World's Last Chance

At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

While WLC continues to uphold the observance of the Seventh-Day Sabbath, which is at the heart of Yahuwah's moral law, the 10 Commandments, we no longer believe that the annual feast days are binding upon believers today. Still, though, we humbly encourage all to set time aside to commemorate the yearly feasts with solemnity and joy, and to learn from Yahuwah's instructions concerning their observance under the Old Covenant. Doing so will surely be a blessing to you and your home, as you study the wonderful types and shadows that point to the exaltation of Messiah Yahushua as the King of Kings, the Lord of Lords, the conquering lion of the tribe of Judah, and the Lamb of Yahuwah that takes away the sins of the world.
WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

మృతమైన పులిసిన దానిని తొలగించుట: అది మనందరిలో వున్న పరిసయ్యుడు

“పరిసయ్యుడు.”
ఈ పదం విన్న వెంటనే బైబిల్ విద్యార్థులు మరియు క్రైస్తవులలో వ్యతిరేక
దృష్టి  కలుగుతుంది. యహూషువః, కొత్త
నిబంధనలో, ఇతర ఏ ప్రజా సమూహం కంటెనూ, పరిసయ్యులతోనే ఎక్కువ వాదన పడెను. అయితే,
ఎందుకు? ఈ వివాదాలకు కారణము ఏమై ఉండెను? అది నేడు అనేక ప్రసిద్ధ క్రైస్తవులు
కలిగియున్న పరిసయ్యుల యొక్క దోషమై ఉండవచ్చా?

పరిసయ్యులు
అనగా మనము తరచుగా పురాతన పాలస్తీనాకు చెందిన ప్రాచీనకాల ప్రజల సమూహం అని
భావిస్తుంటాము, అయితే, నిజానికి పరిసయ్యవాదం నేటికీ సజీవంగానూ మరియు చక్కగానూ
ఉంది. నిజానికి, ఇది యహూషువః యొక్క అనేక సొంత అనుచరుల  హృదయాలలో వృద్ధి చెందుతూనే ఉంది. నేడు
పరిసయ్యవాద ఆత్మ అనేది వయస్సుకో, లింగానికో లేదా వృత్తికో పరిమితం కాలేదు. ఇది యువ
మరియు వృద్ధ రెండు హృదయాలలోనూ 
నివసిస్తుంది; అది స్త్రీ మరియు పురుషుల రెండు హృదయాలోనూ నివసిస్తుంది.
ఎవ్వరును, వారు  ఏ స్థితిలో లేదా ఏ పేరున
వున్నను, దాని చెడు ప్రభావం నుండి మినహాయింపు కలిగి లేరు.

అద్దంలో ఒక వ్యక్తి తనను   చూచుకొనుచుండెను. మనందరిలో ఒక పరిసయ్యుడు ఉన్నాడు. 

మీకు మీరు
ఒక పరిసయ్యునిగా భావిస్తున్నారా? మీరు క్రింది ప్రతి అంశమును1
ప్రార్థనాపూర్వకంగా పరిశీలించుటకు సమయం తీసుకోమని 
ప్రోత్సహిస్తున్నాము. మనము యహూషువః యొక్క రాకడకొరకు సమాయత్తమయ్యే విషయంలో
భాగంగా రోజూ, మన  ఆలోచన-విధానాలను, మన
ఆచరణలను, మన వృత్తులను మరియు యహువః దృష్టిలో మన హృదయముల నిజమైన పరిస్థితిని ప్రతి
రోజూ పరిశీలన చేసుకొనుట అత్యవసరమై యున్నది. మనము ఎల్లప్పుడూ పవిత్రతను వెంబడించు
మన ప్రయత్నంలో అప్రమత్తంగా ఉండాలి, అలా తండ్రి దయవలన ఆ గొప్ప దినమున కళంకము లేని
వారిగా గుర్తించబడెదము.

అప్పుడు
యహూషువః, చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండినిగూర్చి
జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. (మత్తయి సువార్త 16:6)

పులిసిన
పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచేయును. (గలతీయులకు 5: 9)

పరిసయ్యుని యొక్క 50
గురుతులు/లక్షణాలు

(1) ఒక
పరిసయ్యుడు తాను ధర్మాచార  భక్తులతో సంబంధం
కలిగియుండుటను బట్టి అతిశయించును, కానీ ఎలోహా అయిన యహువఃతో వ్యక్తిగత లేదా జీవిత
సంబంధం కలిగి యుండడు. యహూవః మనలను వ్యక్తిగతంగా రక్షించును. ఎవరునూ, భూమిపై
మరొకరితో కలిగియున్న అనుబంధాల ద్వారా రక్షించబడరు. మీరు మరొకరితో సంబంధం కలిగి యుండుట ద్వారా అతిశయిస్తున్నారా? మీరు
సత్యాన్ని  తెలుసుకునేందుకు లేఖనాలను
శోధించట కాకుండా, ఒక తల్లి/తండ్రి, జీవిత భాగస్వామి, స్నేహితుడు, గురువు, లేదా
పాస్టర్ ద్వారా మీ మీ విశ్వాసాలను మరియు ఆచారాలను ప్రభావితం చేసే సంబంధంనకు  అనుమతిస్తున్నారా ?

మీరు సత్యాన్ని  తెలుసుకునేందుకు లేఖనాలను శోధించడం కాకుండా, ఒక తల్లి/తండ్రి, జీవిత భాగస్వామి, స్నేహితుడు, గురువు, లేదా పాస్టర్ తో మీ మీ విశ్వాసాలను మరియు ఆచారాలను ప్రభావితం చేసే సంబంధంనకు  అనుమతిస్తున్నారా?

అబ్రాహాము
మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనతలంచవద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు
పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. (మత్తయి 3: 9)

(2) బాహ్య
నీతినిబట్టి ఒక పరిసయ్యుడు అతిశయించును, కానీ నిజమైన నీతిని నిర్లక్ష్యం చేయును,
అది అంతరంగం నుండి వస్తుంది. తండ్రియైన యహువః తో జీవన సంబంధం కలిగి యుండుట ద్వారా
మాత్రమే వచ్చు నిజమైన నీతిని  కొనసాగించమని
మనము  చెప్పబడితిమి. అది లేకుండా, మనము
“ఏ విధంగానూ పరలోక రాజ్యములో ప్రవేశించలేము. “మీరు అంతరగము నుండి వచ్చే నిజమైన నీతిని కొనసాగించేందుకు
ఇష్టపడుతున్నారా? మీరు కోపం, లైంగిక వాంఛ, తిండికి ఆతురత, దురాశ, మొదలైన వాటికి
మీ హృదయంలో ఆశ్రయమిస్తున్నారా?
నిజమైన నీతి అనేది హృదయం యొక్క స్థితి.
“నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ
హృదయమును భద్రముగా కాపాడుకొనుము” (సామెతలు 4:23). “హృదయశుద్ధిగలవారు
ధన్యులు; వారు దేవుని చూచెదరు.” (మత్తయి 5: 8).

“శాస్త్రుల
నీతి కంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో
ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను.” (మత్తయి 5:20)

(3) ఒక
పరిసయ్యుడు మతం మారని ప్రజలతో  కలిసి
ఉండడు. యహూషువః ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యముగల వారికి వైద్యుడక్కరలేదు; నేను
పాపులనే పిలువ వచ్చితినిగాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.
“(మార్కు 2:17) యహూషువః  అనుచరులగా,
మనము అన్ని విషయాలలోనూ  ఆయనను అనుకరించాలి.మీ సమూహముల సంబంధము రక్షంపబడినవారి మధ్య
మాత్రమే  ఉంటే నశించిన వారిని ఎలా
చేరుకుంటారు? మీరు పాపులలో కలియుటకు తిరస్కరించినచో, మీరు ఒక పరిసయ్యుడై ఉన్నారు.

