World's Last Chance

At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

While WLC continues to uphold the observance of the Seventh-Day Sabbath, which is at the heart of Yahuwah's moral law, the 10 Commandments, we no longer believe that the annual feast days are binding upon believers today. Still, though, we humbly encourage all to set time aside to commemorate the yearly feasts with solemnity and joy, and to learn from Yahuwah's instructions concerning their observance under the Old Covenant. Doing so will surely be a blessing to you and your home, as you study the wonderful types and shadows that point to the exaltation of Messiah Yahushua as the King of Kings, the Lord of Lords, the conquering lion of the tribe of Judah, and the Lamb of Yahuwah that takes away the sins of the world.
WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

యహూషువః: నిబంధనల మధ్య వారధి

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

యహూషువః-నిబంధనల-మధ్య-వారధి

“నేను యహూషువఃను నమ్ముతున్నాను, కానీ నేను సృష్టి వృత్తాంతమును నమ్మలేను” అని మీతో ఎవరైనా చెప్పారా? సుమారు 34 సంవత్సరాల క్రితం ఒకసారి నా తండ్రితో జరిగిన సంభాషణ నాకు గుర్తుంది. మేము బైబిల్ గురించి చర్చిస్తున్నాము మరియు సృష్టి వృత్తాంతమును నువ్వు నిజంగా నమ్ముతున్నావా అని అతడు నన్ను అడిగాడు, నేను అవును అని చెప్పాను, అది అతడిని ఆశ్చర్యానికి గురి చేసెను. స్వయం ప్రతిపత్తి గల “క్రైస్తవుడిగా” అతడు ఒక్కడు మాత్రమే ఇలా లేడని నాకు చాలా ఖచ్చితంగా తెలుసు. వాస్తవానికి, నేడు నాన్-ఇవాంజెలికల్ (సువార్తను నమ్మని) సంఘస్తులలో ఇది ప్రబలంగా ఉన్న భావన అని నేను ధైర్యంగా చెబుతాను. హెబ్రీ బైబిల్ యొక్క జళప్రళయం మరియు నిర్గమమకాండంలో గల కొన్ని ఇతర అద్భుతాలను దీనికి జోడించుకోండి మరియు ఇతర చాలా చారిత్రక సంఘటనలు ఉన్నాయి, ఇవి అనేక మంది నామమాత్రపు క్రైస్తవులను తీవ్రంగా సవాలు చేస్తాయి. ఈ ముఖ్యమైన సంఘటనలను నిజమైన చరిత్ర అని వారు నమ్మరు.

పాత నిబంధన యొక్క అద్భుత కథనాలను అంగీకరించుటను కష్టంగా భావించే అదే వ్యక్తులు, యహూషువః నీటి మీద నడిచాడని లేదా నీటిని ద్రాక్షారసముగా మార్చాడని లేదా లాజరును పునరుత్థానం చేశాడని నమ్ముటను కూడా కష్టంగానే భావిస్తారు. మీరు లేఖనాల విషయంలో ముఖ్య సంపాదకునిగా ఉండటం ప్రారంభించినప్పుడు, మీ వ్యక్తిగత ప్రపంచ దృష్టికోణానికి సరిపోని లేఖనాల్లో కొంత భాగాన్ని తిరస్కరించడాన్ని మీరు త్వరగా సమర్థిస్తారు. అనేక సందర్భాల్లో రెండు మానసిక ప్రక్రియలలో ఒకటి సంభవిస్తుంది. ఒకదాని ప్రకారం, యహూషువఃను రక్షకునిగా నమ్ముతూ, మరియు యహూషువః చెప్పినది లేదా చేసినది పట్టింపు లేదని నమ్మడం. రెండవది, యహూషువః అనగా ఒక రకమైన తూర్పు ఆధ్యాత్మిక ధర్మానికి ఒక రూపకం అనే నమ్మకం.

