World's Last Chance

At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

While WLC continues to uphold the observance of the Seventh-Day Sabbath, which is at the heart of Yahuwah's moral law, the 10 Commandments, we no longer believe that the annual feast days are binding upon believers today. Still, though, we humbly encourage all to set time aside to commemorate the yearly feasts with solemnity and joy, and to learn from Yahuwah's instructions concerning their observance under the Old Covenant. Doing so will surely be a blessing to you and your home, as you study the wonderful types and shadows that point to the exaltation of Messiah Yahushua as the King of Kings, the Lord of Lords, the conquering lion of the tribe of Judah, and the Lamb of Yahuwah that takes away the sins of the world.
WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

న్యూ మూన్ దినాలు & మన్నా | అరణ్యంలోని నమూనా

సృష్టికర్త నియమించిన సమయ సూచిక పద్ధతి అయిన, సూర్య చంద్ర క్యాలెండరుపై కాంతి ప్రకాశించుట పెరుగుతున్నకొలది, ఈ సత్యానికి వ్యతిరేకత కూడా పెరుగుట కొనసాగుతున్నది. ఒక అభ్యంతరానికి సమాధానం వచ్చిన వెంటనే, దాని స్థానంలో మరొకటి అభ్యంతరం పరిచయం చేయబడుతుంది.

సత్యం ధిక్కారుల నుండి విశ్వాసులను వేరుచేస్తుంది.

ప్రత్యేకించి, ముఖ్యంగా ఈ అత్యంత ప్రాముఖ్యమైన అంశాన్ని పూర్తిగా అధ్యయనం చేయుటకు నిజాయితీగా సమయం కేటాయించని వారిచే చూపబడుచున్న ఒక అభ్యంతరం, మన్నాను గూర్చిన బైబిలు కథనం. న్యూ మూన్ దినములయందును మరియు నెల యొక్క 30 వ దినమునందును మన్నా కురియుటను గూర్చిన లేఖనం యొక్క నిశ్శబ్దతను కొందరు లూనార్ సబ్బాతు లేఖనానుసారం కాదు అనుదానికి ఒక “సాక్ష్యం” గా ఉపయోగిస్తున్నారు.

అభ్యంతరాలు ఈ విధంగా ఉంటూ ఉన్నవి:

” మన్నా ఆరు పనిదినాలలో మాత్రమే పడి, ఏడవ రోజు సబ్బాతులో ఎన్నడూ పడలేదు అని నిర్గమకాండం 16 సూచిస్తుండెను. న్యూ మూన్ దినముకు మరియు నెలలోని 30 వ తేదీకి సంబంధించి మన్నాను గురించి ఇక్కడ ప్రస్తావనలేదు. అందువలన ఇశ్రాయేలీయులు నేడు మనం ఆచరిస్తున్నట్లుగానే ఖచ్చితంగా నిరంతర వారాలను ఆచరించి ఉండేవారు.”

న్యూ మూన్ దినము మరియు నెలలోని 30 వ తేదీలకు సంబంధించి మన్నాను గూర్చిన వివరాలను నిర్గమకాండం 16వ అధ్యాయంలో ప్రస్తావించకపోవుట నిజమే అయినప్పటికీ, లేఖనాలు ఈ విషయంలో పూర్తిగా నిశ్శబ్దం వహించుటలేదు. ఇశ్రాయేలీయులు నలభై సంవత్సరాల పాటు మన్నాను మాత్రమే తిన్నారని చాలామంది భావించుచున్నారు. అయితే ఇది నిజం కాదు.

నిర్గమకాండము 12: 30-32లో ఇలా వ్రాయబడి యున్నది:

రాత్రి ఫరోయు అతని సేవకులందరును ఐగుప్తీయులందరును లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైన లేకపోయినందున ఐగుప్తులో మహా ఘోష పుట్టెను. ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి యహువః ను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసికొని పోవుడి; నన్ను దీవించుడని చెప్పెను.

ఫరో చివరికి ఇశ్రాయేలీయులను విడిచిపెట్టడానికి అంగీకరించినప్పుడు, అతడు వారి పశువులను మరియు మందలను వారితో పంపించాడు. ఇశ్రాయేలీయులు తమతోపాటు తీసుకు వెళ్ళిన పశువుల ఖచ్చితమైన సంఖ్య నిశ్చయంగా మనకు తెలియకపోయినా, నిర్గమకాండంలో ఐగుప్తును విడిచిపెట్టిన వారిలో మహిళలు మరియు పిల్లలు కాకుండా కనీసం 600,000 మంది పురుషులు ఉండుటను బట్టి ఆ పశువులు, వందల వేల సంఖ్యలో ఉండునని మనం నిర్ణయించవచ్చు.(నిర్గమకాండము 12:37). నిర్గమము ఒక చిన్న ఉద్యమం కాదు! ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్న సమయంలో యహువః చేత గొప్పగా ఆశీర్వదించబడ్డారు.

