World's Last Chance

At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

While WLC continues to uphold the observance of the Seventh-Day Sabbath, which is at the heart of Yahuwah's moral law, the 10 Commandments, we no longer believe that the annual feast days are binding upon believers today. Still, though, we humbly encourage all to set time aside to commemorate the yearly feasts with solemnity and joy, and to learn from Yahuwah's instructions concerning their observance under the Old Covenant. Doing so will surely be a blessing to you and your home, as you study the wonderful types and shadows that point to the exaltation of Messiah Yahushua as the King of Kings, the Lord of Lords, the conquering lion of the tribe of Judah, and the Lamb of Yahuwah that takes away the sins of the world.
WLC Free Store: Closed!
At the heart of WLC is the true God and his Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

యోనాను గూర్చిన సూచక క్రియ

“యోనాను గూర్చిన సూచక క్రియ” చాలా మంది ప్రజలు గ్రహించిన దానికంటే చాలా ఎక్కువ అర్థాన్ని కలిగియున్నది. గ్రంథాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే “భూమి యొక్క హృదయంలో/heart of the earth” రక్షకుడు గడిపిన “మూడు పగళ్లు మరియు మూడు రాత్రులు” గెత్సేమనేలో ఆయన అప్పగింపబడిన రాత్రి ప్రారంభమాయెనని బయలుపడుతుంది.

పిల్లలు బొమ్మలు గీయుచున్నారుపిల్లలు బైబిలు క్లాసులో యోనా కథను చదువుతున్నారు. శ్రీమతి ఫ్రెడరిక్స్ తన రెండవ తరగతి పిల్లలను యోనా గురించి చిత్రాన్ని గీయమని కోరెను. చాలా మంది పిల్లలు నీటిలో లేదా చేప మింగుచున్న యోనా చిత్రాలను గీశారు. కొద్దిమంది చేప లోపల యోనా ప్రార్థన చేస్తున్నట్లు చూపించే మరొక కోణాన్ని గీసారు. శ్రీమతి ఫ్రెడెరిక్స్ జెన్నిఫర్ చిత్రాన్ని చూసినప్పుడు, అది ఏమైయున్నదో ఆమెకు తెలియలేదు. ఒక పెద్ద దీర్ఘచతురస్రం లోపల ఒక తండ్రి మరియు చిన్న పిల్లవాడు చేతులతో పట్టుకొనియున్న కర్ర బొమ్మల పైన మూడు పడకలు మరియు మూడు నవ్వుతున్న సూర్యులు ఉన్నారు. దీర్ఘచతురస్రం చాలా వరకు గోధుమ రంగు పెన్సిలుతో నింపబడి ఉంది. పైభాగంలో, ఆకుపచ్చ గడ్డి అంచు ఉన్నది. గడ్డి క్రింద గల చిన్న మూలాలను సూక్ష్మంగా గీయబడెను. “జెన్నిఫర్, నీవు యోనా గురించి ఒక చిత్రాన్ని గీయాలి, కాని నీ చిత్రంలో అతడు ఎక్కడా కనబడలేదు. నీకు అప్పగించిన పని అర్థం కాలేదా?” “కాదు, నేను చేసాను, శ్రీమతి ఫ్రెడరిక్స్! చూడండి? ఇది యోనా యొక్క సూచక క్రియ: మనుష్యకుమారుడు మూడు రాత్రింబవళ్ళు భూమిలో ఉన్నాడు. చిన్న పిల్లవాడిని చూశారా? అతడు కుమారుడు. పడకలు మూడు రాత్రులు. సూర్యుడు అనగా రోజులు మరియు ఇవన్నీ భూమిలో ఉన్నాయి.” ఈ చిత్రం తన ఉపాధ్యాయురాలికి నవ్వు తెప్పించినప్పటికీ, చాలా మంది క్రైస్తవులు “యోనా యొక్క సంకేతాన్ని” అర్థం చేసుకోవడంలో ఈ చిన్న జెన్నిఫర్ కంటే ఏమీ ఎక్కువ లేరు. రక్షకుడు తన మరణ విషయంలో ప్రవచించిన ప్రవచనాన్ని వివిధ సంఘాలు వివిధ వివరణలను బోధిస్తాయి: “వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనానుగూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు. యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును.” (మత్తయి సువార్త 12:39,40)