ఎవరైనా తమను తాము “క్రైస్తవుడు” అని చెప్పుకొనుచు మరియు అదే సమయంలో యహూషువః మరియు అపొస్తలులు పదే పదే ధృవీకరించిన అదే బైబిల్ యొక్క భాగాలను ఖండించుట అసంగతమైనదిగా మరియు విరుద్ధమైనదిగా అనిపిస్తుంది. ఇది యహువఃతో “నేను మీ కుమారుడిని రక్షకునిగా మరియు ప్రభువుగా అంగీకరిస్తున్నాను, కాని ఆయన చెప్పినదాన్ని మరియు చేసినదాన్ని నేను తిరస్కరిస్తున్నాను, అలాగే, మీరు యహూషువః గురించి చెప్పినదాన్ని కూడా నేను తిరస్కరిస్తున్నాను అని చెప్పునట్లు ఉంటుంది.” మీకు రెండు మార్గాలు ఉండకూడదు. “నేనే మార్గం, సత్యం మరియు జీవం” అని యహూషువః చెప్పినప్పుడు, మీరు ఆయన మాటలను మీ స్వంత నాశనానికి తిరస్కరించారు. నేటి జీవనశైలికి మరియు విశ్వాసం యొక్క ఆధునిక సమ్మేళనానికి చక్కగా సరిపోయే విధంగా మార్పు చేయబడిన-మెస్సీయను అంగీకరించడం ఈ రోజుల్లో వైఖరిగా [ఫ్యాషన్‌గా] అనిపిస్తుంది. మలాకీ 3: 6 లో ఇలా చెప్పిన తండ్రికి అది అనుకూలంగా ఉంటుందని నేను అనుకోను: “యహువఃనైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు.” ఒక తరం యొక్క జీవనశైలి లేదా నిబంధనలకు అనుకూలంగా సరిపోయేలా యహువః తన ప్రణాళికలను మరియు చట్టాలను మార్చడు. సృష్టించబడిన జీవులైన మనం యహువః యొక్క మెస్సీయ యహూషువః (1 తిమో. 2: 5) అనే ఆదర్శంలోకి మలచబడాలి.

ఒక తరం యొక్క జీవనశైలి లేదా నిబంధనలకు అనుకూలంగా సరిపోయేలా యహువః తన ప్రణాళికలను మరియు చట్టాలను మార్చడు.

యహూషువః: నిబంధనల మధ్య వారధి image

కాబట్టి నిజమైన నమ్మకం ఏమిటి? ఇది మొదటి నిబంధన మరియు రెండవ నిబంధనల మధ్య గల గొలుసు మరియు వంతెన అయిన యహూషువఃను గూర్చినది. ఇది ధర్మశాస్త్రాన్ని, కీర్తనలను మరియు ప్రవక్తలను ధృవీకరించే యహూషువః మాటలను గూర్చినది. ఇది యహువః యొక్క ప్రవచనాన్ని అది ఉద్దేశించిన పూర్తి అర్ధానికి తీసుకురావడం – దానిని “నెరవేర్చడం”. ఇది యహూషువః అపొస్తలులను ఆమోదించడం మరియు నియమించడం గురించి, దీని ద్వారా యహువః మాట్లాడేవాడు మరియు రక్షణ మరియు రాజ్యం గురించి తన ఆలోచనలను మరింత విస్తరించాడు. ఆ అపొస్తలులు వాక్యం కోసం, రాజ్యం గురించిన సువార్త కోసం, మరియు వారికి ముందు వ్రాయబడిన అన్నిటికోసం శ్రమలు అనుభవించారు మరియు మరణించారు. ఇశ్రాయేలు చరిత్రను యూదులకు తెలియజేసిన తరువాత స్తెఫను అమరవీరుడు అవుతాడని భావించవచ్చా (అపొస్తలుల కార్యములు 7) మరియు స్తెఫను తన సమాచారాన్ని ఎక్కడ నుండి పొందాడు? అది మన ప్రభువైన యహూషువః చదివిన మరియు నమ్మిన అవే లేఖనాల నుండి అనగా సమాజ మందిరాలలో ప్రతి సబ్బాతులో చదివే లేఖనాల నుండి పొందినది కాదా? తాను చదివిన మరియు నేర్చుకున్న కథనాలను తాను నమ్ముటలేదని యహూషువః ఎప్పుడైనా సూచించారా? సూచించి ఉంటే నేను దానిని ఎప్పుడూ చదవలేదు.

ఇప్పుడు లేఖనాలను యహూషువః విశ్వసించినట్లయితే మరియు అపొస్తలులు లేఖనాలను విశ్వసించినట్లయితే, ఒకరు యహూషువఃను నమ్ముతూ అదే సమయంలో ఆయన మరియు తాను ఏర్పరచుకున్న శిష్యులు నమ్మినదాన్ని ఎలా ఖండించగలరు? ఆదికాండము నుండి మలాకీ వరకు పాత నిబంధననంతటినీ యహూషువః విశ్వసించాడని నిస్సందేహంగా చూపించే కొన్ని ధృవీకరించే లేఖనాలను పరిశీలిద్దాం (లేదా ఆదికాండము నుండి 2వ దినవృత్తాంతాల వరకు ఆయనకు తెలిసిన క్రమంలో అవే పుస్తకాలు).