న్యూ మూన్ దినాలు & మన్నా | అరణ్యంలోని నమూనా image

లేవీయకాండము మొదటి మూడు అధ్యాయాల్లో ఇవ్వబడిన బల్యర్పణల జాబితా ఇశ్రాయేలీయుల పశువుల సమృద్ధిని2 ధృవీకరిస్తున్నది. ఉదాహరణకి:

నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము మీలో ఎవరైనను యహువః కు బలి అర్పించునప్పుడు, గోవుల మందలో నుండి గాని గొఱ్ఱెల మందలో నుండి గాని మేకల మందలో నుండి గాని దానిని తీసికొని రావలెను. అతడు దహనబలి రూపముగా అర్పించునది గోవులలోనిదైన యెడల నిర్దోషమైన మగ దానిని తీసికొని రావలెను. తాను యహువః సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసికొని రావలెను. (లేవీయకాండము 1: 2-3 చూడండి 3)

వారి పశువులచే ఇవ్వబడిన మాంసాన్ని తినుటతో పాటు, ఇశ్రాయేలీయులు తమకు భోజనం తయారు చేసుకొను నిమిత్తం నూనెలు మరియు గోధుమ పిండిని కలిగియున్నారు. యాజకులను ప్రతిష్టించు విషయంలో యహువః ఇచ్చిన సూచనలలో ఇది కనిపిస్తుంది:

వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించు టకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా, ఒక కోడెదూడను కళంకములేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలుచని అప్పడములను తీసి కొనుము. గోధుమపిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసికొనిరావలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడార ముయొక్క ద్వారము దగ్గరకు తీసికొనివచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి…(నిర్గమకాండము 29:1-4)

న్యూ మూన్ దినాలు & మన్నా | అరణ్యంలోని నమూనా imageప్రత్యక్ష గుడారములోని దీపము నిత్యము వెలుగుచుండుట మరియు యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద భక్ష్యములు దొంతులుగా నిరంతరము ఉండవలెను అను యహువః ఆజ్ఞలో కూడా ఇశ్రాయేలీయులు అరణ్యంలో నివశించినప్పుడు ఒలీవల నూనె మరియు పిండితో ఆశీర్వదింపబడి యున్నారు అనే వాస్తవంను చూడవచ్చు.

మరియు యహువః మోషేకు ఈలాగు సెల విచ్చెను. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపముకొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము . . . . నీవు గోధుమలపిండిని తీసికొని దానితో పండ్రెండు భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు సేరు పిండి యుండవలెను. యహువః సన్నిధిని నిర్మల మైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలెను. యాజకుడు . . . దాని తీసికొని నిత్యము యహువః సన్నిధిని చక్కపరచవలెను.అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను. వారు పరిశుద్ధస్థలములో దాని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యహువః కు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము. (లేవీయకాండము 24:1-9).

ఇశ్రాయేలు పశువులు, చమురు, పిండితో కూడిన భోజనంతో మాత్రమే ఆశీర్వదించబడలేదు కానీ వారికి ఆహారంను అందించుటకు వీలుగా, తమ అవసరతను బట్టి వారికి దైవాదీనంగా పరిచయంలోనికి వచ్చిన వివిధ దేశాల జనుల యొద్ద నుండి కొనుగోలు చేయుటకు మరియు వాణిజ్యానికి కూడా వారు అనుమతించబడిరి. ఇది ఇశ్రాయేలీయులు శేయీరు గుండా వెళ్ళటానికి సిద్ధమైనప్పుడు మోషేకు యహువః ఇచ్చిన ఆజ్ఞలో స్పష్టంగా కనిపిస్తుంది.

అంతట యహువః నాకు ఈలాగు సెలవిచ్చెను మీరు ఈ మన్నెముచుట్టు తిరిగినకాలము చాలును; ఉత్తరదిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనుము. శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోవు చున్నారు, వారు మీకు భయపడుదురు; మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. వారితో కలహపడవద్దు; ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్నెము నేనిచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను. మీరు రూకలిచ్చి వారియొద్ద ఆహారము కొని తినవచ్చును. రూకలిచ్చి వారియొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును. నీ చేతుల పనులన్నిటిలోను నీ ఎలోహీం అయిన యహువః నిన్ను ఆశీర్వ దించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన యెరుగును. నీ ఎలోహీం అయిన యహువః నీకు తోడై యున్నాడు, నీకేమియు తక్కువకాదు. (చూడుము: ద్వితీయోపదేశకాండము 2:2-7).