వివిధ సిద్ధాంతాలు ఉన్నాయి – “యోనా యొక్క సూచక క్రియ” విషయంలో వివిధ వర్గాలు వివిధ వివరణలను కలిగియున్నవి. అవి ఈ కాల వ్యవధిని కింది వాటిలో ఏదో ఒకదానితో వివరించును:

1. సిలువ వేయబడిన శుక్రవారపు ఉదయం నుండి ఆదివారం ఉదయం పునరుత్థానం వరకు.

2. బుధవారం రాత్రి నుండి శనివారం రాత్రి వరకు.

3. సమాధిలో ఖననం చేయబడిన సమయం మాత్రమే, అనగా, శుక్రవారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు.

ఈ ప్రతి వివరణలలో మొదటి సమస్య ఏమిటంటే అవి తప్పుగా ఉన్న ఒక ప్రతిపాదనపై ఆధారపడి ఉన్నవి: అది అన్యమత జూలియన్ క్యాలెండర్‌ను ఇశ్రాయేలు ఉపయోగించెననుట. యహూషువః కాలంలో ఇశ్రాయేలీయులు మోషే యొక్క సూర్య-చంద్ర క్యాలెండర్‌ను ఉపయోగించారు. బైబిల్ క్యాలెండర్ శుక్రవారం, శనివారం మరియు ఆదివారం అనే గ్రహసంబంధిత రోజులతో గానీ అలాగే జూలియన్ క్యాలెండర్ యొక్క ఎనిమిది రోజుల వారంతో గానీ సరిపడదు. అయితే, ఈ సిద్ధాంతాల యొక్క తప్పును వెల్లడించే ఇతర సమస్యలు ఉన్నాయి.

సిలువ వేయబడుట మొదలుకొని పునరుత్థానం వరకు: చాలా మంది యోనా సూచక క్రియలో చెప్పిన కాల వ్యవధి సిలువ వేయబడినప్పటినుండి పునరుత్థానం వరకు ఉన్న కాలాన్ని సూచిస్తుందని అనుకుంటారు. అబీబ్ 14 న ఉదయకాలపు బల్యర్పణ సమయంలో, ఉదయకాలానికి మధ్యలో, రక్షకుడు సిలువ వేయబడెననుట సరైనది కాదు. కాబట్టి, మూడు పగటి భాగాలు గడిచినందున, ఇది కేవలం రెండు రాత్రులకు మాత్రమే సరిపోతుంది.

బుధవారం రాత్రి నుండి శనివారం రాత్రి వరకు: ఇతర క్రైస్తవులు యోనా సూచక క్రియ ప్రకారం యహూషువః మొత్తం 72 గంటలు సమాధిలో ఉండాలని నమ్ముతారు. వీరి ప్రకారం, సిలువ మరణం జూలియన్ క్యాలెండర్ నందుగల బుధవారం జరిగెనని బోధించుదురు. అయితే పునరుత్థానం శనివారం రాత్రి జరిగెననుటవలన ఈ నమ్మకం కూడా తప్పు. ఇది రెండు కారణాల వల్ల తప్పు. మొదటిది, ఇంతకుముందు చెప్పినట్లుగా, యహూషువః కాలంలో యూదులు జూలియన్ క్యాలెండరును ఉపయోగించలేదు. రెండవది, అబీబు 15 రాత్రి పునరుత్థానం జరగలేదని లేఖనం స్పష్టం చేస్తుంది. పునరుత్థానం అబీబు 16 ఉదయం తెల్లవారుజామున సంభవించింది: “విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి.” (మత్తయి 28: 1). నిర్గమకాండము సమయంలో యహువః స్థాపించిన రూపాలను మరియు ప్రతి-రూపాలను అనుసరించి సిలువ మరణం జరిగింది. అందువల్ల, అబీబు 14 కి ముందు ఎప్పుడూ ఇది జరగలేదు.