మీ సమూహముల సంబంధము రక్షంపబడినవారి మధ్య మాత్రమే ఉంటే నశించిన వారిని ఎలా చేరుకుంటారు? మీరు పాపులలో కలియుటకు తిరస్కరించినచో, మీరు ఒక పరిసయ్యుడై ఉన్నారు.

“పరిసయ్యులు
అది చూసి మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు భోజనము చేయుచున్నాడని
ఆయన శిష్యులనడిగిరి.” (మత్తయి 9:11)

“​ఆయనను
పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్తయైన యెడల (కొన్ని ప్రాచీన ప్రతులలో-ఆ
ప్రవక్తయైన యెడల, అని పాఠాంతరము) తన్ను ముట్టుకొనిన యీ స్త్రీ ఎవతెయో ఎటువంటిదో
యెరిగియుండును; ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను.” (లూకా 7:39)

(4)
పరిసయ్యుడు ఒక సన్యాసిగా ఉంటాడు. తాను తన ఉపవాసములయందు అతిశయిస్తూ,  మరియు తన బాహ్య క్రమశిక్షణ యందు  గర్వించును.

“అప్పుడు
యోహాను శిష్యులు ఆయనయొద్దకు వచ్చిపరిసయ్యులును, మేమును తరచుగా ఉపవాసము
చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు; దీనికి హేతువేమని ఆయనను
అడుగగా.” (మత్తయి 9:14).

(5) ఒక
పరిసయ్యుడు ఇతరుల చిన్న చిన్న  విషయాలను
తప్పుపడతూ ఉంటాడు. అతడు  అల్పమైన విషయాల
వివరాలపై దృష్టి పెట్టి, అతి ముఖ్యమైన వాటిని విసర్జించును.

పరిసయ్యులదిచూచి
ఇదిగో, విశ్రాంతిదినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా
(మత్తయి 12: 2)

(6) ఒక
పరిసయ్యుడు మానవ నియమాలపై దృష్టి పెడుతూ, యహువః ప్రత్యక్ష పరచిన చిత్తమును విడిచి
పెట్టును.

ఆయన
అక్కడనుండి వెళ్లి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఊచచెయ్యి
గలవాడొకడు కనబడెను. వారాయనమీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట
న్యాయమా? అని ఆయనను అడిగిరి. అందుకాయన మీలో ఏ మనుష్యునికైనను నొక గొఱ్ఱెయుండి అది
విశ్రాంతి దినమున గుంటలో పడిన యెడల దాని పట్టుకొని పైకి తీయడా? గొఱ్ఱెకంటె
మనుష్యుడెంతో శ్రేష్ఠుడు; కాబట్టి విశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమే అని చెప్పి,
ఆ మనుష్యు నితోనీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దానివలె అది
బాగుపడెను. అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి, ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు
విరోధముగా ఆలోచన చేసిరి. యహూషువః ఆ సంగతి తెలిసికొని అచ్చటనుండి వెళ్లిపోయెను. బహుజనులాయనను
వెంబడింపగా, ఆయన వారినందరిని స్వస్థపరచి, తన్ను ప్రసిద్ధిచేయవద్దని వారికి
ఆజ్ఞాపించెను. (మత్తయి 12: 9-16)

(7) ఒక
పరిసయ్యుడు అసూయ మరియు ద్వేషాల చేత ప్రేరణ పొందుతాడు. మీరు ఎల్లప్పుడూ ఇతరులను దీవించాలని కోరుదురా? … లేక కొన్నిసార్లు
ద్వేషానికి  ఆశ్రయమిస్తున్నారా? అసూయ మరియు
ద్వేషాలు కయీను మతమై ఉన్నాయి.

మీరు ఎల్లప్పుడూ ఇతరులను దీవించాలని కోరుదురా? … లేక కొన్నిసార్లు ద్వేషానికి  ఆశ్రయమిస్తున్నారా?

మీరు  ఎల్లప్పుడూ అభ్యంతరాలు ఉన్నవారికి సహాయపడుతున్నారా? … లేక మీరు వారిని నీచముగా భావించుచున్నారా?

అంతట
పరిసయ్యులు వెలుపలికి పోయి, ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన
చేసిరి. (మత్తయి 12:14)

(8) ఒక
పరిసయ్యుడు నేరం మోపేవానిగాను  మరియు
ఇతరులను చెడ్డగా భావించువానిగానూ వుండును . మీరు  ఎల్లప్పుడూ
అభ్యంతరాలు ఉన్నవారికి సహాయపడుతున్నారా? … లేక మీరు వారిని నీచముగా
భావించుచున్నారా?

(9) ఒక
పరిసయ్యుని మాటలలో అలక్ష్యం ఉంటుంది. వారు యహూవః యొక్క విశ్వాసులపై చెడ్డగా
మాట్లాడటానికి వెనుకాడరు, చివరికి వారి నీతి క్రియలు సాతానువని ఆపాదించును కూడా.

పరిసయ్యులు
ఆ మాట వినివీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలు వలననే దయ్యములను
వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకని వలన కాదనిరి. (మత్తయి 12:24)

(10)
పరిసయ్యుడు మతం పేరుతో తన కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయును.

ఆ సమయమున
యెరూషలేమునుండి శాస్త్రులును పరిసయ్యులును యహూషువః నొద్దకు వచ్చి, నీ శిష్యులు
చేతులు కడుగుకొనకుండ భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల
పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకాయన మీరును మీపారంపర్యాచారము
నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తలిదండ్రులను ఘనపరచుమనియు,
తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలచిచ్చెను.
మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నావలన నీకేది ప్రయోజనమగునో అది
దేవార్పితమని చెప్పిన యెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని
చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము
చేయుచున్నారు.  (మత్తయి 15: 1-6)

ఎవడైనను
స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము
చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడైయుండును. (1 తిమోతి 5: 8)

మీ ‘ఆత్మ’ మీరు సులభంగా ఆగ్రహించుటకు  అనుమతిస్తుందా? “ప్రేమ త్వరగా కోపపడదు” (1 కొరింథీయులు 13: 5)

(11) ఒక
పరిసయ్యుడు త్వరగా ఆగ్రహించును. మీ ‘ఆత్మ’
మీరు సులభంగా ఆగ్రహము పొందుటను అనుమతిస్తుందా?
“ప్రేమ త్వరగా
కోపపడదు” (1 కొరింథీయులు 13: 5)

అంతట ఆయన
శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని ఆయనను
అడుగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును. (మత్తయి
15: 12-13)

(12) ఒక
పరిసయ్యుడు ఆధ్యాత్మికంగా గుడ్డిగా వుండును.

వారి జోలికి
పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు
గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను. (మత్తయి
15:14)

(13) ఒక
పరిసయ్యుడు గ్రంథం యొక్క సాక్ష్యం కంటే బాహ్య సూచక క్రియలనే గొప్పగా చూసును. తాను
దైవత్వంకు నిదర్శనంగా లేఖనాలను శోధించుటకంటే, బాహ్య సంకేతాలకే ప్రాధాన్యమిచ్చును.లేఖనాల యొక్క సాక్ష్యంను విసర్జిస్తూ,
బాహ్య సూచక క్రియలపైనే నమ్మిక యుంచేవారు అతి త్వరలో ఈ చివరి దినాలలో ప్రదర్శంపబడు
అబద్ధపు అద్భుతముల ద్వారా మోసపోవుదురు.

ALT TEXT

అంతిమ మోసం: వెలుగు దుస్తులలో సాతాను
లేఖనాల యొక్క సాక్ష్యంను విసర్జిస్తూ, బాహ్య సూచక క్రియలపైనే నమ్మిక యుంచేవారు అతి త్వరలో ఈ చివరి దినాలలో ప్రదర్శంపబడు అబద్ధపు అద్భుతముల ద్వారా మోసపోవుదురు.