యహూషువః మరియు అపొస్తలులు ఆదికాండము-ద్వితీయోపదేశకాండముల యొక్క అద్భుతాల గురించి మరియు హెబ్రీ బైబిల్ యొక్క నియమావళి గురించి ఎక్కడెక్కడ ప్రస్తావించారో చూద్దాం. తాను తిరిగి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొనగలడా అని యహూషువః ఆశ్చర్యపడెను. విశ్వాసం అనగా నమ్ముట (“అబ్రాహాము యహువఃను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను”). ప్రపంచం యొక్క స్థిరమైన ధోరణి ఏమిటంటే నమ్మిక ఉంచటం అవసరం లేని మార్గాలను కనుగొనడం. కానీ క్రైస్తవులుగా మనం ఎల్లప్పుడూ మన నమ్మకానికి మద్దతు ఇచ్చే మార్గాలను వెతకాలి. విషయం అది కాకపోతే విశ్వాసంతో ఇబ్బందిపడుట ఎందుకు? మీరు నిత్యజీవానికి వాగ్దానం చేయబడిన చాలా పత్రాలను అణగదొక్కాలని కోరుకుంటే, అప్పుడు మీరు గందరగోళం యొక్క స్వచ్ఛమైన నిర్వచనానికి వచ్చినట్లే. క్రింద ధృవీకరించే లేఖనాల జాబితా ఇవ్వబడెను. అయితే ఇక్కడ సమగ్రంగా ఇవ్వబడలేదు, కానీ ఇది విషయాన్ని చూపిస్తుంది మరియు లేఖనాత్మక కొనసాగింపుకు మరియు బైబిల్ యొక్క ఏకీకృత సందేశానికి మద్దతు ఇస్తుంది.

యహూషువః

మత్తయి 1: 1-17 లో 42 తరాలు దావీదు ద్వారా అబ్రాహాముకు తిరిగి వెళ్ళు క్రమంలో ఇవ్వబడెను. ఇది యహూషువః యొక్క గుర్తింపును మరియు “పుట్టుకను” లేదా “ప్రారంభాన్ని” అనుసంధానించే యహూషువః యొక్క వంశావళి.

లూకా 3: 23-38 యహూషువః వంశాన్ని తిరిగి ఆదాము వద్దకు తీసుకువెళుతుంది. ఈ వంశావళిని యహూషువః తిరస్కరించినట్లు ఎక్కడా లేదు. దీనికి విరుద్ధంగా, అతను నోవహు, మెతూషెలా మరియు యాకోబులతో ఉన్న సంబంధాన్ని అంగీకరించాడు.

మత్తయి 2: 5-13. బెత్లెహేములో యహూషువః పుట్టుకకు సంబంధించిన పురాతన మీకా 5: 2 యొక్క ప్రవచన నెరవేర్పు, ఇది చిన్న ప్రవక్తలతోను మరియు తోరాలో వారి ద్వారా వివరించబడిన విపత్తుల గురించిన సూచనలతోను సంబంధాన్ని సృష్టిస్తుంది.

మత్తయి 4: 1-10. అరణ్యంలో సాతాను తనను శోధనకు గురిచేసినప్పుడు యహూషువః ద్వితీయోపదేశకాండము మరియు కీర్తనలను చూపించాడు.

మత్తయి 5:17లో యహూషువః ఇలా అనెను: “నేను ధర్మశాస్త్రమునైనను [5 కాండాలను] ప్రవక్తల వచనములనైనను [యెషయా-మలాకీ, వారికి ముందటి ప్రవక్తలుగా పిలువబడిన యెహోషువ -2వ రాజులతో సహా] కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.” ఆయా గ్రంథాలను మరియు గతం మరియు భవిష్యత్తు గురించి అవి వెల్లడించిన వాటిని యహూషువః నమ్మాడు. ఆయన కొన్ని “అసౌకర్య” చారిత్రక సంఘటనలను గూర్చి ఎక్కడా చెప్పలేదు మరియు వాటి ప్రామాణికతపై ఎన్నడూ వ్యాఖ్యానించలేదు. అది సృష్టి కథ అయినా, సొదొమ మరియు గొమొర్రా లేదా జలప్రళయం అయినా, అతడు వాటికి తన ప్రత్యక్ష మద్దతును ఇస్తూ మరియు వాటిపై విమర్శలు చేయకపోవడం ద్వారా, ఆ సంఘటనలపై తన నమ్మకాన్ని ధృవీకరించాడు. అతడు యహువః యొక్క చివరి “వాక్యం” లేదా వ్యక్తీకరణ అయినందున అతడు దానిని తక్కువ చేయలేడు మరియు అతని ఉద్దేశ్యం ఈ వాక్యాన్ని బలపరచడం మరియు యహువః రాజ్యం యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయడం.