శుక్రవారం రాత్రి నుండి శనివారం రాత్రి వరకు: మరికొందరైతే యహూషువః సమాధిలో గడిపిన గంటలు మాత్రమే “భూగర్భంలో ఉండును” అను వాక్యానికి నెరవేర్పు అని బోధిస్తూ తప్పుచేయుచున్నారు.

లాజరు మరణించిన నాలుగు రోజుల తరువాత సమాధిలో నుండి లేచాడు మరియు అక్కడ ఒక సూచక క్రియను కోరుతున్న పరిసయ్యులకు అది బాగా తెలుసు. ఇదే అద్భుతాన్ని యహుషువః ఒక రోజు తక్కువలో జరుగేటట్లు చేసి, దానిని సూచనగా ఇవ్వాలని అనుకొనెనా? లేదు, మూడు పగళ్లు మూడు రాత్రులు సమాధిలో గడిచిన తరువాత మరణం నుండి లేచుట కంటే ఈ సూచక క్రియ ఇంకా ఎక్కువ అర్థాన్ని కలిగియున్నది. యోనా ప్రవచించినట్లుగా ఆయన [యహువః] నుండి వేరుచేయబడి మన పాపాలలో మునిగిపోవడమే [ఇక్కడ యహువః వినడు] ఈ సూచక క్రియ. మన పాపాల కొరకు బాధలతో, మరణంతో పరిహారం చెల్లించి మూడవ దినాన తిరిగి లేచెను.1

యహూషువః ఇచ్చిన ఈ సంకేతాన్ని అర్థం చేసుకోవాలంటే, ఆయన ఉపయోగించిన సంకేత భాషను అర్థం చేసుకోవాలి. ఎప్పటిలాగే, లేఖనం దాని స్వంత రహస్యాలను వివరించుటకు ఆధారాలను అందిస్తుంది. “యోనా ప్రవక్తను గూర్చిన సూచక క్రియ” లో యహూషువః సూచన యొక్క అర్ధాన్ని స్పష్టంగా వెల్లడించే మూడు అంశాలు ఉన్నాయి:

1. కలిపి మరియు తీసివేసి లెక్కించుట

2. “భూమి యొక్క హృదయం” అనే పదబంధానికి అర్థం

3. “మూడు పగళ్లు, మూడు రాత్రులు” ఎప్పుడు ప్రారంభమాయెను.

కలుపి లెక్కించుట: బైబిలు కాలంలోని రోమీయులు ​​మరియు ఇశ్రాయేలీయులు ఇరువురూ నేడు బోధించబడు దానికంటే భిన్నంగా లెక్కించేవారు. చాలా వరకు, నేటి ప్రజలు తీసివేసి లెక్కిస్తారు. ఉదాహరణకు, వసంతం వచ్చినప్పుడు ఏప్రిల్ 20 న మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చి, వేసవి సెలవులకు ఇంకా ఎంత సమయం ఉందని ఆమె అడుగింది అనకుందాం. ఆమె పాఠశాల జూన్ 15 న వేసవి సెలవులు ఇవ్వనుండెనని మీకు తెలుసు. అందువల్ల, వేసవి సెలవులు రెండు నెలల్లో ప్రారంభమవుతాయని మీరు ఆమెకు చెప్పారు. మీరు తీసివేయు విధానంలో లెక్కించి, మే మరియు జూన్ నెలలను మాత్రమే లెక్కించారు. మీరు ఏప్రిల్ నెలను లెక్కించరు ఎందుకంటే అది మీరు ఉన్న నెల. మరోవైపు, రోమీయులు లేక ఇశ్రాయేలీయులు, ఎల్లప్పుడూ కలిపి లెక్కించేవారు. వేసవి సెలవులు ఎప్పుడు ప్రారంభమవుతాయని వారిని అడిగినట్లయితే, వారి సమాధానం “మూడు నెలలు” గా ఉండేది, ఎందుకంటే వారు ఎల్లప్పుడూ లెక్క ప్రారంభమైన నెలను కూడా లెక్కించేవారు. అలా, యోనా యొక్క సూచనకు 72 గంటలు పూర్తి కానవసరం లేదు. అలాగే, ఒక రోజును 24 గంటల కాలంగా లెక్కించు విధానం ఇశ్రాయేలీయుల కాలంలో ఉనికిలో లేదు. రాత్రుళ్లు “జాము” ల ద్వారా విభజించబడ్డాయి మరియు పగళ్లు సూర్య గడియారం పై 12 సమాన గంటలుగా విభజించబడ్డాయి. యహూషువః ఇలా అడిగెను: “పగలు పండ్రెండు గంటలున్నవి గదా” (యోహాను 11: 9 చూడండి.) వేసవిలో గంటలు శీతాకాలంలో గంటల కంటే ఎక్కువ. కలిపి లెక్కించు విధానంలో, ఒక రోజులోని ఏదైనా భాగాన్ని ఒక రోజుగా లెక్కించేవారు. అందువల్ల, రక్షకుని పునరుత్థాన దినం అబీబు 16, ఆ దినపు ప్రారంభంలో ఆయన పునరుత్థానం చేయబడినప్పటికీ, లెక్క ప్రకారం మూడవ రోజు.