అప్పుడు పరిసయ్యులును
సద్దూకయ్యులును వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశమునుండి యొక సూచకక్రియను తమకు చూపుమని
ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరుఆకాశము ఎఱ్ఱగా ఉన్నది గనుక వర్షము
కురియదనియు, ఉదయమునఆకాశము ఎఱ్ఱగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు
చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని యీ కాలముల సూచనలను
వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ నడుగుచున్నారు, అయితే
యోనాను గూర్చిన సూచకక్రియయేగాని మరి ఏ సూచక క్రియయైన వారి కనుగ్రహింపబడదని వారితో
చెప్పి వారిని విడిచి వెళ్లిపోయెను. (మత్తయి 16: 1-4)

(14) ఒక
పరిసయ్యుడు ప్రజలను వారి మాటల్లో లోపాలను పట్టుకోవడానికి ప్రయత్నించును.

పరిసయ్యులు
ఆయనను శోధింపవలెనని ఆయనయొద్దకు వచ్చిఏ హేతువుచేతనైనను పురుషుడు తన భార్యను
విడనాడుట న్యాయమా? అని అడుగగా (మత్తయి 19: 3)

అప్పుడు
పరిసయ్యులు వెళ్లి, మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచనచేయుచు..,

యహూషువః
వారి చెడుతన మెరిగివేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? (మత్తయి 22:15, 18)

(15) ఒక
పరిసయ్యుడు కఠిన-హృదయమును కలిగి ఉండును.

ఈ ప్రజలు తమ
పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; (మత్తయి 15: 8)

(16) ఒక
పరిసయ్యుడు నిజమైన ఆరాధనను మరియు వాస్తవమైన స్తోత్రమును అభినందించడు.

కాగా
ప్రధానయాజకులును శాస్త్రులును ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి
జయము(మూలభాషలో-హోసన్నా) అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి
కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అని ఆయనను అడిగిరి. అందుకు
యహూషువః వినుచున్నాను; బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోటస్తోత్రము
సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా? అని వారితో చెప్పి  (మత్తయి 21: 15-16)

(17) ఒక
పరిసయ్యుడు యహువః నియమాన్ని బోధించును, కానీ దానిలో నడువడు.

అప్పుడు
యహూషువః ,జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను: శాస్త్రులును పరిసయ్యులును మోషే
పీఠమందు కూర్చుండువారు. గనుక వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించిగై కొనుడి,
అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు.  (మత్తయి 23: 1-3)

(18) ఒక
పరిసయ్యుడు ప్రజలపై అధిక భారంను మోపును.

మీరు మనుష్యుల మెప్పు కొరకు సత్యాన్ని విడిచిపెట్టిరా?.. లేదా మీరు అన్ని వేళలయందునూ, అన్ని పరిస్థితులలో, అన్ని ప్రదేశాల్లో యహూషువః యొక్క అనుచరులై, మరియు సమస్త మనుష్యులతో వుంటున్నారా?

(19) ఒక
పరిసయ్యుడు ఒక కపటియై ఉండును. తాను చెప్పును, కానీ చేయడు. మీరు మీ లోక స్నేహితులతో కంటే మీ “మతసంబంధ” స్నేహితులతో ఒక
ప్రత్యేకమైన మనస్తత్వంతో ఉన్నారా? మీరు మనుష్యుల మెప్పు కొరకు సత్యాన్ని
విడిచిపెట్టిరా?… లేదా మీరు అన్ని వేళలయందునూ, అన్ని పరిస్థితులలో, అన్ని
ప్రదేశాల్లో యహూషువః యొక్క అనుచరులై, మరియు సమస్త మనుష్యులతో వుంటున్నారా?

మోయ
శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని తమ
వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు. . (మత్తయి 23: 4)

(20) ఒక
పరిసయ్యుడు డంభములాడును మరియు మనుష్యుల చేత గౌరవించబడుటకు చూచును. అతడు యహువః
ఆలోచన కంటే మనుష్యులు ఆలోచననే ఎక్కువగా లక్ష్యపెట్టును. మీరు బైబిలేతర పద్ధతులకు వేలాడుతున్నారా; లేదా ఇతరులు ఏమనుకుంటారో అనే
దానిపై ఎక్కువగా దృష్టి యుంచుట వలన యహువఃకు పూర్తి విధేయతను ఇచ్చుటకు నిర్లక్ష్యం
చేయుచున్నారా? మీరు మీ పరలోక తండ్రి ఆలోచనకంటే మీ స్నేహితులు, మీ జీవిత భాగస్వామి,
మీ తల్లిదండ్రులు, మీ గురువు, లేదా మీ సమాజము యొక్క ఆలోచనకై  ఎక్కువగా ఆసక్తి కలిగి యున్నారా?

(21) ఒక
పరిసయ్యుడు బయటకు కనబడు విధానంలో పవిత్రత వుండునని భావించును. మీరు మీరు ధరించు వవస్త్రముపై శ్రద్ధ
చూపుచున్నారా? … లేదా “యహువః దృష్టికి గొప్పగా కనబడు సాత్వికము మరియు దీన
మనస్సు అనే ఆభరణాలను ధరించుకొనుటలో ఆనందిస్తున్నారా? “(1 పేతురు 3: 4)

మనుష్యులకు
కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు
పెద్దవిగాను చేయుదురు; (మత్తయి 23: 5)

(22) ఒక
పరిసయ్యుడు ఉన్నతమైన స్థానాలను మరియు గౌరవ ప్రదమైన స్థితిని ఆశించును. మీరు పాస్టర్, గురువు, బోధకుడు, పూజారి,
నాయకుడు, దాత, మొదలైన పేర్లు పొందుకొనుటకు ఆశ పడుచున్నారా? మీరు యహువః నిమిత్తం
చేయు మీ పనికి ఒక గుర్తింపును కోరుచున్నారా? మీరు మీ పేరు లేదా చిత్రాన్ని ముఖ్య
వార్తలలో లేదా బైబిలు గ్రంథసూచికలలో చూచుకొనుటకు ఆనందించుచున్నారా?

మీరు యహువః నిమిత్తం చేయు మీ పని కోసం ఒక గుర్తింపును కోరుచున్నారా? మీరు మీ పేరు లేదా చిత్రాన్ని ముఖ్య వార్తలలో లేదా బైబిలు గ్రంథసూచికలలో చూచుకొనుటకు ఆనందించుచున్నారా?

విందులలో
అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను, ​సంత వీధులలో వందన ములను
మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. (మత్తయి 23: 6-7)

(23) ఒక
పరిసయ్యుడు పేదల ప్రయోజనాన్ని తీసుకొనును. ఇది పరలోకం యొక్క దృష్టిలో మహాపాపం.
“దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించు వాడు బీదను కనికరించువాడు
ఆయనను ఘనపరచువాడు.”(సామెతలు 14:31)

(24) ఒక
పరిసయ్యుడు మనుష్యుల చేత మెప్పు పొందుటకు బహిరంగంగా దీర్ఘ ప్రార్ధనలు చేయును.

అయ్యో,
వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు వితంతువుల ఇళ్లను
దహించివేయుదురు, మరియు నెపంతో దీర్ఘ ప్రార్థనలు చేయుదురు: కాగా మీరు ఎక్కువ దూషణల
పొందెదరు. (మత్తయి 23:14 kjv)

(25) ఒక
పరిసయ్యుడు ఇతరులను పాడుచేయును. మీరు
యహువః నందు మీ నిబద్ధత మరియు ఆయన నీతి సాధన విషయంలో స్థిరంగా వున్నారా? … లేదా
మీ నులివెచ్చని ప్రవర్తనా మాదిరి ద్వారా అజాగ్రత్తతో, యహువః నందు ఇతరులు
కలిగియున్న  జ్ఞానమును మలినం చేయుచున్నారా?