సంఖ్యాకాండం 11లో మన్నాను గూర్చి ఇశ్రాయేలీయుల యొక్క ఫిర్యాదును బట్టి వారు కేవలం మన్నాను తినడానికి మాత్రమే అనుమతించబడ్డారని కొంతమంది తప్పుగా అర్థం చేసుకొనుచున్నారు.

వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్షను అధి కముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచి తముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్ల గడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల యెదుట మరేమియు లేదని చెప్పుకొనిరి. (సంఖ్యాకాండము 11:4-6).

“ఈ మన్నా తప్ప మరేమీ లేదు” అనే ఇశ్రాయేలీయుల యొక్క పిర్యాదు స్పష్టంగా అత్యాశ మరియు అధిక మాంసముల గురించిన కోరిక మరియు వారిలో చాలామంది ఐగుప్తులో ఆనందించిన విలాసాల యొక్క ప్రతిబింబము. ఐగుప్తు దేశమునుండి వారి నిష్క్రమణ సమయంలో చాలా మంది ఐగుప్తీయులు తమకు తాము ఇశ్రాయేలుతో కలిసి బయటకు వచ్చిరని తప్పక గుర్తుంచుకోవాలి.

అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు గాక కాల్బలము ఆరులక్షల వీరులు. అనేకులైన అన్యజనుల సమూహమును, గొఱ్ఱెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్పమందయును వారితోకూడ బయలుదేరెను. (నిర్గమకాండము 12: 37,38)

ఇశ్రాయేలీయులు పశువులు, చమురు, పిండితో కూడిన భోజనంతో మాత్రమే ఆశీర్వదించబడుట కాదు కానీ వారికి ఆహారంను అందించుటకు వీలుగా, వారు తమ అవసరతను బట్టి సంప్రదాయబద్ధంగా వారికి దైవాదీనంగా పరిచయంలోనికి వచ్చిన వారి యొద్ద నుండి కొనుగోలు చేయుటకు మరియు వాణిజ్యానికి కూడా అనుమతించబడిరి.

న్యూ మూన్ దినాలు & మన్నా | అరణ్యంలోని నమూనా image

ఇశ్రాయేలీయులలో తమకు తాము కలిసిపోయిన కలిసిపోయిన ఐగుప్తీయులే చాలా వరకు ఇక్కడ ఫిర్యాదు చేస్తూ ఉన్నారు, వారు తమ పూర్వపు ఆహారపు అలవాట్ల కొరకు ముష్కరముగా కేకలు వేయుచున్నారు.

అరణ్యంలో ఉన్న సమయంలో ఇశ్రాయేలీయులకు లభించిన ఆహారం మన్నా మాత్రమే కాదని స్పష్టమవుతున్నది. అరణ్యంలో ఇశ్రాయేలీయుల ప్రయాణం యొక్క రెండవ నెల వరకు కూడా మన్నా ఇవ్వబడలేదనే వాస్తవం దీనిని మరింత ధృవీకరిస్తుంది.

తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీమునుండి ప్రయాణమైపోయి, వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన రెండవనెల పదునైదవ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. అప్పుడు యహువః మోషేతో ఇట్లనెనునేను ఇశ్రాయేలీయుల సణుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారముచేత తృప్తిపొందుదురు, అప్పుడు మీ ఎలోహనైన యహువఃను నేనే అని మీరు తెలిసికొందురని వారితో చెప్పుమనెను. (నిర్గమకాండము 16:1,11,12)

అలాంటప్పుడు ఇశ్రాయేలీయుల పిల్లలు అరణ్యంలోని మొదటి నెల సమయంలో ఏమి తిన్నారు? వారు తమ పశువుల సమృద్ధిలో నుండియు, అలాగే ముందుగా ఐగుప్తీయుల వద్దనుండి తీసుకొనిన సామగ్రిలో నుండియు తినడం జరిగింది.

మన్నా మాత్రమే ఇజ్రాయేలీయులకు ఆహారం కానట్లైతే, అప్పుడు, మన్నా దేనికి ఇవ్వబడింది? మన్నా యొక్క ప్రాధమిక ఉద్దేశ్యము ఇశ్రాయేలీయులకు యహువః యొక్క ఖగోళ క్యాలెండరు యొక్క యంత్రాంగంను బోధించుటయై యుండెను. ఇది సృష్టి యొద్ద ఏర్పాటు చేయబడి, నియమించబడినది.