భూమి యొక్క హృదయం[భూగర్భం]: “భూమి యొక్క హృదయం” సమాధి చేయుటను సూచిస్తుందని విశ్వాసులు చాలాకాలంగా భావిస్తున్నారు. అయితే, ఇది చాలా పరిమితమైన వివరణ. నిజమైన “భూమి యొక్క హృదయం[భూగర్భం]” చాలా విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉంది. లేఖనం “భూమి” ని మానవ జాతిని, మరింత ప్రత్యేకంగా మానవ హృదయాన్ని సూచిస్తుంది. యహూషువః చెప్పిన విత్తువాని గూర్చిన ఉపమానంలో, భూమిలో నాటబడుట అనగా “వాక్యం వారి హృదయాలలో నాటబడుట” అని ఆయన స్పష్టంగా చెప్పాడు. (మార్కు 4: 3-20 చూడండి.) మానవ హృదయం చెడ్డదని మరియు పాపాకరమైనదని గ్రంథం కూడా స్పష్టంగా తెలియజేస్తుంది:

“హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?” (యిర్మీయా 17: 9).

“నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యహువః చూచి.” (ఆదికాండము 6:5)

భూమి యొక్క హృదయం

హృదయానికి అదనపు వివరణను ఆదిమ గ్రీకు అందిస్తుంది: “కార్డియా… గుండె. ఆలోచనలు లేదా భావాలు (మనస్సు)….” 2 ఈ విధంగా, భూమి యొక్క హృదయం [భూగర్భం] అనగా, భూమిలో ఒక సాధారణ భౌతిక ఖననం కంటే చాలా ఎక్కువ. ఇది పాప శిక్షావిధిని సూచిస్తుంది. యహూషువః పాపం లేనివాడు. ఆయన అలా అయి ఉండాలి, లేకపోతే ఆయన మాహన విమోచకుడు కాలేడు. మన పాపాలకు ఆయన స్వచ్ఛందంగా బాధ్యత వహించారు. ఇది పశ్చాత్తాపపడే పాపికి ఆధారమును మరియు విముక్తిని ఇవ్వడానికి న్యాయవంతుడైన సృష్టికర్త అందించిన దయ యొక్క రహస్యమై ఉన్నది. యహూషువః, ఆయనకు భాగం లేని మన పాపాలను స్వీకరించుట ద్వారా, ఆయన మనకు భాగం లేని తన నీతిని అర్పించగలడు.

సమస్తమును ఎలోహీమ్ వలననైనవి; ఆయన మనలను మెస్సీయ ద్వారా తనతో సమాధాన పరచుకొని, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, ఎలోహీమ్ వారి అపరాధములను వారిమీద మోపక, మెస్సీయనందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఎందుకనగా మనమాయనయందు ఎలోహీమ్ నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను. (2 కొరింథీయులకు 5:18-19, 21)

యెషయా గ్రంథంలోని యాభై మూడవ అధ్యాయం మొత్తం ఈ దైవిక మార్పిడిని వివరిస్తుంది:

మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను,
మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను;
మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను,
అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది …..
యహువః మన యందరి దోషమును అతనిమీద మోపెను.

ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను,
అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను,
అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను.
(యెషయా 53:5-6, 12)

యహూషువః మనకోసం పాపంగా మారినప్పుడు, పరలోకానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారందరూ పొందబోవు శిక్షను ఆయన పొందుటకు అంగీకరించారు. ఆ శిక్ష యహువః నుండి వేరుచేయబడటం:

“మీ దోషములు మీకును మీ ఎలోహీంకిని అడ్డముగా వచ్చెను;
మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను,
గనుక ఆయన ఆలకింపకున్నాడు.
(యెషయా 59:2)

“నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును.”
(కీర్తనల 66:18)

లెక్కింపు ఎప్పుడు ప్రారంభమైంది? యహూషువః భరించిన శిక్ష సృష్టికర్త నుండి శాశ్వతమైన వేర్పాటును అనుభవించుట. ఈ శిక్ష ఆయన మరణంతో, హృదయం చీలుట ద్వారా ఆయన మరణించినప్పుడు ముగిసింది, ఫలితంగా రక్తం మరియు “నీరు” కలిసిన రెండు ధారలు ఏర్పడెను. ఏదేమైనా, విమోచకుని యొక్క బాధ శరీరాన్ని రంధ్రం చేసిన మొదటి మేకుతో గానీ లేదా రోమీయుల కొరడా ముళ్ల వలన కలిగిన మొదటి చారతో గానీ ప్రారంభం కాలేదు. యోనా ప్రవక్త యొక్క సంకేతాన్ని అర్థం చేసుకొనుటకు ఇది కీలకం. యహూషువః బాధ/వేదన గెత్సేమనే తోటలో మన పాపం నిమిత్తం ఆయనకు శిక్ష విధించబడినప్పుడు ప్రారంభమాయెను.

గెత్సేమనే తోటలో క్రీస్తు మనిషి స్థానంలో శిక్ష అనుభవించాడు, మరియు [యహువః] కుమారుని యొక్క మానవ రూపం, పాపపు అపరాధం యొక్క భయంకరమైన భయానక స్థితిలో ఉండిపోయింది, అతని లేత మరియు వణుకుతున్న పెదవుల నుండి, “నాయనా తండ్రీ, సాధ్యమైతే, ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము; ”అయినను పడిపోయిన మానవుడు రక్షింపబడుటకు వేరే మార్గం లేకపోతే,“నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము అనెను. ఆయన యొక్క మానవ స్వభావం అప్పుడు అక్కడ పాపం యొక్క భయానక స్థితిలో మరణించింది, ఆ వేదనను భరించుటకు పరలోకం నుండి ఒక దేవదూత ఆయనను బలపరచలేదు.3

యహూషువః లోక పాపములను మోసికొనిపోవు యహువః యొక్క గొర్రెపిల్ల. ఆయన పస్కా పండుగలో (అబీబూ 14న) సిలువ వేయబడ్డాడు, తద్వారా ఐగుప్తులోని ఇశ్రాయేలీయుల పైనుండి మరణదూత దాటిపోయినట్లే, యహువః యొక్క తీర్పు పశ్చాత్తాపపడే పాపులపై నుండి దాటిపోతుంది. ఏమైనప్పటికీ, ఆయన శ్రమలు అబీబు13 సాయంత్రం, చివరి భోజనం తరువాత, గెత్సెమనే తోటలో ప్రారంభమాయెను.

మానవునికి బదులుగా మరియు హామీగా ప్రతీకార న్యాయం కలిగించు శక్తియే పాపపు ప్రపంచంపై పడబోవు విపరీతమైన ఉగ్రత కింద “ఒకనిని” బాధలలో నిలబెట్టి వాటిని భరించుటకు ఇవ్వబడిన శక్తి. [యహువః] ధర్మాన్ని ఉల్లంఘించిన వారిపై ప్రకటించబడిన మరణాన్ని క్రీస్తు అనుభవించాడు.