మీరు యహువః నందు మీ నిబద్ధత మరియు ఆయన నీతి సాధన విషయంలో స్థిరంగా వున్నారా? … లేదా మీ నులివెచ్చని ప్రవర్తనా మాదిరి ద్వారా అజాగ్రత్తతో, యహువః నందు ఇతరులు కలిగియున్న  జ్ఞానమును మలినం చేయుచున్నారా.

(26) ఒక
పరిసయ్యుడు జనులు ఇంకా తిరిగి జన్మించకముందే వారిలో మళ్ళీ జన్మించెననే అనుభూతిని
కలిగించును. వారు ఇంకా పశ్చాత్తాపం
పొందకముందే వారు పరలోకం పొందుకుని యున్నారని చెప్పుచున్నారా? నిజమైన మార్పిడులు
పొందాలంటే మనము సువార్తను దాని సంపూర్ణతతో ప్రకటించాలి. మనము రక్షంచబడుటకు
తప్పనిసరిగా చేయవలసిన రెండు విషయాలు: (1) పశ్చాత్తాపం పొంది సమస్త పాపంనుండి
దూరంగా జరగాలి; (2) యహూషువః నందు ఆయన త్యాగం యొక్క గొప్పతనంనందు నమ్మిక యుంచాలి.
(ఒకరు యహువః ధర్మాన్ని, పది ఆజ్ఞలను అతిక్రమించుట వలన కలిగే భయంకరమైన పరిణామాలను
ఒకసారి అర్ధం చేసుకున్న తరువాత వారు పాపంను విడిచి రక్షకుని ఆనుకుని యుందురు).
అందువలన, మనం నిజమైన మార్పిడులు కలిగి ఉండాలంటే మనం ప్రజలకు యహువః ధర్మశాస్త్రము
యొక్క నిజమైన అవగాహనను ఇవ్వాలి. నేడు అనేకులు ఆధునిక నకిలీ-సువార్త ద్వారా
దారితప్పించ బడి నడిపంచబడుచున్నారు.)

అయ్యో,
వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు
సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరక
పాత్రునిగా(మూలభాషలో-నరకకుమారునిగా) చేయుదురు.(మత్తయి 23:15)

(27) ఒక
పరిసయ్యుడు లేఖనాలను లోతు లేకుండా పైపైన, అవగాహన లేకుండా, మరియు పరిశుద్ధాత్మ
యొక్క వెలుగు లేకుండా వివరించును. ఒక పరిసయ్యుడు తనకు కావలసిన వ్యాఖ్యానంతో
సరిపడునట్లు లేఖనాలను మలచుకొనును. మీరు
లేఖనాలను (అవి ఏమి చెప్పునో దానిని) అంగీకరిస్తారా? … లేదా మీరు మీ మునుపటి
అవగాహనలకు  మరియు సంప్రదాయాలకు సరిపోయే
విధంగా వ్యాఖ్యానాలను వెదకుచున్నారా?

అయ్యో,
అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతోడని ఒట్టుపెట్టుకొంటె అందులో ఏమియు లేదు
గాని దేవాలయములోని బంగారముతోడని ఒట్టు పెట్టుకొంటె వాడు దానికి బద్ధుడని మీరు
చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు
దేవాలయమా? మరియుబలిపీఠముతోడని యొకడు ఒట్టుపెట్టుకొంటె, అందులో ఏమియు లేదు గాని,
దాని పైనుండు అర్పణముతోడని ఒట్టుపెట్టు కొంటె దానికి బద్ధుడని మీరు చెప్పుదురు.
అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా?
బలిపీఠముతోడని ఒట్టుపెట్టు కొనువాడు, దాని తోడనియు దానిపైనుండు వాటన్నిటితోడనియు
ఒట్టుపెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టుపెట్టుకొనువాడు, దాని తోడనియు
అందులో నివసించువాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశముతోడని ఒట్టుపెట్టుకొనువాడు
దేవుని సింహాసనము తోడనియు దానిపైని కూర్చున్నవాని తోడనియు
ఒట్టుపెట్టుకొనుచున్నాడు. (మత్తయి 23: 16-22)

మరియు నన్ను
పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు; మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము
వినలేదు; ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో
ఆయన వాక్యము నిలిచియుండలేదు. లేఖన ములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని
పరిశోధించుచున్నారు( లేక, పరిశోధించుండి), అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చు
చున్నవి.  (యోహాను 5: 37-39)

(28) ఒక
పరిసయ్యుడు ధర్మశాస్త్రం యొక్క అక్షరంనకు ప్రాముఖ్యం నిచ్చును, కాని ధర్మశాస్త్రం
యొక్క ఆత్మకు విరుద్ధంగా నడుచుకొనును. అతడు అల్పమైన విషయాలపై దృష్టి పెడుతూ
ప్రధానమైన వాటిని నిర్లక్ష్యం చేయును.

(29)
పరిసయ్యుడు న్యాయం, దయ, విశ్వాసం లను నిర్లక్ష్యం చేయును.

అయ్యో,
వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను
పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును
కనికరమును విశ్వసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసియుండెను.
(మత్తయి 23:23)

(30) ఒక
పరిసయ్యుడు తనకు తాను పెద్ద పెద్ద నేరాలకు ముద్దాయి కాగా, ఇతరుల చిన్న చిన్న
సమస్యలను వెదికి వారికి తీర్పుతీర్చును.  

అంధులైన
మార్గదర్శకులారా, దోమలేకుండునట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే.  (మత్తయి 23:24)

మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు బహిరంగంగా ఉన్నప్పుడు గల అదే వ్యక్తిత్వాన్ని కలిగియుంటారా? ఎవరూ చూడనప్పుడు కూడా నీ అలవాటు నీతిని జరిగించుటయేనా?

(31) ఒక
పరిసయ్యుడు తన హృదయం యొక్క స్థితి కంటే తన బాహ్య స్వరూపాన్ని గురించి మరింతగా
శ్రద్ధ కలిగి యండును. తన లోపలి హృదయం చీకటి మరియు మోసంతో వుండగా, బయటకు మాత్రం
నీతిమంతునిగా కనిపించుటకు శ్రద్ధ చూపుటయందు ఆనందించును. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు బహిరంగంగా ఉన్నప్పుడు గల అదే
వ్యక్తిత్వాన్ని కలిగియుంటారా? ఎవరూ చూడనప్పుడు కూడా నీ అలవాటు నీతిని
జరిగించుటయేనా?
ఒక పరిసయ్యుడు ఇతరులను దీవించుట కంటే మరింత ఎక్కువగా తన సొంత
అభివృద్ధికై దృష్టి కలిగి యండును.

అయ్యో,
వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు గిన్నెయు పళ్లెమును వెలుపట
శుద్ధిచేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండియున్నవి.
గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల
శుద్ధిచేయుము. (మత్తయి 23: 25-26)

(32) ఒక
పరిసయ్యుడు సొంత నీతిపరుడు మరియు తాను ఇతరులలో ఎత్తి చూపిన తప్పులు తనలో ఎంత
మాత్రం ఉండవని భావించును. మీరు ఎప్పుడైనా
“నేను ఎప్పడూ అలా చేయలేదు” అని చెప్పడం ద్వారా ఇతరుల తప్పులను
నిర్ధారించారా? మీరు అహంకారం చేత ఇతరులకంటే మీ తీర్పే గొప్పదని హెచ్చించుకున్నారా?