ఎలోహ పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను “నియామక” కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు . . . పలికెను. (ఆదికాండము 1:14).

మన్నా యొక్క ఉద్దేశ్యం సబ్బాతు దినములు ఎలా లెక్కించబడునో అనే దానిని స్పష్టంగా చెప్పుటయే అయివుంది. మన్నా ఏడవ దినపు సబ్బాతుకు ముందు ఉండే ఆరు పని దినాలలో మాత్రమే పడియుండెను. ఆయన ప్రజలు తన ధర్మశాస్త్రానికి విధేయులవుతున్నారా లేదా అని యహువః పరీక్షిస్తున్నారు.

న్యూ మూన్ దినాలు & మన్నా | అరణ్యంలోని నమూనా image

మన్నా బహుశా న్యూ మూన్ దినములయందు లేదా నెల 30 వ రోజున పడలేదు, ఎందుకంటే అది మాత్రమే వారి ఆహారంనకు తప్పనిసరి కాదు. ఇశ్రాయేలు వంశీయులు విస్తారమైన వనరులతో ఆశీర్వదించబడిరి, మరియు మన్నాకు వేరుగా వారు తినుటకు ఇతరత్రా సామాగ్రి పుష్కలంగా ఉండెను. విశ్రాంతి దినములలో వంట నిషేధించబడిన విషయం దీనిని వివరిస్తుంది. మన్నా యొక్క ఉద్దేశ్యం సబ్బాతు దినములు ఎలా లెక్కించబడునో అనే దానిని స్పష్టంగా చెప్పుటయే. మన్నా ఏడవ దినపు సబ్బాతుకు ముందు ఉండే ఆరు పని దినాలలో మాత్రమే పడియుండెను. ఆయన ప్రజలు తన ధర్మశాస్త్రానికి విధేయులవుదురా లేదా అనేదానిని యహువః పరీక్షిస్తున్నారు.

యహువః మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. మరియు ఆరవ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొనుదానికంటె అది రెండంతలై యుండవలెననెను. (నిర్గమకాండము 16:4,5).

యహువః తన గొప్ప కరుణ మరియు అనంత విజ్ఞానంతో, ఇజ్రాయేలీయులు 400 సంవత్సరాలుగా మర్చిపోవుచున్న, తన క్యాలెండరును గురించి బోధిస్తుండెను! నేడు మన ప్రేమగల తండ్రి తన క్యాలెండరును మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు. మేము ఆయన ప్రజలము అని చెప్పుకునే ప్రజలు ఆయన యొక్క ధర్మశాస్త్రంలో నడుచుదురో లేదోనని ఆయన పరీక్షిస్తున్నారు. మీరు ఈ దినమున, యహువః యొక్క విశ్వాసులలో చేరుదురా? మీరు మీ విధేయతను యహువఃకు ప్రతిజ్ఞ చేయుదురా, మరియు ఆయన నియమించిన క్యాలెండరులోని పవిత్ర దినాలను గైకొందురా?

ఆయన మన ఎలోహ, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొఱ్ఱెలము. నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరచుకొని నట్లు మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. (కీర్తనల గ్రంథము 95:6,7,8).

నిర్ణయం మీదే….

న్యూ మూన్ దినాలు & మన్నా | అరణ్యంలోని నమూనా image

 


1 పండుగ దినాలతో మన్నా ఎలా సంబంధం కలిగివుందనే విషయాల వివరాలను లేఖనాలలో ఇవ్వలేదు. ఉదాహరణకు, ప్రాయశ్చిత్తార్ధ దినాన మన్నా పడుతుందా లేదా అనే దాని ప్రస్తావన లేదు, ఇది ఉపవాసము మరియు ఏ పనియు చేయ కూడని దినము (లేవీయకాండము 23: 27-32). అయినప్పటికీ, ప్రాయశ్చిత్తార్ధ దినము హెబ్రీ క్యాలెండర్లోని భాగం కాదని నిరూపించలేదు!

2 ఇశ్రాయేలీయులకు అవసరమైన విస్తారమైన బలుల మొత్తాన్ని మరియు వారి ఆహార విషయంలో పశుసంపద వినియోగాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే, వారి పశువుల సంపదలను విస్తారంగా ఉండటమే కాక, అరణ్యంలో పశువుల సంఖ్య సమృద్ధిగా (వాటి సం తానం ద్వారా) పెరిగే అవకాశం కూడా ఉందని అర్థమవుతుంది.

3 సూచించిన బలులు మరియు అర్పణల విస్తృతమైన జాబితా కోసం సంఖ్యాకాండము, 28 & 29 అధ్యాయాలు చూడండి.

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.