పశ్చాత్తాపపడని పాపి జీవముగల [ఎలోహీం] చేతులలో పడుట భయంకరమైన విషయం .… కానీ పాపపు ప్రపంచం కోసం [యహువః యొక్క] ఉగ్రతను భరించినప్పుడు, అనంతమైన [ఎలోహీం] కుమారుడైన క్రీస్తు వేదనలో ఇంతవరకు ఇది ఎన్నడూ నిరూపించబడలేదు. పాపం యొక్క పర్యవసానంగా [యహువః ధర్మశాస్త్రం యొక్క అతిక్రమణ], గెత్సేమనే తోట పాపపు ప్రపంచానికి శ్రమల ప్రదేశంగా ప్రముఖంగా మారింది. [యహువః] కుమారుడు భరించిన శ్రమతో మరి ఏ శ్రమయు, దుఃఖమును, వేదనయు సరితూగవు.4

యహువః గొర్రెపిల్ల

“అనేకుల పాపమును భరించుచు, తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనము చేసిన” (యెషయా 53:12) సమయంలో రక్షకుడు అనుభవించిన భావోద్వేగము మరియు మానసిక వేదన గెత్సేమనేలో ప్రారంభమాయెను. భయంకరమైన ఫలితాన్ని లేఖనం నమోదు చేస్తుంది: “అప్పుడు ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను.” (లూకా 22:45). ఇది ఆయన బంధించబడుటకు ముందే జరిగెను. అప్పటికే పాపుల నిమిత్తం దైవిక కోపాన్ని భరిస్తూ, సిలువ మరణానికి ముందు రోజు రాత్రియే ఆయనకు శిక్ష ప్రారంభమైనది. రక్షకుడు పాపులకొరకు అనుభవించిన శిక్ష సిలువపై గడిపిన సుమారు ఆరు గంటల సమయం కన్నా చాలా ఎక్కువని గ్రంథం చెబుతుంది. యహూషువః మరణం చుట్టూ మూడు రోజుల కాల వ్యవధిని సూచించే పన్నెండు వాక్యభాగాలు లేఖనంలో ఉన్నాయి మరియు వాటిలో ప్రతి ఒక్కటి ఆయన మరణానికి ముందు గెత్సెమనేలో ప్రారంభమైన మానసిక వేదనను ప్రత్యేకంగా సూచిస్తాయి.

“పాపాన్ని మోయగలిగినవానిగా మానవుడు తయారు చేయబడలేదు, మరియు రక్షకుడు భరించిన పాపపు శాపం యొక్క భయానకతను మానవుడు ఎప్పటికీ తెలుసుకోలేడు. [యహువః] యొక్క కోపం అధికమైన శక్తితో పడినప్పుడు ఆయనకు [యహూషువఃకు] కలిగిన దుఃఖంతో ఏ దుఃఖమూ సరితూగదు. మానవ స్వభావం భరించగలదు కాని పరిమితమైన పరీక్ష మరియు శోధనను మాత్రమే భరించగలదు. పరిమితమైనది పరిమిత కొలతను మాత్రమే భరించగలదు మరియు మానవ స్వభావం లొంగిపోతుంది; కానీ [యహూషువః] యొక్క స్వభావం శ్రమలను ఎదుర్కొనుటకు ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉండెను; దైవిక స్వభావంలో ఉన్న మానవుడు, మరియు పడిపోయిన ప్రపంచం యొక్క పాపాల వలన కలిగే బాధలను భరించే సామర్థ్యాన్ని కలిగియున్నాడు … పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే యహువః కృపావరము మన రక్షకుడైన యహూషువః నందు నిత్య జీవము.”