అయ్యో,
వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు,
నీతిమంతుల గోరీలను శృంగారించుచు, మనము మన(లేక, మేము, మా) పితరుల దినములలో
ఉండినయెడల ప్రవక్తల మరణ విషయములో (మూలభాషలో-రక్తవిషయములో) వారితో పాలివారమై యుండక
పోదుమని చెప్పుకొందురు. (మత్తయి 23: 29-30)

(33) ఒక
పరిసయ్యుడు యహువః యొక్క ప్రవక్తలను బాధించును.

సర్పములారా,
సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ
యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను; మీరు వారిలో కొందరిని
చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టీ, పట్టణము నుండి
పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును,
దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద
చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నియు ఈ తరమువారి మీదికి
వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 
(మత్తయి 23: 33-36)

మీరు యహువః ఏమి అనుకునునో అనే దానికంటే మీతోటివారు ఏమి అనుకుంటున్నారు అనే దానినే ఎక్కువగా ఆలోచిస్తున్నారా?

(34) ఒక
పరిసయ్యుడు ఇతరులు వారి గురించి ఏమని భావిస్తున్నారు అనే దానిని ఎక్కువగా ఆలోచించును.
పరిసయ్యుడు మనుషులకు భయపడతాడు, కానీ యహువః కు భయపడడు. ఇది యహూషువః చట్టానికి
వ్యతిరేకం “మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను
దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. “(మత్తయి 10:28). మీరు యహువః ఏమి అనుకునునో అనే దానికంటే
మీతోటివారు ఏమి అనుకుంటున్నారు అనే దానినే ఎక్కువగా ఆలోచిస్తున్నారా?

యోహాను
ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడనుండి కలిగినది? పరలోకమునుండి కలిగినదా, మనుష్యులనుండి
కలిగినదా? అని వారినడిగెను. వారుమనము పరలోకమునుండి అని చెప్పితిమా, ఆయనఆలాగైతే
మీరెందుకు అతని నమ్మలేదని మనలనడుగును; మనుష్యులవలననని చెప్పితిమా, జనులకు
భయపడుచున్నాము; అందరు యోహానును ప్రవక్త అని యెంచుచున్నారని తమలోతాము ఆలోచించుకొని
మాకు తెలియదని యహూషువఃనకు ఉత్తరమిచ్చిరి. ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని
జనులందరు ఆయనను ప్రవక్తయని యెంచిరి గనుక వారికి భయపడిరి. (మత్తయి 21: 25-26, 46)

(35) ఒక
పరిసయ్యుడు దురాశపరుడు మరియు ధనమును ప్రేమించును.

ధనాపేక్షగల
పరిసయ్యులు ఈ మాటలన్నియు విని ఆయనను అపహసించుచుండగా (లూకా 16:14)

(36) ఒక
పరిసయ్యుడు తన సొంత క్రియలయందు నమ్మిక యుంచును. పండుగ ఆచారములు, విశ్రాంతి దినాచారము, అపరిశుద్ధమైన ఆహారాలు నుండి దూరంగా
వుండుట మొదలగునవి నిన్ను పరలోకానికి చేర్చునని నీవు నీ హృదయంలో అనుకుంటున్నావా?
మనము విశ్వాసం ద్వారా రక్షించ బడతాము,
క్రియల ద్వారా కాదు. కేవలం యహూషువః బలియాగము మాత్రమే ప్రాయశ్చిత్తము కలిగించును,
మరియు ధర్మానికై మన ఏకైక ఆశ మాత్రమే ధర్మాన్ని ఆపాదించును. మనం ఆయన చేసిన దానికి
జోడించడానికి చేయగలది ఏమీ లేదు. ఆయన త్యాగానికి మన క్రియలను జోడించుటవలన కలిగేది
కేవలం బలిపీఠము కలుషితమౌట మాత్రమే. “మేమందరము అపవిత్రులవంటివారమైతిమి మా
నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతిమి గాలివాన
కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను … “. (యెషయా
64: 6) మన క్రియలు ఫలము మాత్రమే, వేరు 
కాదు” మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన
కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ
వీలులేదు. “(ఎఫెసీయులకు 2:. 8-9)

పండుగ
ఆచారములు, విశ్రాంతి దినాచారము, అపరిశుద్ధమైన ఆహారాలు నుండి దూరంగా వుండుట
మొదలగునవి నిన్ను పరలోకానికి చేర్చునని నీవు నీ హృదయంలో అనుకుంటున్నావా?

(37) ఒక
పరిసయ్యుడు ఇతరులను ద్వేషించును. మీరు
ఇతరులపై ఆగ్రహ భావం కలిగి ఉంటున్నారా? … లేదా మీరు “మీరు పరలోకమందున్న మీ
తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుచూ, శపించు వారిని దీవిస్తూ,
ద్వేషించు వారికి మంచి చేస్తూ, మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయచున్నారా?
“(మత్తయి 5:44)

తామే
నీతిమంతులని తమ్ము నమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము
చెప్పెను. (లూకా 18: 9)

(38) ఒక
పరిసయ్యుడు తాను ఇతరుల కంటే మంచివానిగా భావించుకొనును. నీవు గర్విష్టివా? నీవు ఒక ప్రత్యేకమైన ప్రతిభతో లేక గుణముతో అతిశయించు
చున్నావా?
“కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన
మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు “(ఫిలిప్పీయులకు 2: 3)
“అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు
దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును.
“(యెషయా 2:12)

(39) ఒక
పరిసయ్యుడు గర్వముతో నిండిపోవును మరియు ఇతరుల భావాలను పరిగణలోకి తీసుకోడు. మీరు ఎల్లప్పుడూ, మరియు అన్ని
పరిస్థితులలోనూ, ఇతరుల భావాలను పరిగణలోకి తీసుకుంటున్నారా? మీరు “సంతోషించు
వారితో సంతోషిస్తూ; , ఏడ్చువారితో ఏడ్చు చుంటిరా; ఒకనితో నొకడు మనస్సుకలిసి
యుంటిరా “? (రోమీయులు 12:15)

ప్రార్థనచేయుటకై
యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి.
పరిసయ్యుడు నిలువబడిదేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర
మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నాను.  (లూకా 18: 10-11)

(40) ఒక
పరిసయ్యుడు తన క్రమశిక్షణ, విజయాలు, మరియు ఆచారాలు విషయంలో అతిశయించును. మీరు మీ ఆహార విషయంలో  లేదా క్రమశిక్షణ విషయంలో అతిశయించు చున్నారా?
మీ పద్ధతులకు విభిన్నముగా వున్న వారిని తక్కువగా చూస్తున్నారా?

మీరు మీ ఆహార విషయంలో  లేదా క్రమశిక్షణ విషయంలో అతిశయించు చున్నారా? మీ పద్ధతులకు విభిన్నముగా వున్న వారిని తక్కువగా చూస్తున్నారా?

పరిసయ్యుడు
నిలువబడి దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర
మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ
వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను.  (లూకా 18: 11-12)

(41) ఒక
పరిసయ్యుడు ఇతరులపై నేరం మోపును.

యహూషువః
ఒలీవలకొండకు వెళ్లెను. తెల్లవారగానే యహూషువః తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరు
ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించు చుండెను. శాస్త్రులును
పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడుకొనివచ్చి ఆమెను మధ్య
నిలువబెట్టి బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను; అట్టివారిని
రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను
నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు
ఈలాగున అడిగిరి. అయితే యహూషువః వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. వారాయనను
పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద
రాయి వేయ వచ్చునని వారితో చెప్పి మరల వంగి నేలమీద వ్రాయు చుండెను. వారామాట విని(
కొన్ని ప్రాచీన ప్రతులలో-మనస్సాక్షి చేత గద్దింపబడినవారై అని కూర్చబడియున్నది.) ,
పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యహూషువః
ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడియుండెను. యహూషువః తలయెత్తి చూచి అమ్మా,
వారెక్కడ ఉన్నారు?( కొన్ని ప్రాచీన ప్రతులలో-నీమీద నేరము మోపిన వారెక్కడానున్నారు
అని పాఠాంశము) ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా
అనెను. అందుకు యహూషువః నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని
ఆమెతో చెప్పెను.  (యోహాను 8: 1-11)

(42) ఒక
పరిసయ్యుడు నిజానికి తమ తండ్రి  సాతాను
కాగా, వారి తండ్రి యహువః అని భావిచుచును.

