి అన్నీ తెలుసు కాబట్టి పాపం నుండి మినహాయింపును కోరుట అనేది చాలా అసంగతమైనది.

 క్రిస్మస్ నిజంగా ఒక పండుగ దినం: ఒక మతపరమైన పండుగ. దుష్ట దేవుడు, సాటర్న్ ను గౌరవించుట ద్వారా భూమ్యాకాశములకు సృష్టికర్తయైన, యహువఃకు, అగౌరవం తేబడుతుంది.

 రక్షకుడు తానే దైవ సూత్రంను ఇలా చెప్పారు:

 “ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు యహువఃకిని సిరికిని దాసులుగా నుండనేరరు……” (మత్తయి 6:24)

 సాటర్న్, సమస్త ఇతర తప్పుడు దేవుళ్ళ కన్నా ఎక్కువ సాతాను మాదిరి లక్షణాలను కలిగియున్నాడు. క్రిస్మస్ ఒక అన్యమత పండుగ. క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడం ఈ దుష్ట, సాతాను దేవతకు గౌరవం ఇచ్చుచుండెను.

 భక్తిలో దిగజారిన ఇశ్రాయేలీయుల కోసం ఒక ప్రేమగల తండ్రి పలికిన మాటలు నేడు క్రైస్తవుల కోసం శక్తితో ప్రతిధ్వనిస్తున్నాయి:

 “అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాస ఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాస ఘాతకులైతిరి; ఇదే యహువః వాక్కు . . . తాము దుర్మార్గులై తమ ఎలోహ అయిన యహువఃను మరచిన దానిని బట్టి . . . భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి; మీ అవిశ్వాసమును నేను బాగుచేసెదను; . . ” (యిర్మీయా 3: 20-22)

 అన్యమత ఆచారాలలో పాల్గొనడం యహువఃకు అగౌరవమును తెస్తుంది. మీ ప్రేమగల విమోచకుని యొద్దకు తిరిగి రండి.

 “మెస్సీయనకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? యహువః ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల యహువః ఆలయమై యున్నాము; అందుకు యహువః ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి ఎలోహనై యుందును వారు నా ప్రజలైయుందురు. ” (2 కొరింథీయులు 6: 15-17)

 వాటి మధ్యలోనుండి బయటకు రండి! అపవిత్రమైనదానిని తాకవద్దు!!

 మీరు బయటకు వచ్చెదరా?

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.