మత్తయి 10:15. విమర్శదినమందు యహూషువః లేదా అతని అపొస్తలుల బోధనను చవిచూసిన కొన్ని పట్టణాల గతికంటె సొదొమ గొమొఱ్ఱా ప్రదేశముల గతి ఓర్వతగినదై యుండునని యహూషువః పేర్కొన్నారు.

మత్తయి 19: 4-8. తండ్రి అయిన యహువః మానవాళిని ఆడ, మగగా చేసినప్పుడు జరిగిన సృష్టిని యహూషువః అంగీకరించారు. సృష్టి కథనాన్ని యహూషువః తిరిగి మార్పుచేయలేదు. ప్రార్థనా మందిరాల్లోని ప్రతి సబ్బాతులో చదివినట్లు ఆయన లేఖనాలను నమ్మాడు.

మత్తయి 12: 38-41. యోనా తిమింగలం యొక్క కడుపులో మూడు పగళ్లు మరియు మూడు రాత్రులు ఉండెనని యహూషువః సూచించాడు.

మత్తయి 24: 37-39. ఈ ప్రస్తుత యుగం యొక్క ముగింపును జలప్రళయం మరియు నోవాహు ఓడలోకి ప్రవేశించుటకు ముందుటి రోజులతో యహూషువః పోల్చాడు. మరోసారి యహూషువః ఎటువంటి మార్పులు చేయలేదు. ఆయన జలప్రళయంను ఒక చారిత్రక సంఘటనగా తీసుకున్నాడు.

మత్తయి 24:15. యహూషువః తన భవిష్యత్ రాకడకు మరియు యుగపు సమాప్తికి సంకేతంగా దానియేలు యొక్క అంత్యకాల ప్రవచనమైన “నాశనకరమైన హేయవస్తువు” ప్రవచనాన్ని జతచేశాడు.

యోహాను 10: 34-36. యూదులకు సమాధానమిచ్చేటప్పుడు, యహూషువః వారికి ఇవ్వబడిన యహువః “వాక్కు” పై వ్యాఖ్యానిస్తూ, “లేఖనం కొట్టివేయబడదు” అని జతచేసెను. యహువః (YHWH) నుండి వచ్చినట్లు తమకు తెలిసిన చాలా లేఖనాల‌ యొక్క అర్థాన్ని ఎరుగకపోవుటతో యహూషువః యూదులను ఎన్నిసార్లు హెచ్చరించాడు? వాక్యాన్ని యహూషువః ఎప్పుడూ సరిదిద్దలేదు; ఆయన దానిని సమర్థించాడు మరియు యూదుల కఠినమైన హృదయాల విషయంలో మరియు అవిశ్వాసం విషయంలో నేరారోపణ చేశాడు.

అపొస్తలులు: యహూషువః యొక్క సువార్త సందేశాన్ని కొనసాగించుట

అపొస్తలుల కార్యములు 24:14. ఫేలిక్సు ముందు తనపై వచ్చిన ఆరోపణలపై అపొస్తలుడైన పౌలు తన ప్రతిస్పందనలో ఇలా అన్నాడు, “వారు [యూదులు] మతభేదమని పేరుపెట్టు ఈ మార్గముచొప్పున నా పితరుల యహువఃను సేవించుచున్నానని, ధర్మశాస్త్రము [ఐదు కాండాలు] మరియు ప్రవక్తల గ్రంథాలలో వ్రాయబడినవన్నియు నమ్ముచున్నానని తమరి యెదుట ఒప్పుకొనుచున్నాను.” ఇక్కడ ఎటువంటి సంకోచం లేదు. పౌలు తన నమ్మకం విషయంలో దృఢంగా ఉన్నాడు మరియు తన విశ్వాసానికి గల లేఖనాత్మక మూలాన్ని సూచించాడు. “ధర్మశాస్త్రం, ప్రవక్తలు మరియు రచనలు” (లూకా 24:44) హెబ్రీ బైబిల్ యొక్క రెండు గ్రంథాలలో ఉన్నాయి. ఈ రచనలలో కొన్ని చారిత్రక పుస్తకాలతో పాటు కీర్తనలు మరియు సామెతలు మరియు దానియేలు ఉన్నాయి.