మీరు మీ
తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను; అందుకు వారుమేము వ్యభిచారము వలన
పుట్టినవారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా; యహూషువః వారితో ఇట్లనెను
దేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి
వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేల నా మాటలు గ్రహింపకున్నారు?
మీరు నా బోధ విననేరకుండుటవలననేగదా? మీరు మీ తండ్రియగు అపవాది( అనగా,సాతాను)
సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైయుండి
సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన
స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై(
లేక,అబద్దకునికి జనకుదునై) యున్నాడు. (యోహాను 8: 41-44)

(43) ఒక
పరిసయ్యుడు ఒక అబద్ధీకుడు మరియు హంతకుడు. మీరు
అవినీతితో తీర్పు తీర్చలేదా? “తెల్ల అబద్ధాలు” చెప్పడం లేదా? మీరు
కోపాత్మను కలిగి లేరా?
“నేను మీతో చెప్పునదేమనగాతన సహోదరునిమీద(కొన్ని
ప్రాచీన ప్రతులలో-నిర్నిమిత్తముగా అని కూర్చబడియున్నది.) కోపపడు ప్రతివాడు
విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును;
ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము
నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము
వచ్చినయెడల … “(మత్తయి 5: 21-22)

మీరు మీ
తండ్రియగు అపవాది ( అనగా, సాతాను) సంబంధులు; మీ తండ్రి దురాశలు
నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు;
వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును;
వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై( లేక,అబద్దకునికి జనకుదునై) యున్నాడు.
(యోహాను 8:44)

కోపముతోవున్న మతగురువు.

మీరు మీ యొక్క లేఖనాల వివరణలను అన్నిటినీ అంగీకరించని వారిని తిరస్కారంతో చూచుచున్నారా? ప్రతి విషయాన్ని మీరు చూచుచున్న కోణంలో చూడని వారిని అవహేళన చేయుచున్నారా?

(44)
ఒక పరిసయ్యుడు తనది విననివారిని  అపహాస్యం
చేయును. మీరు మీ యొక్క లేఖనాల వివరణలను అన్నిటినీ అంగీకరించని
వారిని తిరస్కారంతో చూచుచున్నారా? ప్రతి విషయాన్ని మీరు చూచుచున్న కోణంలో చూడని
వారిని అవహేళన చేయుచున్నారా?

కాబట్టి
వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము; ఈ
మనుష్యుడు (యహూషువః) పాపియని మేమెరుగుదుమని వానితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో
నేనెరుగను; ఒకటి మాత్రము నేనెరుగుదును; నేను గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు
చూచుచున్నా ననెను. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కానియెడల ఏమియు చేయనేరడని
వారితో చెప్పెను. అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప
వచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. (యోహాను 9: 24-25, 33-34)

(45) ఒక
పరిసయ్యుడు తాను చేయలేని అద్భుతాలను ఇతరులు చేయునపుడు ఈర్ష్య పడును. మీరు మీకంటే ప్రత్యేకమైన ప్రతిభ, ప్రత్యేకమైన
ఆత్మ బహుమానాలు ఉన్నవారిపై  అసూయ
పడుతున్నారా?

కాబట్టి
మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు
విశ్వాసముంచిరి, కాని వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్లి యహూషువః చేసిన
కార్యములను గూర్చి వారితో చెప్పిరి. . (యోహాను 11: 46-47)

(46) ఒక
పరిసయ్యుడు నీతిగా నడిచే వారి విషయంలో కూడా, పండుగలు / ఉత్సవాలను తనంత స్థాయిలో
పాఠించలేనపుడు వారికి తీర్పు తీర్చును. పండుగలు,
విశ్రాంతి దినాలు లెక్కించు లేదా పాఠించు పద్దతిలో మీకంటే వేరైన అవగాహన కలిగియున్న
వారిని మీరు చిన్న చూపు చూస్తున్నారా?

కాగా
పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుటలేదు గనుక యహువః
యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు పాపియైన మనుష్యుడు ఈలాటి సూచకక్రియ
లేలాగు చేయగలడనిరి; ఇట్లు వారిలో భేదము పుట్టెను. (యోహాను 9:16)

(47) ఒక
పరిసయ్యుడు ఒక ఆత్మలను నాశనం చేసేవాడు, ఆత్మలను సంపాదించేవాడు కాదు. మీరు చైతన్యవంతంగా ఆత్మలను సంపాదించుటకు
కోరుచున్నారా? … లేదా మీరు ప్రజలను చెరుపుతున్నారా? మీరు సువార్త యొక్క
సంపూర్ణత్వంతో నివసిస్తూ దానిని ప్రకటిస్తున్నారా? (పైన # 26 వ్యాఖ్యానం చూడండి.)

అయ్యో,
వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులయెదుట పరలోక రాజ్యమును
మూయుదురు; మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు.(మత్తయి
సువార్త 23:13,14).

ఆత్మ విషయంలో నశించుచున్నవారి కొరకు మీ హృదయంలో దుఃఖిస్తున్నారా?

“ఇతరులు రక్షింపబడుటను మీరు కోరుకొనుట లేదా? అలా అయితే మీరు రక్షింపబడలేదు, ఇది నిజము తెలుసుకో!” (C.H. స్పర్జన్)

(48) ఒక
పరిసయ్యుడు నశించుచున్న పాపుల కోసం ఆందోళన పడడు. మీరు నిత్యం మీ చుట్టూ జరుగుతున్న హేయకృత్యముల విషయంలో నిట్టూరుస్తూ మరియు
దుఃఖిస్తున్నారా? ఆత్మ విషయంలో నశించుచున్నవారి కొరకు మీ హృదయంలో దుఃఖిస్తున్నారా?
మీరు ప్రతి రోజు “చేయవలసిన “పనుల జాబితా” లో మొదటిగా ఆత్మలను
సంపాదించుట ఉన్నదా? లేనియెడల, మీరు కొంత తీవ్రమైన ఆత్మ  పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉన్నది.
“ఇతరులు రక్షింపబడుటను మీరు కోరుకొనుట లేదా? అలా అయితే మీరు రక్షింపబడలేదు,
అది నిజము తెలుసుకో! “(C.H. స్పర్జన్).
రక్షకుడు పిలుపు ఇదిగో, ” నా
వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతును ” (మత్తయి
4:19) మనకు ఆయన ఆజ్ఞ: “నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని
గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ
ఉన్నానని వారితో చెప్పెను…. “(మత్తయి 28:20) మనము ఆయన సాక్షులుగా ఉండాలి
“భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.
“(అపొస్తలుల కార్యములు 1: 8)”. “నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము
జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు “(సామెతలు 11:30)

“అందుకు
పరిసయ్యులు మీరు కూడ మోస పోతిరా? అధి కారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైనను
ఆయనయందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని
వారితో అనిరి. (John7: 47-49)

(49) ఒక
పరిసయ్యుడు యహువః మాటకంటే సంప్రదాయానికే ఎక్కువ విలువ ఇస్తాడు. మీరు లేఖనాలకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి
సిద్ధాంతాన్ని  మరియు విధానాన్ని
విడిచిపెట్టుటకు  సిద్ధంగా ఉన్నారా (దాని
వయస్సు లేదా ప్రజాదరణతో పనిలేకుండా)? మీరు దోషము నుండి ఒంటరిగా బయటకు వచ్చారా (మీ
స్నేహితులు లేదా కుటుంబం ఎవరూ మీతో రాకపోయినా సరే)? 
సంప్రదాయం, అనేకులకు ఒక అడ్డు బండగా ఉంది,
ఎందుకంటే వారు సత్యంను అనుసరించుట (వలన కలిగే విడిపోవుట) కంటే తప్పులో వుంటూ
కలిసుండుటనే కోరుచున్నారు. నేడు, అనేక క్రైస్తవులు క్రిస్మస్, ఈస్టర్, మరియు
ఆదివారం ఆరాధనకు అంటి పెట్టుకుని ఉన్నారు ఎందుకంటే అది బైబిల్ లో వున్నది అని
కాదు, కానీ వారు యహువః వాక్యము కంటే ఎక్కువగా వారి సంప్రదాయాలను రక్షించుకొను
చున్నందున.