ఎల్లెన్ జి. వైట్, మాన్యుస్క్రిప్ట్ 35, 1895

“అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యహూషువః తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా.” (మత్తయి 16:21)

అప్పటినుండి మూడవ రోజు అనగా? బాధ ప్రారంభమైనప్పటి నుండి. చదవండి:

“అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలోనుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.” (లూకా 24:45-47)

“మరియు మనుష్యకుమారుడు అనేక హింసలుపొంది, పెద్దల చేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను ఉపేక్షింపబడి చంపబడి, మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప నారంభించెను.” (మార్కు 8:31)

ఈ వచనం ప్రత్యేకించి గమనించదగినది, ఎందుకంటే వేదనలు ప్రారంభమైన మూడు రోజుల తరువాత ఆయన తిరిగి లేచుట జరుగునని తెలుపుతుంది. పునరుత్థాన దినమైన అబీబు 16 న యెరూషలేము నుండి ఎమ్మాయు అను గ్రామమునకు నడిచి వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల సంభాషణ లూకా 24 లో నమోదు చేయబడినది. వారు నడుస్తున్నప్పుడు “జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి యొకరితో నొకరు సంభాషించుచుండిరి.” (లూకా 24:14).

వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, యహూషువః తానే దగ్గరకువచ్చి వారితోకూడ నడిచెను; అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మూయబడెను.

ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న యీ మాట లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి.

ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారునజరేయుడైన యహూషువః ను గూర్చిన సంగతులే; ఆయన ఎలోహీం యెదుటను ప్రజలందరి యెదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయై యుండెను. మన ప్రధాన యాజకులును అధికారులును ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి, సిలువవేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించియుంటిమి; ఇదిగాక యీ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయెను. (లూకా 24:15-17, 19-21)

ఈ సంఘటన యహూషువః వారికి బోధించుటకు మరియు వారి విశ్వాసాన్ని ప్రేరేపించుటకు మార్గమును ఏర్పరచెను:

అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా, మెస్సీయ ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. (లూకా 24:25-27)

(ఇదే సంఘటనల ప్రక్రియను చూపించే గ్రంథంలోని ఇతర లేఖనాలను ఆంగ్లములో చదవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి 5). రక్షకుని శ్రమలు మరియు మరణం యొక్క ఈ అద్భుతమైన ప్రవచనాన్ని విస్మరించకూడదు, అలాగే ఈ కాల వ్యవధి పూర్తిగా 72 గంటలు ఉండవలసిన అవసరం లేదు. అబీబు 13 సాయంత్రం నుండి అబీబు 16 తెల్లవారుజాము 6 వరకు ఈ ప్రవచనం యొక్క లెక్కింపు కొనసాగుతుంది. పాపులకు వ్యతిరేకంగా ధర్మశాస్త్రం విధించిన శిక్షావిధిని యహూషువః స్వచ్ఛందంగా అంగీకరించి, మానవజాతి విమోచన కోసం యహువః నుండి విడిపోవుటకు ఆయన సమర్పించుకున్నప్పుడు “యోనా ప్రవక్త యొక్క సూచక క్రియ” రక్షకుని యొక్క శ్రమలు మరియు మరణంలో సంపూర్ణంగా నెరవేరింది.


1 జెన్ ష్రోడర్, త్రీ డేస్ & త్రీ నైట్స్: ది సైన్ ఆఫ్ జోనా.

2 కార్డియా, # 2588, ది న్యూ స్ట్రాంగ్స్ ఎక్స్‌పాండెడ్ డిక్షనరీ ఆఫ్ బైబిల్ వర్డ్స్.

3 యస్డియే బైబిల్ కామెంటరీ, వాల్యూమ్. 5, పే. 1103.

4 ఐబిడ్.

5 అపొస్తలుల కార్యములు 10: 39 లో “చంపిరి” అని అనువదించబడిన అసలు గ్రీకు పదం హింసాత్మక మరణాన్ని సూచిస్తుంది. ఇది దయగల, శీఘ్ర మరణం కాదు. బాధతో నిండిన హింసాత్మకమైనది.

6 అబీబు 16 తెల్లవారుజామున, ప్రవచనం యొక్క మూడవ దినాన పునరుత్థానం జరిగిందనే వాస్తవం, బైబిలు దినము తెల్లవారుజామున ప్రారంభమవుననే బైబిలు సాక్ష్యానికి పరోక్షంగా మద్దతు ఇస్తుంది.

This site is registered on wpml.org as a development site. Switch to a production site key to remove this banner.