రోమా ​​1: 18-20. ఇక్కడ పౌలు సృష్టిని కవితా రూపక కోణంలో కాక, నిజమైన మరియు చారిత్రక కోణంలో సూచిస్తాడు. పరిణామ సిద్ధాంతం ద్వారా పౌలు తన ఆలోచనలో మునిగిపోయాడని నేను అనుకోను. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గ్రీకులు మొదట ఒక విధమైన పరిణామాన్ని ప్రతిపాదించారు మరియు బోధించారు. డార్విన్ దానిని సమయానికి ముందుకు తీసుకువచ్చాడు. అప్పటికి రోమా సామ్రాజ్యమందంతటా ఉన్న ప్రపంచ దృక్పథం గ్రీకు బోధనచే రూపించబడియున్నందున పౌలు నిస్సందేహంగా ఆ గ్రీకు బోధనకు సుపరిచితుడు.

రోమా ​​5:14. “మరణం ఆదాము నుండి మోషే వరకు పరిపాలించింది.” యహువః ఆదామును మొదటి మనిషిగా (అభివృద్ధి చెందుతున్న జీవిగా కాదు) సృష్టించాడని పౌలుకు తెలుసు మరియు నమ్మాడు, మరియు అన్యమత గ్రీకు ఆలోచన గ్రంథాల యొక్క సాదా భావాన్ని అర్థం చేసుకొనుట విషయంలో అతడు ఎటువంటి సూచనను ఇవ్వలేదు.

1 కొరింథీయులకు 10: 1-4. పౌలు నిర్గమకాండంలో ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం గుండా వెళ్ళిన సంఘటనను బాప్టిజంతో పోల్చాడు. అతడు “బండ” ను రాబోయే మెస్సీయను సూచించే ఒక “రకం” లేదా నమూనాగా చూశాడు. యహువః యొక్క కుమారుడు భూమిపై పుట్టకముందే జీవించి ఉన్నాడని పౌలు నమ్మలేదు!

2 కొరింథీయులకు 11: 3. సర్పము హవ్వను మోసం చేసిన సంఘటనను పౌలు యహూషువః యొక్క సరళత నుండి దారితప్పుటతో పోల్చాడు. సృష్టి ఖాతాను సవాలు చేయాల్సిన అవసరం ఉందని పౌలు భావించలేదు.

హెబ్రీయులు 1-4 లో సృష్టి ప్రణాళికతో మానవాళి ఎలా సరిపోతుందో పౌలు వివరించాడు మరియు భూత మరియు భవిష్యత్ కాలాలలో మనిషిని దేవదూతల స్థానంతో పోలుస్తూ వివరించాడు.

1 పేతురు 3:20. పేతురు [చాలా సంవత్సరాలు యహూషువఃతో నడిచిన మరియు మాట్లాడాడిన వాడిగా] నోవాహు జలప్రళయ వృత్తాంతానికి తన గణనీయమైన ఋజువును ఇస్తాడు. మరోసారి, పేతురు యొక్క నమ్మకం మరియు అవగాహనతో సమస్య లేదు. అతడు హెబ్రీ బైబిల్‌ను అక్షరాలా చారిత్రక కథనంగా తీసుకున్నాడు.

2 పేతురు 2: 6-8 లో పురాతన ప్రపంచ చరిత్రను, సొదొమ, గొమొర్రాలకు సంభవించిన విపత్తు నుండి యహువః నీతిమంతుడైన లోతును ఎలా తప్పించెనో పేతురు వివరించాడు.

చివరగా, ప్రకటన గ్రంథంలో హెబ్రీ బైబిల్ గురించి చాలా ప్రస్తావించబడింది. దీనిలో 450 సూచనలు ఉన్నాయి. సంఘాలకు అందించుటకు యహువః యహూషువఃకు ఇచ్చిన ప్రత్యక్షత ఇది. మనము ఆదికాండము నుండి ప్రకటన వరకు పూర్తిగా తిరిగి వచ్చాము మరియు లేఖనాల కొనసాగింపు ధృవీకరించబడింది. ఏ అపొస్తలుడు స్థానాలను విచ్ఛిన్నం చేయలేదు మరియు తండ్రి అయిన యహువః మరియు అతని మెస్సీయ యహూషువః [అతడు యహువః యొక్క చివరి దూత, యహువః మరియు దావీదు కుమారుడు మరియు వాగ్దానం చేయబడిన ప్రవక్త. ద్వితీ. 18: 15-18; అపొస్తలుల కార్యములు 3:22; 7: 37] నుండి వచ్చిన జ్ఞానాన్ని సవాలు చేయలేదు. ఏ అపొస్తలుడు కూడా తాను ఏ పరిశుద్ధ లేఖనాలను నమ్మలేదని గానీ లేదా తన ప్రభువైన మెస్సీయ (లూకా 2:11) ఏ విధంగానైనా వాటిని తప్పుగా భావించాడని గానీ తెలియచేయలేదు.