మీరు లేఖనాలకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి సిద్ధాంతాన్ని  మరియు విధానాన్ని విడిచిపెట్టుటకు  సిద్ధంగా ఉన్నారా (దాని వయస్సు లేదా ప్రజాదరణతో పనిలేకుండా)? మీరు దోషము నుండి ఒంటరిగా బయటకు వచ్చారా (మీ స్నేహితులు లేదా కుటుంబం ఎవరూ మీతో రాకపోయినా సరే)?

అప్పుడు
పరిసయ్యులును శాస్త్రులునునీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున
నడుచుకొనక, అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన నడిగిరి. అందుకాయన వారితో
ఈలాగు చెప్పెనుఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని, వారి హృదయము నాకు దూరముగా
ఉన్నది. వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోప దేశములని బోధించుచు నన్ను
వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా
ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మనుష్యుల పారంపర్యాచారమును
గైకొనుచున్నారు. మరియు ఆయనమీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను
బొత్తిగా నిరాకరించుదురు. (మార్కు 7: 5-9)

(50) ఒక
పరిసయ్యుడు మనుష్యుల ముందు తనకు తాను నిర్దోషినని సమర్థించుకొనును. ఒక నిజమైన
మారుమనస్సు పొందిన వ్యక్తి ఎల్లప్పుడూ యహువః ద్వారా తీర్పు పొందును మరియు తన
నిజమైన పరిస్థితిని లేఖనాలు తెలియజేయుట ద్వారా అంగీకరించును. ఒక నిజమైన
మారుమనస్సు పొందిన వ్యక్తి తన వ్యక్తిగత తప్పిదాలను దీనమనస్సుతో గుర్తించి, తన
తప్పులనుండి బయటకు వచ్చును. “ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా
అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదుగాని, ఆయన
ఎక్కువ కృప నిచ్చును; అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప
అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది”. (యాకోబు 4: 6). మీరు మీ తప్పులను
దీనమనస్సుతో గుర్తించిరా? … లేదా మిమ్మల్ని ఖండించు వారిని శిక్షించాలని
చూస్తున్నారా? మీరు మీ లోపాలను గుర్తించిరా? … లేదా మీరు నిందను ఇతరులపై
నెట్టాలని చూస్తున్నారా? మీరు ఆధ్యాత్మికంగా దివాలా తీసిరని మరియు ఒక రక్షకుడు అవసరమై
యుండెనని గుర్తించిరా? … లేదా మిమ్మల్ని మీరే సమర్థించుకునేందుకు చూస్తున్నారా?

ధనాపేక్షగల
పరిసయ్యులు ఈ మాటలన్నియు విని ఆయనను అపహసించుచుండగా, ఆయన మీరు మనుష్యులయెదుట
నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో
ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము. (లూకా 16: 14-15)


పరిసయ్యుని
యొక్క 50 గుర్తులు / లక్షణాలు (A రివ్యూ)