యహూషువః ప్రతి సందర్భంలోనూ ప్రామాణిక సూత్రాన్ని మరియు లేఖనం యొక్క అధికారాన్ని సమర్థించాడు మరియు అదే విశ్వాసాన్ని అపొస్తలులకు ఇచ్చాడు. “క్రైస్తవుడు” అనే హోదాను మనం నిజంగా సొంతం చేసుకుంటే, గతంతో ఈ విడదీయలేని సంబంధాన్ని ఎలా తిరస్కరించగలము? “నేను యహూషువఃను నమ్ముతున్నాను” అని చెప్పడం మరియు అదే సమయంలో ఆయన ధృవీకరించిన లేఖనాలను తిరస్కరించడం అర్థం లేనిది. యహూషువః వాక్యం యొక్క అవతారం. అతడు యహువః వెల్లడించిన లేఖనాలను తిరస్కరించలేడు లేదా సవాలు చేయలేడు. లేఖనాలను సవరించడం యహూషువః బాధ్యత కాదు కాని వాటిని సమర్థించడం అతని బాధ్యత.

హెబ్రీ బైబిల్ ను (పాత నిబంధన: ధర్మశాస్త్రం, ప్రవక్తలు మరియు కీర్తనలు, లూకా 24:44) మరియు గ్రీకు క్రొత్త నిబంధన లేఖనాల‌ను ఎవరైతే ఒప్పుకోరో వారు యహూషువః మరియు యహువఃతో విభేదిస్తున్నారని నేను సురక్షితంగా చెప్పగలనని నమ్ముతున్నాను. ఆదికాండములో ఒక అడుగు మరియు ప్రకటనలో ఒక అడుగుతో పాత మరియు క్రొత్త నిబంధనలకు యహూషువః వంతెన వేస్తాడు. మరియు ఆయన ప్రపంచానికి మరియు సాతానుకు చెబుతున్నాడు, “ఇది నా అధికార సామ్రాజ్యం. త్రోవకు వెలుపల ఉండండి.”

యహూషువః-నిబంధనల-మధ్య-వారధి

యహువః తన వాక్కును పవిత్రమైన హెబ్రీ లేఖనాలను వ్రాసి సంరక్షించిన తండ్రులు మరియు ప్రవక్తలకు వెల్లడించారు (లూకా 24:44). ఆ పాత నిబంధన కాలం తరువాత మాత్రమే, యహువః, తన కుమారుని ద్వారా, యహూషువః అనే పదం ద్వారా, అతీంద్రియంగా పుట్టిన మానవుని ద్వారా (హెబ్రీ. 1: 1-2; లూకా 1:35) మాట్లాడెను. యహూషువః ఆ లేఖనాలను పూర్తిగా ధృవీకరించాడు, క్రొత్త నిబంధనను ప్రవేశపెట్టాడు, అది మోషే ధర్మశాస్త్రం కాక “దయ మరియు సత్యం” అని ధృవీకరించాడు (యోహాను 1:14, 17). తన పనిని పూర్తి చేసిన యహూషువః ఇప్పుడు యహువః కుడి పార్శ్వమున కూర్చొని ఉండి, (కీర్తనలు 110: 1 లోని “నా ప్రభువు”), ప్రధాన యాజకునిగా, అవిశ్వాస మరియు తిరుగుబాటు ప్రపంచానికి తీర్పు తీర్చుటకు భూమిపైకి తిరిగి వచ్చుటకు ఎదురు చూస్తున్నాడు. మన కొరకు యహువః‌ తన చివరి మాటలను దావీదు కుమారుడైన తన కుమారుని ద్వారా అందించబడిన మాటలను గ్రీకు క్రొత్త నిబంధన లేఖనాలలో గ్రంథస్థం చేసెను.


ఇది టెర్రీ ఆండర్సన్ రాసిన కథనం. WLC కథనం కాదు.

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి – కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృందం.

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.