  1. ఒక పరిసయ్యుడు తాను ధర్మాచార భక్తులతో సంబంధం
    కలిగియుండుటను బట్టి అతిశయించును, కానీ యహువఃతో వ్యక్తిగత లేదా జీవిత సంబంధం కలిగి
    యుండడు. (మత్తయి 3: 9)
  2. బాహ్య
    నీతినిబట్టి ఒక పరిసయ్యుడు అతిశయించును, కానీ నిజమైన నీతిని నిర్లక్ష్యం చేయును,
    అది అంతరంగం నుండి వచ్చును. (మత్తయి 5:20)
  3. ఒక
    పరిసయ్యుడు మతం మారని ప్రజలతో  కలిసి
    ఉండడు. (మత్తయి 9:11; లూకా 7:39)
  4. ఒక
    పరిసయ్యుడు సన్యాసిగా ఉండును. (మత్తయి 9:14)
  5. ఒక
    పరిసయ్యుడు ఇతరుల చిన్న చిన్న  విషయాలను
    తప్పుపడతూ ఉంటాడు. అతడు  అల్పమైన విషయాల
    వివరాలపై దృష్టి పెట్టి, అతి ముఖ్యమైన వాటిని విసర్జించును. (మత్తయి 12: 2)
  6. ఒక
    పరిసయ్యుడు మానవ నియమాలపై దృష్టి పెడుతూ, యహువః ప్రత్యక్ష పరచిన చిత్తమును విడిచి
    పెట్టును. (మత్తయి 12: 9-16)
  7. ఒక
    పరిసయ్యుడు అసూయ మరియు ద్వేషాల ద్వారా ప్రేరణ పొందుతాడు. (మత్తయి 12:14)
  8. ఒక
    పరిసయ్యుడు నేరం మోపేవానిగాను  మరియు
    ఇతరులను చెడ్డగా భావించువారిగానూ వుండును . (మత్తయి 12:24)
  9. ఒక
    పరిసయ్యుని మాటలలో అలక్ష్యం ఉంటుంది. వారు యహూవః యొక్క విశ్వాసులపై చెడ్డగా
    మాట్లాడటానికి వెనుకాడరు, చివరికి వారి నీతి క్రియలు సాతానువని ఆపాదించను
    కూడా. (మత్తయి 12:24)
  10. పరిసయ్యుడు మతం పేరుతో తన కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయును. (మత్తయి 15: 1-6,
    తిమోతి 5: 8)
  11. ఒక
    పరిసయ్యుడు త్వరగా ఆగ్రహించును. (మత్తయి 15: 12-14)
  12. ఒక
    పరిసయ్యుడు ఆత్మీయంగా గుడ్డిగా వుండును. (మత్తయి 15:14)
  13. ఒక
    పరిసయ్యుడు గ్రంథం యొక్క సాక్ష్యం కంటే బాహ్య సూచక క్రియలనే గొప్పగా చూసును.
    (మత్తయి 16: 1-4)
  14. ఒక
    పరిసయ్యుడు ప్రజలను వారి మాటల్లో తప్పును పట్టుకోవడానికి ప్రయత్నించును. (మత్తయి
    19: 3; 22: 15-18)
  15. ఒక
    పరిసయ్యుడు కఠిన-హృదయమును కలిగి ఉండును. (మత్తయి 15: 8)
  16. ఒక
    పరిసయ్యుడు నిజమైన ఆరాధనను మరియు వాస్తవమైన స్తోత్రమును అభినందించడు. (మత్తయి 21:
    15-16)
  17. ఒక
    పరిసయ్యుడు యహువః నియమాన్ని బోధించును, కానీ దానిలో నడవడు. (మత్తయి 23: 1-3)
  18. ఒక
    పరిసయ్యుడు ప్రజలపై అధిక భారంను మోపును. (మత్తయి 23: 4)
  19. ఒక
    పరిసయ్యుడు ఒక కపటియై ఉండును. తాను చెప్పును, కానీ చేయడు. (మత్తయి 23: 4)
  20. ఒక
    పరిసయ్యుడు డంభములాడును మరియు మనుష్యుల చేత గౌరవించబడుటను  కోరును. (మత్తయి 23: 5)
  21. ఒక
    పరిసయ్యుడు బయటకు కనబడు విధానంలో పవిత్రత వుండునని భావించును. (మత్తయి 23: 5)
  22. ఒక
    పరిసయ్యుడు ఉన్నతమైన స్థానాలను మరియు గౌరవ ప్రదమైన స్థితిని ఆశించును. (మత్తయి 23:
    6-7)
  23. ఒక
    పరిసయ్యుడు పేదల ప్రయోజనాన్ని తీసుకొనును. (మత్తయి 23:14)
  24. ఒక
    పరిసయ్యుడు మనుష్యుల చేత మెప్పు పొందుటకు బహిరంగంగా దీర్ఘ ప్రార్ధనలు
    చేయును.(మత్తయి 23:14)
  25. ఒక
    పరిసయ్యుడు ఇతరులను పాడుచేయును.(మత్తయి 23:15)
  26. ఒక
    పరిసయ్యుడు జనులు వారు ఇంకా తిరిగి జన్మించకముందే వారిలో మళ్ళీ జన్మించెననే
    అనుభూతిని కలిగిస్తారు. (మత్తయి 23:15)
  27. ఒక
    పరిసయ్యుడు లేఖనాలను లోతు లేకుండా పైపైన, అవగాహన లేకుండా, మరియు పరిశుద్ధాత్మ
    యొక్క వెలుగు లేకుండా వివరించెదరు. (మత్తయి 23: 16-22; యోహాను 5: 37-39)
  28. ఒక
    పరిసయ్యుడు ధర్మశాస్త్రం యొక్క అక్షరంనకు ప్రాముఖ్యం నిచ్చును, కాని ధర్మశాస్త్రం
    యొక్క ఆత్మ విరుద్ధంగా నడుచుకొనును. (మత్తయి 23:23)
  29. పరిసయ్యుడు న్యాయం, దయ, విశ్వాసం లను నిర్లక్ష్యం చేయును. (మత్తయి 23:23)
  30. ఒక
    పరిసయ్యుడు తనకు తాను పెద్ద పెద్ద నేరాలకు ముద్దాయి కాగా, ఇతరుల చిన్న చిన్న
    లోపాలను వెదికి వారికి తీర్పుతీర్చును. (మత్తయి 23:24)
  31. ఒక
    పరిసయ్యుడు తన హృదయం యొక్క స్థితి కంటే తన బాహ్య స్వరూపాన్ని గురించి మరింతగా
    శ్రద్ధ కలిగి యండును. (మత్తయి 23: 25-26)
  32. ఒక
    పరిసయ్యుడు సొంత నీతిపరుడు మరియు అతను ఇతరులలో ఎత్తి చూపిన తప్పులు తనలో ఎంత
    మాత్రం ఉండవని భావించును. (మత్తయి 23:30)
  33. ఒక
    పరిసయ్యుడు యహువః యొక్క ప్రవక్తలను బాధించును. (మత్తయి 23: 33-36)
  34. ఒక
    పరిసయ్యుడు ఇతరులు వారి గురించి ఏమని భావిస్తున్నారు అనే దానిని ఎక్కువగా
    ఆలోచించును. మనుషులకు భయపడతాడు, కానీ యహువః కు భయపడడు. (మత్తయి 21: 25-26, 46)
  35. ఒక
    పరిసయ్యుడు దురాశపరుడు మరియు ధనమును ప్రేమించును. (లూకా 16:14)
  36. ఒక
    పరిసయ్యుడు తన సొంత క్రియలయందు నమ్మిక యుంచును. (లూకా 18: 9)
  37. ఒక
    పరిసయ్యుడు ఇతరులను ద్వేషించును. (లూకా 18: 9)
  38. ఒక
    పరిసయ్యుడు తాను ఇతరుల కంటే మంచివానిగా భావించుకొనును. (లూకా 18: 9-11)
  39. ఒక
    పరిసయ్యుడు గర్వముతో నిండిపోవును మరియు ఇతరుల భావాలను పరిగణలోకి తీసుకోడు. (లూకా
    18: 9-11)
  40. ఒక
    పరిసయ్యుడు తన క్రమశిక్షణ, విజయాలు, మరియు ఆచారాలు విషయంలో అతిశయించును. (లూకా 18:
    11-12)
  41. ఒక
    పరిసయ్యుడు ఇతరులపై నేరం మోపును. (యోహాను 8: 1-11)
  42. ఒక
    పరిసయ్యుడు నిజానికి వాని తండ్రి  సాతాను
    కాగా, వారి తండ్రి యహువః అని భావిచుచుండెను. (యోహాను 8: 41-44)
  43. ఒక పరిసయ్యుడు
    ఒక అబద్ధీకుడు మరియు హంతకుడు.(యోహాను 8:44)
  44. ఒక
    పరిసయ్యుడు తనది విననివారిని  అపహాస్యం
    చేయును. (యోహాను 9: 24-25, 33-34)
  45. ఒక
    పరిసయ్యుడు తాను చేయలేని అద్భుతాలను ఇతరులు చేయునపుడు ఈర్ష్య పడును. (యోహాను 11:
    46-47)
  46. ఒక
    పరిసయ్యుడు నీతిగా నడిచే వారి విషయంలో కూడా, పండుగలు / ఉత్సవాలను తనంత స్థాయిలో
    పాఠించలేనపుడు వారికి తీర్పు తీర్చును. (యోహాను 9:16)
  47. పరిసయ్యుడు ఒక ఆత్మలను నాశనం చేసేవాడు, ఆత్మలను సంపాదించేవాడు కాదు. (మత్తయి
    23:13)
  48. ఒక
    పరిసయ్యుడు నశించుచున్న పాపుల కోసం ఆందోళన పడడు. (John7: 47-49)
  49. ఒక
    పరిసయ్యుడు యహువః మాటకంటే సంప్రదాయానికే ఎక్కువ విలువ ఇస్తాడు. (మార్కు 7: 5-9)
  50. ఒక
    పరిసయ్యుడు మనుష్యుల ముందు తనకు తాను నిర్దోషినని సమర్థించుకొనును. (లూకా 16:
    14-15)


మన ఆత్మీయ
కుష్ఠువ్యాధిని కడిగివేసుకొనుటకు మరియు మన హృదయాల నుండి పరిసయ్యుల పులిసిన పిండికి
సంబంధించిన ప్రతి అణువునీ  నిర్మూలించుటకు
మనందరమూ, యహువః యొక్క శక్తివంతమైన కృప ద్వారా పరిసయ్యుల యొక్క ప్రతి వ్యవహారం
నుండి మరియు లక్షణము నుండి విడుదల పొంది మారుమనస్సు పొందెదము. ఆమీన్.

బైబిలు తో ప్రార్ధించుట. 

మూర్ఖచిత్తులు
యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. (సామెతలు 11:20)

సమాధానకర్తయగు
ఎలోహా యే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును
మన అభిషక్తుడైన యహూషువః రాకడయందు నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు
కాపాడబడును గాక. (1 థెస్స. 5:23)


1 ఈ కథనం జాక్ పూనేన్ యొక్క “పరిసయ్యుల
లక్షణాలు” అనే ఉపన్యాసపు సిరీస్ నుండి తీసుకొనబడినది. ఇది Mr. పూనేన్ యొక్క
ఇతర బోధనలు లేదా నమ్మకాలను ఆమోదించినట్లు కాదు.

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.